Author: Editor's Desk, Tattva News

తనను ఎన్నుకొంటే పసుపు బోర్డు తీసుకు వస్తానని బాండు పేపరు రాసిచ్చి గత ఎన్నికలలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవితపై గెలుపొందిన బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ మూడేళ్లు అవుతున్నా ఆ హామీని నెరవేర్చలేక పోవడంతో పసుపు రైతుల ఆగ్రవేశాలు ఎదుర్కోవలసి వస్తున్నది. మాట తప్పినందున తన పదవికి రాజీనామా చేయాలని రైతుల నుండి నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా, నిజామాబాద్‌ జిల్లా చేపూర్‌, రాంచంద్రపల్లికి చెందిన రైతులు, టీఆర్‌ఎస్‌ నాయకులు పసుపు బోర్డు తెచ్చే వరకు ఆయన ఇంటి ముందు ఆందోళన చేస్తామని తేల్చిచెప్పారు. ఆదివారం నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలోని పెర్కిట్‌లో గల విశాఖ కాలనీలో ఎంపీ నివాసం ముందు ట్రాక్టర్‌లో పసుపు తీసుకొచ్చి కుప్పగా పోశారు. ఐదు రోజుల్లో పసుపుబోర్డు ఏర్పాటు చేస్తామని బాండ్‌పేపర్‌ రాసిచ్చి రైతులను మోసం చేసిన ఎంపీని ప్రతి గ్రామంలో అడ్డుకుంటామని స్పష్టం చేశారు. పసుపు బోర్డు తెస్తామని హామీ ఇచ్చి అమలు…

Read More

రాష్ట్రపతి రామనాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడుల పదవీ కాలం వరుసగా జులై, ఆగష్టు నెలల్లో పూర్తి కావస్తునందున ఆ పదవులకు ఎన్నికలు జరుగబోతున్నాయి. బిజెపి మొదటిసారిగా ఈ రెండు అత్యున్నత రాజ్యాంగ పదవులకు తమ పార్టీకి చెందిన సీనియర్ నాయకులను ఎన్నిక చేసుకోగలిగింది. గతంలో వాజపేయి హయాంలో ఉపరాష్ట్రపతిగా బైరంగసింగ్ షెకావత్ ఎన్నికైనా, రాష్ట్రపతిగా ఎన్నికైన అబ్దుల్ కలాం బిజెపి సభ్యుడు కారు. ఈ పర్యాయం కూడా ఈ రెండు పదవులకు తమ పార్టీ అభ్యర్థులను ఎన్నికయ్యేటట్లు చూడడం కోసం బిజెపి కసరత్తు ప్రారంభించింది. ఈ విషయమై ముందుగా ఎన్డీయే భాగస్వాములతో సమాలోచనలు జరపడంతో పాటు, తటస్థంగా ఉన్న పార్టీ నేతల వద్దకు కేంద్ర మంత్రులను పంపనున్నారు. మొదటగా, ఎన్డీయే భాగస్వామి, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదేశ్ పాట్నా వెళ్లి కలిశారు. బీహార్ లో తమకే ఎక్కువమంది ఎమ్యెల్యేలు ఉండడంతో నితీష్ కుమార్ ను ఉపరాష్ట్రపతిగా…

Read More

ఢిల్లీలోని జహంగీర్‌పురిలో శ్రీరామనవమి రోజున అలర్లను నియంత్రించడంలో పోలీసులు పూర్తిస్థాయిలో విఫలమయ్యారని ఢిల్లీలోని రోహిణి జిల్లా కోర్టు తీవ్రంగా విమర్శించింది. శ్రీరామనవమి సందర్భంగా పోలీసు అనుమతి లేకుండా చట్టవిరుద్ధంగా జరిగిన ఊరేగింపును నిలిపివేయడానికి బదులుగా, దానిని పోలీసులు అనుసరించారని పేర్కొంది. ఈ కేసులో ఎనిమిదిమంది నిందితులకు బెయిల్‌ను తిరస్కరించింది. నిందితులు స్థానికంగా పేరుగాంచిన నేరస్థులని, వారిని విడుదల చేస్తే సాక్షులను భయపెట్టే అవకాశం ఉంటుందని కోర్టు పేర్కొంది. జహంగీర్‌పురి ప్రాంతంలో శ్రీరామనవమి ఊరేగింపు సందర్భంగా జరిగిన అల్లర్లలో ఎనిమిదిమంది పోలీసులు, ఒక పౌరుడు గాయపడ్డారు. 20 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు విచారణలో ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం పోలీసుల అనుమతి లేకుండానే ఊరేగింపు జరిగిందని, పోలీసుల సమక్షంలోనే మైనారిటీలతో వాగ్వివాదం, ఘర్షణలు జరిగాయని తెలుస్తోందని కోర్టు పేర్కొంది. చట్టవిరుద్ధమైన ఊరేగింపును నిలిపివేసి, గుంపును చెదరగొట్టడానికి బదులుగా, పోలీసు అధికారులు ఊరేగింపుతో పాటు వెళ్లారని కోర్టు విమర్శించింది. శాంతిభద్రతలను రక్షించడం పోలీసుల…

