‘‘యాసంగిలో నిర్ణీత సమయంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకుండా జాప్యం చేసి రైతులను నిండా ముంచారు. రైతులు పండించిన పంటలో 60 శాతం వడ్లను అడ్డికి పావుశేరు చొప్పున దళారులకు అమ్మేసుకుని రైతులు తీవ్ర నష్టపోయారు. కేసీఆర్ పాలనలో రైతులు అన్ని విధాలా నష్టపోతున్నరు. ఒక్కటి మాత్రం నిజం… ఎద్దు ఏడ్చిన వ్యవసాయం… రైతు ఏడ్చిన రాజ్యం ఎన్నటికీ బాగుపడుదు.’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కేసీఆర్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ప్రజా సంగ్రామ యాత్ర లో భాగంగా 20వ రోజు మంగళవారం దేవరకద్ర నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ కుమార్ నాగారం స్టేజ్ వద్ద ధాన్యం కుప్పలను పరిశీలించారు. పంట కల్లాల్లో ఉన్న రైతుల వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ‘‘గత 20 రోజులుగా తమ ధాన్యాన్ని పంట కల్లాల్లో ఆరబోసి, అమ్మడానికి ఎదురు చూస్తున్నామని… అయినా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకుండా…
Author: Editor's Desk, Tattva News
తీవ్రమైన ఆర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలోని తమిళులకు సాయం చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం సిద్ధమైంది. రూ.123 కోట్ల విలువైన నిత్యావసర వస్తువులు, సరుకులను సరఫరా చేసేందుకు కేంద్రం నుంచి అనుమతి పొందింది. శ్రీలంక తమిళులకు చేయూత నివ్వాలని అసెంబ్లీలో ఇటీవల చేసిన తీర్మానాన్ని అనుసరించి సీఎం స్టాలిన్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. శ్రీలంకలో నెలకొన్న తీవ్ర ఆర్థిక సంక్షోభం వల్ల అత్యవసర, నిత్యావసర వస్తువులకు గిరాకీ ఏర్పడింది. అన్ని వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో అక్కడి ప్రజలు కనీసం నిత్యావసర సరుకులను కూడా కొనుగోలు చేయలేక పోతున్నారు. పెట్రోలు, డీజిల్, కిరోసిన్ కొనుగోలుకు గంటల తరబడి ప్రజలు క్యూలో ఉంటున్నారు. వంట గ్యాస్ సిలిండర్ దొరకడం గగనమైంది. దేశమంతా విద్యుత్ కోతలతో అల్లాడుతోంది. విద్యుత్ లేని కారణంగా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు మూసివేస్తున్నారు. ఈ క్రమంలో శ్రీలంక ప్రభుత్వానికి భారత్ సహా మిత్రదేశాలు స్నేహహస్తం అందిస్తున్నాయి. ఇందులో భాగంగా స్టాలిన్ ప్రభుత్వం కూడా…
కాంగ్రెస్ ఎంపిలు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలపై హైకోర్టు న్యాయవాది రామారావు మంగళవారం నాడు జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థుల మధ్య ఘర్షణలు ప్రేరేపించే విధంగా శాంతి భద్రతల పరిరక్షణ, వివిధ అంశాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలలో శాంతి భద్రతల సమస్య సృష్టించే ప్రయత్నం చేస్తుందని న్యాయవాది రామారావు ఆరోపించారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ ఫిర్యాదుపై దర్యాప్తు చేయనుంది. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పర్యటనను వ్యతిరేకిస్తూ టీఆర్‌ఎస్‌వీ ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా వర్సిటీ ప్రాంగణంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను టిఆర్‌ఎస్‌వి నాయకులు దహనం చేసి నిరసన తెలిపారు. ఒయూలో రాహుల్ గాంధీ అడుగుపెడితే అడ్డుకుంటామని, తెలంగాణ అమరవీరుల కుటుంబాలను పరామర్శించిన తర్వాతే రాహుల్ ఒయూకు రావాలని డిమాండ్ చేశారు. ఉద్యమ సమయంలో ఏనాడూ గుర్తుకు రాని…
