పార్లమెంటు, శాసనసభలతోపాటు అన్ని చట్టసభలు తరచుగా సమావేశమవుతూ నవభారత నిర్మాణానికి అవసరమైన విధంగా నిర్మాణాత్మకమైన బాటలు వేయాల్సిన అవసరం ఉందని భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పిలుపిచ్చారు. దీనికితోడు చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని మరింతగా పెంచడం, ప్రజాప్రయోజనాలతో ముడిపడిన అంశాలపై విస్తృతమైన చర్చలు జరపడం తదితర అంశాలపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. మిజోరం అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తూ శాసనసభ సమావేశాలను సరైన సమయంలో నిర్వహిస్తూ, సరైన అంశాలపై చర్చోపచర్చలు నిర్వహించాలని చెప్పారు. ప్రతి సమావేశం తర్వాత నిర్మాణాత్మకమైన నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్లాలని పేర్కొన్నారు. దేశ స్వాతంత్యానికి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఆజాదీకా అమృత్ మహోత్సవాలను ఘనంగా జరుపుకుంటూనే.. ఈ సందర్భంగా మన ఘనమైన ప్రజాస్వామ్య వారసత్వాన్ని మరింత బాద్యతగా ముందుకు తీసుకెళ్లేందుకు మహాసంకల్పాన్ని తీసుకోవాలని సూచించారు. నవభారత నిర్మాణమే లక్ష్యంగా ప్రతి ప్రజాప్రతినిధి ఆలోచించాలని చెబుతూ ఈ దిశగా పునరంకితం కావాలని కోరారు. చట్టసభల్లో మహిళల సంఖ్య తక్కువగా ఉన్న విషయాన్ని…
Author: Editor's Desk, Tattva News
ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కీలకమైన యుపితో సహా నాలుగు రాష్ట్రాల్లో బిజెపి తిరిగి గెలుపొందింది. పంజాబ్ లో 117 సీట్లకు గాని 92 సీట్లు గెలుపొంది ఆప్ సంచలనం సృష్టించింది. అంతర్గత కుమ్ములాటల్లో కూరుకుపోయిన కాంగ్రెస్ పంజాబ్, ఉత్తర ప్రదేశ్‌లలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. యుపిలో బిజెపిని ఢ కొట్టిన సమాజ్‌వాది పార్టీ 124 స్థానాలు సాధించింది. ఓట్ల శాతాన్ని బాగా పెంచుకుంది. మొత్తం 403 అసెంబ్లీ స్థానాలున్న యుపిలో బిజెపి కూటమి 274 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్-2, బిఎస్పీ ఒక స్థానం సాధించాయి. పంజాబ్‌లో ఆప్ ప్రభంజనానికి కాంగ్రెస్, అకాలీదళ్ ఎదురు నిలవలేకపోయాయి. పంజాబ్ ముఖ్యమంత్రి చన్నీ తాను పోటీ చేసిన రెండు చోట్ల పరాజయం పాలయ్యారు. ఒక రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించి, మరో రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవడం ద్వారా దేశ రాజకీయాల్లోనే ఆప్ సంచలనం సృష్టించింది. పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ కూడా ఓటమి…
