Author: Editor's Desk, Tattva News

రాజకీయ పార్టీలు, ముఖ్యంగా మిత్రపక్షాలు కుల గణన కోసం డిమాండ్‌ పై పట్టుబడుతున్న తరుణంలో, రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో బిజెపి ఇతర వెనుకబడిన తరగతులు (ఓబిసిలు), దళితులపై దృష్టి సారించడం ద్వారా వారి “రాజకీయ సాధికారత” ఫార్ములాను ఎంచుకుంది. జూన్ 10న జరిగే రాజ్యసభకు జరిగే ఎన్నికల కోసం ఆది, సోమవారాల్లో ప్రకటించిన 22 మంది అభ్యర్థుల్లో సగానికి పైగా సామాజికంగా బలహీన వర్గాలకు చెందిన వారే ఉండడం గమనార్హం. తొమ్మిది మంది ఓబీసీ అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా కుల గణనపై రాజకీయాలు ముదురుతున్న నేపథ్యంలో వాటిని ఎదుర్కొనేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నించినట్లు స్పష్టం అవుతుంది. అభ్యర్థుల జాబితా 2014 నుండి పార్టీ తన ఎన్నికల పోరాటాలలో సాయపడిన సోషల్-ఇంజనీరింగ్ ఫార్ములాకు అనుగుణంగా ఈ ఎంపిక చేసిన్నట్లు వెల్లడి అవుతుంది. ఉత్తరప్రదేశ్‌లో పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి ఆ రాష్ట్రంలోని ఓబిసి-దళిత ఓటు పునాదియే కారణమని బిజెపి నాయకత్వం భావిస్తున్నది. అగ్రవర్ణాలు, మహిళల రాజకీయ ఆకాంక్షలను కూడా…

Read More

కేకే గా పేరొందిన ప్రముఖ బాలీవుడ్ గాయకుడు కృష్ణకుమార్ కున్నత్ (53)  గుండెపోటుతో ఆకస్మికంగా కన్నుమూశారు. కోల్ కతాలోని నజ్రుల్ మంచా ఆడిటోరియంలో మంగళవారం రాత్రి జరిగిన లైవ్ కన్సర్ట్ లో పాల్గొని హోటల్ కు చేరుకున్న కాసేపటికే ఆయన గుండెపోటుతో కుప్పకూలారు.  వెంటనే  సమీపంలోని సీఎంఆర్ఐ ఆస్పత్రికి తరలించినప్పటికీ, అప్పటికే కేకే మృతిచెందినట్లు వైద్యులు రాత్రి 10.30 గంటలకు వెల్లడించారు. అయితే తాను పాల్గొన్న లైవ్ కన్సర్ట్ ఫొటోలను కేకే తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ (కేకే లైవ్ నౌ) లో షేర్ చేశారు. లైవ్ కన్సర్ట్ లో ఆయన చివరి సారిగా ‘హమ్ రహే యా నా రహే యాడ్ ఆయెంగే యే పల్’ అనే పాటను పాడి ప్రేక్షకులను ఉర్రూతలూగించిన. వాస్తవానికి కన్సర్ట్ ముగిశాక తాను బస చేసిన హోటల్ కు బయలుదేరే సమయంలోనే కృష్ణకుమార్ కున్నత్ అస్వస్థతకు లోనై ఉండొచ్చని సోషల్ మీడియాలో షేర్ అవుతున్న వీడియోలను బట్టి తెలుస్తోంది.…

Read More

కాంగ్రెస్ కు రాజీనామా చేసిన పాటిదార్‌ ఉద్యమ నేత హార్ధిక్‌ పటేల్‌ బీజేపీలో చేరడానికి రంగం సిద్దమైన్నట్లు వార్తలు వస్తున్నాయి. 2017 అసెంబ్లీ ఎన్నికలలో బిజెపిని పరాజయం అంచు వరకు తీసుకెళ్లిన అతను ఇప్పుడు అదే పార్టీలో చేరడానికి ప్రధాన కారణం అతనిపై బిజెపి ప్రభుత్వం నమోదు చేసిన రెండు దేశ ద్రోహం కేసులతో పాటు సుమారు 30 క్రిమినల్ కేసులే అని తెలుస్తున్నది. ఆ కేసులు ఉన్నంత వరకు తాను ఎన్నికలలో పోటీ చేసే అవకాశం లేకపోవడంతో, ఆయా కేసులను ఉపసంహరించుకునే షరతుపై బీజేపీలో చేరడానికి సిద్ధపడినట్లు చెబుతున్నారు. వాస్తవానికి గత వారం ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పాటు గుజరాత్ లో పర్యటించిన సమయంలోనే ఆయన సమక్షంలో బీజేపీలో చేరుతారని కున్నారు. అయితే కేసుల చిక్కుముడి వీడక పోవడంతో జాప్యం జరుగుతున్నట్లు భావిస్తున్నారు.  2017 అసెంబ్లీ ఎన్నికలలో కనీస వయస్సు లేక పోటీ చేయలేక పోయారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో క్రిమినల్…