Read More

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుండే ప్రతిపక్షాల మధ్య పొత్తుల గురించి చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు సహజంగానే అధికారంలో ఉన్న వైసిపిలో అసహనం కలిగిస్తున్నాయి. వైసిపిని ఓడించడం కోసం వ్యతిరేక శక్తులు ఒకటి కావాలని టిడిపి, జనసేన ఇప్పటికే పిలుపిచ్చాయి. దానితో రాజకీయ శక్తుల పునరేకీకరణ తధ్యం అనే సంకేతాలు వస్తున్నాయి. వాస్తవానికి 2019 ఎన్నికలు ముగిసిన ఆరేడు నెలలకే బిజెపి జనసేనతో పొత్తు ఏర్పరచుకున్నా రాజకీయంగా ఎవ్వరి దారి వారిదే అన్నట్లుగా ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన రాజకీయ పోరాటాన్ని రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కేంద్రీకరిస్తుండగా, బిజెపి నేతలు మాత్రం ఆచరణలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును `ప్రధాన శత్రువు’గా పరిగణిస్తున్నారు. బీజేపీలో ఒక వర్గం వైసిపి నేతలతో కుమ్మక్కయ్యారని బహిరంగంగానే చర్చ జరుగుతున్నది. మరో వర్గం చంద్రబాబు పట్ల సానుకూలంగా ఉన్నరని, అయితే ఎవ్వరు రాష్ట్రంలో బిజెపిని బలోపేతం చేయడం పట్ల…

Read More

ప్రగతిశీల, ఆధునిక భారతదేశంలో ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలకు అనుగుణంగా పోలీసు బలగాలు సంసిద్ధం కావాలని, ఇందుకోసం పోలీసు బలగాల సంస్కరణలను అమలు చేయాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపిచ్చారు. మాజీ పోలీస్ అధికారి ప్రకాష్ సింగ్ రచించిన ‘ది స్ట్రగుల్ ఫర్ పోలీస్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా’ పుస్తకాన్ని ఆదివారం న్యూఢిల్లీలో ఆయన ఆవిష్కరించారు.  21 శతాబ్దపు సైబర్ క్రైమ్ వంటి నేరాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు, ఈ తరం సవాళ్ళకు అనుగుణంగా పోలీసుల నైపుణ్యాలను మెరుగు పరచాల్సిన అవసరాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఖాళీల భర్తీ మొదలుకుని ఆధునిక పోలీసింగ్ అవసరాలకు అనుగుణంగా పోలీసు శాఖలో మౌలిక సదుపాయాల కల్పన సహా యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాల్సిన అంశాలని పేర్కొన్నారు.  ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో పోలీసుల నివాస సముదాయాలతో సహా ప్రతి అంశంలోనూ ఈ మార్పులు జరగాలని ఆయన సూచించారు. సామాన్య ప్రజల పట్ల పోలీసుల స్నేహపూర్వకంగా, మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించిన…

Read More

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాక సందర్భంగా వరంగల్ లో పెద్ద ఎత్తున జనసమీకరణ జరగడంతో, ఆయన వచ్చిన మరో ఏడెనిమిది రోజులకే కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా వస్తుండడంతో, అందుకు పోటీగా జనసమీకరణ జరపాలని బిజెపి రాష్ట్ర నేతలు సమాయత్తం అవుతున్నారు. తెలంగాణాలో రాజకీయ ప్రత్యామ్న్యాయం కాంగ్రెస్ కాదని, తామే అని చెప్పుకొంటున్న బిజెపి నేతలకు అమిత్ షా సభ ప్రతిష్టాత్మకంగా మారింది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా ఈ నెల 14న మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని తుక్కుగూడ సమీపంలో నిర్వహించే బహిరంగ సభకు అమిత్ షా హాజరవుతున్నారు. గతంలో మొదటి దశ పాదయాత్ర ముగింపు సభకు కూడా ఆయనే హాజరయ్యారు. అయితే ఆ సమయంలో వివిధ కారణాల చేత పెద్ద ఎత్తున జనసమీకరణ చేయలేక పోయారు. అందుకనే ఈ పర్యాయం ఒక వంక పాదయాత్రలో ఉంటూనే జనసమీకరణ పట్ల కూడా సంజయ్ స్వయంగా…

Read More

రాష్ట్రాన్ని రక్షించాలంటే వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని, వైసీపీ వ్యతిరేక ఓటు చీలితే రాష్ట్రం అంధకారంలోకి వెళుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. పొత్తు గురించి చెబుతూ.. పొత్తు అనేది ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని, పొత్తులను వ్యక్తిగత లాభాల కోణంలో చూడడం లేదని స్పష్టం చేశారు. కర్నూలు జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టి, ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేస్తూ ఏపీలో వైసీపీ పాలన అస్తవ్యస్తంగా ఉందని విమర్శించారు. 2014లో బీజేపీ, టీడీపీలతో కలిసి జనసేన పోటీ చేసిందని వెల్లడించారు. అయితే ఎప్పుడైనా సరే, పొత్తు ప్రజలకు ఉపయోగపడకపోతే జనసేన అందులోంచి బయటికి వస్తుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం తాము బీజేపీతో పొత్తులో ఉన్నామని, ఏపీలోని ప్రస్తుత పరిస్థితులను కేంద్రం దృష్టికి తీసుకెళతామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు మరింత క్షీణించాయని, ఆడబిడ్డల గౌరవ మర్యాదలు కాపాడమంటే అది చాలా చిన్న విషయంగా మాట్లాడతారని పవన్…

