Author: Editor's Desk, Tattva News

ఢిల్లీలోని జహంగీర్‌పురిలో హనుమాన్ జయంతి శోభాయాత్ర సందర్భంగా శనివారం చెలరేగిన హింసాకాండకు ఇటీవల రాజస్థాన్‌లోని కరౌలీ, మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌లో జరిగిన మత ఘర్షణలకు ఏమైనా సంబంధం ఉందా? అని కేంద్ర దర్యాప్తు సంస్థలు పరిశీలిస్తున్నాయి. దేశంలోని మత సామరస్యానికి భంగం కలిగించే పెద్ద కుట్రను సూచిస్తూ ఈ ఘటనలన్నింటి స్వరూపం ఒకే విధంగా ఉందని ఏజెన్సీలు పేర్కొంటున్నాయి. ఈ రాష్ట్రాల్లో మతపరమైన ఊరేగింపులపై దాడులు హిందూ,  ముస్లిం వర్గాలు చాలా కాలంగా కలసి నివసిస్తున్న ప్రదేశాలలో ఈ ఘర్షణలు జరగడం గమనిస్తే భద్రతలోపం కూడా వెల్లడవుతోంది.  కరౌలిలో, ఏప్రిల్ 2న హిందూ నూతన సంవత్సర మొదటి రోజు నవ్ సంవత్సర్ సందర్భంగా జరిగిన ఊరేగింపుపై రాళ్లు రువ్వడంతో హింస చెలరేగింది. ఈ ఘర్షణల్లో 42 మందికి పైగా గాయపడ్డారు. ఖర్గోన్‌లో, శ్రీ రామ నవమి సందర్భంగా మతపరమైన ఊరేగింపు తలాబ్ చౌక్ ప్రాంతం గుండా వెళుతుండగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువైపులా రాళ్లు రువ్వడంతో…

Read More

త్వరలోనే దేశంలోని బిజెపియేతర ముఖ్యమంత్రుల సమావేశం ముంబైలో జరుగుతుందని శివసేన ఎంపి సంజయ్ రౌత్ వెల్లడించారు. దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితిని , కేంద్రంలోని బిజెపి సారథ్యపు ప్రభుత్వ వైఖరితో తలెత్తుతున్న సమస్యలను ఈ సమావేశంలో సమీక్షిస్తారని ఆయన తెలిపారు. బిజెపి అధికారంలో లేని రాష్ట్రాల సిఎంలందరికీ ఇటీవలే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ లేఖలు రాశారని ఆయన గుర్తు చేశారు. అంతా ఒక్కచోట సమావేశం కావాలని ఆమె కోరారు. ఈ మేరకు ముంబైలో ఈ సమావేశం త్వరలో ఏర్పాటు అవుతుందని, తేదీని ఖరారు చేసి వెల్లడిస్తామని రౌత్ తెలిపారు. దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులతోపాటు ద్రవ్యోల్బణం, మత విద్వేషాలు, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం వంటి అంశాలపై చర్చ జరుగుతుందని చెప్పారు. మత ఘర్షణలతో లబ్ధి పొందే బిజెపి వ్యూహం కాగా, దేశంలో మతఘర్షణలను రేకెత్తించి, ఎన్నికల్లో లబ్ధి పొందాలన్నదే బిజెపి వ్యూహమనిసంజయ్ రౌత్ ఆరోపించారు. శ్రీరాముని పేరుతో మత ఘర్షణలు చెలరేగడం రాముడి…

