మొత్తం 24 మంది మంత్రులతో రాజీనామా చేయించి, మూడు రోజులపాటు కసరత్తు చేసిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొత్తగా ప్రమాణస్వీకారం చేయబోయే 25 మంది మంత్రుల జాబితాను ప్రకటించగానే రాష్ట్రంలో పలుచోట్ల అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. మొదటిసారిగా, వైసిపి శ్రేణులు పార్టీ నాయకత్వంపై ఆగ్రవేశాలతో రోడ్లపైకి వచ్చి, నిరసనలు తెలిపారు. పలుజిల్లాల్లో ఎమ్మెల్యేలు, వారి అనుచరులు రోడ్డెక్కారు. మొదటి నుండి పార్టీని అంటిపెట్టుకున్న తమకు జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర అన్యాయం చేశారని పలువురు ఎమ్మెల్యేలు అసంతృప్తితో రగిలిపోయారు మనస్థాపంతో కంటతడిపెట్టుకున్నారు. పలువురు ఎమ్మెల్యేలు ఫోన్‌లను స్విచాఫ్ చేసుకొని ఎవరినీ కలవకుండా ఇళ్లకే పరిమితమయ్యారు. ఎమ్మెల్యేలకు మద్దతుగా పలు నియోజకవర్గాల్లోని తాము ప్రాతినిథ్యం వహిస్తున్న స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవులతోపాటు పార్టీ పదవులకు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. ఎమ్మెల్యేలు వివిధ రూపాల్లో తమ అసమ్మతిని వ్యక్తం చేస్తుండగా వారి అనుచరులు ప్రత్యక్ష ఆందోళనకు దిగారు. మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు …
Author: Editor's Desk, Tattva News
ఎర్రజెండా అండతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఆగడాలను తిప్పికొట్టాలని దేశ ప్రజానీకానికి సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. కేరళలోని కన్నూరులో ఈనెల ఆరు నుంచి ఐదు రోజులపాటు కొనసాగిన సీపీఎం అఖిల భారత 23వ మహాసభల ముగురింపు సందర్భంగా జరిగిన భారీ బహిరంగసభలో మాట్లాడుతూ ఒకవైపు మతోన్మాదం..మరోవైపు ఆర్థిక భారాలు.. ఇంకోవైపు ప్రభుత్వ ఆస్తులను తెగనమ్మటం.. దీంతోపాటు రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేయటమే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ సర్కారు పనిచేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. సరళీకృత ఆర్థిక విధానాలకు మతోన్మాదాన్ని జోడించటం ద్వారా అది ‘ప్రజలను విభజించి,పాలించు’ అనే తన అజెండాను సమర్థవంతంగా అమలు చేస్తున్నదని ఆయన ధ్వజమెత్తారు. ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్ముతూ ప్రజలను లూఠీ చేస్తోందని చెప్పారు. మరోవైపు రాజకీయాల్లోకి మతాంశాలను జప్పించటం ద్వారా ప్రజా సమస్యలను పక్కదోవ పట్టిస్తోందని విమర్శించారు. రాజ్యాంగ మూల సూత్రాలైన ప్రజాస్వామ్యం, లౌకికత్వం, సమాఖ్య వ్యవస్థ, ఆర్థిక స్వావలంబన అనే అంశాలను నిర్వీర్యం చేస్తోందని ఆందోళన…
