Author: Editor's Desk, Tattva News

‘చంద్రబాబు హయాంలో పెగాసస్‌ స్పైవేర్‌ కొన్నారు’ అని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పినట్లుగా వచ్చిన వార్తలు ఏపీలో రాజకీయ ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి. ఈ అంశాన్ని ఆసరాగా చేసుకొని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును దోషిగా తేల్చే ఆధారాలు సేకరించడం కోసం  తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఛైర్మన్‌గా హౌస్‌ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో సభ్యులుగా మాజీ మంత్రి కొలుసు పార్థసారథి, కె.భాగ్యలక్ష్మి, గుడివాడ అమర్‌నాథ్‌, కొఠారు అబ్బయ్యచౌదరి, మేరుగ నాగార్జున, మద్దాలి గిరిధర్‌ ఉన్నారు. 12 రోజులపాటు జరిగిన బడ్జెట్ సమావేశాల ముగింపు రోజున స్పీకర్  స్పీకర్‌ తమ్మినేని సీతారాం సభాసంఘం ఏర్పాటును ప్రకటించి, ఈ అంశంపై నిగ్గు తేల్చే బాధ్యతను సభా సంఘానికి అప్పగించారు.  ‘మేం పెగాసస్‌ కొనలేదు’ అని చంద్రబాబునాయుడు ఇప్పటికే స్పష్టం చేశారు. ‘ఏపీలో పెగాస్‌సను ఉపయోగించలేదు. ఇది వందశాతం నిజం’ అని అప్పటి నిఘా విభాగం చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు కూడా తేల్చి చెప్పారు.  ఇక.. వైసీపీ హయాంలోనే డీజీపీగా పని…

Read More

ఉత్తర్ ప్రదేశ్లో కొత్త సర్కారు కొలువుదీరింది. గత రికార్డులను బ్రేక్ చేస్తూ యోగి ఆదిత్యనాథ్ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గవర్నర్ ఆనందీ బెన్ యోగితో ప్రమాణ స్వీకారం చేయించారు.   యూపీలో వరుసగా రెండోసారి పాలనా పగ్గాలు చేపట్టిన యోగి 37ఏళ్ల రికార్డు బ్రేక్ చేశారు. ఆయనతో పాటు 52 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. లక్నోలోని అటల్ బిహారీ వాజ్ పేయ్ ఏకానా క్రికెట్ స్టేడియంలో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సహా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ హాజరయ్యారు.  యూపీలో ఇద్దరు డిప్యూటీ సీఎంల సంప్రదాయాన్ని కొనసాగించాలని బీజేపీ నిర్ణయించింది. ఈ క్రమంలో కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రిజేష్ పాఠక్ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేశారు. ఎన్నికల్లో కేశవ్ ప్రసాద్…

Read More

పంజాబ్ లో తొలిసారిగా కాంగ్రెస్, అకాలీదళ్ కాకుండా ఆప్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి భగవంత్ మాన్ వరుసగా సంచలన నిర్ణయాలు తీసుకొంటున్నారు. ప్రమాణస్వీకారం రోజుననే అవినీతి ఫిర్యాదులకు ప్రత్యేక ఫోన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన, ఇకపై ‘వన్ ఎమ్మెల్యే వన్ పెన్షన్’ విధానం అమలవుతుందని ప్రకటించారు.  ఆ మేరకు ఎమ్మెల్యేల ఫ్యామిలీ పెన్షన్లోనూ కోత విధిస్తున్నట్లు వెల్లడించారు. పలువురు ఎమ్మెల్యేలు ఒకసారికి మించి ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతుండటంతో పదవీకాలం ముగిసిన ప్రతిసారీ వారికి కొత్తగా మరో పెన్షన్ ఇవ్వడం సంప్రదాయంగా వస్తోంది. ఈ క్రమంలో ఒక్కొక్కరు  రూ.3.50 లక్షల నుంచి రూ.5.25 లక్షలు పెన్షన్ గా అందుకుంటున్నారు. ఇది ప్రభుత్వ ఖజానాకు భారంగా మారింది.  మాజీ ఎమ్మెల్యేలలో  కొందరు ఎంపీలుగానూ కొనసాగుతున్నారు. వారు పార్లమెంట్ సభ్యుడిగా సేవ చేసినందుకు ఆ పెన్షన్ కూడా అందుకుంటున్నారని భగవంత్ మాన్ చెప్పారు. ఈ కారణంగానే ‘వన్ ఎమ్మెల్యే వన్ పెన్షన్’ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చామని తెలిపారు.  వారు ఇప్పుడు ఒక…