Read More

సోషల్ మీడియాలో మార్ఫింగ్ చేసిన పోస్ట్‌పై నిరసనకారులు పోలీసు వాహనాలను ధ్వంసం చేయడం, రాళ్లతో దాడి చేయడంతో హింస చెలరేగడంతో ఆదివారం కర్ణాటకలోని హుబ్బళ్లిలో నిషేధ ఉత్తర్వులు జారీ అయ్యాయి. హింసాకాండలో నలుగురు పోలీసులతో సహా పలువురు గాయపడ్డారు. హింసాకాండ తర్వాత దాదాపు 40 మందిని అదుపులోకి తీసుకున్నామని, ఏప్రిల్ 20వ తేదీ ఉదయం 6 గంటల వరకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సిఆర్‌పిసి) సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలు విధించినట్లు హుబ్బల్లి-ధార్వాడ్ నగర పోలీసు కమిషనర్ లాభూరామ్ తెలిపారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, పాత హుబ్బల్లి పోలీస్ స్టేషన్ వెలుపల చాలా మంది ప్రజలు గుమిగూడి, అవమానకరమైన మార్ఫింగ్ ఫోటోను పోస్ట్ చేసిన అభిషేక్ హిరేమత్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ఫిర్యాదు మేరకు పోలీసులు ఆనంద్ నగర్‌లోని ఆయన నివాసం నుంచి హీరేమత్‌ను అరెస్టు చేసి పాత హుబ్బళ్లి పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. నిరసనకారులు పోలీసు…

Read More

పోలీసులు తనను కావాలని వేధిస్తున్నారంటూ పురుగుల మందు తాగిన బీజేపీ నేత సామినేని సాయిగణేష్(25) మృతిచెందడంతో  ఖమ్మం జిల్లా కేంద్రం అట్టుడికింది.  సాయిగణేశ్‌ మృతికి  పోలీసులతో కలసి వేధించిన స్థానిక  మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, కార్పొరేటర్‌ కన్నం వైష్ణవి భర్త ప్రసన్న కృష్ణ, పోలీసులు కారకులంటూ బీజేపీ కార్యకర్తలు పెద్దఎత్తున  ఆందోళనకు దిగారు.   సాయి గణేష్ మృతికి సంబంధించి మంత్రి పువ్వాడ, బాధ్యులైన పోలీసులు, నాయకులపై హత్య కేసు నమోదు చేయాలని ప్రజాసంగ్రామ యాత్రలో ఉన్న రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఖమ్మంలో సాయి గణేష్ ఆత్మహత్య ఘటనలో న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.  మరణ వాంగ్మూలం తీసుకుంటే స్థానిక మంత్రి, టీఆర్ఎస్ నేతలపై హత్య కేసు నమోదు చేయాల్సి వస్తుందనే భయంతోనే మరణ వాంగ్మూలం నమోదు చేయలేదని ధ్వజమెత్తారు. సీఎంఓ నుండి వచ్చిన ఆదేశాలతోనే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు.  మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, పోలీసుల వేధింపులు భరించలేక ఖమ్మంలో బిజెపి కార్యకర్త…

Read More

భారతదేశంలో పేదరికం చెప్పుకోదగ్గ స్థాయిలో 12.3 శాతం తగ్గిందని ప్రపంచ బ్యాంకు ఆదివారం ప్రకటించింది. 2011తో పోలిస్తే.. 2019లో పేదరికం పరిస్థితి మెరుగుపడిందని చెప్పింది. 2011లో 22.5 శాతం ఉన్న పేదరికం 2019లో 10.2 శాతానికి పడిపోయిందని వివరించింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం గణనీయంగా తగ్గిందని తమ పరిశోధనలో తేలిందని ప్రపంచ బ్యాంకు ప్రకటన చేసింది. ఇటీవల అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) కూడా ఇదే ప్రకటన చేసింది. భారతదేశం తీవ్రమైన పేదరికాన్ని నిర్మూలించిందని ఐఎంఎఫ్‌ వర్కింగ్‌ పేపర్‌ ప్రకటించింది. ప్రభుత్వం ఉచితంగా ఆహార సరుకులను అందజేస్తుండటంతో వినియోగంలో అసమానతలు 40 ఏళ్ల కనిష్ట స్థాయికి తగ్గినట్టు వివరించింది. ప్రపంచ బ్యాంకు వర్కింగ్‌ పేపర్‌ను ఆర్థికవేత్తలు సుతీర్థ సిన్హా రాయ్‌, రాయ్‌ వాన్‌ డెర్‌ వెయిడేలు సంయుక్తంగా రూపొందించారు. ఈ నివేదికలో కీలక విషయాలు వెల్లడించారు. భారతదేశంలో పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం తగ్గుదల ఎక్కువగా ఉందని తెలిపారు.…