ఎన్నికల కోసం అంటూ మంత్రివర్గంలో మార్పుల కోసం మొత్తం మంత్రులందరితో రాజీనామాలు చేయించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాటలో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కూడా నడిచేటట్లు చేయడం కోసం బిజెపి జాతీయ నాయకత్వం కసరత్తు చేస్తున్నట్లు కనిపిస్తున్నది. కాంగ్రెస్ సంస్కృతిని అద్దంపట్టే విధంగా మంత్రువర్గంలో మార్పుల కోసం ఢిల్లీ చుట్టూ బొమ్మై ప్రదక్షణాలు చేస్తున్నారు. గత వారం రెండు రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసినా మంత్రివర్గ విస్తరణకు అనుమతి లభించలేదు. పార్లమెంట్ సమావేశాల్లో తీరిక లేకుండా ఉన్నారంటూ హోమ్ మంత్రి అమిత్ షాతో కలవడం కూడా సాధ్యపడలేదు. అయితే ముఖ్యమంత్రి పదవికోసం ప్రయత్నిస్తున్న మాజీ సీఎం జగదీశ్ శెట్టియార్ మాత్రం బొమ్మై బెంగళూరుకు చేరేలోగానే అమిత్ షాను కలసిన్నట్లు సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అయ్యాయి. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ కసరత్తును కర్ణాటకకు చెందిన పార్టీ జాతీయ సంఘటనా కార్యదర్శి బీఎల్ సంతోష్ అత్యంత రహస్యంగా చేస్తున్నట్లు తెలుస్తున్నది. పార్టీ ఎమ్యెల్యేలతో ఆయనే స్వయంగా…
ఇంధన ధరల పెరుగుదల గురించి ఎదురైన ప్రశ్నకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అసహనం వ్యక్తం చేశారు. ఆదివారం ఢిల్లీ గుహవటి విమానంలో ప్రయాణిస్తున్న స్మృతి ఇరానీని కాంగ్రెస్ నేత నెట్టా డిసౌజా ఈ ప్రశ్న అడిగారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. తన ఇంటర్వ్యూని కేంద్ర మంత్రి కూడా వీడియో తీశారంటూ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ యాక్టింగ్ చీఫ్‌గా వ్యవహరిస్తున్న నెట్టా డిసౌజా ట్విటర్‌లో పేర్కొన్నారు. మంత్రి స్మృతి ఇరానీ గౌహతికి వెళ్లే విమానంలో ఆమెకు ఎదురయ్యారు. తీవ్రంగా పెరుగుతున్న ఎల్‌పిజి ధరలపై ప్రశ్న అడిగినపుడు ఆమె స్పందించిన తీరు చూడండి అంటూ ట్వీట్ చేశారు. ‘‘గౌహతి వెళ్తున్న సమయంలో మోదీ కేబినెట్‌లో మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీ కలిశారు. పెట్రో ధరల పెంపు పై ప్రశ్నించాను. దీంతో వ్యాక్సిన్లు, రేషన్‌తో సహా పేదలను నిందించారు. ఈ వీడియోను చూడండి’’ అంటూ కాంగ్రెస్ నేత డిసౌజా…
వచ్చే ఏడాది జరగనున్న శాసన సభ ఎన్నికలకు ఛత్తీస్‌గఢ్ లో బిజెపిని ఎదుర్కొనేందుకు ఆ పార్టీ ఇతర రాష్ట్రాలలో అనుసరిస్తున్న `హిందుత్వ’ రాజకీయాలతో ఇక్కడ ప్రయోజనం పొందకుండా అడ్డుకట్ట వేసేందుకు తామే అసలైన `హిందూ’ అన్నట్లు కాంగ్రెస్ వ్యవహరిస్తున్నది. రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాలను కలుపుతూ ‘రామ వన గమన టూరిజం సర్క్యూట్’ను వేగవంతం చేస్తోంది. ఈ ప్రాజెక్టు తొలి దశలో తొమ్మిది స్థలాలను అభివృద్ధి చేస్తోంది. ‘రామ వన గమన టూరిజం సర్క్యూట్’ ప్రాజెక్టులో భాగంగా గత ఏడాది అక్టోబరులో మాతా కౌసల్య దేవాలయాన్ని పునరుద్ధరించారు. దీనిలో రెండో ప్రాజెక్టుగా శివ్రినారాయణ్ దేవాలయాన్ని పునరుద్ధరించి శ్రీరామ నవమి సందర్భంగా ఆదివారం ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ ప్రారంభిస్తున్నారు. ఈ సందర్భంగా రామ చరిత మానస్ పారాయణం చేయించి, బహుమతులను కూడా ప్రకటించారు. భూపేష్ బాఘెల్ మాట్లాడుతూ, అయోధ్య తరహాలో శివ్రినారాయణ్ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. రామాయణంతో ఛత్తీస్‌గఢ్‌కు గొప్ప అనుబంధం ఉందని…
