గవర్నర్ల నియామకం అంతా కేంద్రం ప్రభుత్వ పరిధిలోని అంశం కావడంతో ఒక రాష్ట్ర గవర్నర్ ప్రధాన మంత్రి పట్ల ధిక్కార ధోరణిలో మాట్లాడటం సాధారణంగా జరగదు. ఆ విధంగా మాట్లాడిన వారు గవర్నర్ పదవిలో కొనసాగడం కూడా అసాదమే అవుతుంది. అయితే మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మాత్రం మొదటి నుండి కేంద్ర ప్రభుత్వం పట్ల, ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పట్ల ధిక్కార ధోరణితో వ్యవహరిస్తున్నారు. తాజాగా, మోదీ సర్కారును గద్దె దించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో దేశంలోని రైతులంతా ఏకమై మార్పు తీసుకురావాలని, బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. హరియాణాలోని జింద్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సత్యపాల్ తన పదవీకాలం ముగిసిన తర్వాత ఉత్తర భారత్ మొత్తం పర్యటిస్తానని, అక్కడి అన్నదాతల్ని ఒక్కతాటి పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తానని ప్రకటించారు. రైతు ఉద్యమం ప్రారంభమైనప్పటి నుండి వారి పట్ల గవర్నర్ గా ఉంటూనే సానుభూతి ప్రకటిస్తూ వస్తున్నారు.…
Author: Editor's Desk, Tattva News
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా మొట్టమొదటగా ఓ మహిళను ఎంపిక చేసేందుకు బిజెపి కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా రీతూ ఖండూరి పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. దీంతో కోట్‌ద్వార్ నియోజకవర్గం నుండి విజయం సాధించిన రీతూ ఖండూరికి ఆ అవకాశం దక్కనున్నట్లు సమాచారం. బిజెపి మహిళా కార్యకర్తలు కూడా రీతూకి భారీగా మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఓటమిపలయ్యారు. దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరిని ఎన్నుకుంటారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా తదుపరి సిఎంగా ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి బిసి ఖండూరీ కుమార్తె రీతూ ఖండూరీ పేరు బలంగా వినిపిస్తోంది. పైగా, రీతూ ఖండూరీ భర్త కూడా కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహతుడు కావడంతో ఆమె ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నట్లు పలు వర్గాలు భావిస్తున్నాయి. ప్రభుత్వ ఏర్పాటు, ముఖ్యమంత్రి అభ్యర్థిపై…
ఐదు రాష్ట్రాలలో ఘోర పరాజయం అనంతరం ఆదివారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ సమావేశంలో పార్టీ దిద్దుబాటు చర్యలు చేబడుతుందని ఆశించిన వారికి ఆశాభంగం కలిగింది. కనీసం పరాజయంకు నాయకత్వమే కారణమని అంటూ పలువురు సీనియర్ నాయకులు వరుసగా ఇచ్చిన ప్రకటనల గురించి చర్చిస్తారని ఎదురు చూసిన వారికి నిరాశే మిగిలింది. నిరాశాజనకంగా ఫలితాలు రావడానికి తమ వ్యూహంలో లోపమే కారణం అంటూ సర్దిచెప్పుకొంది. చివరకు తాత్కాలిక అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న సోనియా గాంధీ నాయకత్వం పట్ల విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీ పరాజయాలకు నైతిక బాధ్యత వహిస్తూ ఆమెతో పాటు, ఆమె కుటుంభ సభ్యులు (రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ) రాజీనామా చేయబోతున్నట్లు వచ్చిన మీడియా కథనాలను కొట్టిపారవేస్తూ, ఎవ్వరు రాజీనామా చేయడం లేదని స్పష్టం చేసింది. సీడబ్ల్యూసీ సమావేశం అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ‘‘కాంగ్రెస్ పార్టీకి తాత్కాలిక అధినేతగా మరింత కాలం సోనియా గాంధీనే కొనసాగుతారు. మాకందరికీ నాయకత్వం వహించడంతో…
