Author: Editor's Desk, Tattva News

అనూహ్యంగా మొత్తం 24 మంత్రులతో రాజీనామా చేయించి, ఈ నెల 11న కొత్తవారితో ప్రమాణస్వీకారం చేయించడానికి సిద్ధపడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలు వత్తిడులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తున్నది. మే, 2019లో ప్రమాణస్వీకారం రోజుననే రెండున్నరేళ్లకు మంత్రివర్గం మార్చివేస్తానని ప్రకటించిన జగన్ వివిధ కారణాల చేత ఇప్పటివరకు చేయలేక పోయారు.  ముందు సగం మందిని మారుస్తారన్నారు. ఆ తర్వాత 90 శాతం అన్నారు. కాదు అందరిని మారుస్తున్నట్లు సంకేతాలు ఇచ్చారు. రాజీనామాలు చేయించిన తర్వాత నాలుగైదుగురు కొనసాగనున్నారనే లీక్ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా 10 మందిని  కొనసాగించవచ్చని అంటున్నారు. శనివారం ముఖ్యమంత్రిని కలసిన అనంతరం పాత, కొత్తల మేలుకలయకగా మంత్రివర్గంలో మార్పులు ఉంటాయని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.  సామజిక సమీకరణాలు అని చెబుతున్నా, ఏ ప్రాతిపదికన కొద్దిమందిని కొనసాగిస్తున్నారనే ప్రశ్న వస్తున్నది. ముఖ్యంగా సీనియర్ మంత్రులలో ధిక్కార ధోరణులు వ్యక్తం అవుతున్నాయి. అలకలు, బెదిరింపులతో జగన్ మొదటిసారిగా జగన్ తలపట్టుకొంటున్నట్లు చెబుతున్నారు.  రాజకీయ ప్రాతిపదికన కాకుండా బెదిరింపులకు భయపడో, ఇతరత్రా వ్యక్తిగత…

Read More

శనివారం అర్ధరాత్రి జరిగిన అవిశ్వాస తీర్మానంలో ఇమ్రాన్ ఖాన్ సర్కారు ఓటమి పాలైంది. పాక్ నేషనల్ అసెంబ్లీలో ఉదయం నుంచి అర్ధరాత్రి దాకా పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.  చివరి వరకూ అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహణను వాయిదా వేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. విదేశీ కుట్రలో పాలుపంచుకోలేమంటూ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో ప్యానల్ స్పీకర్ అయాజ్ సాధిక్ ఓటింగ్ నిర్వహించారు  అవిశ్వాసం ద్వారా పదవిని కోల్పోయిన తొలి పాక్‌ ప్రధానిగా ఇమ్రాన్‌ ఖాన్‌ చరిత్రలో నిలిచిపోతారు. ఉదయం నుండి ఓటింగ్‌ను వాయిదా వేసేందుకు అన్ని రకాలుగా ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రయత్నించారు. ముందే చెప్పిన్నట్లు చివరి బాల్ వరకు పదవి కాపాడుకోవడం కోసం ఎత్తుగడలు వేస్తూనే ఉన్నారు.  సుమారు 14 గంటల పాటు సాగిన జాతీయ అసెంబ్లీ.. అవిశ్వాస తీర్మానం ద్వారా ఇమ్రాన్‌ను సాగనంపింది. ఓటింగ్‌ సందర్బంగా పాక్‌ జాతీయ అసెంబ్లీలో 342 మంది సభ్యులు ఉన్నారు. మెజార్టీకి 172…

