Author: Editor's Desk, Tattva News

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ఘోర పరాజయం చెందిన తర్వాత కాంగ్రెస్ నాయకత్వంలో ప్రక్షాళన కోరుతున్న జి-23 బృందం నాయకులు తమ కార్యకలాపాలను ఉధృతం చేయడంతో ఆ పార్టీలో కలకలం చెలరేగుతుంది. మొదటిసారిగా మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయకత్వంపై తమకు నమ్మకం లేదని, పార్టీకి కొత్తగా సమిష్టి నాయకత్వం అవసరమని బహిరంగంగా స్పష్టం చేశారు. దానితో ఖంగారు పడిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అర్ధాంతరంగా నష్టనివారణ చర్యలు చేపట్టారు. సోనియా స్వయంగా బుధవారం రాత్రి ఈ నేతల సమావేశం జరిగిన కొద్దిసేపటికే గులాబీ నబి ఆజాద్ కు ఫోన్ చేసి మాట్లాడారు. వారి బృందంతో మాట్లాడడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు హామీ ఇచ్చారు. మరోవంక, రాహుల్ గాంధీ హర్యానా మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత భూపేందర్ సింగ్ హుడాతో భేటీ అయ్యారు. రాహుల్ తో భేటీ అయిన వెంటనే ఆయన ఆజాద్ ఇంటికి వెళ్లి, ఆయనతో మాట్లాడారో. ఆ సమయంలో రాజ్యసభలో పార్టీ ఉపనేత ఆనంద్…

Read More

నేడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న, సుప్రీం కోర్ట్ నియమించిన నిపుణుల బృందం దర్యాప్తు చేస్తున్న ఇజ్రాయెల్ కు చెందిన  పెగసస్‌ స్పైవేర్‌ను ఏపీలో  చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని టిడిపి ప్రభుత్వం కొనుగోలు చేసిన్నట్లు టిఎంసి అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణ చేశారు.  ఈ సాఫ్ట్‌వేర్‌ను రూ.25 కోట్లకు అందిస్తామంటూ అప్పట్లో బెంగాల్‌లోని తమ ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయని,  అయితే, ఈ అంశం ప్రజల వ్యక్తిగత గోప్యతకు సంబంధించినది, చట్ట విరుద్ధమైంది అయినందున తాము కొనలేదని ఆమె వెల్లడించారు. ‘ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో సంస్థ పెగసస్‌ సాఫ్ట్‌వేర్‌ను రూ.25 కోట్లకు అమ్ముతామంటూ నాలుగైదేళ్ల క్రితం మా రాష్ట్ర పోలీసులను సంప్రదించింది. విషయం నాకు తెలిసి, మాకు ఆ సాఫ్ట్‌వేర్‌ అవసరం లేదని చెప్పాను’ అని ఆమె వెల్లడించారు.  కానీ ఈ స్పైవేర్‌ను కొనుగోలు చేసిన కేంద్రం ప్రభుత్వం, దానిని దేశ భద్రత కోసం ఉపయోగించడానికి బదులుగా రాజకీయ ప్రయోజనాల కోసం…

Read More

కేసీఆర్ ఏ పధకం ప్రవేశ పెట్టినా అది ఎన్నికల కోసమే అని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. ఉప ఎన్నికల కోసం దళితబంధు పెట్టి, కొందరికే సాయంచేసే చేతులు దులుపుకున్నారని ధ్వజమెత్తారు. దళితుందరికీ దళితబంధు ఇస్తామని మాయమాటలు చెప్పి మోసం చేశారని ఆమె మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలని షర్మిల పిలుపునిచ్చారు.  ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని, మళ్లీ రాజన్న సంక్షేమ పాలన తీసుకువస్తామని, అప్పుడు చేనేతతో పాటు అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటామని ఆమె భరోసా ఇచ్చారు.  గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలంలోని వంకమామిడి, దంతూర్, కనుముకుల, భీమనపల్లి మీదుగా భూదాన్‌పోచంపల్లి వరకు షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా భూదాన్‌పోచంపల్లిలో నిర్వహించిన చేనేత సదస్సులో షర్మిల  మాట్లాడుతూ  నేటి పాలకుల విధానాలతో చేనేత రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.  ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మళ్లీ నమ్మితే మన బతుకులు బుగ్గిపాలు కావడం ఖాయమని…

Read More

ఇప్పటి వరకు కేసీఆర్, కేటీఆర్ లపై నిత్యం సవాళ్లు విసురుతున్న రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పై మొదటిసారిగా రాష్ట్ర మంత్రి కెటి రామారావు మాటల దాడికి పాల్పడ్డారు. దమ్ముంటే మంత్రి గంగుల కమలాకర్పై  పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. ఇటీవలే అసెంబ్లీ వేదికగా కేంద్రంపై నిప్పులు చెరిగిన టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తాజాగా బండి సంజయ్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీంతో తెలంగాణలో ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. కరీంనగర్ పర్యటనలో భాగంగా గురువారం రూ 1,067కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కేటీఆర్ మార్క్ ఫెడ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ కరీంనగర్ను సీఎం కేసీఆర్ లక్ష్మీనగరంగా చూస్తారని, ఇక్కడ ప్రారంభించే ప్రతి పని విజయవంతం అవుతుందని నమ్ముతారని చెప్పారు.  కరీనంగర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిన బండి సంజయ్ తనను గెలిపించిన ప్రజల కోసం ఒక్క పని కూడా చేయలేదని కేటీఆర్…

