Author: Editor's Desk, Tattva News

కోల్‌కతా హైకోర్టులో బుధవారం నాటకీయ సన్నివేశాలు చోటుచేసుకోవడంతో ‘గో బ్యాక్ చిదంబరం’ నినాదాలు మిన్నంటాయి. ఓ కేసులో వాదించడానికి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ప్రముఖ న్యాయవాది పి చిదంబరం వచ్చిన్నప్పుడు నిరసనలు చెలరేగాయి. అయితే ఈ నిరసనలు చేసింది ప్రతిపక్షాలకు చెందిన వారు కాదు. ఆయన ఎంపీగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన న్యాయవాదులు కావడం గమనార్హం.  కాంగ్రెస్ సెల్ లాయర్లు కొందరు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, నల్ల రిబ్బన్లు ప్రదర్శించారు.  ”టీఎంసీ సానుభూతిపరుడు” అంటూ వెక్కిరిస్తూ వ్యాఖ్యలు చేయడంతో పాటు పశ్చిమబెంగాల్‌లో కాంగ్రెస్ పార్టీ దయనీయమైన ఫలితాలను చవిచూడడానికి ఆయనే బాధ్యులంటూ తప్పుపట్టారు. మెట్రో డెయిరీని తక్కువ ధరకు విక్రయించడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఎంపీ, ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరి దాఖలు చేసిన కేసులో ఆయనకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం చౌకగా వాటాలు అమ్మిన్నల్టు ఆరోపిస్తున్న ఓ ప్రైవేటు కంపెనీ తరపున వాదించడానికి చిదంబరం హైకోర్టుకు వచ్చారు. …

Read More

భారత స్వాతంత్ర పోరాటంలో తను, మన, ధన, ప్రాణాలను త్యాగం చేసిన వారిలో చాలా మంది కనీస గుర్తింపునకు కూడా నోచుకోలేదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. వారికి చరిత్ర పుస్తకాల్లో సరైన స్థానం కల్పించడం ద్వారా వారి త్యాగాలను యువతరానికి, చిన్నారులకు తెలియజేయాల్సిన అవసరముందని సూచించారు.  ఇలాంటి గాథల స్ఫూర్తితో వారు జాతి నిర్మాణంలో మరింత ఉత్సాహంగా పాల్గొనేందుకు వీలుంటుందని ఆయన తెలిపారు. బుధవారం ఉపరాష్ట్రపతి నివాసంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ సమావేశ ప్రాంగణంలో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజనీతివేత్త హేమవతి నందన్ బహుగుణ జీవిత చరిత్ర ‘హేమవతి నందన్ బహుగుణ: ఎ పొలిటికల్ క్రుసేడర్’ పుస్తకాన్ని (ఇంగ్లీష్, హిందీ భాషల్లో)  ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని హేమవతి నందన్ బహుగుణ కుమార్తె, ప్రొఫెసర్ రీటా బహుగుణ జోషి, డాక్టర్ రామ్ నరేశ్ త్రిపాఠీలు రాశారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ భారతదేశ చరిత్ర ఎంతో ఘనమైనదని, ఎందరో…