Read More

దేశంలో ఆంగ్ల భాష‌కు ప్రత్యామ్నాయంగా హిందీని ఆమోదించాలంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ఇది భారతదేశ బహుళత్వంపై దాడి అని ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి.  వివిధ రాష్ట్రాల‌కు చెందిన ప్ర‌జ‌లు మాట్లాడుకునేట‌ప్పుడు ఇంగ్లిష్, స్థానిక భాష‌ల్లోనే కాకుండా, త‌ప్ప‌కుండా హిందీలోనే మాట్లాడాల‌ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్య‌ల‌ పట్ల మంత్రి  కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భార‌త‌దేశం ఒక వ‌సుదైక కుటుంబమ‌ని పేర్కొన్న కేటీఆర్.. భిన్న‌త్వంలో ఏక‌త్వ‌మే మ‌న బ‌లం అని స్పష్టం చేశారు.  మ‌న దేశంలోని ప్ర‌జ‌లు ఏం తినాలో, ఏం ధ‌రించాలో, ఎవ‌రిని ప్రార్థించాలో, ఏ భాషా మాట్లాడాలో ప్ర‌జ‌ల నిర్ణ‌యానికే వ‌దిలేయాలని ఆయన హితవు చెప్పారు. దేశంలో ఏ భాష మాట్లాడాలో దేశ ప్రజలను ఎందుకు నిర్ణయించుకోనివ‍్వకూడదంటూ ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్రశ్నించారు. భాషా దురాభిమానం, ఆధిపత్యం చెలాయించడం వంటివి బూమరాంగ్‌ అవుతాయ‌ని కేటీఆర్ హెచ్చరించారు. …

Read More

రాష్ట్ర ప్రభుత్వాలు, పార్టీలు ప్రకటించే ఉచిత పథకాల్ని అడ్డుకోలేమని ఎన్నికల కమీషన్ స్పష్టం చేసింది.  చట్టంలో సరైన మార్పులు చేయకుండా, పార్టీలు, ప్రభుత్వాలపై చర్యలు తీసుకోలేమని తేల్చి చెప్పింది. ఉచిత పథకాలు ప్రకటిస్తున్న రాజకీయ పార్టీలపై చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టులో న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్‌కు ప్రతిస్పందనగా ఈ అఫిడవిట్ దాఖలు చేసింది.  ఇతరులతో పాటు, ఎన్నికలకు ముందు ప్రజా నిధి నుండి అహేతుకమైన ఉచితాల వాగ్దానం ఓటర్లను అనవసరంగా ప్రభావితం చేస్తుందని, స్థాయి స్థాయికి భంగం కలిగిస్తుందని, స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతంగా ఎన్నికల మూలాలను కదిలిస్తుందని, ఎన్నికల ప్రక్రియ యొక్క స్వచ్ఛతను దెబ్బతీస్తుందని కోర్టును ఆదేశించాలని, ప్రకటించాలని విజ్ఞప్తి కోరింది. అటువంటి వాగ్దానం లేదా పంపిణీ భారతీయ శిక్షాస్మృతి ప్రకారం లంచం, మితిమీరిన ప్రభావానికి సమానమని పిటిషనర్ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆదేశించాలని మరియు ప్రకటించాలని కోరారు.  ‘‘పార్టీలు ఎన్నికలకు ముందు.. లేదా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చే ఉచిత పథకాల్ని నియంత్రించడం సాధ్యం కాదు. ఆ…

Read More

విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించే ప్రయత్నాల పట్ల తీవ్ర నిరసనలు ఎదురవుతున్నా నరేంద్ర మోదీ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ముందుకెళ్లడానికే సిద్ధపడుతున్నట్లు తెలుస్తున్నది.  డిపార్టుమెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ పబ్లిక్‌ అసెట్‌ మేనేజిమెంట్‌ (దీపం) నుంచి ఆర్‌ఐఎన్‌ఎల్‌ పెట్టుబడులను వ్యూహాత్మకంగా ఉపసంహరించేందుకుగాను ఇటీవల పిలిచిన టెండర్లకు పది సంస్థలు బిడ్లను దాఖలు చేసేందుకు సుముఖంగా ఉన్నాయి.  ఈ అంశాన్ని శనివారం కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ అడ్మినిస్ట్రేటివ్‌ నియంత్రణ మండలి వెల్లడించింది. స్టీల్‌ప్లాంట్‌ ఆస్తుల విలువ లెక్కకట్టేందుకుగాను ఆ పది సంస్థలు ఆసక్తిని కనబరుస్తున్నాయి. ఈ నెల 4 నుంచి 6వ తేదీ వరకూ అత్యధిక సంస్థలు తమ బిడ్లను దాఖలు చేశాయి. ఎఎఎ వేల్యూయేషన్‌ ప్రొఫెషనల్స్‌ ఎల్‌ఎల్‌పి, అడ్రాయిట్‌ అప్రైజర్స్‌ అండ్‌ రీసెర్చి ప్రైవేట్‌ లిమిటెడ్‌, అమిత్‌కుమార్‌ కంకానే, భావిన్‌ ఆర్‌ పాటెల్‌, సిపిఎ వేల్యూయేషన్‌ అడ్వైజర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, గా అడ్వైజర్‌ ఎల్‌ఎల్‌పి, టి టెక్‌ వేల్యూయర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఆర్‌బిఎస్‌ఎ…