Read More

భారత్‌లో కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతూ ఉండడంతో ఇక దేశంలో మూడో  వేవ్‌ దాదాపు ముగిసినట్లే అనుకొంటున్న సమయంలో ఇప్పుడు నాలుగో వేవ్‌ దశ జూన్‌ 22 నాటికి ప్రారంభం అవుతుందని తాజాగా పరిశోధకులు అంచనా వేస్తున్నారు. నాలుగో వేవ్నా లుగు నెలల పాటు కొనసాగనుందని ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు అంచనా వేశారు.  అయితే నాలుగో వేవ్ తీవ్రత అనేది.. వైరస్ వ్యాప్తి, కొత్త వేరియంట్‌ల బట్టి ఉంటుందని స్పష్టం చేశారు. బూస్టర్ డోస్ పంపిణీ, వ్యాక్సినేషన్ లాంటి అంశాలపై కూడా నాలుగో వేవ్‌ తీవ్రత ఆధారపడి ఉంటుందని తెలిపారు. నాలుగో వేవ్ ఆగస్టు 15 నుంచి 31 మధ్య కాలంలో గరిష్టానికి చేరుకుంటుందని పరిశోధకులు భావిస్తున్నారు. ఆ తర్వాత కేసులు తగ్గుముఖం పడతాయని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయమై రాష్ట్రలు అప్రమత్తంగా ఉండాలని, అస్సలు నిర్లక్ష్యం వహించకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని హెచ్చరిస్తున్నది. కాగా, మూడో…

Read More

సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపన ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి పొందడం, రాష్ట్రపతి, ప్రధాని వంటి హేమాహేమీలు అందులో పాల్గొనడంతో ఆయన ప్రఖ్యాతి ఎంతో వెలుగొందిన కొద్దీ రోజులకే త్రిదండి చినజీయర్‌ స్వామి పెను వివాదంలో చిక్కుకున్నారు. వనదేవతలపై ఆయన చేసిన వాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.  మేడారం వనదేవతలు సమక్క, సారలమ్మలపై గతంలో ఆయన చేసిన వ్యాఖ్యల తాలూకు ఓ వీడియో తాజాగా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో ఆయన మాట్లాడిన మాటలు వనదేవతలను అవమానించే విధంగా ఉన్నాయని, మేడారం జాతరను హేళన చేసే విధంగా ఉన్నాయని., భక్తుల విశ్వాసాలను, ఆదివాసీ సంస్కృతిని తూలనాడే విధంగా ఉన్నాయంటూ తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. సమక్క, సారలమ్మలపై చినజీయర్‌ గతంలో ఏ సందర్భంగా మాట్లాడారో తెలియదు గానీ కొన్నిరోజులుగా ఆ వ్యాఖ్యల తాలూకు వీడియో ఒకటి ఫేస్‌బుక్‌, వాట్సా్‌పలో తిరుగుతోంది. ఆ వీడియోలో చినజీయర్‌.. ‘‘అసలు సారక్క, సమ్మక్క ఎవరు? పోనీ.. దేవతలా? బ్రహ్మ…

Read More

ఇటీవల యుపి ఎన్నికల్లో విజయం సాధించడంతో యుపిలో అసెంబ్లీ ఎన్నికల ప్రభావం సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిబింబిస్తుందంటూ బిజెపి శ్రేణులు సంబరాలు చేసుకొంటున్న సమయంలో ఆట అప్పుడే అయిపోలేదని అంటూ రాష్ట్రపతి ఎన్నికలు వస్తున్నాయని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బనెర్జీ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపిని కట్టడి చేయడం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేయబోతున్నట్లు సంకేతం ఇచ్చారు. వచ్చే 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బిజెపియేతర కూటమిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్న మమతా బెనర్జీ ఇప్పటికే పలు ప్రాంతీయ పార్టీలతో చర్చలు ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీ కన్నా ఎక్కువమంది ఎమ్మెల్యేలను కలిగి ఉన్నారని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం పెద్ద విజయం కాదని, రానున్న రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపొందడం తేలిక కాదని మమతా స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యలో సగం సభ్యులు కూడా…

