ఉక్రెయిన్ పై యుద్దాన్ని ఆసారాగా తీసుకొని రష్యాపై కఠినమైన ఆర్ధిక ఆంక్షలు విధించడం ద్వారా అమెరికా, ఐరోపా దేశాలు రష్యాను ఆర్ధికంగా పతనం వైపుకు నెట్టడంతో ఏమేరకు ఫలితం సాధించాయి గాని, ఇప్పటి వరకు అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాలలో ఆధిపత్యం వహిస్తున్న డాలర్, యురొ కరెన్సీల ప్రభావం మాత్రం గణనీయంగా కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంక్షల పుణ్యమాని రూబుల్ , ఇతర దేశాల జాతీయ కరెన్సీలు వెలుగులోకి రాగా, డాలర్, యూరోలు మసకబారుతున్నాయి. ఒక దేశం తరువాత ఒక దేశం తమ కరెన్సీలను డాలర్ నుంచి తమ సొంత జాతీయ కరెన్సీలో విదేశీ వాణిజ్యాన్ని నెరిపేందుకు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. దీంతో అంతర్జాతీయ వాణిజ్యంలో ఇంతవరకు చక్రం తిప్పిన డాలర్, యూరోల ప్రాభవం దిగజారడం మొదలైంది. చాలా దేశాలు ఇప్పుడు తమ జాతీయ కరెన్సీలోనే చెల్లింపులు జరిపేందుకు ప్రాధాన్యమిస్తుండడంతో డాలర్ అవసరం తగ్గిపోతున్నది. ‘ డారల్ నుంచి ఇతర కరెన్సీల్లోకి మళ్లే క్రమం మొదలైంది. ఇక్కడితో ఆగేది కాదు.’ అని…
Author: Editor's Desk, Tattva News
ప్రజాభిప్రాయం పరిగణించకుండా జిల్లాల విభజన చేశారని, ఈ విభజన లోపభూయిష్టంగా సాగిందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మండిపడ్డారు. జిల్లాల విభజనపై ఆయన మాట్లాడుతూ… పాలకుల చిత్తానికి తోచినట్లు ముందుకెళ్లారని విమర్శించారు. పార్లమెంట్ నియోజకవర్గమే ప్రామాణికం అంటూ.. ప్రజల మనోగతాన్ని, కొత్త జిల్లాల మూలంగా వాళ్లు ఎదుర్కొనే ఇబ్బందులను ఎందుకు పరిగణించలేదని ప్రశ్నించారు. ఎప్పటినుంచో జిల్లా కోసం డిమాండ్ ఉన్న ప్రాంతాలపై అధ్యయనం కూడా చేయలేదని ధ్వజమెత్తారు. పాడేరు కేంద్రంగా ఏర్పాటు చేసిన జిల్లాతో పోలవరం ముంపు మండలాల గిరిజనులకు అనేక ఇబ్బందులు ఎదురవుతాయనిపేర్కొ న్నారు. ఎటపాక, కుక్కునూరు లాంటి మండలాల ప్రజలు.. జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే కనీసం 300 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుందని గుర్తు చేశారు. అంటే ఆ ప్రాంత గిరిజనులు జిల్లా కేంద్రంలో ఉన్న అధికారిని కలవాలంటే కనీసం 2 రోజుల సమయం పడుతుందని తెలిపారు. ఈ తరహా విభజనతో ప్రజలకు ఏ విధంగా పాలన చేరువ చేస్తున్నారో…
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలు అవతరించాయి. సోమవారం ఎపి కొత్త జిల్లాలను సిఎం వైఎస్.జగన్ వర్చువల్‌గా ప్రారంభించారు. 42 ఏళ్ల తరువాత ఎపిలో కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. 