Read More

మూడు ఆఫ్రికా దేశాల పర్యటనలో భాగంగా గబాన్ రిపబ్లిక్ రాజధాని లిబ్రేవిల్లే చేరుకున్న ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడుకు గబాన్ ప్రధానమంత్రి శ్రీమతి రోజ్ క్రిస్టైన్ ఒసుకా రాపొండా, ఆ దేశ విదేశాంగ మంత్రి  మైకెల్ మౌసా అడామోలు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటన సందర్భంగా ఆ దేశ విదేశాంగ మంత్రితో జరిగిన తొలి ద్వైపాక్షిక సమావేశం అనంతరం ఆ దేశాధ్యక్షుడు  అలీ బొంగో ఒండిబాతో ఉపరాష్ట్రపతి సమావేశమయ్యారు. అనంతరం ఆ దేశ ప్రధానమంత్రితో అత్యున్నత స్థాయి అధికారిక చర్చల్లోనూ ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ గబాన్ తో పాటు ఆఫ్రికా దేశాలతో సత్సంబంధాలకు భారతదేశం ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. గబాన్ అభివృద్ధి పథంలో భారత ప్రభుత్వం విశ్వసనీయమైన భాగస్వామిగా ఉంటుందని ఆయన భరోసా కల్పించారు. కరోనా నేపథ్యంలోనూ 2021-22 సంవత్సరానికి గానూ భారత్, గబాన్ ద్వైపాక్షిక వాణిజ్యం బలియన్ డాలర్లు దాటడాన్ని ప్రస్తావిస్తూ ఈ దిశగా మరింత పురోగతి సాధించేందుకు విస్తృతమైన అవకాశాలున్నాయని చెప్పారు.…

Read More

ఉక్రెయిన్‌పై యుద్ధం తరువాత రష్యా అధ్యక్షుడు పుతిన్‌ క్రమముగా ప్రభుత్వంపై పట్టు కోల్పోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆయన వ్యవహారం పట్ల ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉన్నవారిలోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతున్నది. త్వరలో సైనిక తిరుగుబాటు జరిగే అవకాశాన్ని కొట్టిపారేయలేమని పరిశీలకులు భావిస్తున్నారు. పుతిన్ కు అత్యంత సన్నిహితులు, ఆయన ఎదుగుదలలో తెరవెనుక ఘనమైన పాత్ర పోషించిన వారు ఒక్కొక్కరూ దూరమవుతున్నారు. ఒకవైపు తీవ్ర ఆరోగ్య సమస్యలు, మరోవైపు ఉక్రెయిన్‌లో ఎదురుదెబ్బలు పుతిన్‌పై అసంతృప్తికి కారణమని భావిస్తున్నారు. తాజాగా పుతిన్‌ సలహాదారు, మాజీ అధ్యక్షుడు ఎల్సిన్‌ అల్లుడు వాలెంటిన్‌ యుమాష్‌ బోరిస్‌ పదవినుంచి తప్పుకున్నారు. ఎల్సిన్‌ హయాంనుంచి ఇప్పటివరకు క్రెవ్లిున్‌ వ్యవహారాలలో అత్యంత కీలక పరిణామాలకు బాధ్యుడు అయిన యుమాష్‌ ఇటీవలి పరిణామాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ పదవి నుండి వైదొలగినట్లు తెలుస్తోంది. ఎల్సిన్‌ హయాంలో పనిచేసి ఇప్పుటివరకు బాధ్యతలు నిర్వహించిన చివరి వ్యక్తి యుమాష. నిజానికి ఉక్రెయిన్‌పై యుద్ధంపట్ల అటు సైన్యంలోను, పుతిన్‌…