Read More

ప్రపంచానికి కరోనా ముప్పు ఇంకా తప్పి పోలేదని, అందుకు చాలా సమయం పడుతుందని స్ఫష్టం చేస్తూ సగటున ప్రతి నాలుగు నెలలకు కరోనా కొత్త వేరియంట్‌ పుట్టుకొస్తుందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ అంటోనియో గుటెరస్‌ హెచ్చరించారు.  అన్ని దేశాల్లోనూ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తి కాలేదని, ఇప్పటికీ ఒక్క డోసు వ్యాక్సిన్‌ కూడా అందని దేశాలు ఉన్నాయని గుటెరస్‌ ఆందోళన వ్యక్తం చేశారు.  కొత్త వేరియంట్లు ఆసియాలో వ్యాప్తి చెందడానికి కొంత సమయం పడుతుందని, అదే సమయంలో ఆసియాలోని అన్ని దేశాల ప్రభుత్వాలు, ఔషధ కంపెనీలు సమన్వయంతో ప్రతి దేశంలో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ను అందేలా చూడాలని ఆయన పిలుపునిచ్చారు. గవి కొవాక్స్‌ అడ్వాన్స్‌ మార్కెట్‌ కమిట్‌మెంట్‌ సమ్మిట్‌ 2022లో ”వన్‌ వరల్డ్‌ ప్రొటెక్టెడ్‌- బ్రేక్‌ కొవిడ్‌ నౌ” అనే వీడియో సందేశంలో గుటెరస్‌ మాట్లాడారు.  ఇప్పటికీ ప్రతి రోజూ 1.5 మిలియన్‌ కేసులు వస్తున్నాయని, ఆసియా వ్యాప్తంగా కేసులు విజృంభిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. మరికొన్ని దేశాల్లో…

Read More

భారత విదేశీ మారక వారంతపు నిల్వలు ఏప్రిల్ 1 నాటికి 11.17 బిలియన్ డాలర్లు తగ్గిపోయింది. చివరికి 606.475 బిలియన్ డాలర్ల వద్ద ఇది స్థిరపడిందని భారత రిజర్వు బ్యాంకు డేటా పేర్కొన్నట్లు ఓ వార్తా సంస్థ తెలిపింది.  భారత విదేశీ మారకపు నిల్వలు పడిపోవడానికి ఉక్రెయిన్ యుద్ధం, కొనసాగుతున్న కరోనా మహమ్మారి, ఇతర అంతర్జాతీయ పరిణామాలు కారణమని తెలుస్తోంది. భారత్ వద్ద బంగారం నిల్వలు కూడా 507 మిలియన్ డాలర్ల మేరకు తగ్గి 42.734 బిలయన్ డాలర్ల వద్ద స్థిరపడిందని ఆర్‌బిఐ డేటా పేర్కొంది.  గమనించాల్సిన విషయమేమిటంటే గత నాలుగు వారాల్లో భారత విదేశీ మారక నిల్వలు దాదాపు 26 బిలియన్ డాలర్ల మేరకు పడిపోయింది. భారత రిజర్వు బ్యాంకు శుక్రవారం 2022/23 ఆర్థిక సంవత్సరపు తొలి ద్రవ్య విధానం ప్రకటించింది.  రెపో రేటును 4శాతం, రివర్స్ రిపో రేటును 3.5 శాతం వద్ద స్థిరంగా ఉంచింది.  భారత జిడిపి 7.2 శాతం,…