Read More

పరిహారం కోసం కేంద్రంపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా రాష్ట్రాలు తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు జిఎస్‌టి కౌన్సిల్‌ కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం ఉన్న ఐదు శాతం శ్లాబ్‌ను తొలగించే ప్రతిపాదనను పరిశీలించే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వచ్చే నెలలో జరగనున్న జిఎస్‌టి కౌన్సిల్‌ సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు సమాచారం. 5 శాతం పరిధిలోకి వచ్చే వినియోగదారులను 3 శాతం, 8 శాతం వర్గాలుగా విభజించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జిఎస్‌టిలో 5,12.18,28 శాతం పన్ను శ్లాబులున్నాయి. బంగారం, బంగారం ఆభరణాలపై 3 శాతం పన్ను విధిస్తున్నారు.  ప్యాక్‌ చేయని, బ్రాండెడ్‌ కాని ఆహార, డైరీ ఉత్పత్తులు ప్రస్తుతం జిఎస్‌టి నుండి మినహాయింపు రాష్ట్రాల ఆదాయాన్ని పెంచేందుకు ఆహారేతర వస్తువులను 3 శాతం శ్లాబ్‌ పరిధిలోకి తీసుకురావాలని కేంద్రం యోచిస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. 5 శాతం శ్లాబ్‌ని 7 శాతం లేదా 8 శాతం లేదా 9 శాతాలకు…

Read More

దివ్యాంగుల పట్ల ఉన్న సామాజిక దృక్పథాన్ని మార్చాల్సిన తరుణమిదేనని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. వారిపట్ల సానుభూతిని చూపించాల్సిన అవసరం లేదని, చేయూతనందించడం ద్వారా వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా ముందుకు సాగాలని హితవు చెప్పారు.  వారిపట్ల ఉన్న వివక్షతను నిర్మూలించే దిశగా ప్రభుత్వం చేస్తున్న కృషితో పాటు సమాజం కూడా తన వంతు పాత్ర పోషించాలని ఉపరాష్ట్రపతి చెప్పారు. దివ్యాంగుల్లో సహజంగానే వివిధ అంశాలకు సంబంధించిన తెలివితేటలు ఉంటాయని చెబుతూ వాటిని గుర్తించి పదునుపెట్టాలని చెప్పారు.  హైదరాబాద్ బోయినపల్లిలోని ‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిజెబిలిటీస్’ (ఎన్ఐఈపీఐడీ)ని ఆదివారం ఉపరాష్ట్రపతి సందర్శించారు. ఈ సందర్భంగా దివ్యాంగులు, వారి కుటుంబసభ్యుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించిన సమాజాభివృద్ధిలో వారిని భాగస్వాములు చేసేందుకు ఎన్ఐఈపీఐడీ చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించారు. దివ్యాంగుల అభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటుచేయడం చాలా అవసరం అన్న ఉపరాష్ట్రపతి, ఈ దిశగా ‘యాక్సెసెబుల్ ఇండియా’ ఉద్యమం ద్వారా సానుకూలమైన…

Read More

రైతుల సంక్షేమ పథకాలు తుంగలో తొక్కిన ఘనత సీఎం కేసిఆర్‌దేనని వైఎస్ఆర్ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటన చేస్తున్న ఆమె మాట్లాడుతూ రెండుసార్లు తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు అధికారం ఇస్తే ఏం చేశారని ప్రశ్నించారు.  షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర 58వ రోజైన ఆదివారం కొత్తగూడెం నియోజకవర్గం సుజాతనగర్‌ మండలంలో కొనసాగింది.  సుజాత  నగర్  గ్రామంలో నిర్వహించిన  రైతు గోస  ధర్నాలో  షర్మిల పాల్గొంటూ  కేసీఆర్‌ చెప్పిన ఒక్క మాట, చేసిన ఒక్క సంతకంతో రాష్ట్రంలో సుమారు 17లక్షల మంది రైతులు నష్టపో యారని ధ్వజమెత్తారు.  రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేశానని సీఎం చెబుతున్నారని, మరి రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయని ఆమె  నిలదీశారు. 8 సంవత్సరాలలో వేల మంది ఆత్మహత్య చేసుకున్నారంటే కోటీశ్వరులై., కార్లు ఎక్కువై ఆత్మహత్యలు చేసుకున్నారా..? అని షర్మిల ప్రశ్నించారు.  బ్యాంకుల వాళ్లు ఇళ్లకు వచ్చి తాళాలు వేసి అప్పుల కోసం వేధిస్తుంటే, అవమానాలు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని షర్మిల…