Read More

అమెరికాలో స్థిరపడిన ప్రవాస వైద్యులు మాతృ భూమికి సేవలు చేయాలనే మహత్తర ఆశయంగా ప్రారంభించి, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ఉత్తమ ఆసుపత్రిగా వెలుగొందుతున్న గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో భారీ కుంభకోణం బహిర్గతమైనది. ఇద్దరు డైరక్టర్లు, మరొ ఇద్దరు కీలక వ్యక్తులతో కుమ్మక్కై, లెక్కలను తారుమారు చేసి, రూ 50 కోట్లకు పైగా స్వాహా చేసినట్టు బయటపడింది. ఆస్పత్రి డైరెక్టర్లు నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్‌, డాక్టర్‌ మణి అక్కినేని, ఛీప్‌ కో ఆర్డినేటింగ్‌ ఆఫీసర్‌ ఉప్పల శ్రీనివాసరావు, చీఫ్‌ పైనాన్సింగ్‌ ఆఫీసర్‌ నళిని మోహన్‌…ఓ గ్యాంగ్‌గా ఏర్పడి ఈ భారీ మోసానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఎన్‌ఆర్‌ఐ ఆకాడమీ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ నిధులతోపాటు కరోనా సమయంలో రోగుల చెల్లింపుల్లో గోల్‌మాల్‌కు పాల్పడినట్లు అంతర్గత విచారణలో తేలింది. కరోనా సమయంలో నకిలీ ఇన్వాయిస్‌లతో అక్రమాలకు పాల్పడినట్టు తెలిసింది. సెప్టెంబర్ 24, 2020న ఒక రిటైర్డు జస్టిస్‌, ఆయన సతీమణిని ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో చేరారు. చికిత్స నిమిత్తం రూ…

Read More

 కేంద్ర జల సంఘం అనుమతులు లేకుండానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల పనులపై అభ్యంతరాలు తెలుపుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణానది యాజమాన్య బోర్డుకు లేఖల మీద లేఖలు రాస్తోంది. మంగళవారం నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ కృష్ణాబోర్డు చైర్మన్ మహేంద్ర ప్రతాప్ సింగ్‌కు మరో లేఖ రాశారు.  అత్యున్నత మండలి (అపెక్స్ కైన్సిల్), కృష్ణా బోర్డు అనుమతులు లేకుండా ఎలాంటి సాగునీటి ప్రాజెక్టులు, కాల్వల విస్తరణ పనులు చేపట్టకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నిలువరించాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డును కోరారు. ఏపిలో చేపట్టిన పంప్‌డ్ హైడ్రోస్టోరేజ్ జలవిద్యుత్ ఉత్పత్పత్తికి సంబంధించిన పథకాలపై లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఎలాంటి అనుమతుల్లేకుండా కృష్ణానదిపై చేపట్టిన పనులను బోర్డు దృష్టికి తీసుకు పోయారు. ఏ విధమైన అనుమతులు లేకుండా పలు పథకాల పనులు చేపట్టిందని తెలియజేస్తూ ఆ పనుల పట్ల అభ్యంతరాలు తెలిపారు. ఆ పనులను నిలువరించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన అన్ని పంప్‌డ్ స్టోరేజి…

Read More

అందాల తెలుగు నటి, టిడిపిలో అధికార ప్రతినిధిగా రాజకీయ ప్రత్యర్థులపై ఘాటైన విమర్శలతో తరచూ సంచలనం కలిగిస్తుండే దివ్యవాణి మంగళవారం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ట్వీట్ ఇచ్చి కలకలం రేపారు. అయితే, కొన్ని గంటల తర్వాత ఆ ట్వీట్ ను తీసివేయడం ద్వారా పార్టీలో కొనసాగుతున్నట్లు సంకేతం ఇచ్చారు. వర్రా రవీందర్‌రెడ్డి పేరుతో వచ్చిన పోస్టింగ్ ఆధారంగా రాజీనామా చేశానని దివ్యవాణి చెప్పారు. క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు పేరుతో దివ్యవాణిని సస్పెండ్ చేసినట్లుగా ఫేస్‌బుక్‌లో పోస్టింగ్ వైరల్ అయింది. మహానాడులో మాట్లాడే అవకాశం రాకపోవడంపై దివ్యవాణి రెండు రోజుల క్రితం ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆమె రాజీనామా గందరగోళానికి దారితీసింది. దివ్యవాణిని తాము సస్పెండ్ చేయలేదని టీడీపీ స్పష్టం చేసింది. గతంలోనూ కొందరు తప్పుడు పోస్ట్‌లు పెట్టారని, గతంలో అయ్యన్నను సస్పెండ్ చేసినట్లు ఫేక్‌ పోస్ట్‌లు పెట్టారని టీడీపీ గుర్తుచేసింది. బచ్చుల అర్జునుడుతో మాట్లాడిన తర్వాత దివ్యవాణి తన రాజీనామాపై వెనక్కి తగ్గి…