Read More

తాను తలుచుకుంటే తెలంగాణలో ప్రభుత్వం పడిపోయేది అంటూ గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ రెండు రోజుల ఢిల్లీ పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణాలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.  మొదటి రోజు ప్రధాని నరేంద్ర మోదీని కలసిన అనంతరం తనకేమి అవమానం జరగలేదని అన్నట్లు మాట్లాడిన ఆమె, మరుసటి రోజు హోమ్ మంత్రి అమిత్ షాను కలసిన అనంతరం టి ఆర్ ఎస్ ప్రభుత్వం పట్ల రాజకీయ విమర్శలు చేయడంతో కలకలం రేగుతోంది.  పలువురు రాష్ట్ర మంత్రులు ఆమె వాఖ్యలపై  తీ వ్ర స్థాయిలో అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 119 మంది ఎమ్యెల్యేలలో 100 మందికి పైగా మద్దతు ఉన్న కేసీఆర్ ప్రభుత్వం రద్దయి ఉండేదని ఒక గవర్నర్ అనడం రాజకీయ వాఖ్యలే అంటూ మండి పోతున్నారు. తమిళిసై చేసిన వ్యాఖ్యలు గవర్నర్ వ్యవస్థకు మచ్చ తెచ్చాలా ఉన్నాయని విమర్శలు గుప్పిస్తున్నారు.  ఢిల్లీకి వెళ్లిన తమిళిసై రాష్ట్రపతిని కలువకుండా ప్రధానిని, హోంశాఖ మంత్రి, ఆర్ధిక శాఖ మం…

Read More

బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు అన్ని కలసి రావాలని పిలుపిచ్చింది కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఐక్య కూటమి ఏర్పాటుకు చర్చలు జరుగుతున్నట్లు వెల్లడించారు. బిజెపి,  ఆర్‌ఎస్‌ఎస్‌  లను ఒంటరి చేయాలని సిపిఎం కాంగ్రెస్ లో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపిచ్చిన రెండు రోజులకే రాహుల్ ఈ ప్రకటన చేయడం గమనార్హం.  ఇటీవలనే ఆర్జేడీతో చేరిన శరద్ యాదవ్ ను కలసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ  ఆర్‌ఎస్‌ఎస్‌, నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఉన్న ప్రతిపక్షాలు ఒక్కతాటిపైకి రావాలని స్పష్టం చేశారు. అయితే, అవి ఎలా కలిసి రావాలి, ఎలాంటి ఫ్రేమ్‌వర్క్ ఉండాలి, ఏం అభివృద్ధి చేయాలి అనే అంశాలపై చర్చలు చేస్తున్నామని రాహుల్ తెలిపారు.  భారతదేశ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి గురించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. “భారత ఆర్థిక పరిస్థితి, ఉద్యోగపరిస్థితిని మీరు ఊహించలేరు. మీ జీవితంలో తదుపరి ఏమి జరుగుతుందో మీరు చూడలేరు” అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దేశపు ఉపాధి నిర్మాణం,…

Read More

అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లవద్దని అమ్నెస్టీ ఇండియా మాజీ చైర్మన్ ఆకార్ పటేల్‌ను ఢిల్లీ సెషన్స్ కోర్టు శుక్రవారం ఆదేశించింది. అమెరికాకు వెళ్ళబోతుండగా ఆయనను ఆపినందుకు ఆయనకు తక్షణమే లిఖితపూర్వక క్షమాపణ చెప్పాలని సీబీఐని ఆదేశిస్తూ గురువారం స్పెషల్ కోర్టు ఇచ్చిన ఆదేశాల అమలును నిలిపేసింది. ఆకార్ పటేల్ బుధవారం అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించగా, ఆయనను సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ) నిలిపేసింది. అనంతరం ఆయన స్పెషల్ కోర్టును ఆశ్రయించారు. ఆయనకు స్పెషల్ కోర్టు ఉపశమనం కల్పించింది. ఆయనపై సీబీఐ జారీ చేసిన లుకౌట్ సర్క్యులర్‌ను పక్కనపడేసింది. దీనిపై సెషన్స్ కోర్టులో సీబీఐ అపీలు చేసింది. దీనిపై విచారణ జరిపిన సెషన్స్ కోర్టు తీర్పు చెప్తూ అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్ళవద్దని ఆకార్ పటేల్‌ను ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే మంగళవారం జరుగుతుందని తెలిపింది. స్పెషల్ కోర్టు తీర్పు అనంతరం ఆకార్ పటేల్ అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించగా గురువారం రాత్రి…

Read More