Author: Editor's Desk, Tattva News

ఆదాయ పన్ను చట్టం స్థానంలో ప్రత్యక్ష పన్నుల కోడ్‌ను తీసుకురావాలని మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం సూచించారు. అయితే ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఆర్థిక బిల్లులో 39 సవరణలు ఎందుకు చేయాలనుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటున్నానని ఆయన చెప్పారు.  రాజ్యసభలో  ఆర్థిక బిల్లుపై జరిగిన చర్చ సమయంలో చిదంబరం మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక బిల్లులోని 125 క్లాజులు ఉన్నాయని, వాటిలో ఆదాయ పన్ను చట్టం 84 సవరణలు కలిగి ఉందని గుర్తు చేశారు.  అయితే ఆర్థిక మంత్రి సవరణ బిల్లులో 125 క్లాజులకు 39 సవరణలు చేశారని, నిశితంగా పరిశీలిస్తే.. ఈ సవరణలు ఆమెకి అర్థంకాలేదని తెలుస్తుందని ఆయన ఎద్దేవా చేశారు.  ఇది వారసత్వ సమస్య అని, ఏడాది అనంతరం ఏడాది కొనసాగుతూనే ఉంటుందని పేర్కొంటూ ఇది ఆగిపోవాలని చిదంబరం స్పష్టం చేశారు.  పాత వారసత్వాలన్నింటినీ ఈ ప్రభుత్వం తుడిచివేస్తామని చెబుతోందని, ముందుగా ఆదాయ పన్ను చట్టం పూర్తిగా ప్రత్యక్ష పన్ను కోడ్‌తో మార్చేయాలని ఆయన సూచించారు. …

Read More

దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు భగ్గుమంటున్నాయి.  మంగళవారం పెట్రోల్‌పై 80 పైసలు, 70 పైసలు పెరిగింది. వారం రోజుల వ్యవధిలో లీటరుకి రూ. 4.80 పెరిగింది. దీంతో ఢిల్లీలో పెట్రోల్‌ ధర రూ.100.21, లీటర్‌ డీజిల్‌ ధర రూ. 91.47కి చేరింది.  ముంబయిలో పెట్రోల్‌ లీటరు ధర రూ. 115.04లకు పెరిగింది. డీజిల్‌ లీటరు ధర రూ. 99.25గా ఉంది. చెన్నైలో పెట్రోల్‌ ధర లీటరుకు 76 పైసలు పెరిగి ఇప్పుడు రూ.105.94 అయింది. డీజిల్‌ ధర లీటరు రూ.96. కోల్‌కతాలో పెట్రోల్‌ ధర రూ.109.68, డీజిల్‌ ధర రూ.94.62గా ఉంది. హైదరాబాద్ లో పెట్రోల్ 113 రూపాయల 61 పైసలు, డీజిల్ 99 రూపాయల 84 పైసలకు చేరింది. విశాఖలో పెట్రోల్ 113 రూపాయల 43 పైసలు, డీజిల్ 99 రూపాయల 47 పైసలకు ఎగబాకింది.గడిచిన ఎనిమిది రోజుల్లో వరుసగా ఏడుసార్లు పెరిగాయి పెట్రోల్, డీజిల్ ధరలు. కోల్ కతాలో పెట్రోల్ 109 రూపాయల…

Read More

భారత్ బయోటెక్ సీఎండి డాక్టర్ కృష్ణమూర్తి ఎల్ల, ఆయన సతీమణి సుచిత్ర కృష్ణ ఎల్ల, సంయుక్తంగా పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. రాష్ట్రపతి రామ్‌నాధ్ కొవింద్ చేతుల మీదుగా విశిష్ట పురస్కారాన్ని స్వీకరించారు.  ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్‌లో మలివిడత పద్మ అవార్డుల ప్రదానోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. మార్చి 21 న తొలివిడతగా కొందరికి అందజేయగా, సోమవారం మిగతా వారికి అందించారు.  ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు సహా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, బిజెపి అధ్యక్షుడు నడ్డా హాజరయ్యారు.  హిందుస్థానీ సంగీతంలో ప్రసిద్ధి చెందిన గాయని ప్రభ ఆత్రే పద్మవిభూషణ్ అందుకున్నారు. ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం దివంగత కల్యాణ్ సింగ్‌కు మరణానంతరం కేంద్రం పద్మవిభూషణ్ ప్రకటించగా, ఆయన కుమారుడు రాజ్‌వీర్ సింగ్ రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును స్వీకరించారు.  నటుడు విక్టర్ బెనర్జీ పద్మభూషణ్ , ఒలింపిక్స్ గోల్డ్‌మెడలిస్ట్…

