Author: Editor's Desk, Tattva News

తెలుగు దేశంలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్యెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ కు దారితీసింది.  సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో ఉజ్వలా ఫౌండేషన్‌ పేరుతో విల్లాల నిర్మాణంలో జరిగిన అక్రమాలను అరికట్టాలని జెసి.ప్రభాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.  ఈ అక్రమాలపై జిల్లా కలెక్టరుకు వినతిపత్రం ఇచ్చేందుకు శుక్రవారం ఆయన అనంతపురం నుంచి పుట్టపర్తికి బయల్దేరారు.  ప్రభాకర్‌రెడ్డి పుట్టపర్తికి వెళ్తే శాంతిభద్రతల సమస్య ఏర్పడుతుందన్న పేరుతో.. జాతీయ రహదారి 44 మరూరు టోల్‌గేట్‌ వద్ద అనంతపురం పోలీసులు ఆయనను అడ్డుకుని అరెస్టు చేశారు. రాప్తాడు స్టేషన్‌కు తరలించారు. అనంతరం విడుదల చేశారు.  జెసి ప్రభాకర్‌రెడ్డి పుట్టపర్తికి వెళ్తున్నారని తెలిసి పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే, టిడిపి నాయకులు పల్లె రఘునాథ్‌రెడ్డి అనుచరులు కొత్తచెరువు, పుట్టపర్తిలో నిరసనకు దిగారు. ‘జెసి.ప్రభాకర్‌రెడ్డి గోబ్యాక్‌’ అంటూ ఫ్లకార్డులు చేతబూని నినాదాలు చేశారు. ఈ వ్యవహారంతో జెసి.ప్రభాకర్‌రెడ్డి, పల్లె రఘునాథరెడ్డిల మధ్య ఉన్న తగాదాలు మరోసారి…

Read More

ప్రపంచ కుబేరుడు,టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అనూహ్యమైన ప్రకటన చేశారు. 44 బిలియన్ డాలర్ల (రూ.3.3 లక్షల కోట్లు పైమాటే) విలువైన ట్విట్టర్ కొనుగోలు ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్టు వెల్లడించారు.   స్పామ్‌, నకిలీ ఖాతాలు 5 శాతం కన్నా తక్కువ ఉంటాయన్న లెక్కలకు సంబంధించి వివరాలను ఇంకా అందజేయలేదని, దీంతో కొనుగోలు ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు మస్క్‌ ట్వీట్‌ చేశారు. దీంతో మార్కెట్‌ ట్రేడింగ్‌లో ట్విటర్‌ కంపెనీ షేర్లు 20 శాతం పడిపోయాయి. అయితే ఈ అంశంపై ట్విటర్‌ అధికారికంగా స్పందించాల్సి వుంది. మొదటి త్రైమాసికంలో నగదు ఆర్జించే రోజువారీ క్రియాశీల వినియోగదారులు, స్పామ్‌ ఖాతాలు 5 శాతం కంటే తక్కువ ఉంటాయని కంపెనీ ఈ నెల ప్రారంభంలో అంచనా వేసింది. మస్క్‌తో ఒప్పందం ముగిసే వరకు ప్రకటనదారులు ట్విటర్‌లో కొనసాగాలా వద్దా అనే నిర్ణయంతో పాటు కంపెనీ పలు నష్టాలను ఎదుర్కొన్నట్లు తెలిపింది.మరోవైపు స్పామ్ లేదా నకిలీ ఖాతాలను ట్విటర్…

