ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ మరణాలు మాత్రం గత వారం 40 శాతం పెరిగాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌వొ) వెల్లడించింది. అమెరికాలో తాజా మరణాలతో పాటు భారత్‌లో సవరించిన గణాంకాల ప్రకారం ఈ పెరుగుదల కనిపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ బుధవారం విడుదల చేసిన నివేదిక వివరించింది. డిసెంబర్ నుంచి కరోనా కేసులు పెరుగుతున్న పశ్చిమ పసిఫిక్ రీజియన్‌తోపాటు ప్రతిచోటా తాజా కరోనా కేసుల సంఖ్య తగ్గిందని వారం వారీ నివేదిక పేర్కొంది. గత వారం దాదాపు 10 మిలియన్ తాజా కేసులు, 45,000 కు పైగా మరణాలు నమోదయ్యాయని, అంతకు ముందు వారం మరణాల్లో 23 శాతం తగ్గుదల కనిపించిందని వివరించింది. అంతకు ముందటి వారంలో మరణాలు 33,000 నుంచి మరణాల సంఖ్య సవరించిన గణాంకాల వల్ల పెరిగిందని, మరణాల సంఖ్య నమోదు విషయంలో చిలీ, అమెరికా దేశాలతోపాటు అన్ని దేశాలు అప్రమత్తం అయ్యాయని డబ్లుహెచ్‌వొ…
Author: Editor's Desk, Tattva News
ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుకు మహర్తం ఖరారైంది. ఏప్రిల్ 4వ తేదీ ఉదయం 9.05 గంటల నుండి 9.45 గంటల మధ్య దీనికి సంబంధించి ప్రకటన వెలువడనుంది. రాష్ట్ర ప్రభత్వం ఈ మేరకు నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలు 26 జిల్లాలు కానున్నాయి. బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లాల ఏర్పాటు ప్రక్రియకు సంబంధించి అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సుస్ధిర ఆర్థిక ప్రగతి కోసం నిర్దేశించుకున్న లక్ష్యాలను కొత్త జిల్లాలతో అనుసంధానం చేయాలని పేర్కొన్నారు. పరిపాలనా సముదాయాలా నిర్మాణాల కోసం అనువైన స్థలాల ఎంపికను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. కనీసం 15 ఎకరాల స్థలం ఉండేలా చూడాలని, అందులోనే కలెక్టరేట్‌తోపాటు, జిల్లా పోలీసు అధికారి కార్యాలయాన్ని కూడా ఉండేలా చూడాలని తెలిపారు. క్యాంపు కార్యాలయాలను అదే ప్రాంగణంలో ఉండాలని స్పష్టం చేశారు. భవనాలకు మంచి డిజైన్లు చూడాలని.…
‘‘కష్టపడండి.. జనంలోకి వెళ్లండి.. కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను, మోడీ సర్కార్ సక్సెస్ ను ఇంటింటికి వెళ్లి వివరించండి. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి ఎలా తీసుకురావాలనేది మాకు వదిలేయండి’’ అంటూ తెలంగాణలోని బిజెపి నేతలకు పార్టీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బి ఎల్ సంతోష్ దిశానిర్ధేశం చేశారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన పార్టీ రాష్ట్ర ఆఫీసు బేరర్లు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్ ఛార్జ్ ల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర నేతలు చేసే పోరాటానికి కేంద్ర నాయకత్వం పూర్తి మద్దతుగా నిలుస్తుందని, అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తెలంగాణపై జాతీయ నాయకత్వం స్పెషల్ ఫోకస్ పెట్టిందనే విషయాన్ని మరువరాదని స్పష్టం చేశారు. ఏ ఒక్క అవకాశాన్ని కూడా బీజేపీ నేతలు వదలుకోవద్దని, ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటేనే పార్టీని అధికారంలోకి తీసుకురావచ్చని సంతోష్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అధికారం బీజేపీదేననే లక్ష్యంతో పని చేయాలని రాష్ట్ర నేతలకు స్పష్టం చేశారు. …