Read More

సమతామూర్తి విగ్రవిష్కరణ కార్యక్రమంకు ముందుకూడా అక్కడకు వెళ్లి, అక్కడ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించిన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కార్యక్రమాలలో ఎక్కడా పాల్గొనకపోవడంతో మొదటిసారిగా బహిర్గతమైన చిన్నజియ్యర్ స్వామితో ఆయనకు ఏర్పడిన విబేధాలు, యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో అన్నీ తానై వ్యవహరించిన చినజీయర్‌‌ లేకుండానే సీఎం కేసీఆర్‌‌ ఆలయాన్ని ప్రారంభించడంతో మరోసారి వెల్లడయ్యాయి.  చినజీయర్​ నిర్ణయించిన ముహూర్తానికే వైభవంగా మహాకుంభ సంప్రోక్షణ చేసినా, ఆయనకు కనీసం ఆహ్వానం కూడా పంపకపోవడం గమనార్హం. “తాము ఎవరికి దూరం కావాలనుకోనని,  ఎవరైనా కావాలనుకొంటే తాము చేసేదేమీ లేదని” అంటూ తమ మధ్య ఏర్పడిన అగాధాన్ని చిన్నజియ్యర్ స్వయంగా ఈ మధ్య విజయవాడలో మీడియా సమావేశంలో వెల్లడించారు.  అయితే ఆ తర్వాత “చిన్నజియ్యర్ కు నాకు దూరం పెరిగినది మీకు ఎవ్వరు చెప్పారు? మీకెలా తెలిసింది” అంటూ పుకార్లే” అంటూ స్వయంగా కేసీఆర్ మరో మీడియా సమావేశంలో కొట్టిపారవేసారు. దానితో యాదాద్రికి స్వామీజీని ఆహ్వానించవచ్చని, ఆ విధంగా వారిద్దరూ తిరిగి కలుసుకోగలరని చాలామంది భావించారు. అయితే ఆయన ప్రసక్తి లేకుండా యాదాద్రిలో కార్యక్రమాలు…

Read More

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ప్రధానాలయ ఉద్ఘాటనలో ప్రధాన ఘట్టమైన మహాకుంభ సంప్రోక్షణను వేద మంత్రాల మధ్య వైభవంగా  జరిపిన తర్వాత  స్వయంభూ దర్శనాలు తిరిగి సోమవారం మొదలయ్యాయి. ఉదయం ఆలయ మహాకుంభసంప్రోక్షణలో సీఎం కేసీఆర్, మంత్రులు పాల్గొన్నారు. ఇక నిర్మాణంలో భాగస్వాములైన వారిని సన్మానించారు. ముహూర్తం ప్రకారమే మహాకుంభ సంప్రోక్షణ పూర్తయ్యింది.  ఆలయ ఉద్ఘాటన, మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం వేదమంత్రోచ్చారణల మధ్య కన్నుల పండువగా నిర్వహించారు. ఏకాదశి శ్రవణ నక్షత్రయుక్త మిథున లగ్నంలో.. పుష్కరాంశ శుభ ముహూర్తంలో మహాకుంభ సంప్రోక్షణ జరిగింది. తొలుత గర్భాలయంపై ఉన్న విమానగోపురం వద్ద పూజలు చేసి, ఆశీర్వచనం నిర్వహించారు. కేసీఆర్‌కు కంకణధారణ చేసి, సుదర్శన చక్రానికి పూజలు చేయించారు. అనంతరం దివ్య విమాన రాజగోపురం వద్ద ఉదయం 11:55 గంటలకు శ్రవణ నక్షత్రయుక్త మిథునలగ్న అభిజిత్‌ ముహూర్తంలో మహాకుంభ సంప్రోక్షణ ప్రారంభించారు. ప్రధానాచార్యులు నల్లంథీఘల్‌ లక్ష్మీనర్సింహాచార్యుల ఆధ్వర్యంలో సువర్ణ సుదర్శన చక్రానికి బంగారు కలశంలో నింపిన పవిత్ర నదీజలాలతో…