సరిహద్దుల్లో ఆక్రమణలో ఉన్న భారత భూభాగాలలో అక్రమ నిర్మాణాలు చేపట్టడం చైనా కొనసాగిస్తూనే ఉంది. ఒక వంక సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు నెలకొల్పడం కోసం అంటూ సైనిక స్థాయిలో భారత్ తో చర్చలు జరుపుతూనే, మరోవంక దొంగచాటుగా తూర్పు లడఖ్ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు, సేనల మోహరింపు చేస్తూనే ఉంది. తాజాగా, పాంగాంగ్ సరస్సుపై ఖుర్నాక్ వద్ద వంతెన నిర్మాణం పూర్తి చేసింది. ఈ బ్రిడ్జ్‌ను దగ్గరలోని సైనిక స్థావరానికి అనుసంధానించేలా రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు శాటిలైట్ చిత్రాలు చెబుతున్నాయి. ఖుర్నాక్ సమీపంలో గత ఏడాది సెప్టెంబర్ చివరి వారం నుంచి డ్రాగన్ వంతెన నిర్మాణం ప్రారంభించింది. ఇది ఏప్రిల్ తొలివారంలో పూర్తయింది. దీంతో ఖుర్నాక్ నుంచి దక్షిణ ఒడ్డుకు 180 కిలోమీటర్ల దూరం కాస్తా.. 50 కిలోమీటర్లకు తగ్గిపోయింది. 1962 నుంచి చైనా అక్రమ ఆక్రమణలో కొనసాగుతున్న ప్రాంతాల్లో ఈ వంతెనను నిర్మించింది. ఇది వరకే ఈ వంతెన నిర్మాణంపై.. ‘భారత ప్రభుత్వం…
ప్రజల చేతిలో అధికారం పెడితే అంతా సర్దుకుంటుందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి గులాంనబీ ఆజాద్జ మ్మూకాశ్మీర్ ఎన్నికలపై వ్యాఖ్యానిస్తూ చెప్పారు. ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ఢిల్లీలోని పార్లమెంటు స్ట్రీట్ మసీదులో నమాజ్ చేసిన తరువాత మీడియాతో మాట్లాడుతూ దేశం కరోనా నుండి ఉపశమనం పొందడం పట్ల సంతోషం ప్రకటించారు. కరోనా వల్ల ఎంతో మంది ప్రజలు రోడ్డున పడ్డారని చెబుతూ ఇప్పుడైన ప్రజల్లో విద్వేషాలు తొలగిపోవాలని కోరారు. పీడీపీతో నాయకురాలు మెహబూబా ముఫ్తీ నేతృత్వంలో బీజేపీ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే 2018 జూన్ లో ప్రభుత్వం నుంచి బీజేపీ వైదొలగింది. అప్పటి నుంచి అక్కడ రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. 2019 ఆగస్టులో రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కాగా ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంది. ఈ రాష్ట్రం రాష్ట్రపతి పాలనలో ఉన్నప్పటికీ శాసన సభను కలిగి…
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేపాల్ లోన్ ఓ పబ్‌లో ఉన్న, ఓ చైనా మహిళతో కలసి సన్నిహితంగా ఉన్న వీడియో వైరల్ గా మారింది. నేపాల్ రాజధాని ఖాట్మండులోని ఓ నైట్ క్లబ్ లో రాహుల్ కనిపించారు. ఈ వీడియోని పలువురు బీజేపీ నేతలు ట్విట్టర్ లో షేర్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్‌లో మతఘర్షణలు జరుగుతుంటే రాహుల్ గాంధీ ఎంచక్కా పార్టీ చేసుకుంటున్నారని విమర్శలు సంధించారు. కష్టాల్లో ఉన్న పార్టీని వదిలి విదేశాల్లో పార్టీ చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాగా నేపాల్‌లోని చైనా రాయబారిగా పనిచేస్తున్న మహిళాతో కలిసి పార్టీ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాహుల్ నేపాల్‌లో ఉన్నట్టు ఖాట్మండు పోస్ట్ కథనం కూడా నిర్ధారించింది. ఓ వివాహానికి హాజరయ్యేందుకు ఆయన నేపాల్ వెళ్లారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ ఐటీ కన్వినర్ అమిత్ మాలవీయ స్పందిస్తూ… కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నమవుతున్న వేళ రాహుల్…
గత ఏడాది కాలంగా మీడియాపై దాడులు పెరుగుతుండడం పట్ల నేషనల్ అలయన్స్ ఫర్ జర్నలిస్ట్స్ (ఎన్‌ఎజె), ఢిల్లీ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (డియుజె) తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. ఏకపక్ష అరెస్టులు, వేధింపుల నుంచి మీడియా సిబ్బందిని రక్షించేందుకు తక్షణమే సమగ్ర చట్టాన్ని రూపొందించాలని అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. తద్వారా భావ ప్రకటనా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, పత్రికా స్వాతంత్య్ర పరిరక్షణకు నిర్భయంగా పోరాడేందుకు వీలుంటుందని