Read More

కరోనా నుండి పూర్తిగా కోలుకోకముందే దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలతో పాటు, నిత్యావసర వస్తువుల ధరలు, వంటనూనె ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. తాజాగా ఆర్‌టిసి ధరలు కూడా పెరిగాయి. రోజురోజుకూ సామాన్యులపై అధిక రేట్లు గుదిబండలా పెరుగుతూనే ఉన్నాయి.  ధరలు పెరిగిన వేళ  వాటి డిమాండ్‌ తగ్గడం ప్రారంభించింది. ముఖ్యంగా ఈ మార్పు పెట్రో ధరల విషయంలో స్పష్టంగా కనిపిస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. పెట్రో ధరలు పైకి ఎగబాకడంతో రవాణా ఛార్జీలు పెరిగి, దాని ప్రభావం అన్నింటిపై పడుతుందని ఆర్థిక నిపుణులు వెల్లడిస్తున్నారు.  ఈ నెలలో మాత్రం ఇంధన వినియోగం బాగా తగ్గినట్టు గణాంకాలు చెబుతున్నాయన్నారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు విపరీతంగా పెరుగడమే ఇందుకు కారణంగా విశ్లేషిస్తున్నారు. మార్చి 2022 తొలి 16 రోజులతో పోలిస్తే  ఏప్రిల్‌లో 10 శాతం పెట్రోల్‌ వినియోగం తగ్గిపోయింది.  ఇదే సమయంలో డీజిల్‌ వినియోగం 15.6 శాతం పడిపోగా, వంటగ్యాస్‌ వినియోగం కూడా…

Read More

ఆఫ్ఘన్‌ల సహనాన్ని పరీక్షించకండి. ఆ తర్వాత జరిగే తీవ్రమైన పరిణామాలకు పాకిస్తాన్‌ సిద్ధంగా ఉండాలని పాకిస్థాన్ ను తాలిబన్లు హెచ్చరించారు. ఆఫ్ఘానిస్తాన్ లో తాలిబన్ల పాలన ఏర్పాటులో కీలక పాత్ర వహించిన పాకిస్థాన్ పట్ల ఇప్పుడు ఆ దేశంలో తీవ్ర అసహనం వ్యక్తం అవుతున్నది.  తాజాగా, ఆప్ఘనిస్తాన్‌లోని ఖోస్ట్, కునార్ ప్రావిన్సులపై పాక్‌ జరిగిపిన వైమానిక దాడుల్లో 60 మందికిపైగా ఆప్ఘన్‌ సాధారణ పౌరులు మృతిచెందారు. దీనిపై  తాలిబాన్‌ ప్రభుత్వానికి చెందిన సమాచార, సాంస్కృతిక శాఖ ఉప మంత్రి జబివుల్లా ముజాహిద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి వైమానిక దాడులు జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని స్పష్టం చేశారు.  ఇలాంటి ఘటన వల్ల రెండు దేశాల మధ్య వివాదాలు పెరుగుతాయన్న ముజాహిద్‌.. దౌత్య మార్గాల్లో సమస్యల పరిష్కారానికి తాము ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. ఇదిలా ఉండగా పాక్‌ వైమానిక దాడుల అనంతరం ఆప్ఘనిస్తాన్‌ రాజధాని కాబూల్‌లోని పాకిస్తాన్‌ రాయబారి మన్సూర్ అహ్మద్ ఖాన్‌తో తాలిబాన్‌ విదేశాంగ మంత్రిత్వ…

Read More