Read More

తీవ్రమైన ఆర్ధిక సంక్షోభం ఎదుర్కొంటున్న ఏపీ ప్రభుత్వం చివరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసే కాన్వాయ్ వాహనాలకు చెల్లించ వలసిన అద్దెలు కూడా చెల్లింపలేక పోతున్నది. దానితో  ఆయన పర్యటనకు వాహనాలను సమకూర్చుకోవడం అధికారులకు కష్టంగా మారింది.  గత  మూడేళ్లలో వాహనాలకు ఛేళించవలసిన అద్దె రూ.18.11కోట్లకు పేరుకు పోవడంతో ప్రభుత్వం అద్దెకు రమ్మంటే ప్రైవేటు ట్రావెల్స్‌, ట్యాక్సీ యాజమానులు, డ్రైవర్లు దండం పెట్టేస్తున్నారు. చేసేది లేక ఆర్టీఏ అధికారులు ప్రైవేటు వాహనాలను రోడ్లపై ఆపేసి బలవంతంగా తీసుకెళ్లిపోతున్నారు. ఇటీవల అదే విధంగా ఒంగోలు లో తిరుమలకు తీర్థయాత్రకు వెడుతున్న ఓ కుటుంభం సభ్యులను అర్ధరాత్రి వారి వాహనం సీఎం కాన్వాయ్ కోసం అంటూ బలవంతంగా తీసేసుకొని, వారిని రోడ్డుపై వదిలి వెళ్లిపోవడంతో మీడియాలో రాద్దాంతం గా మారింది. దానితో  మోటార్‌ వెహికల్‌ ఇన్స్‌పెక్టర్‌ను సస్పెండ్‌ చేయాలని సీఎంవో ఆదేశించడం ద్వారా నష్ట నివారణ చర్య చేపట్టారు.  దీంతో కాన్వాయ్…

Read More

దేశంలో రెండేళ్లలోపు పిల్లల్లో89 శాతం మందికి కనీస పౌష్టికాహారం లభించడం లేదు. గర్భస్థ శిశువు దగ్గర్నుంచీ రెండేళ్ల పిల్లాడు అయ్యేంత వరకు వారికి పోషకాహారం అందటం అత్యంత కీలకమైంది. లేదంటే అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. మానసిక, శారీరక ఎదుగుదల సరిగా ఉండదు. ఇది సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.  దేశంలో 6 నుంచి 23 నెలల చిన్నారుల్లో 89 శాతం మందికి కనీసంలో కనీసం పోషకాహారం (మినిమం డైట్‌) అందటం లేదని ‘జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5’ (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌) ఆందోళన వ్యక్తం చేసింది. నిర్దేశిత ప్రమాణాలమేరకు కనీస పౌష్టికాహారం పొందని శిశువులు, చిన్నారులు 2015-16లో 91.3శాతముంటే, 2019-20లో 89 శాతంగా నమోదైందని తాజా సర్వే పేర్కొన్నది.  గణాంకాల్లో స్వల్ప మెరుగుదల ఉన్నా, పరిస్థితిలో పెద్దగా మార్పు లేదని సర్వే తేల్చింది. సమాజంలో పేదరికం, అవిద్య, అవగాహనా లోపం, పప్పులు, కూరగాయలు, పండ్లు, గుడ్లు అందుబాటులో లేకపోవటం.. వంటివి సమస్యకు ప్రధాన కారణమని నిపుణులు…

Read More

అమెరికాలో కరోనా మరణాలు 10 లక్షలు దాటాయి. అధ్యక్షులు జో బైడెన్‌ ఈ విషయాన్ని ప్రకటించారు. ఇది ఒక ‘విషాదకరమైన మైలురాయి’ అని, మహమ్మారి ఇంకా కొనసాగుతున్నందు వల్ల జాగ్రత్తగా ఉండాలని అమెరికన్లకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.  రాయిటర్స్‌ గణాంకాల ప్రకారం అమెరికాలో బుధవారం నాటికి కరోనా మరణాలు 10 లక్షలకు చేరుకున్నాయి. అంటే ప్రతి 327 మంది అమెరికన్లలో ఒకరు మరణించారన్నమాట. అలాగే కరోనా మరణాల సంఖ్య శాన్‌ఫ్రాన్సిస్కో లేదా సీటెల్‌ నగరాల్లోని జనాభా కంటే అధికం. దేశంలో కరోనా మరణాల సంఖ్య 10 లక్షలు దాటడటంతో సంతాప సూచకంగా వైట్‌హౌస్‌పై జెండాను అవనతం చేశారు.  రెండో గ్లోబల్‌ కోవిడ్‌-19 సమ్మిట్‌ గురువారం జరగబోతోంది. మరోవైపు కోవిడ్‌తో పోరాటం కొనసాగించేందుకు మరిన్ని నిధులు ఇవ్వాలని కాంగ్రెస్‌ను బైడెన్‌ అభ్యర్థించారు.  ‘మనం ఈ మహమ్మారి పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి. గతంలో లేని విధంగా…

