దేశంలో కల్లోలానికి దిగి ప్రధాని నరేంద్ర మోదీని అంతమొందించడం, ప్రధాన నగరాలలో భయోత్పాతం సృష్టికి దిగడం కోసం 20 స్లీపర్ సెల్స్ రంగంలోకి దిగాయా? ఇందులో ఎంతమేరకు నిజం ఉంది? అనే కీలక అంశాలను తేల్చేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (నియా) రంగంలోకి దిగింది. దేశంలో ఇప్పటివరకూ నిద్రాణంగా ఉన్న 20 ఉగ్రవాద స్లీపర్‌సెల్స్ 20 కిలోల ఆర్‌డిఎక్స్ పేలుడు పదార్థాలతో చురుగ్గా ఉన్నాయని, ప్రధాన నగరాలను ఎంచుకుని 20 దాడులకు దిగనున్నారని వెలువడ్డ ఇ మొయిల్ నిజానిజాలపై నియా దర్యాప్తు చేస్తుంది. ప్రధాని మోదీపై తనకు విద్వేషం ఉందని అంతమొందిస్తామని ఈ మొయిల్ పంపిన అజ్ఞాత వ్యక్తి ఇందులో తెలిపారు. ఇంటర్నెట్ వర్తమానం గురించి తెలియగానే దీనిపై వెంటనే స్పందించి జాతీయ దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగిందని ఇంటలిజెన్స్ వర్గాలు తెలిపాయి. ప్రధాని హత్యకు కుట్ర జరుగుతోందని ఈ ఇ మొయిల్ సమాచారంలో పేర్కొని ఉంది. దేశంలోని 20 ప్రధాన…
Author: Editor's Desk, Tattva News
విద్యార్థులు పరీక్షలను గడ్డు సవాళ్లుగా చుకోకుండా, పండుగలుగా మలుచుకుని ఉత్సాహం ప్రదర్శించి ఫలితాలు రాబట్టుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులకు హితవు చెప్పారు. దేశవ్యాప్తంగా విద్యార్థులకు పరీక్షా కాలం ఆసన్నమవుతున్న నేపథ్యంలో శుక్రవారం ప్రధాని మోదీ పరీక్షా పే చర్చా కార్యక్రమంద్వారా విద్యార్థులతో ఇష్టాగోష్టిగా ముచ్చటించారు. విద్యార్థులు ఒత్తిడికి గురి కారాదని, సంవత్సరం చదివినదంతా పరీక్షలకు ముందుటి టెన్షన్‌లతో దెబ్బతింటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ఇప్పటికే విద్యార్థులు పలు పరీక్షలు రాసి విజేయులు అయి ఉంటారని, ఎటువంటి పరీక్షను అయినా ధైర్యంగా మానసిక ఆందోళనకు గురి కాకుండా చూసుకుంటే ఎదుర్కొనవచ్చునని విజయం సాధించవచ్చునని ధైర్యం చెప్పారు. పరీక్షా పే చర్చా ప్రక్రియలో ఇప్పటి భాగం ఐదవది. ఇంతకు ముందు కరోనా దశలలో ఈ కార్యక్రమం వర్చువల్‌గా సాగింది. అయితే ఇప్పుడు ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో నిర్ణీత విద్యార్థుల ప్రశ్నలకు ప్రధాని సమాధానం ఇచ్చారు. వారి అనుభవాలను తెలుసుకున్నారు. దీనిని దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు, అధ్యాపకులు,…
స్వతంత్రతతో కూడిన దర్యాప్తు సంస్థల ఏర్పాటు అత్యవసరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పిలుపిచ్చారు. ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో నిర్వహించిన 19వ డీపీ కోహ్లీ స్మారకోపన్యాస సదస్సులో ‘ప్రజాస్వామ్యం-దర్యాప్తు సంస్థల పాత్ర, బాధ్యతలు’ అనే అంశంపై ఆయన ప్రసంగిస్తూ పోలీసు వ్యవస్థను ఆధునికీకరించడం అత్యావశ్యకం అని తెలిపారు. నాయకులు వస్తుంటారు, పోతుంటారు… కానీ దర్యాప్తు సంస్థలే శాశ్వతం అని స్పష్టం చేశారు. అదే సమయంలో ప్రతి దర్యాప్తు సంస్థ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని సీజేఐ అభిలషించారు. అన్ని దర్యాప్తు సంస్థల పర్యవేక్షణకు స్వతంత్ర వ్యవస్థ రావాలని ఆయన సూచించారు. ప్రాసిక్యూషన్, దర్యాప్తు కోసం ప్రత్యేక సంస్థలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. పోలీసులు బాధ్యతను పెంపొందించుకోవాలని సూచిస్తూ రాజకీయ నాయకులతో కుమ్మక్కైతే తరువాత రోజుల్లో ఇబ్బందులు తప్పవని జస్టిస్ రమణ హెచ్చరించారు. అలాగే ఒక కేసును అనేక సంస్థలు దర్యాప్తు చేసే విధానానికి స్వస్తి పలికి సీబీఐ, ఎస్ఎఫ్ఐవో, ఈడీ లాంటి సంస్థలు…
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ తమను నాశనం చేయాలని కోరుకుందని, అందులో అది విజయం సాధించిందని ఫ్యూచర్ రిటైల్ సంస్థ సుప్రీంకోర్టులో ఆమోదం ఆవేదన వ్యక్తం చేసింది. రిలయన్స్ ఇండ్రస్టీస్ లిమిటెడ్‌తో ప్యూచర్ గ్రూప్ ఒప్పందం కుదుర్చుకోవడంపై అమెజాన్ వ్యతిరేకించింది. దీంతో అమెజాన్, ప్యూచర్ గ్రూప్ రిటైల్ లిమిటెడ్ మధ్య విభేదాలు తలెత్తగా, వీటి మధ్య చర్చలు కూడా విఫలమయ్యాయి. కాగా, రిలయన్స్ ఇండిస్టీస్ లిమిటెడ్‌తో చేసుకున్న ఒప్పందంలో భాగంగా కిశోర్ బియాని నేతృత్వంలోని వందలాది ఫ్యూచర్ గ్రూప్ స్టోర్‌లను సదరు సంస్థ కైవసం చేసుకుంది. చెల్లించని అద్దెలు రూ. 4800 కోట్లకు పెరగడంతో స్టోర్లను అప్పగించినట్లు పేర్కొంది. కాగా, రిలయన్స్, ఫ్యూచర్ గ్రూప్స్ మధ్య జరిగిన ఒప్పందం మోసపూరితమని అమెజాన్ పేర్కొనగా, దీనిపై ఫ్యూచర్ సంస్థ స్పందించింది. ‘అమెజాన్-ప్యూచర్ వివాదాస్పద ఒప్పందం విలువ రూ. 1400 కోట్లు కాగా, అమెజాన్ రూ. 26 వేల కోట్ల విలువ చేసే…
న్యాయ ఆదేశాలు జాప్యం కాకుండా వేగంగా కక్షిదారులకు చేరడానికి రూపొందించిన ఫాస్ట్, సెక్యూర్డ్ ట్రాన్స్‌మిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ (ఫాస్టర్) సాఫ్ట్‌వేర్‌ను గురువారం సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు. కోర్టు ఉత్తర్వులు ఎలక్ట్రానిక్ మోడ్ ద్వారా వేగంగా, సురక్షితంగా చేరేలా రూపొందించిన ఈ సాఫ్ట్‌వేర్ ప్రారంభోత్సవ ఆన్‌లైన్ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హేమంత్‌గుప్తా, పలు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. వేగంగా సాఫ్ట్‌వేర్ రూపొందించిన నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసీ) అధికారులు, కోర్టు రిజిస్ట్రీని అభినందించారు. కోర్టు ఆమోదించిన బెయిల్, విడుదలకు సంబంధించిన ప్రోసీడింగ్స్, ఆదేశాలను ఈ–మెయిళ్ల ద్వారా వెంటనే సంబంధిత నోడల్ అధికారులకు చేరేలా ఈ సాఫ్ట్‌వేర్ చేస్తుందన్నారు. ధ్రువీకరణ నిమిత్తం డిజిటల్ సంతకాలు, సంస్థాగత డిజిటల్ సంతకాలు ఉంటాయని పేర్కొన్నారు. దీని ద్వారా కోర్టు…