Read More

అదానీతో చేసుకున్న చీకటి ఒప్పందాలు కారణంగానే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రంలో పేదలపై వేల కోట్ల రూపాయలు భారం వేస్తున్నారని టిడిపి నేత, మాజీ ఎమ్యెల్యే దూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు.  ఎక్కడైనా పెద్దోడ్ని కొట్టి.. పేదోడికి పెడతారు.. కానీ ఎపిలో పేదోణ్ణి కొట్టి అదానీకి దోచి పెడుతున్నారని, ప్రజలేమైనా ఫర్వాలేదు.. అదానీతో చేసుకున్న చీకటి ఒప్పందాలు మాత్రం ఆగకూడదనే రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. జగన్‌ సీఎం అయ్యాక ఎపిఇఆర్సి రాష్ట్రంలో విద్యుత్‌ కోతలకు ఆదేశాలిచ్చే సంస్థగా మారిందని దుయ్యబట్టారు.  విద్యుత్‌ కోతలపై ఎపిఇఆర్సి ఆదేశాలు జారీ చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ అసమర్థత, వైఫల్యాలను కప్పి పుచ్చేందుకు ఎపిఇఆర్సి ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. ఏపీలోనే సోలార్‌ పవర్‌ రూ. 2కే లభ్యమవుతోంటే, అదానీ దగ్గర నుంచి రూ. 4కు విద్యుత్‌ కొనుగోలు చేయాల్సిన అవసరమేంటని ఆయన ప్రశ్నించారు. యూనిట్‌ రూ.12కు మించకుండా విద్యుత్‌ కొనుగోలు చేయొద్దంటూ ఎపిఇఆర్సి సీలింగ్‌ విధించడం పట్ల నరేంద్ర విస్మయం…

Read More

పెను రాజకీయ దుమారం రేపిన వీడియోలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు నేపాల్ లోని ఓ నైట్ క్లబ్‌లో ఆయన పక్కన కనిపించిన మహిళ చైనా రాయబారి అంటూ  వార్తలు రావడంతో, బిజెపి నేతలు తీవ్రంగా మండిపడ్డారు అయితే దీనిపై జాతీయ మీడియా సంస్థ ఫ్యాక్ట్ చెక్ చేయగా ఆమె చైనా రాయబారి కాదని వెల్లడైనది.  ఆమ సీఎన్‌ఎన్ మాజీ విలేకరి సుమ్నిమా ఉదాస్ స్నేహితురాలని, ఆమె నేపాల్ జాతీయురాలని ఆ మీడియా సంస్థ ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ నైట్ క్లబ్ యజమాని చెప్పినట్టు తెలిపింది. రాహుల్‌తోపాటు ఐదు, ఆరుగురు స్నేహితులు కూడా వచ్చారని , అయితే అందులో ఎవరూ చైనా దేశస్థులు లేరని క్లబ్ యజమాని చెప్పినట్టు పేర్కొంది.  దాదాపు గంటన్నర పాటు రాహుల్ ఆ క్లబ్‌లో ఉన్నట్టు వెల్లడించింది. సున్నిమా ఉడాస్ వివాహానికి హాజరయ్యేందుకు రాహుల్ సోమవారం కాఠ్‌మాండూ వెళ్లారు. విందులో భాగంగా ఓ నైట్‌క్లబ్‌లో…

Read More

అదానీ కంపెనీ ఉత్పత్తి చేసే 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకి) ద్వారా కొనుగోలు చేయాలన్న ఒప్పందాలను సవాల్‌ చేసిన కేసులో మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. భారీ పెట్టుబడులు, వాణిజ్య సంబంధ అంశాలపై దాఖలైన కేసుల్లో జోక్యం చేసుకోలేమని చెప్పింది.  ప్రతివాదుల వాదనలు విన్న తర్వాతే తగిన విధంగా స్పందిస్తామని ప్రకటించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యుత్‌ పంపిణీ సంస్థలు, కేంద్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (సిఇఆర్‌సి), ఎపి విద్యుత్‌ నియంత్రణ మండలి (ఎపిఇఆర్‌సి), సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకి) తమ వాదనలతో కౌంటర్‌ పిటిషన్లు దాఖలు చేయాలని చీఫ్‌ జస్టిస్‌ పికె మిశ్రా, జస్టిస్‌ ఎం సత్యనారాయణమూర్తితో కూడిన డివిజన్‌ బెంచ్‌ నోటీసులు జారీ చేసింది.  7 వేల మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ కొనుగోలుకు అనుమతినిస్తూ ఎపిఇఆర్‌సి జారీ చేసిన అనుమతులను, సోలార్‌…