Read More

మాజీ కేంద్ర మంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ కూతురు రుబయ్యా సయీద్‌ను కిడ్నాప్ చేసి తమ వాళ్లను విడుదల చేయాలని ఉగ్రవాదులు డిమాండ్ చేసినప్పుడు అప్పుడు జమ్మూ కాశ్మీర్  ముఖ్యమంత్రిగా ఉన్న ఫారూఖ్ అబ్దుల్లా అందుకు ఒప్పుకోలేదని కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ స్పష్టం చేశారు.  ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేసినందుకు కేరళ గవర్నర్  ధన్యవాదాలు తెలుపుతున్నట్లు నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తెలిపారు. 1989లో జరిగిన ఈ ఉదంతం గురించి తాజాగా ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖాన్ స్పష్టం చేశారు.  1989 డిసెంబర్ 9న రుబయ్యా సయీద్‌ను జేకేఎల్ఎఫ్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. కాగా, అరెస్టై జైలులో ఉన్న ఐదుగురు ఉగ్రవాదులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలో జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రిగా ఉన్న ఫారూఖ్ అబ్దుల్లా అందుకు ఒప్పుకోలేదట. అయితే చాలా ఒత్తిడిల అనంతరం వారిని విడుదల…

Read More

ఏప్రిల్ 1వ తేదీ నుంచీ రాష్ట్రంలో అర్హులైన వారందరికీ ఆసరా పింఛన్లు అందిస్తామని, 57 ఏళ్ళు దాటినవారికి కూడా మంజూరు చేస్తామని ప్రకటనలతో కేసీఆర్ సర్కారు ఊదరగొట్టిందని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి గుర్తుచేశారు.  తీరా చూస్తే ఏప్రిల్ 1వతేదీ అనేది కొన్ని గంటల్లోకి వచ్చేసినా పరిశీలన ప్రక్రియ మొదలుకాలేదని, సర్కారు ప్రకటనను నమ్మి పాపం దాదాపు 11 లక్షల మంది ఆసరా పింఛన్లపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని ఆమె తెలిపారు. అయితే, కొత్త అప్లికేషన్లను పరిశీలనకు మార్గదర్శకాలు జారీ కాలేదని ఆమె పేర్కొన్నారు.  ప్రజలకు ఆసరాగా నిలిచి ఆదుకోవలసిన తెలంగాణ సర్కారు ఆ కర్తవ్యాన్ని మరిచిపోయి అధికార ఆసరా కోసం నానా పాట్లు పడుతోందని ఆమె ఎద్దేవా చేశారు.  ఇప్పటి వరకూ దరఖాస్తు చేసుకోని వారికి అవకాశం ఇస్తారా? లేదా… వచ్చిన దరఖాస్తులనే పరిశీలిస్తారా? వంటి ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయని ఆమె తెలిపారు. రాష్ట్రంలో గత మూడేళ్లుగా కొత్త పింఛన్లు…