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని పోప్ ఫ్రాన్సిస్ ఆదివారం తీవ్రంగా ఖండించారు. చిన్న పిల్లల ఆసుపత్రులు, సామాన్య ప్రజలపై బాంబులు కురిపించడం ఆటవిక, పైశాచిక చర్య అని తెలిపారు. ఆమోదయోగ్యం కానటువంటి ఈ నరమేధాన్ని దేవుని కోసం ఆపాలని కోరారు. చర్చలపై నిజమైన, నిర్ణయాత్మకమైన దృష్టి పెట్టాలని కోరారు. మానవతావాద నడవ (కారిడార్)లను సమర్థవంతంగా ఏర్పాటు చేయాలని, ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళడానికి అవకాశం కల్పించాలని ఆయన కోరారు. బాలలను, నిరాయుధులను చంపడం ఆటవిక చర్య అని పేర్కొన్నారు. రోమ్‌లోని సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో సండే బ్లెస్సింగ్ సందర్భంగా వేలాది మందిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన ఈ పిలుపిచ్చారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఫిబ్రవరి 24 నుంచి కొనసాగుతోంది. ఉక్రెయిన్ నుంచి లక్షలాది మంది ప్రజలు ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్ళిపోతున్నారు. న్యూయార్క్ టైమ్స్ జర్నలిస్ట్ దుర్మరణం ఉక్రెయిన్‌లోని ఇర్పెన్‌లో రష్యా బలగాలు జరిపిన దాడుల్లో న్యూయార్క్ టైమ్స్ జర్నలిస్ట్ బ్రెంట్ రెనాడ్ దుర్మరణం పాలయ్యారు.…
సామాజిక అంశాలను వెండితెరపై ఆవిష్కరించే దర్శకులలో వివేక్ అగ్నిహోత్రి ఒకరు. ఇదివరకు ఆయన తెరకెక్కించిన ‘ది తాష్కెంట్ ఫైల్స్’ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా 90వ దశకంలో కశ్మీర్ పండిట్లపై సాగిన సాముహిక హత్యాకాండ నేపథ్యంలో డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి రూపొందించిన చిత్రం ‘ది కశ్మీర్ ఫైల్స్’. 1990 దశకంలో యునైటైడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రధాన మంత్రి పదవి కాలంలో కశ్మీర్ లో జరిగిన దారుణ మారణ హింసాకాండకు దృశ్య రూపంగా ‘ది కశ్మీర్ ఫైల్స్’ . అనే సినిమాను దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించారు. 90వ దశకంలో కశ్మీర్ పండితులపై అక్కడి జిహాదిలు చేసిన ఊచకోతకు ప్రతిరూపంగా ఈ సినిమాను తెరకెక్కించారు. మొత్తంగా 90 దశకంలో మన దేశంలోనే శరణార్ధులుగా మారిన కశ్మీర్ పండిత్స్ దీనగాథపై తెరకెక్కిన సినిమా ‘ది కశ్మీర్ ఫైల్స్’ . ఈ చిత్రంలో మిథున్ చక్రబర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్శన్ కుమార్…
దేశంలో “రాజ్యాంగం, మతస్వేచ్ఛ” మరియు “ప్రభుత్వ యంత్రాంగంలోకి ప్రవేశించడానికి ఒక నిర్దిష్ట సమాజం చేస్తున్న విస్తృతమైన ప్రణాళికలు” ముసుగులో దేశంలో “పెరుగుతున్న మతపరమైన మతోన్మాదం” పట్ల ఆర్ఎస్ఎస్ ఆందోళన వ్యక్తం చేసింది. గుజరాత్ లోని కర్ణావతిలో జరుగుతున్న అఖిల భారతీయ ప్రతినిధి సభలో సర్ కార్యవాహ దత్తాత్రేయ హాసభలే సమర్పించిన వార్షిక నివేదికలో “ఈ ముప్పును ఓడించడానికి” “సంఘటిత శక్తితో సంపూర్ణ ప్రయత్నాలకు” పిలుపిచ్చారు. . “దేశంలో పెరుగుతున్న మత ఛాందసవాదపు బలీయమైన రూపం చాలా చోట్ల మళ్లీ తల ఎత్తింది. కేరళ, కర్నాటకలో హిందూ సంస్థల కార్యకర్తల దారుణ హత్యలే ఇందుకు ఉదాహరణ. మతపరమైన ఉన్మాదం, ర్యాలీలు, ప్రదర్శనలు, రాజ్యాంగం, మత స్వేచ్ఛ ముసుగులో సామాజిక క్రమశిక్షణ, ఆచారం, సంప్రదాయాల ఉల్లంఘన, స్వల్ప కారణాలతో హింసను ప్రేరేపించడం, చట్టవ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహించడం మొదలైన దారుణమైన చర్యల పరంపర పెరిగిపోతోంది” అని వార్షిక నివేదిక పేర్కొంది. దీర్ఘకాలిక లక్ష్యాలతో కుట్ర జరుగుతోందని నివేదిక పేర్కొంది, “ప్రభుత్వ యంత్రాంగంలోకి…
2014 మార్చి 14న ప్రారంభమైన జనసేన పార్టీ ఎనిమిదో ఏడాదిలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసే ప్రసంగాన్ని ఆలకించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గం, తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో సభా వేదికను ఏర్పాటు చేస్తున్నారు. సభ కోసం అనుమతులివ్వాలంటూ జనసేన నాయకులు దాదాపు పది రోజులు తిరగగా ఎట్టకేలకు పోలీస్ శాఖ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో దాదాపు ఏడెకరాలలో సభాస్థలిని సిద్ధం చేయడంతోపాటు, సభకు హాజరయ్యే వారి వాహనాల పార్కింగ్ కోసం 18 ఎకరాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. జనసేన ఆవిర్భావ సభకు ఎంతమంది వచ్చినా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. సభా వేదికకు వచ్చే మార్గంలో ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండేందుకు మూడు మార్గాలు సిద్ధం…