13 జిల్లాలు, 26 జిల్లాలుగా పున: వ్యవస్థీకరణయ్యాయి. కొత్త జిల్లాల ఏర్పాటును సోమవారం తాడేపల్లి కార్యాలయం నుండి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. పాలనా వికేంద్రీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల కార్యాలయాల ద్వారా సేవలందించేందుకు .. ఆయా జిల్లాలకు చేరుకున్న ఉద్యోగులందరికీ కూడా, ప్రతి ఒక్కరికీ సిఎం జగన్ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, ఏలూరు, అనకాపల్లి, పల్నాడు, నంద్యాల, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి, బాపట్ల, ఎన్టీఆర్ పరిపాలన సౌలభ్యాన్ని, వికేంద్రీకరణ అవసరాన్ని, స్వాతంత్య్ర సమరయోధులను దృష్టిలో ఉంచుకుని ఈ జిల్లాలకు పేర్లు పెట్టినట్లు తెలిపారు. గతంలో ఉన్న జిల్లా పేర్లు అలాగే కొనసాగుతాయని తెలిపారు. కనీసం ఒక్కొక్క పార్లమెంటరీ నియోజకవర్గం చొప్పున…
దేశంలో ప్రతిపక్షాలు ఏర్పాటు చేయాలి అనుకొంటున్న బీజేపీ వ్యతిరేక కూటమికి సారథ్యం వహించడం పట్ల మాజీ ఉపప్రధాని, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ విముఖత వ్యక్తం చేశారు. అదే విధంగా ప్రస్తుతం తమ పార్టీ భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ కూటమికి చైర్మన్‌గా ఉండాలన్న ఆసక్తి కూడా తనకు లేదని స్పష్టం చేశారు. అయితే కేంద్రంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా నిర్మించే ఏ వేదికలోనైనా కాంగ్రెస్‌ను దూరంగాని ఉంచలేమని ఆయన తేల్చి చెప్పారు. ‘‘బీజేపీ వ్యతిరేక కూటమి ప్రయత్నాలకు పూర్తిగా సహకరిస్తా. ఇప్పుడూ అదే ప్రయత్నాల్లో ఉన్నా. కూటమి కట్టాలంటే విపక్షాలు కొన్నింటిని మర్చిపోవాలి” అని ఆయన హితవు చెప్పారు. మమతా బెనర్జీకి చెందిన టీఎంసీ పశ్చిమబెంగాల్‌లో బలమైన పార్టీ. ఇతర ప్రాంతీయ పార్టీలూ తమ రాష్ట్రాల్లో బలంగా ఉన్నాయి. కాంగ్రెస్ దేశవ్యాప్తంగా విస్తరించి ఉంది. ప్రతి రాష్ట్రం, జిల్లా, గ్రామంలోనూ ఆ పార్టీకి కార్యకర్తలున్నారన్నది వాస్తవం అని ఆయన గుర్తు…
బంజారాహిల్స్‌లోని ఓ పబ్‌పై హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున దాడిచేసి, 150 మందిని పైగా అదుపులోకి తీసుకొని, పెద్ద ఎత్తుగా డ్రగ్ లను స్వాధీనం చేసుకోవడం ప్రకంపనాలు సృష్టిస్తున్నది. ప్రాధమికంగా అర్ధరాత్రి దాటిన తర్వాత, ఉదయం 3 గంటల ప్రాంతంలో కూడా పబ్ పనిచేస్తుండడంతో దాడి చేసిన పోలీసులు, అక్కడ ప్రముఖ సెలబ్రేటీలు, వారి కుటుంభం సభ్యులు ఉండడంతో సంచలనం కలిగించింది. రాడిసన్ పబ్‌లో డ్రగ్స్ బయటపడ్డాయి. పోలీసుల దాడుల్లో 6 గ్రాముల కొకైన్ ను గుర్తించారు. దీంతో వాటిని పోలీసులు సీజ్ చేశారు. పోలీసుల దాడులతో బెంబేలెత్తిన యువకులు పరుగులు తీశారు. పబ్‌లో ఎక్కడపడితే అక్కడ డ్రగ్స్ పడేశారు. బాత్ రూమ్, డ్యాన్స్ ఫ్లోర్లలో డ్రగ్స్ ప్యాకెట్లను టాస్క్ ఫోర్స్ స్వాధీనం చేసుకున్నారు. హోటల్‌లో భాగంగా ఉన్న ఫుడింగ్ మింగ్ పబ్‌లో పార్టీ జరుగుతున్నదని, అందులో పాల్గొన్న పలువురు డ్రగ్స్ తీసుకున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆదివారం తెల్లవారుజామున…
ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో తాజాగా నిరసనలు పతాకస్థాయికి చేరడంతో పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రం కావడంతో శ్రీలంక ప్రధానమంత్రి మహింద రాజపక్స తన పదవికి రాజీనామా చేసినట్లు వదంతులు వ్యాపించాయి. అయితే ప్రధానమంత్రి కార్యాలయం వీటిని ఖండించింది. శ్రీలంకకు 1948లో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇంత ఆర్థిక సంక్షోభం ఎన్నడూ నెలకొనలేదు. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించమని శ్రీలంక- అంతర్జాతీయ ద్రవ్య నిధిని, రుణాలివ్వమని భారత్‌ను, చైనాను కోరుతున్నది.తాజా సంక్షోభం తమ ప్రభుత్వ నిర్ణయాల వల్ల కాదని, కోవిడ్ మూలంగా ఆర్ధిక వ్యవస్థ దెబ్బతిని విదేశీ మారక నిల్వలు కరిగిపోయాయని రాజపక్స ప్రభుత్వం చెబుతూ వస్తోంది. సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకకు భారత్ పెద్ద ఎత్తున సాయం అందిస్తోంది. 2.5 బిలియన్ డాలర్ల సాయంతో పాటు లక్షల టన్నుల ఇంధనాన్ని పంపింది. బియ్యం కూడా పంపింది. కర్ఫ్యూ ధిక్కరిస్తూ శ్రీలంకలో భారీ నిరసనలు శ్రీలంకలో ఎమర్జెన్సీ విధింపును నిరసిస్తూ ఒక వంక ప్రతిపక్షాలు, మరోవంక విద్యార్థులు…
ఆత్మహత్యకు పాల్పడిన ప్రతి కౌలురైతు కుటుంభానికి జనసేన పార్టీ రూ 1 లక్ష చొప్పున ఆర్ధిక సహాయం చేయనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కౌలు రైతుల ఆత్మహత్యలు పెరిగాయని ఆందోళన ప్రకటిస్తూ అధికారంలోకి వస్తే ఆత్మహత్యకు పాల్పడిన ప్రతి కౌలు రైతు కుటుబానికి రూ.7 లక్షల నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చి.. ఇప్పుడు ఆ హామీని ప్రభుత్వం బుట్టదాఖలు చేసిందని ఆయన విమర్శించారు. అధికారంలోకి వచ్చిన మొదట ఏడాది తూతూ మంత్రంగా సాయం చేసి రెండేళ్లుగా ముఖం చాటేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉగాది పూజల అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ”కొత్త సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగు, ఆనందం రావాలనే కోరుకునే రోజు. కానీ కౌలు రైతుల ఆత్మహత్యల గురించి వింటే బాధనిపిస్తోంది” అని తెలిపారు. పోరాట యాత్ర, మండపేట పర్యటన, కాకినాడ రైతు సౌభాగ్య దీక్షలో, నివర్ తుపాన్ సమయంలో స్వయంగా…
పంజాబ్ లో అనూహ్యంగా భారీ ఆధిక్యంతో అధికారం చేజిక్కించుకున్న తర్వాత ఈఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే గుజరాత్‌పై ఆమ్ ఆద్మీపార్టీ దృష్టి సారించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తో కలిసి శనివారం గుజరాత్‌కు వచ్చారు. ముందుగా, గాంధీజి స్మారక చిహ్నం అయిన సబర్మతీ ఆశ్రమాన్ని ఈ ఇరువురూ సందర్శించారు. శుక్రవారం రాత్రి ఇక్కడికి చేరిన ఇరు రాష్ట్రాల సిఎంలు తెల్లవారుజామునే ఆశ్రమానికి వెళ్లారు. తొలుత మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. తరువాత ఆశ్రమంలో బాపు ఎక్కువగా గడిపిన హృదయ్‌కుంజ్‌కు వెళ్లారు. అక్కడి మ్యూజియంలను సందర్శించారు. గాంధీకి అత్యంత ఇష్టమైన చరఖాపై నూలు వడికారు. కేజ్రీవాల్ , మాన్ ఆ తరువాత అక్కడి సందర్శకుల పుస్తకంలో తమ అనుభవాలను పొందుపర్చారు. ఆశ్రమ అధికారులు ఇద్దరు నేతలకు చరఖా ప్రతిమ, గాంధీజి పుస్తకాలను కొన్నింటిని బహుకరించారు. తాను ఢిల్లీ ముఖ్యమంత్రిని అయిన తర్వాత సబర్మతి ఆశ్రమానికి రావడం ఇదే…
శ్రీలంకలో పరిస్థితి చేయిదాటిపోయింది. తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో లంకేయులు నరకం అనుభవిస్తున్నారు.పెరిగిన ధరలకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో అధ్యక్షుడు గొటబయ రాజపక్స ఎమర్జెన్సీ ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గెజిట్ విడుదల చేశారు.ప్రజలకు రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ, అత్యవసర సరుకులు, సేవల నిర్వహణ కోసం ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించారు. అధ్యక్ష భవనం ఎదుట గురువారం రాత్రి నిరసన ప్రదర్శనలు హింసాత్మకంగా మారడంతో దేశంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఆ మరునాడే ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది. ఇప్పటికే శ్రీలంక ప్రభుత్వం పశ్చిమ రాష్ట్రంలో ఆరు గంటల కర్ఫ్యూ విధించింది. అర్థరాత్రి నుంచి ఉదయం 6 గంటల వరకు పశ్చిమ ప్రావిన్సులో కర్ఫ్యూ అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. శ్రీలంకలో 22 మిలియన్ల జనాభా ఉన్నారు. 1948 నుంచి బ్రిటన్ నుంచి స్వాతంత్య్రం పొందింది. కానీ గతంలో…
దేశంలోని మెట్రో నగరాలు, పట్టణాల్లో విధ్వంసాలు సృష్టించేందుకు ఐసిస్ ఉగ్రవాద సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసిందని హైదరాబాద్ పోలీసులు గుర్తించారు. ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐసిస్) కార్యకలాపాలు సాగిస్తున్న పాతబస్తీ ఫలక్‌నుమాకు చెందిన యువకుడు మహమ్మద్ అబుసానిని అరెస్ట్ చేసిన పోలీసులు అతని నుండి స్వాధీనం చేస్తుకున్న లాప్‌టాప్‌న పరిశీలించిన అనంతరం ఈ సమాచారం తెలుసుకొని విస్తుపోయారు. ప్రార్థనా మందిరాలు, రద్దీగా ఉండే ప్రాంతాలు, విదేశీ రాయబార కార్యాలయాలపై బాంబులతో దాడులు జరిపి విధ్వంసం సృష్టించేందుకు అబుసాని పథక రచన చేశారు. ఇతను ఐసిస్ సానుభూతిపరుడిగా ఎప్పటి నుంచి మారాడు? ఎంత కాలంగా సామాజిక మాధ్యమాల ద్వారా యువతను ఆకర్షించేందుకు వీడియోలు, ఐసిస్ సమాచారాన్ని పంపిస్తున్నాడు? అన్న విషయాన్ని తెలుసుకునే పనిలో సైబర్ క్రైమ్ పోలీసులు ఉన్నారు. హైదరాబాద్ కేంద్రంగా కొద్ది నెలల నుంచి ఐసిస్ సానుభూతిపరులను తయారు చేసేందుకు సామాజిక మాధ్యమాలను అబుసాని విస్తృతంగా వినియోగిస్తున్నట్టు…