మనం పాశ్చాత్య దేశాలలో మాత్రమే వింటుండే మానవ పాల బ్యాంకులు ఇప్పుడు భారత దేశంలో కూడా వ్యాపిస్తున్నాయి. ఒడిశాలో మొట్టమొదటి మానవ పాల బ్యాంకును భువనేశ్వర్‌లోని క్యాపిటల్ హాస్పిటల్‌లో ప్రారంభించారు. తల్లులు తల్లిపాలు పట్టలేని నవజాత శిశువులకు, అలాగే తల్లులు మరణించిన, అనారోగ్యంతో ఉన్న లేదా తగినంత పాలు అందని శిశువులకు.. లేదా వారి తల్లుల పాలు పీల్చుకోలేని శిశువులకు ఈ తల్లి పాలను సరఫరా చేయడం కోసం దీనిని ఏర్పాటు చేశారు. పాశ్చరైజేషన్ తర్వాత పాలను ఆరు నెలల వరకు బ్యాంకులో ఉంచవచ్చని క్యాపిటల్ హాస్పిటల్ డైరెక్టర్ ఎల్‌డి సాహూ చెప్పారు. నిల్వ చేసిన పాలను మొదట ఇంట్లోనే శిశువులకు ఇస్తారు. ఇతర కేంద్రాలలో ఇలాంటి సౌకర్యాలను ప్రారంభిస్తున్నట్లు ఆయన చెప్పారు. అత్యాధునిక మిల్క్ బ్యాంక్.. తల్లుల పాలలోని పోషక విలువలను సంరక్షిస్తుందని భరోసా ఇచ్చారు. 19 మంది పాలిచ్చే తల్లులు తమ పాలను బ్యాంకు ఆపరేషన్ ప్రారంభించిన మొదటి రోజున…
కేరళ ముఖ్యమంత్రిగా, కేంద్ర రక్షణ మంత్రిగా, కాంగ్రెస్ లో కీలక నేతగా పలు దశాబ్దాలుగా క్రియాశీలంగా వ్యవహరిస్తున్న ఏకే ఆంటోనీ (81) ఇక తాను ఎన్నికల రాజకీయాలకు, ఢిల్లీకి దూరం కానున్నట్లు ప్రకటించారు. ఆ మేరకు పార్టీ అధినేత సోనియా గాంధీ, కేరళ కాంగ్రెస్ కమిటీకి తెలిపారు. ఆయన రాజ్యసభ సభ్యత్వం ఏప్రిల్ 2 నాటికి ముగుస్తుంది. తిరిగి రాజ్యసభకు ఎన్నిక కావడానికి కేరళలో కాంగ్రెస్ కు బలం ఉన్నప్పటికీ, తాను పోటీచేయబోనని స్పష్టం చేశారు. ఆ విధంగా 52 ఏళ్ళ క్రియాశీల రాజకీయాలకు స్వస్తి చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఇక నుండి తిరువనంతపురంలోని ఉంటానని తెలిపారు. కాంగ్రెస్ విద్యార్థి, యువజన విభాగాల నేతగా ఉంటూ 1970లో మొదటిసారిగా రాష్ట్ర శాసనసభకు ఎన్నికై ఐదు సార్లు ఎమ్యెల్యేగా పనిచేశారు. ఈ సమయంలో మూడు సార్లు కేరళ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. పదేళ్ల పాటు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్నారు. ఐదు సార్లు రాజ్యసభకు ఎన్నికైన ఆయన మూడు సార్లు కేంద్ర…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, గవర్నర్ బిఎస్ కోషియార్ ల మధ్య పలు అంశాలపై విభేదాలను ప్రస్తావిస్తూ. రాష్ట్రంలోని ఇద్దరు అత్యున్నత రాజ్యాంగ అధికారులు “ఒకరినొకరు విశ్వసించకపోవడం” “దురదృష్టకరం” అని బాంబే హైకోర్టు విచారం వ్యక్తం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపాంకర్ దత్తా, న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్. కార్నిక్ వీరిద్దరూ (సీఎం, గవర్నర్) కలిసి కూర్చుని తమ విభేదాలను పరిష్కరించుకోవడం సముచితమని సూచించారు. మహారాష్ట్ర శాసనసభ స్పీకర్ ఎంపిక ప్రక్రియను సవాల్ చేస్తూ న్యాయవాదులు మహేష్ జెఠ్మలానీ, సుభాష్ ఝా ద్వారా దాఖలు చేసిన రెండు పిల్‌లపై విచారణ సందర్భంగా కోర్టు మౌఖిక పరిశీలనలు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ద్వారా హామీ ఇవ్వబడిన చట్టం ముందు సమానత్వానికి పౌరుల ప్రాథమిక హక్కును ఈ ప్రక్రియ ఉల్లంఘించదని పేర్కొంటూ, సుదీర్ఘ విచారణ తర్వాత హైకోర్టు పిటిషన్లను తోసిపుచ్చింది. రెండు పిల్‌లలో ఒకదానిలో బిజెపి ఎమ్మెల్యే గిరీష్ మహాజన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న జెఠ్మలానీ, ప్రస్తుత విధానం-2021 డిసెంబర్‌లో ముఖ్యమంత్రి…