Read More

ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) పనితీరులో సంస్కరణల కోసం ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రపంచ కరోనా సదస్సులో మాట్లాడుతూ  ప్రపంచ ఆరోగ్య భద్రతను మరింత స్థితిస్థాపకంగా నిర్మించుకోవడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.  అంతేకాదు ఆ ప్రయత్నాలలో కీలక పాత్ర పోషించడానికి భారత్‌ సిద్ధంగా ఉందని ప్రధాని తెలిపారు.  సరఫరా గొలుసులు స్థిరంగా ఉంచడానికి వ్యాక్సిన్‌లు, చికిత్సవిధానాల కోసం డబ్ల్యూహెచ్‌ఓ ఆమోద ప్రక్రియను క్రమబద్ధీకరించాలని పిలుపునిచ్చారు.  భవిష్యత్తులో ఆరోగ్య అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రపంచ వ్యాప్తంగా సమన్వయంతో కూడిన ప్రతిస్పందన అవసరమని స్పష్టంగా తెలుస్తోందని తెలిపారు. అంతేకాదు ప్రపంచ వాణిజ్య సంస్థ నియమాలు, ముఖ్యంగా వాణిజ్య సంబంధిత అంశాలకు సంబంధించిన మేథో సంపత్తి హక్కు(ట్రిప్స్‌)ల ఒప్పందాలు మరింత సరళంగా ఉండాలని చెప్పారు. కరోనా గురించి ప్రస్తావిస్తూ, “కరోనా మహమ్మారి విషయంలో భారత్‌ సమిష్టి కేంద్రీకృత వ్యూహాన్ని అనుసరించింది. మేము వార్షిక ఆరోగ్య సంరక్షణ బడ్జెట్‌కు అత్యధిక నిధులు కేటాయించాం. భారత్‌లోని వ్యాక్సినేషన్‌ ప్రక్రియ అతి పెద్దది. భారత్‌ డబ్ల్యూహెచ్‌ఓ ఆమోదించిన…

Read More

పార్లమెంట్ లో కేవలం ఒకేఒక సభ్యుడుగా గల, నాలుగు సార్లు ప్రధానిగా వ్యవహరించిన రణిల్ విక్రమసింఘే శ్రీలంక తదుపరి ప్రధానమంత్రిగా గురువారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. దేశంలోని అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ ఎస్ జె బి గోటబయ రాజపక్సే అధ్యక్షతన ప్రభుత్వంలో చేరడానికి నిరాకరించడంతో, విక్రమసింఘే ఏకైక ఎంపికగా మిగిలిపోయారు. నాలుగుసార్లు దేశ ప్రధానిగా పనిచేసిన విక్రమసింఘేను 2018 అక్టోబర్‌లో అప్పటి అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ప్రధాని పదవి నుంచి తొలగించారు. అయితే, రెండు నెలల తర్వాత సిరిసేన ఆయనను మళ్లీ ప్రధానిగా నియమించారు. అధికార శ్రీలంక పొదుజన పెరమున (ఎస్ ఎల్ పి పి), ప్రధాన ప్రతిపక్షమైన సమగి జన బలవేగయ (ఎస్ ఎ బి)లోని  ఒక వర్గంతో పాటు అనేక ఇతర పార్టీలు పార్లమెంటులో విక్రమసింఘేకు మెజారిటీ సాధించడానికి  మద్దతును తెలిపినట్లు తెలుస్తున్నది.  2020 పార్లమెంట్ ఎన్నికల్లో దేశంలో పురాతన పార్టీ అయిన యు ఎన్ పి  బలమైన కొలంబో నుండి పోటీ చేసిన విక్రమసింఘేతో సహా…