కేవలం వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలకు అసెంబ్లీలో ప్రవేశపెట్టే ముందు లాంఛనంగా ఆమోదించడం కోసం రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్‌రెడ్డి పేల్చిన బాంబుతో మంత్రులందరిలో ఆందోళన మొదలైనది. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, పలువురు మంత్రులు పదవులు కోల్పోతారని స్పష్టం చేశారు. అయితే వారికి పార్టీ పనులు అప్పజెబుతామని, ఆ పెదవులని గౌరవంగా భావించాలని హితవు చెప్పారు. వాస్తవానికి మంత్రివర్గం ప్రమాణస్వీకారం సమయంలోనే రెండున్నరేళ్ల తర్వాత సంగం మంది మంత్రులను వారి పనితీరు ఆధారంగా మారుస్తానని చెప్పారు. ఆ తర్వాత మంత్రులందరినీ మార్చబోతున్నట్లు సంకేతం ఇచ్చారు. ఏ కారణం వాళ్లయితేనేమి డిసెంబర్ లో జరుగవలసిన మంత్రివర్గ మార్పులు జరగలేదు. ఆ విషయాన్ని మంత్రులు మరచిపోతున్న సమయంలో ముఖ్యమంత్రి స్వయంగా మంత్రివర్గ సమావేశంలోనే ప్రస్తావించి, త్వరలోనే మీలో చాలామంది పదవులు పోవడం ఖండం అంటూ చెప్పడం కలకలం రేపింది. అయితే వెంటనే ఉండకపోవచ్చని, జూన్ లో ఉండవచ్చనే సంకేతం ఇప్పుడు ఇస్తున్నారు. ఎప్పుడు జరిపినా జగన్ ఆ కసరత్తు…
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బిజెపి నేత దేవేంద్ర ఫడ్నవీస్‌కు ముంబై పోలీసులు నోటీసులు జారీ చేశారు. అక్రమంగా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిన కేసులో తమ ఎదుట హాజరుకావాలని కోరారు. ఈ నోటీసులకు సమాధానం ఇవ్వడంతో పాటు ముంబై పోలీసుల ముందు హాజరు కావాలని కోరింది. మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న ఫడ్నవీస్‌ను ఆదివారం ఉదయం 11 గంటలకు బీకేసీ సైబర్ పోలీస్‌స్టేషన్‌లో హాజరై వాంగ్మూలం ఇవ్వాలని సూచించారు. ఐపీఎస్ అధికారి రష్మీ శుక్లా రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగానికి నేతృత్వం వహిస్తున్న సమయంలో అక్రమ ఫోన్ ట్యాపింగ్‌పై నమోదైన కేసులో ఫడ్నవీస్ సాక్షి అని రాష్ట్ర ప్రభుత్వం గతంలో కోర్టుకు తెలిపింది. ఆ నోటీసును ఆయన ట్వీట్ లో షేర్ చేశారు. కాగా, తనకు పోలీసులు నోటీసులు జారీ చేయడం పట్ల మహారాష్ట్ర ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. బదిలీ పోస్టింగ్ స్కాంపై రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలలుగా ఏమీ చేయకపోవడం తనను ఆశ్చర్యపరిచిందని తెలిపారు. మహరాష్ట్ర ప్రభుత్వం చర్యల్లో తప్పులను బయటపెట్టినందుకే తనకు నోటీసులు అందాయని ఆరోపించారు. …
పంజాబ్‌లో అనూహ్య విజయం సాధించిన సంబరాలలో ఉన్న ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్) ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు వ్యాపించి, జాతీయ పార్టీగా ఎదగడం కోసం ముమ్ముర ప్రయత్నాలు చేస్తున్నది. గతంలోనే దేశవ్యాప్తంగా పార్టీ విభాగాలు ఏర్పాటు చేసి, ఎన్నికలలో పోటీ చేసినా ఢిల్లీ, పంజాబ్ లలో మినహా ఎక్కడ ప్రభావం చూపలేక పోయింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ చతికలపడటంతో ఆ స్థానం ఆక్రమించడం కోసం వ్యూహాత్మకంగా సొంతంగా ఎదగాలని అడుగులు వేస్తున్నది. ఇతర పార్టీలతో పొత్తులకు సిద్దపడటం లేదు. అందుకనే పంజాబ్ లో ఆ పార్టీ అఖండ విజయం సాధించినా ప్రత్యర్ధులైన ప్రధాని, కాంగ్రెస్ నేతలు అభినందించారు గాని ప్రతిపక్ష నేతలైన మమతా బెనర్జీ, కేసీఆర్, ఎంకే స్టాలిన్ వంటి వారెవ్వరూ అభినందిస్తూ ట్వీట్ కూడా ఇవ్వలేదు. కనీసం కేరళ సీఎం విజయన్ కూడా ఆభినందించలేదు. మొదటగా డిసెంబర్ లో ఎన్నికలు జరిగే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లపై ద్రుష్టి సారించిన, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో పట్టుకోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. గతంలో…