లోక్ సభ సభ్యత్వాన్ని వదులుకొని, రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉండాలని నిర్ణయించుకోవడం ద్వారా ఇక ఉత్తర ప్రదేశ్ లో బిజెపిని కట్టడి చేయడం పట్ల దృష్టి సారిస్తానని స్పష్టమైన సంకేతం ఇచ్చిన సమాజావాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ను కట్టడి చేయడం కోసం బిజెపి మరో రాష్ట్రం ప్రయోగించనున్నట్లు తెలుస్తున్నది. అఖిలేష్ వ్యవహారం పట్ల తొలినుండి అసంతృప్తిగా ఉంటున్న ఆయన బాబాయి శివపాల్ యాదవ్ ను బీజేపీలో చేర్చుకొని రాజ్యసభకు పంపే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను శివపాల్ కలవడంతో ఇటువంటి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పైగా, రెండు రోజులుగా ఢిల్లీలో ఉంది పలువురు బిజెపి నేతలను ఆయన కలుస్తున్నట్లు తెలుస్తున్నది. 2017లో శివపాల్ యాదవ్ బిజెపితో చేతులు కలిపి, సమాజవాద్ పార్టీ నుండి బైటకు వచ్చి, సొంతంగా ప్రగతిశీల్ సమాజ్‌వాదీ పార్టీ పేరుతో ప్రాంతీయ పార్టీ ఏర్పాటు ద్వారా అఖిలేష్ ఓటమికి కారకుడయ్యారనే ప్రచారం ఉంది. గత ఎన్నికల ముందు తిరిగి అఖిలేష్ తో…
రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి మొబైల్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వైఎస్‌ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకంపై క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వేకు సంబంధించిన వివరాలను అధికారులు సిఎంకు అందజేశారు. సర్వే కోసం అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన డ్రోన్లను సిఎం పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ భూసమస్యల పరిష్కారానికి మొబైల్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తే స్థానికంగా ఉను సమస్యలు ఎక్కడివి అక్కడ పరిష్కారం అవుతాయని చెప్పారు. భూ యజమానులకు క్లియర్ టైటిల్స్ ఇచ్చే నాటికి దాదాపుగా వివాదాలు లేకుండా చూడాలని ఆదేశించారు. న్యాయశాఖను కూడా ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేయాలన్నారు. దీనికోసం ప్రత్యేకంగా రోడ్‌మ్యాప్‌ను తయారు చేయాలని చెప్పారు. అంతిమంగా సచివాలయాల స్థాయిలోనే రిజిస్ట్రేషన్లు పూర్తవ్వాలని సూచించారు. భూ సర్వే, రికార్డులు తదితర అంశాల్లో దేశానికి రాష్ట్రం ఒక దిక్సూచిగా నిలవాలని అందుకనే సీనియర్…
కోర్టు ధిక్కార కేసులో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారుపై ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తొలుత వీరికి జైలుశిక్ష, జరిమానా విధించిన ధర్మాసనం క్షమాపణలతో తగ్గించింది. జైలు శిక్షకు బదులుగా సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు సేవ చేయాలని ఆదేశించింది. ఈమేరకు జస్టిస్ బి.