Read More

ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో కీలక వడ్డీ రేట్లను పెంచనున్నట్లు ఆర్‌బిఐ ప్రకటించింది. బుధవారం అత్యవసరంగా భేటీ అయిన ఆర్‌బిఐ అనూహ్య నిర్ణయం తీసుకుంది. రెపో రేటును 40 బేసిస్‌ పాయింట్లు పెంచుతున్నామని, దీంతో రెపోరేటు 4.40 శాతానికి చేరుతుందని గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ప్రకటించారు. పెంచిన రేటు తక్షణమే అమల్లోకి వస్తుందని గవర్నర్‌ వెల్లడించారు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు సర్దుబాటు ధోరణిని ఉపసంహరించుకునే యోచనలో ఉన్నట్లు శక్తికాంతదాస్‌ ప్రకటించారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ద్రవ్యోల్బణాన్ని ఆందోళనకర స్థాయికి చేరుతుండడంతో అత్యవసరంగా భేటీ కావాల్సి వచ్చిందని పేర్కొన్నారు.  కాగా వడ్డీరేట్ల పెంపు పై ఏప్రిల్‌లో జరిగిన ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాల ప్రకటనలోనే సంకేతాలిచ్చారు. అయితే జూన్‌లో జరిగే తదుపరి ఎంపిసి సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని భావించారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడంతో ఫిబ్రవరిలో 6.07 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం.. మార్చిలో 6.95 శాతానికి చేరింది.  రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా ధరలు భగ్గుమంటున్నాయి. కోళ్ల పెంపకానికి…

Read More

కర్ణాటకలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైని మార్చబోతున్నారని వస్తున్న కథనాలను బిజెపి కొట్టిపారవేసింది. బొమ్మై  ముఖ్యమంత్రిగా, ఆయన సారథ్యంలోనే 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు వెడతామని ఆ పార్టీ స్పష్టం చేసింది.  బెంగళూరులో బసవ జయంతి సభలో పాల్గొనడానికి వచ్చిన అమిత్‌ షా సోమవారం అర్ధరాత్రి సిఎం బొమ్మైతో  సమావేశమయ్యారు. మంగళవారం సిఎంతో సమావేశమై భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయనను కలసిన వారిలో మాజీ సిఎం యడ్యూరప్ప, కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కటీల్‌ కూడా ఉన్నారు.  అయితే ఆయన అకస్మాత్తుగా బెంగుళూరు పర్యటన పెట్టుకున్నారని, ముఖ్యమంత్రి మార్పు విషయంపైననే వస్తున్నారని కధనాలు వెలువడ్డాయి. ప్రస్తుతం ఐరోపా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ తిరిగి రాగానే ముఖ్యమంత్రి మార్పు తధ్యం అనే ప్రచారం జరుగుతున్నది.   2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పూర్తి స్థాయిలో కర్ణాటకలో నాయకత్వ మార్పులు ఉంటాయంటూ కూడా వార్తలు వెలువడ్డాయి.  అయితే ఆ వార్తలు ఊహాజనితమేనని, ముఖ్యమంత్రిగా బసవరాజ్‌ బొమ్మై కొనసాగుతారని…

Read More

ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా ప్రైవేటీకరణ చేస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం తాజాగా లాభాల్లో ఉన్న మరో ప్రభుత్వ రంగ సంస్థ ‘పవన్ హన్స్’ను అమ్మడంపై రాజకీయ దుమారం చెలరేగుతుంది. వేలకోట్ల రూపాయల ఆస్తులు గల ఈ సంస్థను ఎవ్వరికీ తెలియని ఓ కంపెనీకి కారుచవుకగా కట్టబెట్టే ప్రయత్నం జరుగుతున్నట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. లాభాల్లో ఉన్న కంపెనీని ప్రైవేట్ కంపెనీకి అమ్మడమే ఓ ఘోరమైతే.. దానిని ఆరు నెలల క్రితం కేవలం లక్ష రూపాయల పెట్టుబడితో పెట్టిన కంపెనీకి కట్టబెట్టడం చూస్తే అనేక అనుమానాలు, ప్రశ్నలు తలెత్తుతున్నాయని తెలంగాణ ఐటి మంత్రి కెటి రామారావు విమర్శలు కురిపించారు. అన్నారు. 2017లోనే పవన్ హన్స్ కంపెనీ విలువ రూ.3,700 కోట్లు ఉం డేదని, అలాంటి కంపెనీని లక్ష రూపాయల కంపెనీకి ఎలా అమ్మారని ట్విట్టర్ వేదికగా కెటిఆర్ ప్రశ్నించారు. ఐదేళ్ల క్రితమే రూ 3700 కోట్ల విలువైన కంపెనీలో 49 శాతం వాటా ను రూ.211 కోట్లకు అమ్మడం ఎలా…