Read More

ఒక వంక తీవ్రమైన అవినీతి ఆరోపణలు, మరో వంక శృతి మించిన అంతర్గత కుమ్ములాటలతో వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలలో కర్ణాటకలో తిరిగి అధికారంలోకి రావడం ప్రశ్నార్ధకరంగా మారడంతో, ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ ఉనికిని ప్రశ్నించే విధంగా ఆ పార్టీ కీలక నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు గాలం వేస్తున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న సిద్దరామయ్య పరోక్ష సహకారంతోనే కాంగ్రెస్ మద్దతుతో ఏర్పడిన హెచ్ డి కుమారస్వామి ప్రభుత్వాన్ని కూలదోసి రెండున్నరేళ్ల క్రితం బిజెపి అధికారంలోకి రాగలిగింది. ఆ సమయంలో కాంగ్రెస్ – జేడీఎస్ ప్రభుత్వంలో మంత్రి పదవులు దక్కలేదని అసమ్మతితో బీజేపీలో చేరిన వారంతా సిద్దరామయ్య మద్దతుదారులు కావడం గమనార్హం. ప్రస్తుతం బసవరాజ్ బొమ్మై మంత్రివర్గంలో కనీసం 15 మంది సిద్దరామయ్య మద్దతుదారులుగా భావిస్తున్నారు. ఈ విషయమై బిజెపి నేతలు సిద్దరామయ్యతో మంతనాలు జరిపారని, తన మద్దతు దారులకు కనీసం 20 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నారని రాజకీయ వర్గాలలో వినవస్తుంది.…

Read More

ఈ వారం ప్రారంభంలో గుజరాత్ హైకోర్టుకు చెందిన జస్టిస్ జంషెడ్ బుర్జోర్ పర్దివాలాను సుప్రీంకోర్టుకు పదోన్నతి కల్పించాలని సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సును అనుసరించి, కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ శనివారం ఉన్నత న్యాయస్థానంలో ఆయన నియామకాన్ని ధృవీకరిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.ఇద్దరు న్యాయమూర్తులు సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు కొలీజియం సిఫార్సు చేసింది. వారు, గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుధాన్షు ధులియా, జస్టిస్ పార్దివాలా. వీరి నియామకంతో 30 నెలల అనంతరం సుప్రీం కోర్ట్ లో పూర్తి స్థాయిలో 34 మంది న్యాయమూర్తులు ఉన్నట్లు కాగలదు. జస్టిస్ పర్దివాలా, వల్సాద్‌కు చెందినవారు. 1965లో బొంబాయిలో జన్మించారు, 2030లో పదవీ విరమణ చేసే వరకు సుప్రీం కోర్టులో విధులు నిర్వహిస్తారని భావిస్తున్నారు. నాల్గవ తరం న్యాయ నిపుణులు 1989లో బార్‌ లో ప్రారంభించి, 2011లో బెంచ్‌కు మారారు. 2013లో గుజరాత్ హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా ఆయనను ధృవీకరించారు.2015లో 58 మంది రాజ్యసభ సభ్యులు అప్పటి…

Read More

వరంగల్ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తోందని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్యెల్యే ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. ఆర్ధిక మంత్రిగా పనిచేసిన అనుభవంతో చెబుతున్నట్లు పేర్కొంటూ ఒకేసారి రూ 2 లక్షల రుణమాఫీ సాధ్యం కాదని తేల్చి చెప్పారు.  రాష్ట్ర ప్రభుత్వం మూడున్నర సంవత్సరాలు అయినా లక్ష రూపాయల రుణ మాఫి చేయలేదని ఆయన తెలిపారు. ఏది చేయగలరో అది చెప్పాలి అంతేకానీ.. ఆచరణ సాధ్యం కానీ  హామీలు ఇవ్వొద్దని రైతులు అంటున్నారని చెప్పారు. ఎకరానికి రూ 15 వేలు ఒకేసారి ఇస్తారా? ఎలా ఇస్తారు?  దానికి స్పష్టత లేదని విమర్శించారు.  మొదటి పంటకి ఇస్తారా?  రెండో పంటకి ఇస్తారా? అని ఈటెల ప్రశ్నించారు.  తాను టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు నాలుగు సార్లు మేనిఫెస్టో రాసినా అది అమలు కాలేదని ఆయన గుర్తు చేశారు. ధనిక రాష్ట్రం అని చెప్పిన కేసీఆర్ నెల నెల జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని …

Read More