దేవానంద్ గురువారం తీర్పు చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాలను ప్రభుత్వ పాఠశాలల నుండి తొలగించాలని గతంలో హైకోర్టు తీర్ప చెప్పిన విషయం తెలిసిందే. ఏడాదైనా ఆ తీర్పు పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదు. ఈ నేపథ్యంలో దీనికి భాధ్యులైన ఐఎఎస్ అధికారులను స్వయంగా హాజరుకావాలని గత విచారణ సందర్భంగా హైకోర్టు ఆదేశించింది. దీంతో వారు గురువారం ధర్మాసనం ముందు హాజరయ్యారు. పంచాయతీరాజ్ కార్యదర్శి గోపాలకఅష్ణద్వివేదీ, కమిషనర్ గిరిజాశంకర్, పాఠశాల విద్యాశాఖ గత ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్, గత కమిషనర్ చిన వీరభద్రుడు, మున్సిపల్ శాఖ అప్పటి ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రదాన…
ఉక్రెయిన్ యుద్ధంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు వాస్తవాలు వెల్లడించడానికి సైనికాధికారులు, సలహాదారులు భయపడుతున్నారని అమెరికా వెల్లడించింది. ఉక్రెయిన్‌లో రష్యా సైనిక చర్య పెద్ద వ్యూహాత్మక తప్పిదమని, దీని ఫలితంగా రష్యా బలహీనం కావడమే కాకుండా ప్రపంచ వేదికపై అది దాదాపు ఒంటరి అయిపోతోందని వైట్‌హౌస్ పేర్కొంది. ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న క్రమంలో పుతిన్‌కు ఆయన సిబ్బందితో సంబంధాలు దిగజారాయని వైట్‌హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ కేట్ బెడింగ్‌ఫీల్డ్ మీడియా సమావేశంలో చెప్పారు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా సైన్యం ఎంత పేలవంగా పని చేస్తున్నదో, ఆంక్షలతో రష్యా ఆర్థిక వ్యవస్థ ఛిద్రమవుతున్న తీరుపై పుతిన్‌కు ఆయన సలహాదారులు తప్పుడు సమాచారం ఇస్తున్నారని తాము భావిస్తున్నామని ఆమె చెప్పారు. పుతిన్‌కు వాస్తవాలు చెప్పడానికి సీనియర్ సలహాదారులు సైతం భయపడుతున్నారని ఆమె పేర్కొన్నారు. రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోగుతో పుతిన్ సంబంధాలు దెబ్బతిన్నాయని, రెండు వారాలుగా ఆయన ఎక్కడా కనిపించడం లేదని వైట్‌హౌస్ పేర్కొంది. రక్షణ…
ఉపాధి హామీ పథకం నిధులపై కేంద్రం కోత విధించడం పట్ల కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అనేక రాష్ట్రాలకు ఉపాధి హామీ పథకం కింద దాదాపు రూ. 5,000 కోట్లు కేంద్రం చెల్లించాల్సి ఉందని, దీని వల్ల కార్మికులకు వేతనాల చెల్లింపులో జాప్యం జరుగుతోందని ఆమె తెలిపారు. గురువారం లోక్‌సభ జీరో అవర్‌లో సోనియా గాంధీ ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ కరోనా కాలంలో ప్రభుత్వానికి ఎంతో ఉపయోగపడిన ఉపాధి హామీ పథకానికి సమృద్ధిగా నిధులను కేంద్రం కేటాయించాలని, 15 రోజుల్లో కూలీలకు చెల్లింపులు జరిగేలా చూడాలని ఆమె కోరారు. ఉపాధి హామీ పథకాన్ని కొందరు సభ్యులు ఎద్దేవా చేశారని, అయితే కరోనా కాలంలో కోట్లాది మందికి ఈ పథకమే సాయపడిందని ఆమె గుర్తు చేశారు. 2020 బడ్జెట్ కన్నా 35 శాతం తక్కువ కేటాయింపులు ఈ బడ్జెట్‌లో చేయడం పట్ల ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా..కేంద్ర…