Read More

‘మిషన్‌ ఇన్‌ గుజరాత్‌’పై కాంగ్రెస్‌ దృష్టిసారించింది. ఈ ఏడాది చివరలో జరుగనున్న గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పుడు కాంగ్రెస్ ప్రధానంగా దృష్టి సారిస్తున్నది. సుమారు మూడు దశాబ్దాలుగా రాష్ట్రంలో అధికారంకు దూరంగా ఉన్న కాంగ్రెస్ ఈ పర్యాయం గెలుపోండంపట్ల తీవ్రంగా దృష్టి సారిస్తున్నది. అందుకోసమే, పలు రాష్ట్రాలలో వివిధ పార్టీలు అధికారంలోకి రావడానికి కీలక పాత్ర వహించినట్లు భావిస్తున్న  ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్‌ సేవలను కాంగ్రెస్ వినియోగించుకోనున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు వారి పట్ల ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.  గత ఏడాది కాంగ్రెస్ పార్టీలో కీలక ప్రాతినిధ్యం ఇస్తే ఆ పార్టీలో చేరడానికి ఉత్సాహం చూపిన కిషోర్, అందుకు ఆ పార్టీ విముఖత వ్యక్తం చేయడంతో, అప్పటి నుండి కాంగ్రెస్ కు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు  కాంగ్రెస్‌ పార్టీతో ఎలాంటి అనుబంధం లేకుండా కేవలం ఓ ప్రొఫెషనల్‌గా పని చేసేందుకు ప్రశాంత్‌ కిశోర్‌ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. రాహుల్‌గాంధీతో సమావేశమైన సందర్భంగా ఈ మేరకు…

Read More

సుప్రసిద్ధ రచయిత శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) కుమార్తె నిడుమోలు మాలా మద్రాస్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. మద్రాస్‌ హైకోర్టుకు న్యాయవాదుల కోటాలో ఆరుగురి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేయగా వీరిలో మాలా, ఎస్‌.సౌందర్‌ల పేర్లకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఈమేరకు కేంద్ర న్యాయశాఖ అదనపు కార్యదర్శి రాజేందర్‌ కశ్యప్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీశ్రీ-సరోజా దంపతుల నలుగురి సంతానంలో చిన్నవారైన మాలా మద్రాస్‌ లా కళాశాల నుంచి డిగ్రీ పొందారు. ఆమె 1989లో మద్రా్‌స-పుదుచ్చేరి బార్‌ అసోసియేషన్‌లో నమోదయ్యారు. 32 ఏళ్లుగా మద్రాస్‌ హైకోర్టులో ప్రాక్టీసు చేస్తున్నారు. 2020 నుంచి పుదుచ్చేరి ప్రభుత్వ న్యాయవాది (జీపీ)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మాలా భర్త నిడుమోలు రాధారమణ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో ఉన్నతాధికారిగా ఉన్నారు. వారిది ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా.  మాలా-రాధా రమణ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు శ్రీనివాస్‌ జయప్రకాశ్‌ కూడా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తున్నారు. …

Read More

దేశ వ్యక్తంగా కలకలం రేపిన పశ్చిమబెంగాల్​లోని బీర్భూమ్​ జిల్లా బొగ్టుయ్ గ్రామంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనపై దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. ఈ ఘటనపై ఇప్పటికే దర్యాప్తు చేస్తున్న సిట్‌ (బెంగాల్ పోలీస్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) ఇప్పటి వరకు చేసిన దర్యాప్తు వివరాలను కూడా సీబీఐకి అప్పగించాలని సూచించింది. వారం రోజుల్లో దర్యాప్తుకు సంబంధించిన స్టేటస్ రిపోర్టును న్యాయస్థానానికి అందజేయాలని సీబీఐని ఆదేశించింది. అనంతరం ఈ కేసు విచారణను హైకోర్టు ఏప్రిల్ 7కు వాయిదా వేసింది. బీర్భూమ్ జిల్లా బొగ్టుయ్ గ్రామంలో మార్చి 22న జరిగిన అల్లర్లలో మూడు ఇళ్లకు నిప్పు పెట్టడంతో ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు. అధికార తృణమూల్ పార్టీకి చెందిన ఓ నేత మృతి తర్వాత ఈ అల్లర్లు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు సహా మొత్తం ఎనిమిది మందిని సజీవ దహనం చేయడానికి ముందు వారిని చిత్రహింసలు పెట్టినట్టు పోస్టుమార్టం రిపోర్ట్​లో వెల్లడైంది. …

Read More

టోక్యోలోని రెంకోజీ ఆలయంలో ఉన్న నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అస్థికలను భారత్‌కు తీసుకురావాలని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లో ‘నేతాజీ గ్రంథ సమీక్ష’ కార్యక్రమంలో ముఖ్యఅతిగా పాల్గొంటూ ఎంతో మంది పాలకులు మారుతున్నా గానీ, నేటికీ నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ చితాభస్మాన్ని ఎందుకు తేలేకపోతున్నారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.  నేతాజీ అస్థికలను తెచ్చి ఎర్రకోటలో ఉంచాలని స్పష్టం చేశారు. ప్రజలు దీనికి సహకరించాలని నోరుతూ ఆస్థికలను తెచ్చేంత వరకూ ప్రజా ఉద్యమాన్ని కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పిలుపిచ్చారు. అందుకు నాయకులపై ఒత్తిడి తీసుకొస్తే ఇది సాధ్యమవుతోందని ఆయన చెప్పారు.  ఈ సందర్భంగా ఆయన అస్థికలు తేవాలని డిమాండ్‌ చేస్తూ రింకోజ్‌ టు రెడ్‌ ఫోర్ట్‌ అనే హ్యాష్‌ ట్యాగ్‌ను ఆవిష్కరించారు. నేతాజీ సేవలను ఈ దేశం సరిగా గుర్తించలేదని విచారం వ్యక్తం చేశారు. నిన్నకాక మొన్న వచ్చిన వారికి శిలా ఫలకాలు, విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారని, కానీ  దేశం…