Read More

కర్నాటక ప్రభుత్వం గురువారం నాడు, మతమార్పిడి నిరోధక బిల్లుగా ప్రసిద్ధి చెందిన కర్నాటక మత స్వేచ్ఛ హక్కు బిల్లు, 2021ని ఆర్డినెన్స్ ద్వారా తీసుకురావాలని నిర్ణయించింది. కర్నాటక మత స్వేచ్ఛ హక్కు బిల్లు, 2021 డిసెంబర్ 23, గురువారం అసెంబ్లీలో ఆమోదించినా, కానీ కౌన్సిల్‌లో ప్రవేశపెట్టబడలేదు.కర్నాటక అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లును ఇప్పుడు ఆర్డినెన్స్‌గా రూపొందించి గవర్నర్ సమ్మతి కోసం పంపనున్నారు. “వివిధ కారణాల వల్ల, మేము బిల్లును కౌన్సిల్‌లో ప్రవేశపెట్టలేదు కాబట్టి రాజ్యాంగంలో మాకు నిబంధనలు ఉన్నందున మేము ఆర్డినెన్స్‌ను ఆమోదించాలని నిర్ణయించుకున్నాము. రానున్న రోజుల్లో మండలిలో కూడా ప్రవేశపెట్టి ఆమోదింపజేస్తాం. సెషన్‌లో లేనందున మేము ఇప్పుడు చేయలేము, ”అని కర్ణాటక న్యాయ మంత్రి జెసి మధుస్వామి బెంగళూరులో విలేకరులతో చెప్పారు.భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 213 ప్రకారం, శాసనసభ సమావేశాలు జరగనప్పుడు, రాష్ట్ర గవర్నర్ అటువంటి ఆర్డినెన్స్ అవసరం అని సంతృప్తి చెందితే, రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను ప్రకటించడానికి అనుమతించవచ్చు.…

Read More

టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజ్ శ్రవణ్ మండిపడ్డారు. బంజరాహిల్స్ లోని ఎకరాకు పైగా స్థలాన్ని టీఆర్ఎస్ పార్టీకి కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది. దీనిపై దాసోజ్ శ్రవణ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం గతంలోనే కాంగ్రెస్ పార్టీ భూమి కేటాయించిందని, అక్కడ భవ్యమైన భవనం నిర్మించుకున్నారని గుర్తు చేశారు. మళ్లీ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి స్థలాన్నిఇవ్వడమేంటని ప్రశ్నించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిసోమేశ్ కుమార్ ప్రభుత్వ సొమ్మును టీఆర్ఎస్ కు ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. వంద కోట్ల విలువైన భూమిని గజానికి రూ.100 కే ఇవ్వడం విడ్డూరమని విమర్శించారు. టీఆర్ఎస్ భవన్ లో టీవీ చానెల్ నడుపుతున్నారన్న ఆయన అందుకే వేరే చోట పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం టీఆర్ఎస్ కు ప్రభుత్వ భూమిని కేటాయించారని పేర్కొన్నారు. ప్రజల సొమ్మును టీఆర్ఎస్ దోచుకుంటోందని, ఎనిమిదేళ్లలో టీఆర్ఎస్ ఆస్తులు వెయ్యి కోట్లకు…

Read More

కనీసం మరో 20- 30 ఏళ్లపాటు భారత రాజకీయాలు బిజెపి చుట్టూనే తిరుగుతూ ఉంటాయని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. బిజెపి తనంతట తానే కృంగిపోతుందని ఆశలు పెట్టుకోవద్దని ప్రతిపక్షాలకు, ముఖ్యంగా కాంగ్రెస్ కు చురకలు అంటించారు. మతప్రాతిపదికన ఓటర్లలో చీలికపై వాస్తవంకన్నా ఎక్కువగా ఊహిస్తున్నారని చెబుతూ బిజెపి చెబుతున్న హిందూ కధనంతో ఆకట్టుకొంటున్న ప్రతి ఒక ఓటరుకు బదులుగా మరో ఓటరు ఆకట్టుకోవడం లేదని ప్రతిపక్షాలు గ్రహించాలని సూచించారు. బిజెపి కధనంతో నమ్మకంలేని హిందువులను చేరుకొనే ప్రయత్నం ప్రతిపక్షాలు చేయాలని చెప్పారు. ముందుగా, కాంగ్రెస్ పార్టీ చిరకాలం అధికారంలో ఉన్నామన్న భావన నుండి బయట పడాలని, తాము ప్రతిపక్షంలో ఉన్నామని గ్రహించి ఓ ప్రతిపక్షంగా ఏ విధంగా వ్యవహరించాలో తెలుసుకోవాలని స్పష్టం చేశారు. ఇటీవల పార్టీని ఎలా పునరుద్ధరించాలనే దానిపై కాంగ్రెస్‌తో తన చర్చలు కుప్పకూలడం గురించి ప్రస్తావిస్తూ ప్రతిపక్షాలు నాయకత్వం గురించి కాకుండా ప్రజల ముందు ఎటువంటి కధనంతో వెళ్లాలో…

Read More