రష్యాకు చెందిన ఆయిల్ దిగుమతులపై పలు దేశాలు ఆంక్షలు విధిస్తుండడంతో, దీనిని సాకుగా తీసుకొని ఆ దేశంలోని గ్యాస్ వంటి సహజవనరుల సంస్థలలో పెట్టుబడులు కొనడం, పెంచే అంశాలను చైనా పరిశీలిస్తోందని బ్లూమ్‌బర్గ్ మీడియా తెలిపింది. రష్యన్‌లోని ప్రధాన గ్యాస్ ఎగుమతి దారు గాసోప్రోమ్, అల్యూమినియం ఉత్పతిదారు రుసల్ సంస్థలలో చైనా ప్రత్యేకంగా పెట్టుబడులు పెట్టేందుకు యత్నిస్తోందని తెలిపింది. చైనా నేషనల్ పెట్రోలియం కార్పోరేషన్, చైనా పెట్రోకెయికల్ కార్పోరేషన్, అల్యూమినియం కార్పోరేషన్ ఆఫ్ చైనా, చైనా మినరల్స్ కార్పోరేషన్ సంస్థలతో పెట్టుబడులకు సంబంధించి రష్యా ప్రతినిధులు చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం చర్చలు ప్రారంభదశలో ఉన్నాయని, అయితే చైనీస్, రష్యా ఇంధన సంస్థల మధ్య ఇప్పటికే చర్చలు ప్రారంభమయ్యాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా చేపడుతున్న సైనిక దాడుల నేపథ్యంలో పలు పశ్చిమ దేశాలు గత కొన్ని రోజులుగా రష్యాపై ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే. అమెరికాకు దిగుమతయ్యే…
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ముందు రోజున ఎన్నికల్లో ఉపయోగించిన ఎలెక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలలో (ఇవిఎంలు) అవకతవకలు చోటుచేసుకుంటున్నాయని సమాజ్‌వాది పార్టీ ఆరోపించింది. దానితో, ఇవిఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూము వెలుపల సమాజ్‌వాది పార్టీ కార్యకర్తలు పహరాను ముమ్మరం చేశారు. ఇవిఎంలను రవాణా చేసే ప్రక్రియలో ప్రొటోకాల్‌ను పాటించలేదని ఒక అధికారి ఒప్పుకున్న వీడియోను ఆ పార్టీ తన ట్విటర్ హ్యాండిల్‌లో అప్‌లోడ్ చేసింది. ఇవిఎంలు ట్యాంపరింగ్ అయ్యే అవకాశం లేకపోలేదని కూడా ఆ అధికారి ఆ వీడియోలో అంగీకరించారు. అనేక జిల్లాలలో ఇవిఎంలలో అక్రమాలు చేసుకున్నట్లు తమకు ఫిర్యాదులు అందుతున్నాయని, ఇవి ఎవరి ఆదేశాల మేరకు జరుగుతున్నాయని సమాజ్‌వాది పార్టీ తన ట్వీట్‌లో ప్రశ్నించింది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అధికారులపై ఒత్తిడి వస్తోందా? దీనికి ఇసి దయచేసి వివరణ ఇవ్వాలి అంటూ ఆ పార్టీ నిలదీసింది. అయితే ఇదంతా ఓటమిని ముందే గ్రహించి, అందుకు సాకు వెతుక్కోవడమే అని బిజెపి నేతలు…
వైసిపి వేయి రోజుల పాలనపై ఎపి టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, చినరాజప్ప, నక్కా ఆనందబాబు, దీపక్ రెడ్డి, అశోక్ బాబులు “వేయి రోజుల పాలన.. వేయి తప్పిదాలు” అంటూ ఛార్జ్ షీట్ విడుదల చేశారు. సీఎం జగన్ 1000 రోజుల పాలనలో వెయ్యి తప్పులంటూ.. పుస్తకంతోపాటు విధ్వంస పాలనలో 1000 నేరాలు, ఘోరాలు, లూటీలు, అసత్యాలు పేరిట టిడిపి ప్రజా ఛార్జ్ షీట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ”అశుభంతో పరిపాలన ప్రారంభించిన ముఖ్యమంత్రి చరిత్రలో జగన్ ఒక్కరే. సమస్యల