Read More

బహిరంగ ప్రదేశాల్లో ప్రాంక్ వీడియోలు షూట్ చేసిన హీరో విశ్వక్ సేన్, అతడి యూనిట్ పై న్యాయవాది అరుణ్ కుమార్ రాష్ట్ర మానవ హక్కుల కమీషన్  (హెచ్ఆర్సీ)లో ఫిర్యాదు చేశారు. తన సినిమాలను ప్రమోట్ చేసుకునేందుకు ఆదివారం విశ్వక్ ఒక ప్రాంక్ వీడియో షూట్ చేయడం కలకలం రేపింది.  తన కారు ముందు ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేసినట్లు విశ్వక్ సీన్ క్రియేట్ చేసి షూట్ చేయగా.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.  ఓ సినిమా పబ్లిసిటీ కోసం ప్రజలను భయాందోళనకు గురి చేసి, న్యూసెన్స్ చేసిన వారిపై చర్యలకు ఆదేశించాలని హెచ్ఆర్సీని ఆ న్యాయవాది కోరారు. ఇలాంటి వీడియోలు యువతపై నెగెటివ్ ప్రభావాన్ని చూపుతాయని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. కాగా, ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ లో ఈ ఫ్రాంక్ వీడియోపై చర్చించేందుకు ఆహ్వానించగా ఆమె వేసిన ప్రశ్నకాలు విశ్వక్ సేన్ సహనం కోల్పోయి అనుచిత భాష వినియోగించడంతో ఇంటర్వ్యూ చేస్తున్న ప్రముఖ  యాంకర్ ఆ…

Read More

ఉక్రెయిన్‌లో తక్షణం కాల్పుల విరమణ పాటించి చర్చలు, దౌత్యమార్గాలద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. యుద్ధాన్ని ముగించడానికి రష్యాపై భారత్ తన పలుకుబడిని ఉపయోగిస్తుందన్న ఆశాభావాన్ని మరోవంక డెన్మార్క్ ప్రధాని మెట్ ఫ్రెడెరిక్‌సన్ వ్యక్తం చేశారు. ఐరోపా పర్యటనలో భాగంగా డెన్మార్క్‌లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ మంగళవారం డెన్మార్క్ ప్రధాని మెట్ ఫ్రెడరిక్‌సన్‌తో భేటీ అయ్యారు. విమానాశ్రయంలో ఆయనకు డెన్మార్క్ ప్రధాని ఫ్రెడరిక్‌సన్ స్వాగతం పలికారు. మేరిన్‌బోర్గ్‌లోని ప్రధాని నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ఇరువురు నేతలు ఉక్రెయిన్ సంక్షోభంతో పాటుగా పలు ప్రాంతీయ, ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. అనంతరం ఇరువురు నేతలు సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ‘ఉక్రెయిన్‌లో తక్షణం కాల్పులు విరమించి సంక్షోభ పరిష్కారానికి దౌత్య, చర్చల మార్గాన్ని ఎంచుకోవలసిందిగా మేము పిలుపునిస్తున్నాం’ అని మోదీ చెప్పారు. ఈ యుద్ధాన్ని, మారణ హోమాన్ని ఆపడానికి రష్యాపై భారత్ తన పలుకుబడిని ఉపయోగిస్తుందన్న ఆశాభావాన్ని ఫ్రెడరిక్‌సన్…

Read More