Read More

దక్షిణ కశ్మీర్‌కు చెందిన కుల్గాం ప్రాంతంలో ప్రవాసం వచ్చిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని మంగళవారం ఉదయం ఉగ్రవాదులు కాల్చి చంపారు. కశ్మీర్ పండిత్ ఉద్యోగిని అతడి కార్యాలయంలోనే కాల్చి చంపిన రెండు వారాలకే ఈ ఘటన వెలుగుచూసింది. ఉగ్రవాదులు దక్షిణ కశ్మీర్ కుల్గాం ప్రాంతంలోని గోపాల్‌పురా గ్రామం ఉన్న ప్రభుత్వ పాఠశాలలోకి దూరి మరీ ఉపాధ్యాయురాలిని గాయపరిచారు. తర్వాత ఆమెను ఆస్పత్రికి తరలించగా అక్కడ ఆమె చనిపోయింది. ఆ లేడీ టీచర్‌ను రజనీ (36)గా గుర్తించినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఆమె జమ్మూలోని సాంబ నివాసి. ఇదిలావుండగా కశ్మీర్ పండిత్ ఉద్యోగి రాహుల్ భట్‌ను అతడి కార్యాలయంలోనే కాల్చి చంపిన రెండు వారాలకే ఈ ఘటన చోటుచేసుకుంది.  అదే విధంగా వారం కిందట టీవీ నటి అమ్రీన్‌ భట్‌ను సైతం ఉగ్రవాదులు కిరాతకంగా కాల్చి చంపారు. ఇదిలా ఉంటే  ఈ నెలలో ఉగ్రదాడుల్లో ఇది ఏడో మరణం. ముగ్గురు పోలీస్‌ సిబ్బందికాగా, నలుగురు పౌరులు మరణించారు.…

Read More

జూన్ 10న జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు 10 మంది అభ్యర్థులను ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ నుండి అసంతృప్తి స్వరాలు చెలరేగుతున్నాయి. ఈ మధ్యనే ఉదయపూర్ లో జరిగిన చింతన్ సివిర్ లో నిర్ణయాలకు పార్టీ నాయకత్వం తిలోదకాలిచ్చిందనే విమర్శలు చెలరేగుతున్నాయి.  ఒక కుటుంభంలో ఒకే సీట్ నిబంధనను గాలికి వదిలివేశారని సీనియర్లు మండియపడుతున్నారు. కొడుకు ఎంపీగా ఉన్నా 76 ఏళ్ళ చిదంబరంకు రాజ్యసభ సీట్ అవ్వడం, కూతురు యుపిలో ఎమ్మెల్యేగా ఉన్నా ప్రమోద్ తివారీకి రాజస్థాన్ నుండి సీట్ ఇవ్వడం ఏమిటనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. జి23 లేఖలో కీలక పాత్ర వహించిన గులాబీ నబి ఆజాద్, ఆనంద్ శర్మలను వదిలి వేయడం గమనిస్తే గాంధీ కుటుంభం `భజన పరులు’ మాత్రమే పార్టీలో ఉండాలనే సంకేతం ఇచ్చిన్నట్లయింది.  నటిగా మారిన రాజకీయ నాయకురాలు నగ్మా మొరార్జీ అభ్యర్థిత్వాలపై ప్రశ్నలను లేవనెత్తారు. కేంద్ర మాజీ మంత్రులు పి చిదంబరం, జైరాం రమేష్, అజయ్ మాకెన్‌లతో పాటు ఆ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి రణ్‌దీప్…

Read More