Read More

ఉత్తర్ ప్రదేశ్లో శుక్రవారం కొత్త సర్కారు కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ రెండోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో ఆ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో సమావేశమైన పార్టీ అగ్రనేతలు యోగి ఆదిత్యనాథ్ ను ఉత్తర ప్రదేశ్ శాసనసభాపక్ష నేతగా గురువారం లాంఛనంగా ఎన్నుకున్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా, జార్ఖండ్ మాజీ సీఎం రఘుబర్ దాస్ ఆధ్వర్యంలో జరిగిన భేటీలో సీఎం యోగి ఆదిత్యనాథ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు రాధామోహన్ సింగ్, మాజీ డిప్యూటీ సీఎం దినేష్ శర్మ, కేపీ మౌర్య తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. కేబినెట్ బెర్తుల కేటాయింపు, డిప్యూటీ సీఎంల ఎంపికపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. యూపీలో ఉప ముఖ్యమంత్రులుగా ఈసారి కూడా ఇద్దరికి అవకాశం ఇవ్వాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఉంటే తాజా ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ మాజీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యకు మరోసారి అదే పదవిలో …

Read More

రాజ్యాంగానికి మూడు స్తంభాలైన న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు ఒకదాని పరిధిలోకి మరొకటి చొరబడకూడదని, అప్పుడే వ్యవస్థలన్నవి నడుస్తాయని, అలా కాకపోతే వ్యవస్థలన్నీ కుప్పకూలిపోతాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హెచ్చరించారు.  మూడు రాజధానుల ప్రతిపాదనను కొట్టివేస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ శాసనసభ ఫలానా విధానాన్ని, ఫలానా చట్టాన్ని చేస్తుందని ముందస్తుగానే ఊహించుకుని కోర్టులు ఆదేశాలు ఇవ్వజాలవని స్పష్టం చేశారు.  రాబోయే రోజుల్లో ఒక చట్టం రాబోతుందని, దానివల్ల ఫలానా రాజధాని ఫలానా చోట పెడతారు.. అని వాళ్లంతట వాళ్లే ఊహించుకుంటే ఎలా? అని ప్రశ్నించారు. ఎందుకంటే ఈ రోజు అలాంటి చట్టం ఏదీ లేదని, దాన్ని మనం వెనక్కి తీసుకున్నామని చెప్పారు.  ‘ఈ పరిస్థితిలో ఇలాంటి తీర్పు ఎందుకు ఇచ్చినట్టు? మూడు రాజధానులను చేస్తూ ఒక చట్టమే లేనప్పుడు ఈ తీర్పు ఎందుకు వచ్చినట్టు?’ అంటూ రాష్ట్ర హైకోర్టు తీరుపట్ల విచారం వ్యక్తం…

Read More

బీర్భూమ్ హింస వెనుక పెద్ద హస్తమే ఉందని, రాష్ట్రంలో రాజకీయ హింస, చట్టవ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహిస్తోందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. బీర్భూమ్ ప్రాంతంలో మమతా బెనర్జీ గురువారం పర్యటించారు.  ”ఆధునిక బెంగాల్‌లో ఇంత అనాగరికం జరుగుతుందని నేను అనుకోలేదు. తల్లులు, పిల్లలు చనిపోయారు. మీ కుటుంబీకులు చనిపోయారు. నా గుండె తరుక్కుపోతోంది” అంటూ  మమత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ హింస వెనుక పెద్ద కుట్ర ఉందని, బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ఆమె పోలీసులను అక్కడికక్కడే ఆదేశించారు.  ఈ సందర్భంగా పోలీసులను ఆమె తీవ్రంగా మందలించారు. “పోలీసులు వెంటనే వెళ్లి ఉంటే ఈ సంఘటనను నివారించవచ్చు” అని పేర్కొంటూ ఆమె పోలీసులపై విరుచుకుపడ్డారు. “డిఐబి (డిస్ట్రిక్ట్ ఇంటెలిజెన్స్ బ్యూరో), ఐసి (ఇన్‌స్పెక్టర్ ఇన్‌ఛార్జ్) తమ బాధ్యతను నెరవేర్చలేదు. తెలిసి కర్తవ్యాన్ని నిర్వర్తించని వారిపై చర్యలు తీసుకోవాలి” అని బెనర్జీ స్పష్టం చేశారు.  కాగా, టిఎంసికి చెందిన రాంపూర్‌హాట్ 1…

Read More