పరిష్కారానికి నిర్మించిన ప్రజావేదిక కూల్చివేతతో పాలన ప్రారంభించారు. ప్రాంతీయ విద్వేషాల కోసమే మూడు రాజధానులు నిర్ణయం తీసుకున్నారు” అని ఆరోపించారు. మూడు రాజధానుల నిర్ణయంతో 135 సంస్థలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయి. రూ.2 లక్షల కోట్ల సంపద కలిగిన అమరావతిని నాశనం చేశారు. ఎప్పుడూ లేని విధంగా దేవాలయాలపై దాడులకు తెగబడ్డారు. మూడేళ్ల జగన్ పాలనలో అన్నీ…
తన ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేయడం లేదని ప్రతిపక్షాలు, ముఖ్యంగా బిజెపి తరచూ విమర్శలు, ఆందోళనలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నేడు రాష్ట్ర శాసనసభలో 91,142 ఉద్యోగాల భర్తీ ప్రక్రియను నేటి నుండే ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. 11,103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరిస్తామని, 80,039 ఉద్యోగాలకు ఇవాళ్టి నుంచే నోటిఫికేషన్ ఇస్తామని, ఇక నుంచి 95 శాతం స్థానికులకే ఉద్యోగాలని కూడా ప్రకటించారు. లక్షా 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు. 22 వేల ఉద్యోగుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని, లక్షా 56 వేల ఉద్యోగాలను నోటిఫై చేశామని వివరించారు. అటెండర్ నుంచి ఆర్డీవో వరకు స్థానికులకే అవకాశమని కేసీఆర్ చెప్పారు. ఇందులో గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4 పోస్టులతోపాటు జిల్లాలు, జోనల్, మల్టీజోనల్, సెక్రటేరియట్, హెచ్‌ఓడీలు, వర్సిటీల్లోని పోస్టులను భర్తీ చేస్తున్నట్లు సిఎం కెసిఆర్ చెప్పారు. వీటిలో జిల్లాల్లో మొత్తం 39,829 పోస్టులు ఉన్నాయి. రాష్ట్రంలో గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4 పోస్టులను భర్తీ చేస్తున్నామని సిఎం కెసిఆర్ ప్రకటించారు. శాశ్వత ప్రతిపాదికన తెలంగాణ నిరుద్యోగులకు న్యాయం…
ఉక్రెయిన్ వివాదం ఇతర దేశాలతో పాటు భారతదేశంపై ఆర్ధిక, రక్షణ పరమైన పలు సవాళ్ళను విసురుతున్నప్పటికీ తీవ్ర పరిణామాలను కలిగి ఉన్నప్పటికీ, యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి మన దేశ సరిహద్దులు శాంతియుతంగా ఉన్నాయి. ఒకవైపు భారత్, చైనాల మధ్య, మరో వైపు భారత్, పాకిస్థాన్ బలగాల మధ్య ఉద్రిక్తతలు కనిపించడం లేదు. రష్యా-ఉక్రెయిన్ వివాదంపై ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ వేదికలపై సహితం ఈ మూడు దేశాలు మొదటిసారిగా దాదాపు ఒకే విధమైన వైఖరిని అవలంభిస్తున్నాయి. మూడు దేశాలు కూడా రష్యా పట్ల పరోక్షంగా సానుభూతి చూపుతున్నాయి. ఈ వివాదం కారణంగా అంతర్జాతీయ విషయాలపై భారతదేశం, చైనా , పాకిస్తాన్ దగ్గరవుతున్నాయా? న్యూఢిల్లీ. బీజింగ్ ల మధ్య రెండు దేశాల సేనలు గాల్వాన్ లోయలో ఘర్షణలు తలబడి, 20 మంది భారతీయ సైనికులు, కనీసం 38 మంది చైనా సైనికులు మరణించిన తర్వాత జూన్ 2020 సరిహద్దు ఉద్రిక్తలు నెలకొనడం తెలిసిందే. ఉద్రిక్తల నివారణకు రెండు దేశాల సైనికుల…