పెట్రోల్, డీజిల్, ఆహార వస్తువులు, ఒకటేమిటీ… దైనందిన జీవితంలో వాడే ప్రతీదానిపై ఛార్జీల బాదుడు పెరిగి సామాన్యులు కుదేలవుతున్నారు. ప్రతీరోజూ సామాన్యులపై అదనపు భారాలు పడుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా.. వాహనదారులపై మరో భారం పడనుంది. జాతీయ రహదారులపై టోల్ ప్లాజ్‌ల రేట్లు కూడా పెరిగాయి. ఏప్రిల్ ఒకటో తేదీ నుండి టోల్ ఫీజులు పెరగనున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని జాతీయ రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాల్లో ఫీజులు శుక్రవారం అంటే ఏప్రిల్ ఒకటో తేదీ నుండి పెరగనున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొత్త రుసుములను ఖరారు చేస్తూ ఆదేశాలు వచ్చాయి. ఏయే వాహనాలకు.. కార్లు, జీపులు వంటి వాహనాలపై రూ.5-10,బస్సులు, లారీలకు రూ.15-25,భారీ వాహనాలకు రూ.40-50 వరకు పెరగనున్నాయి. సింగిల్, డబుల్ ట్రిప్‌లతోపాటు నెలవారీగా జారీ చేసే పాసుల్లోనూ రేట్ల పెంపు ఉంటుంది. రాష్ట్రంలోని అన్ని జాతీయ రహదారులపై కలిపి మొత్తంగా 57 టోల్ ప్లాజాలున్నాయి. వీటి మీదుగా వెళ్లే వాహనాల…
నెలరోజులకు పైగా భీకరంగా జరుగుతున్న రష్యా – ఉక్రెయిన్ యుద్ధం ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లకు రెండు దేశాల శాంతి చర్చల్లో పురోగతి వచ్చింది. కీవ్, చెర్నిహివ్ నుంచి బలగాలు ఉపసంహరించేందుకు రష్యా అంగీకరించింది. కీవ్, చెర్నిహివ్ చుట్టూ మోహరించిన బలగాలను వెనక్కి పిలిపిస్తామని రష్యా రక్షణశాఖ మంత్రి అలెగ్జాండర్ ఫొమిన్ చెప్పారు. జెనీవా ఒప్పందాలకు కట్టుబడి ఉంటామని ఉక్రెయిన్ చెప్పిందని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య టర్కీలో మంగళవారం జరిగిన శాంతి చర్చల్లో తటస్థంగా ఉంటామని ఉక్రెయిన్ లిఖిత పూర్వక హామీ ఇచ్చిన నేపథ్యంలో రష్యా తన మిలిటరీ కార్యకలాపాలను తగ్గిస్తామని రష్యా చెప్పింది. ఈ నాటకీయ పరిణామాలు ఇరుదేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరేందుకు సానుకూల వాతావరణం ఏర్పరిచాయి. టర్కీ మధ్యవర్తిత్వంలో జరిగిన ఈ శాంతి చర్చలు ప్రయోజనకరంగా ఉన్నట్లు రష్యా ప్రతినిధి బృంద నేత వ్లాదిమిర్ మెదిన్‌స్కీ తెలిపారు. ఉక్రెయిన్ తటస్థత, అణ్వస్త్రరహిత దేశంగా ఉండేందుకు అంగీకరించడంతో చర్చలు ఆచరణాత్మక దశకు…
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా అధికార టీఆర్‌ఎ్‌సతో అమీ తుమీ తేల్చుకునే దిశగా ముందుకు సాగేందుకు కాంగ్రెస్ సిద్దపడుతోంది.రైతాంగ ఉద్యమంతో మొదలుపెట్టి.. ప్రజాందోళనలు తీవ్రతరం చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలకు పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ సూచించారు. టిపిసిసి నిర్వహించే భారీ బహిరంగ సభలలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొంటారు. ఈ నెలాఖరులో సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తి కాగానే నీళ్లు, నిధులు, నియామకాలపై ఉధృతంగా ఉద్యమాలు నిర్వహించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సహా ఇతర నేతలతో జరిగిన అంతరంగిక భేటీలో సూచించారు. రైతులను ధాన్యం పేరుతో మోసం చేసి, వారి కడుపు కొట్టేందుకు సీఎం కేసీఆర్ యత్నిస్తున్నారని, రైతు ఉద్యమంతో ఆయన నిజస్వరూపాన్ని బయట పెట్టాలని స్పష్టం చేశారు. ఏప్రిల్ నెలాఖరులో లక్షలాది మంది రైతులతో వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ సభకు రాహుల్‌గాంధీ హాజరై ప్రసంగిస్తారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రాన్ని ఢీకొంటున్నట్లు రైతులను కేసీఆర్…
రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోని అధికార బీజేపీ కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోందని ధ్వజమెత్తుతూ దీనిపై ఉమ్మడి కార్యాచరణకు ఓ భేటీకి హాజరు కావాలని సూచిస్తూ పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ బిజెపియేతర ముఖ్యమంత్రులకు, ప్రతిపక్ష పార్టీలకు లేఖ వ్రాసారు. ఈ లేఖలో విపక్ష పార్టీలన్నీ కలిసొచ్చి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని ఆమె కోరారు. బీజేపీకి వ్యతిరేకంగా ముందుకు వెళ్లే మార్గం గురించి చర్చించడానికి కలిసొచ్చేవారంతా సమావేశమవ్వాలని మమత పిలుపునిచ్చారు. బీజేపీ అణచివేత పాలనపై ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని ఆమె స్పష్టం చేశారు. ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకునేందుకు బిజెపి సర్కార్ దర్యాప్తు సంస్థలను దుర్వినియోగపరుస్తున్నారని మమతా ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని ఎక్కడైనా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడానికి కేంద్రం.. దర్యాప్తు ఏజెన్సీలను దుర్వినియోగపరుస్తుందని ఆమె విమర్శించారు. దీనిపై మనందరం కలిసి చర్చించాలని ప్రతిపక్షాలకు ఆమె పిలుపునిచ్చారు. బొగ్గు గనుల స్కాం కేసులో మంగళవారం విచారణకు హాజరు కావాలంటూ…
అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీ (ఐసిఆర్‌సి) ”శత్రువు కోసం పనిచేస్తోందని” ఉక్రెయిన్ డిప్యూటీ ప్రధానిఇర్యానా వెరెషుక్ ఆరోపించారు. రష్యా దళాల దిగ్బంధంలో ఉన్న ఓడరేవు నగరమైన మరియుపోల్ నుండి రష్యాకు ప్రజలను తరలించడానికి రెడ్‌క్రాస్ సాయపడిందని ఆమె ఆరోపించారు. ఉక్రెయిన్ ప్రయోజనాలకు మద్దతివ్వడానికి బదులుగా రష్యా నిధుల పట్ల అంతర్జాతీయ సహాయ సంస్థకు మరింత ఆసక్తి వున్నట్లు కనిపిస్తోందని ఆమె ఎద్దేవా చేశారు. మరియుపోల్ నుండి ప్రజలను రష్యా బలవంతంగా తరలిస్తోందని, అందుకు రెడ్‌క్రాస్ సాయపడిందని ఆమె మండిపడ్డారు. మరియుపోల్ నుండి రష్యాకు మానవతా కారిడార్‌ను ఉక్రెయిన్ ఎన్నడూ అంగీకరించదని ఆమె స్పష్టం చేశారు. వారు ఆక్రమణదారులు, శత్రువులు, శాంతి పరిరక్షకులు కాదు, అటువంటపుడు అక్కడి వారిని తరలించడంలో సాయపడేందుకు రెడ్‌క్రాస్‌కుహక్కులేదని ఉక్రెయిన్ వార్తా సంస్థకుఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తేల్చి చెప్పారు. అయితే, తాము అటువంటి బలవంత తరలింపుల్లో పాల్గొనలేదని ఐసిఆర్‌సి పేర్కొంటోంది. ఉక్రెయిన్‌లోనే కాదు, ప్రపంచంలో ఎక్కడా కూడా తాము…
సుదీర్ఘ కాలంగా అపరిష్కరితంగా ఉన్న సరిహద్దు వివాదానికి అసోం, మేఘాలయ రాష్ట్రాలు చరమ గీతం పాడాయి. 50 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న తమ సరిహద్దు వివాదాల పరిష్కారానికి సంబంధించిన చారిత్రక ఒప్పందంపై రెండు రాష్ట్రాలు అంగీకారానికి వచ్చాయి. అసోం ముఖ్యమంత్రి హిమంతబిశ్వ శర్మ, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా మంగళవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖతో పాటు రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. ఒప్పందంపై ఇరువురు ముఖ్యమంత్రులు సంతకాలు చేయడాన్ని ‘చరిత్రాత్మక రోజు’గా వర్ణించారు. ఈ ఒప్పందం ద్వారా ఇరు రాష్ట్రాల మధ్య 70 శాతం సరిహద్దు వివాదం పరిష్కారమైందని వెల్లడించారు. ఈశాన్య ప్రాంతంలో శాంతి, సంస్కృతి పరిరక్షణ, అభివృద్ధిపై దృష్టి సారించిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకి చెందుతుందని ఆయన చెప్పారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న 884.9 కిలోమీటర్ల సరిహద్దులో…
కర్ణాటకలో కొన్ని ప్రాంతాలలో దేవాలయ ఉత్సవాలలో ముస్లింలను షాపులు ఏర్పర్చుకోకుండా నిషేధించడం పట్ల అధికార బిజెపిలోనే కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి, హోమ్ మంత్రి జోక్యం చేసుకోవాలని, ఇటువంటి చర్యలు అంతర్జాతీయంగా హిందువుల మనుగడపై ప్రభావం చూపగలవని ఇద్దరు బిజెపి ఎమ్యెల్యేలు హెచ్చరించారు. కొన్ని హిందూత్వ అనుకూల గ్రూపుల ఆదేశాల మేరకు దేవాలయాల ఉత్సవాల్లో పాల్గనకుండా ముస్లిం వ్యాపారాలపై ఆంక్షలు విధిస్తున్నారని ఎంఎల్‌సి ఎ.హెచ్. విశ్వనాథ్, ఎమ్మెల్యే అనిల్ బనేక్‌లు పేర్కొన్నారు. ఈ చర్య ప్రజాస్వామ్య విరుద్ధం, తప్పుడు చర్యలు, పిచ్చితనంగా వారు స్పష్టం చేశారు. విహెచ్‌పి, హిందూ జాగరణ వేదిక, భజరంగ్ దళ్, శ్రీరామసేన బృందాల డిమాండ్ మేరకు ఉడుపి, శివమొగ్గలో కొన్ని ఆలయ ఉత్సవాల్లో ముస్లింలు పాల్గనకుండా అడ్డుకుకోవడం పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించాయని హెచ్చరించారు. అయితే హిందూ యేతరులు ఆలయాల ప్రాంగణాల్లోకి ప్రవేశించకుండా 2002లో కాంగ్రెస్ హయాంలోనే…