Read More

దేశంలోని ఎన్నికల ప్రక్రియలో క్రమపద్ధతిలో వ్యూహాత్మకంగా ప్రపంచ సామాజిక మాధ్యమం జోక్యం చేసుకొంటోందని, వ్యవస్థను ప్రభావితం చేస్తోందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోపించారు. ఫేస్‌బుక్‌ మత విద్వేషాలు రెచ్చగొడుతోందని ఆమె తెలిపారు. బుధవారం ఆమె లోక్‌సభ జీరోఅవర్‌లో మాట్లాడుతూ భారత రాజకీయాలు, ఎన్నికల్లో ఫేస్‌బుక్‌, ఇతర సోషల్‌ మీడియా మాధ్యమాల జోక్యాన్ని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లేకపోతే ఇది ప్రమాదకర పరిస్థితిని తెచ్చిపెడుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. గ్లోబల్ సోషల్ మీడియా కంపెనీలను కావాలనే దురుద్ధేశపూరితంగా వాడుకుంటుని ఆమె ధ్వజమెత్తారు. దీనితో దేశ ప్రజాస్వామ్య హరణం జరుగుతోందని ఆమె హెచ్చరించారు. సోషల్ మీడియా ఇక్కడి ప్రజాస్వామ్యాన్ని ఎన్నికల వ్యవస్థను హ్యాక్ చేస్తోందని, ఇది చొరబాటుతో కూడిన ప్రాబల్యపు చర్య అవుతోందని ఆమె చెప్పారు. ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి గ్లోబల్ కంపెనీలను కొన్ని శక్తులు విరివిగా వాడుకుంటున్నాయని సోనియా ఆరోపించారు. కొన్ని రాజకీయ పార్టీల నేతలు, పార్టీలు, తమ అనుకూల పరోక్ష వ్యక్తులు తమ వాదనను…

Read More

భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనడానికి ప్రత్యామ్నాయ వ్యూహాలను రూపొందించాలని, కుహనా లౌకికవాదాన్ని వదిలిపెట్టాలని తన మిత్రపక్షం కాంగ్రెస్ పార్టీకి శివసేన హితవు పలికింది. ఈ రెండు పార్టీలు మహారాష్ట్రలోని మహావికాస్ అగాడీ కూటమిలో భాగస్వాములే. ఈ కూటమిలో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ కూడా ఉంది. శివసేన పత్రిక ‘సామ్నా’ సంపాదకీయంలో కాంగ్రెస్ పునరుజ్జీవానికి సూచనలు చేసింది. కుహనా లౌకికవాదాన్ని వదిలిపెట్టాలని, బీజేపీని ఎదుర్కొనడానికి ప్రత్యామ్నాయ వ్యూహాన్ని రచించాలని సలహా ఇచ్చింది. ‘ది కశ్మీర్ ఫైల్స్’ వంటి సినిమాల ద్వారా, హిజాబ్ వివాదం ద్వారా బీజేపీ సృష్టించిన భావాలను తిప్పికొట్టేందుకు ప్రత్యామ్నాయ వ్యూహాలను రూపొందించాలని తెలిపింది. బీజేపీ సైబర్ ఆర్మీ బూటకపు కథనాలను సృష్టిస్తోందని ఆరోపించింది. ఇటువంటి కథనాలను బీజేపీ నేతలు బెంగాల్, మహారాష్ట్రలలో కూడా ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. కానీ అవి పని చేయడం లేదని పేర్కొంది. ఉత్తర ప్రదేశ్‌లో అఖిలేశ్ యాదవ్ కూడా బీజేపీకి వ్యతిరేకంగా గట్టిగా పోరాడారని…

Read More

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ కంటే కేసీఆర్ ఎక్కువ భయపడుతున్నారని బీజేపీ ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. అసెంబ్లీ సమావేశాలు టీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లీస్ సమావేశాలుగా జరిగాయని ఆయన విమర్శలు గుప్పించారు. డబుల్ ఇంజన్‌కే నాలుగు రాష్ట్రాల ప్రజలు పెద్దపీట వేశారని కేసీఆర్ గుర్తుంచుకోవాలని హితవు చెప్పారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడానికి కేసీఆర్ అసెంబ్లీ వేదికగా చేసుకున్నారని లక్ష్మణ్ మండిపడ్డారు. కాంగ్రెస్, టీఆర్ఎస్‌లు ఒకే గూటి పక్షులని అసెంబ్లీ సమావేశాల ద్వారా తేటతెల్లమైందని ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచార సభలో మాట్లాడినట్లు అసెంబ్లీలో మాట్లాడి సభను దుర్వినియోగం చేశారని ఆయన విమర్శించారు. హిజాబ్ అంశంపై కేసీఆర్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని లక్ష్మణ్ ధ్వజమెత్తారు. కెసీఆర్ తన పతనాన్ని గమనించి మోదీపై విమర్శలు చేస్తున్నారని ఆయన  మండిపడ్డారు. కంటోన్మెంట్ ప్రాంతంలో కరెంటు, నీళ్లు కట్ చేస్తామని కేటీఆర్ వ్యాఖ్యానించడం సిగ్గు చేటని మండిపడ్డారు.  సింగిల్ ఇంజన్ సర్కార్…

Read More