పేర్కొన్నాయి. ఎలాంటి అధికారాలు లేని ప్రెస్ కౌన్సిల్ స్థానంలో అన్ని పక్షాలకు చెందిన నిపుణులతో మీడియా కమిషన్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాయి. భావ ప్రకటనా స్వేచ్ఛను పరిరక్షించేందుకు సాహసోపేతంగా పోరాడుతున్న జర్నలిస్టుల వాణిని వినిపించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని పురస్కరించుకుని యూనియన్లు తీర్మానించాయి. ఫాసిజం, జర్నలిస్టులపై తప్పుడు కేసులు బనాయించడం, దాడులు జరపడం, ఇంటర్‌నెట్‌పై నిషేధాలు, గూఢచర్యం, ట్రోలింగ్ వంటి…
దేశంలోని చాలా ప్రాంతాల్లో వడగాలుల పరిస్థితులు తగ్గుముఖం పడుతున్నాయని భారత వాతావరణ విభాగం సోమవారం వెల్లడించింది. ఈనెల 4 వరకు వాయువ్య బారతంలో ఉరుములతోపాటు ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. తూర్పు, దక్షిణ భారత్‌లో ఆరో తేదీ వరకు, ఈశాన్య ప్రాంతంలో మూడో తేదీ వరకు ఇలాంటి పరిస్థితులే ఉంటాయని చెప్పింది. ఇటీవలి వారాల్లో అత్యంత వేడి పరిస్థితులు ఎదుర్కొన్న ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్ తదితర ప్రాంతాల్లో వచ్చే మూడు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు ల్లో వచ్చే ఐదు రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. గత నెలలో దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా జమ్మూ కశ్మీర్, హర్యానా, పంజాబ్, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, రాజస్థాన్, గుజరాత్, తదితర రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు…
రెండు నెలల తర్వాత దేశంలో కరోనా పాజిటివ్ రేటు మళ్లీ 1 శాతం మేరకు నమోదయ్యింది. దేశంలో మహమ్మారి కరోనా వైరస్ మళ్లీ పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,568 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. కరోనాతో మరో 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. దీంతో మొత్తం కేసులు 4.30కోట్లకు చేరాయి. గత 24 గంటల్లో 2,911 మంది వైరస్ నుంచి బయటపడగా.. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 4.25కోట్ల మందికి పైగా బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5,23,889మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 19,137 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 189కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత ఫిబ్రవరి 27న దేశంలో కరోనా పాజిటివ్ రేటు 1.11 శాతం ఉండగా మళ్లీ రెండు నెలల తర్వాత ఇప్పుడు రోజువారీ పాజిటివిటీ రేటు 1.07గా నమోదైంది. టీకాలపై ఎవ్వరిని బలవంతం చేయరాదు ఇలా…
రష్యా,ఉక్రెయిన్ యుద్ధంలో శాంతి వైపే భారత్ నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ యుద్ధంలో విజేతలంటూ ఎవరూ ఉండరన్నదే తమ దృఢమైన అభిప్రాయమని ప్రకటించారు. రష్యా ఐరాస నియమావళికి విరుద్ధంగా ఉక్రెయిన్ పై దాడికి దిగిందని జర్మన్ చాన్సలర్ ఒలాఫ్ షుల్జ్ ఆరోపించినప్పుడు, ప్రధాని ఈ విధంగా స్పందించారు. వ్యాపార వాణిజ్యంతో సహా పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించుకునే విషయమై విస్తృత స్థాయిలో చర్చల అనంతరం ఈ ఇరువురు నేతలూ సంయుక్తంగా పత్రికా గోష్టిలో మాట్లాడారు. ఉక్రెయిన్ సంక్షోభం గురించి షుల్జ్ లేవనెత్తగా ప్రధాని స్పందిస్తూ, ‘ఘర్షణలకు తక్షణమే స్వస్తి పలికి, చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని ఈ వివాదం మొదలైనప్పటి నుంచి భారత్ చెబుతూనే ఉంది. ఈ యుద్ధంలో విజేతలంటూ ఎవరూ ఉండరు. అందరూ నష్టపోయేవారే, కావున మేము శాంతి వైపు ఉంటాము’ అని చెప్పారు. ఉక్రెయిన్ సంక్షోభం వల్ల తలెత్తిన ఈఘర్షణల వల్ల చమురు ధరలు…