ఉత్తర ప్రదేశ్ లో బిజెపి గెలుపుకు తాను సహకరించానని అన్నట్లుగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై బిఎస్‌పి అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మాయావతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సొంతిల్లును చక్కదిద్దుకోలేని వ్యక్తి బిఎస్‌పి లొసుగులు చూయించాలనుకున్నాడు’ అంటూ ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధాలని చెబుతూ, ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలపై దృష్టి పెట్టాలని హితవు చెప్పారు. అలాంటి వ్యాఖ్యలు చేయడానికి ముందు కాంగ్రెస్ వంద సార్లు ఆలోచించుకోవాలని సూచించింది. `వారు బిజెపి మీద విజయం సాధించలేకపోయారు. కానీ నిందలు వేస్తున్నారు’ అంటూ మండిపడ్డారు. `అధికారంలో ఉన్నప్పుడు, అధికారం కోల్పోయాక కూడా కాంగ్రెస్ ఏమీ చేయలేదు’ అని ఆమె విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ శనివారం ‘మాయావతికి యూపి ముఖ్యమంత్రి పదవిని ఇస్తామని కూడా చెప్పాము. కానీ ఆమె మాతో మాట్లాడనైనా మాట్లాడలేదు’ అంటూ యూపిలో బిజెపి గెలుపుకు స్పష్టమైన మార్గాన్ని మాయావతి చూయించిందని రాహుల్ ఆరోపించారు. ఇదిలావుండగా…
భారత్ పై విషం కక్కడం, కాశ్మీర్ వివాదాన్ని లేవనెత్తడం ద్వారానే పాకిస్థాన్ లో రాజకీయ నాయకులు `నిజమైన అధికారం’ చెలాయిస్తున్న సైన్యాన్ని మెప్పించే ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు ప్రధాని పదవి కోసం ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన షాబాజ్ షరీఫ్ సహితం అదే పల్లవి అందుకున్నారు. కశ్మీర్ సమస్య పరిష్కారమయ్యే వరకు భారత్‌లో సంబంధాలు సాధారణ స్థితికి రావని స్పష్టం చేసారు. శనివారం అర్ధరాత్రి పాక్ జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఇమ్రాన్ ఖాన్ పదవీచ్యూతుడయ్యాడు. అవిశ్వాసం నెగ్గడంతో ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలోనే షాబాజ్ షరీఫ్‌ను ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఈ మేరకు ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయనను కొత్త ప్రభుత్వం భారత్‌తో సంబంధాలను మెరుగుపర్చేందుకు కృషి చేస్తుందా? అని మీడియా ప్రశ్నించింది. కశ్మీర్ సమస్య పరిష్కారం కానంత వరకు భారత్‌తో సంబంధాలు మామూలుగా ఉండవని చెప్పారు. అవినీతి ఆరోపణలతో…
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అండతో ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టడమే కాకుండా, బలమైన ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్ ను ప్రదవీచ్యుతుడిని కావించి, తదుపరి ముఖ్యమంత్రి కావాలని కలలు కన్నా రాజకీయ నేతగా మారిన క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దుకు ఇప్పుడు పంజాబ్ కాంగ్రెస్ లో చుక్కెదురైంది. అమరిందర్ సింగ్ రాజీనామా అనంతరం ముఖ్యమంత్రి పదవి తాను సూచించిన వారికి కాకుండా మరొకరికి ఇవ్వడం, కనీసం తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ప్రకటించాక పోవడం, ఘోరంగా కాంగ్రెస్ ఓటమి చెందడంతో పిసిసి అధ్యక్ష పదవికి రాజీనామా చేయమనడంతో ఇప్పటికే రగిలిపోతున్న సిద్ధుకు తాజాగా కీలక నీయమకాలు ఆయనకు సంబంధం లేకుండా జరగడంతో తీవ్ర ఆశాభంగంకు గురైనట్లు కనిపిస్తున్నది. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నేషనల్ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్‌ను పంజాబ్ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా నియమించడం సిద్ధూ శిబిరంలో నిరసన జ్వాలలలు రేకెత్తిస్తున్నాయి. సిద్ధూ కొత్త కాంగ్రెస్ చీఫ్.. కొత్త సిఎల్పి నాయకుడు…
కర్ణాటకలో ఇటీవల చెలరేగిన హలాల్, హిజాబ్ వంటి భావోద్వేగ అంశాలతో ఓటర్లను ఆకట్టుకోవచ్చనే ఆత్రుతతో రాష్ట్ర శాసన సభకు ముందస్తు ఎన్నికలు జరపాలని సంబరపడుతున్న ఆ రాష్ట్ర బిజెపి నాయకులకు పార్టీ కేంద్ర నాయకత్వం ఝలక్ ఇచ్చిన్నట్లు తెలుస్తున్నది. కేవలం ఇటువంటి అంశాలతో గెలుపు సాధ్యం కాదని స్పష్టం చేస్తూ, పరిపాలన పట్ల దృష్టి సారింపమని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి స్పష్టం చేసిన్నట్లు తెలుస్తున్నది. అంతేకాదు, ముందస్తు ఎన్నికలకు వెళ్లవద్దని, గడుపు ప్రకారమే జరగనీయమని కూడా స్పష్టం చేసిన్నట్లు చెబుతున్నారు. గత కేంద్ర నాయకత్వంతో సమాలోచనలు జరిపి తిరిగి వచ్చిన బొమ్మై ముందు నిర్దిష్ట అజెండాను ఉంచినట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రతిపాదనలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలుపై దృష్టి పెట్టమని సూచించింది. పైగా, రాష్ట్ర బిజెపి విభాగాన్ని పూర్తిగా పునర్నిర్మించేందుకు సహితం కేంద్రం సిద్దపడుతున్నది. త్వరలో క్రియాశీలంగా రాష్ట్ర అధ్యక్షుడితో పాటు, యువ నాయకత్వాన్ని సమకూర్చే కసరత్తు చేస్తున్నది. మంత్రివర్గ విస్తరణ విషయమై బొమ్మై…
భారత స్వాతంత్య్ర సంగ్రామంలోనూ ఎందరో కళాకారులు సర్వస్వాన్నీ త్యాగం చేశారని గుర్తు చేస్తూ వారి స్పూర్తితో భారతీయ కల, సాంస్కృతిక రూపాలను కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉన్నదని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలిపారు. బ్రిటిషర్ల అరాచకాన్ని ఎదిరించే ప్రయత్నంలో కళలు, సాంస్కృతిక రూపాలు ‘ప్రభావవంతమైన రాజకీయ ఆయుధాలు’గా ఎంతగానో ఉపయుక్తమయ్యాయని ఆయన గుర్తు చేశారు. రవీంద్రనాథ్ ఠాగూర్, సుబ్రమణ్య భారతి, కాజీ నజ్రూల్, బంకించంద్ర చటర్జీ వంటి వారెందరో తమ కవితలు, పాటల ద్వారా స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని నిరంతరం జాగృతం చేశారని పేర్కొన్నారు. ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత, నాటక అకాడెమీ అవార్డులు, లలితకళ ఆకాడెమీ ఫెలోషిప్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి, విజేతలకు అవార్డులు అందజేశారు. 2018 నుంచి 2021 వరకు మూడేళ్లకు గానూ ఈ అవార్డులు ఒకేసారి అందజేశారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ప్రసంగిస్తూ భారతదేశ అస్తిత్వానికి మన భాష, మన సంస్కృతి, మన కళారూపాలే…