Read More

బాలీవుడ్‌ బ్యూటీ క్వీన్‌ దీపికా పదుకొనెకు  టైం 100 ఇంపాక్ట్‌ అవార్డును అందుకుంది. మానసిక ఒత్తిడిపై ఆమె అవగాహన కల్పిస్తూ ఆమె అందించిన సేవలకు గాను దీపికకు అరుదైన ఈ గౌరవం అభించింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ అవార్డును అందుకున్న ప్రముఖుల జాబితాలో ఇప్పుడు దీపికా కూడ చేరింది.  ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా దీపికా పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ షేర్‌ చేస్తూ.. ‘ఈ సోమవారం శుభవార్తతో రోజు మొదలైంది’ అంటూ ఫ్యాన్స్‌తో గుడ్‌న్యూస్‌ పంచుకుంది. అది చూసిన ఆమె అభిమానులు, బాలీవుడ్‌ సెలెబ్రెటీలు దీపికాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా ప్రపంచ వ్యాప్తంగా శాస్త్ర, రాజకీయ, కళా రంగంలో అందించే సేవలకు గుర్తింపుగా ఈ అవార్డుతో సత్కరిస్తారు. యుఏఈ అడ్వాన్స్‌డ్‌ టెక్కాలజీ మంత్రి సారా అల్‌ అమీరి, ప్రముఖ సింగర్‌, రచయిత ఎల్లి గౌల్డింగ్‌, హుడా బ్యూటీ వ్యవస్థాపకులు హుడా కట్టాన్‌, సింగీత…

Read More

‘కాశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రంపై బిజెపి సర్కార్‌ మక్కువ చూపడంపై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా మండిపడ్డారు. కాశ్మీర్‌ పండిట్ల కష్టాలపై కలత చెందని కమలం పార్టీ.. ఈ చిత్రంపై ప్రేమ కరిపిస్తోందని ఎద్దేవా చేశారు. ఈ సినిమాను ప్రమోట్‌ చేస్తూ.. అక్కడి పండిట్లపై మొసలి కన్నీరు కారుస్తోందని విమర్శించారు. పాక్‌ ఉగ్రమూకల దాడితో కాశ్మీర్‌ లోయను వీడిన పండిట్లు తిరిగి స్వస్థలాలకు వెళ్లే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారని ఆయన చెప్పారు. ఎనిమిదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న కాషాయ పార్టీ… వారి కోసం ఏం చేసిందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.  ఈ సినిమాకు టాక్స్‌ ఫ్రీ ప్రకటించి.. అందరూ చూడాలని బిజెపి ప్రమోట్‌ చేయడంపై మండిపడ్డ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌.. ఈ చిత్రాన్ని యూట్యూబ్‌లో పెడితే.. అందరూ చూస్తారంటూ ఇప్పటికే చురకలు అంటించారు. ఇప్పటి వరకు ఈ చిత్రంపై వసూలైన మొత్తాన్ని కాశ్మీర్‌ పండిట్ల సంక్షేమం కోసం వినియోగించాలని సూచించారు. తాజాగా మనోష్‌…

Read More

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీలో సోమవారం అధికార టిఎంసి, ప్రతిపక్ష బిజెపి ఎమ్మెల్యేలు బాహాబాహీకి దిగారు. భీర్భూంలో చోటుచేసుకున్న హత్యలపై చర్చించాలని పట్టుబడ్డ బిజెపి.. రాష్ట్రంలో శాంతి, భద్రతలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మౌనం వీడాలంటూ డిమాండ్‌ చేయడంతో అధికార తఅణమూల్‌ కాంగ్రెస్‌, బిజెపి ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం నెలకొంది.  ఇది కాస్త మాటల యుద్ధం నుండి చేతల దాడి వరకు దారి తీసింది. దీంతో ఇరు పార్టీల ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురు ఎమ్మెల్యేలు గాయపడ్డారు. కాగా, ఈ ఘర్షణలకు కారణమైన ప్రతిపక్ష శాసన సభా పక్షనేత సువేందు అధికారితో పాటు మరో నలుగురు బిజెపి ఎమ్మెల్యేలను సంవత్సరం పాటు స్పీకర్‌ సస్పెండ్‌ చేశారు. ఇటీవల బీర్భూం జిల్లాలోని రామ్‌పుర్‌హట్‌లో చోటుచేసుకున్న ఘటనలో హింసాత్మక ఘటనలో ఐదుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులతో సహా 8 మంది సజీవదహనమైన విషయం తెలిసిందే. టిఎంసి నేత హత్య తర్వాత…

Read More