ఉద్గారాల పెరుగుదల ప్రస్తుత స్థాయిలో కొనసాగితే, ఉష్ణ్నోగత 30 డిగ్రీల సెల్సియస్ దాటి పోయి దేశంలో పలు ప్రాంతాలు ప్రమాదంలో పడతాయని ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ (ఐపిసిసి) తాజా నివేదిక హెచ్చరించింది. లక్నో, పాట్నాలలో ఉష్ణ్నోగత 35 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోవచ్చనని నివేదిక అంచనా వేసింది. అలాగే, భువనేశ్వర్, చెన్నై, ముంబై, ఇండోర్, అహ్మదాబాద్‌లో ఉష్ణోగ్రతలు 32-34 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకునే ప్రమాదం ఉన్నట్లు గుర్తించింది. మొత్తం మీద, అస్సాం, మేఘాలయ, త్రిపుర, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ చాలా తీవ్రంగా ప్రభావితమవుతాయి. ఉద్గారాల పెరుగుదల ప్రస్తుత స్థాయిలోనే కొనసాగితే ఈ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటాయని నివేదిక అంచనా వేసింది. సున్నితంగా ఉండే పర్యావరణ శాస్త్రం కారణంగా వాతావరణంలో స్వల్ప మార్పు కూడా హిమాలయ ప్రాంతంపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతుంది. ఈ సంవత్సరం హిమాచల్, ఉత్తరాఖండ్‌లో…
Author: Editor's Desk, Tattva News
ఉక్రెయిన్‌లో మరో భారతీయ విద్యార్థి మృతి చెందాడు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన 22 ఏళ్ల చందన్ జిందాల్… అనారోగ్యం కారణంగా చనిపోయాడు. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న భీకర దాడులతో కొందరు భారత విద్యార్థులు అక్కడ చిక్కుకున్నారు. ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి తిరిగి రాలేకపోతున్నారు. ముఖ్యంగా తూర్పు ఉక్రెయిన్‌లో ఉన్నవారి పరిస్థితి దయనీయంగా మారింది. ఈ క్రమలోనే పంజాబ్‌లోని బర్నాలాకు చెందిన చందన్ జిందాల్ (22) ఇవాళ అనారోగ్యంతో మృతి చెందినట్లు తెలుస్తోంది. అతనికి రక్తం గడ్డ కట్టడంతో వెంటనే సమీప హాస్పిటల్‌కు తీసుకెళ్ళారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. చందన్ విన్నిట్సియాలో నేషనల్ పైరోగవ్ మెమోరియల్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. విన్నిట్సియాలో నాలుగేళ్లుగా చదువుతున్నాడు. ఫిబ్రవరి 2న అనారోగ్యానికి గురవ్వడంతో అతనికి శస్త్ర చికిత్స చేశారు. ఫిబ్రవరి 7న అతని తండ్రి శిషన్ కుమార్, మామ కృష్ణకుమార్ అతనితో కలిసి ఉక్రెయిన్ వెళ్లారు. చందన్ మంగళవారం మృతి చెందినట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. నిన్న రష్యా చేసిన…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై రాజకీయ పోరాటంకై బిజెపియేతర పక్షాలను సమీకరించే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ద్వారా జాతీయస్థాయి దృష్టి ఆకర్షించాలని నిర్ణయించారని తెలుస్తున్నది. నేరుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలోనే ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి సిద్ధపడుతున్నట్లు చెబుతున్నారు. రెండు రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన ఆయన ఈ నెల 4న వారణాసిలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఎన్సీపీ అధినేత శరద్ పవర్ వంటి హేమాహేమీలతో కలసి సమాజవాద్ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూటమికి మద్దతుగా ప్రచారం చేయనున్నట్లు తెలిసింది. ఏడు దశలలో ఎన్నికలు జరుగుతున్న ఉత్తర ప్రదేశ్ లో చివరిదశ అయిన మార్చ్ 7న వారణాసిలో ఎన్నికలు జరుగనున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహితం అక్కడనే మూడు రోజులకు ఎన్నికల ప్రచారం కోసం మకాం వేస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏరాటు దిశగా ఈ మధ్య కేసీఆర్ …
(ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఇంటర్వ్యూ మొదటి భాగం) బిజెపి వరుస ఎన్నికల విజయాల వెనుక ప్రధాన వ్యూహకర్త, కేంద్ర హోం మంత్రి, బిజెపి మాజీ అధ్యక్షుడు అమిత్ షా ఐదు రాష్ట్రాలకు, ముఖ్యంగా యుపి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అడుగడుగునా నిమగ్నమై ఉన్నారు. గత సారి బీజేపీ యుపిలో అఖండ విజయం సాచించేటట్లు చేసిన ఘనత ఆయనదే. మొదటి దశలో కొన్ని అవాంతరాల మధ్య ఆయన బాధ్యతలు చేపట్టారు. యుపిలో మళ్లీ విజయం సాధిస్తామన్న నమ్మకం, కేంద్రం-రాష్ట్ర సంబంధాలు, పార్టీని వీడుతున్న నేతలు, ఉద్యోగాల వంటి ఓటర్ల ఆందోళనలపై అమిత్ షా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడారు. ప్రశ్న: 2017లో, మీరు ఉత్తరప్రదేశ్‌లో బిజెపి ప్రచారానికి నాయకత్వం వహించినప్పుడు, అధికారంలో ఉన్న అఖిలేష్ యాదవ్‌కు వ్యతిరేకంగా ప్రధాని నరేంద్ర మోదీ సందేశం ఇచ్చారు. నేడు, యోగి ఆదిత్యనాథ్‌కు ఐదేళ్లుగా అఖిలేష్ యాదవ్ సవాలుగా ఉన్నారు. ఇది మీకు ఎంత భిన్నంగా ఉంటుంది? అమిత్ షా:…
ఉక్రెయిన్‌నుంచి పొరుగుదేశాలకు వలస వెళ్లిన భారతీయులను వెనక్కి తీసుకు రావడం కోసం ప్రభుత్వం రాబోయే మూడు రోజుల్లో 26 ప్రత్యేక విమానాలను నడుపుతుందని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా చెప్పారు. ఉక్రెయిన్‌నుంచి భారతీయులను తీసుకువచ్చే అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ శ్రింగ్లా ఈ విషయం తెలిపారు. ప్రభుత్వం తొలి అడ్వైజరీ జారీ చేసిన సమయంలో ఉక్రెయిన్‌లో దాదాను 20 వేల మంది భారతీయులు ఉన్నట్లుగా అంచనా వేశాం. వీరిలో దాదాపు 12 వేల మంది ఉక్రెయిన్ వదిలి వెళ్లారు. అంటే ఉక్రెయిన్‌లో ఉన్నం మొత్తం భారతీయుల్లో ఇది 60 శాతం అని హర్షవర్ధన్ చెప్పారు. కాగా, ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల్లో 616 మంది నాలుగో రోజు స్వదేశానికి చేరుకున్నారు. రొమేనియా రాజధాని బుచారెస్ట్, హంగేరీ రాజధాని బుడపెస్ట్ నుంచి ఇండిగో, టాటా గ్రూప్ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ లకు చెందిన…
గతంలో ఎటువంటి రాజకీయ అనుభవం లేకుండానే కామెడీ నటుడిగా ఉంటూ నేరుగా దేశ అధ్యక్ష పదవి స్వీకరించడంతో పాటు, ఇప్పుడు ఎటువంటి సైనిక అనుభవం లేకుండానే ప్రపంచంలో పెద్ద సైన్యములలో ఒకటైన రష్యా సేనలతో ముందుండి వీరోచితంగా పోరాడుతూ, రష్యా సేనలకు తీవ్ర ప్రతిఘటన ఇస్తున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ హత్యకు రష్యా కుట్ర పన్నిందా? అందుకోసం కిరాయి గుండాలను సిద్ధంగా ఉంచిందన్న వార్త ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. వారంతా ప్రత్యేకంగా శిక్షణ పొందారని ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ కథనం వెలువరించింది. వారంతా వాగ్నర్ గ్రూప్ గా చెప్పుకుంటోన్న ఒక ప్రైవేటు మిలిషియాకు చెందినవారిగా పేర్కొంది. ఆ బృందాన్ని ఆఫ్రికా నుంచి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. జెలెన్ స్కీతో సహా 23 మంది ప్రభుత్వ పెద్దల్ని హత్యచేసేందుకు రష్యా అధ్యక్షుడు ప్రతిన్ నుంచి ఆ బృందానికి ఆదేశాలున్నట్లు కథనం పేర్కొంది. వాగ్నర్ గ్రూపు పుతిన్ సన్నిహితుడు ఒకరు నిర్వహిస్తుండడం మరింత అనుమానాలకు తావిస్తోంది. ఆ…
విద్యతోపాటు ఉన్నతవిలువలను ఒంటబట్టించుకున్నప్పుడే విద్యార్థులు వారి జీవితాల్లో విజయాలు సాధింగలరని గౌరవ భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు దిశానిర్దేశం చేశారు. వీటితోపాటు క్రమశిక్షణ, చిత్తశుద్ధి, నైతికత, దేశభక్తి పెంపొందించుకోవడం ద్వారా ఉన్నతస్థానాలకు చేరుకోగలమని ఆయన చెప్పారు. గుంటూరులోని శ్రీ పాటిబండ్ల సీతారామయ్య ఉన్నతపాఠశాల వజ్రోత్సవ వేడుకలలో పాల్గొంటూ సమాజం, దేశ పురోగతికోసం విద్యార్థులకు సరైన విద్యనందించడం బలమైన పునాదులు వేస్తుందని పేర్కొన్నారు. విద్య వ్యక్తిని విజ్ఞానవంతుడిగా చేయడంతోపాటు సమాజం పట్ల బాధ్యత కలిగిన పౌరునిగా మలుస్తుందని తెలిపారు. ‘వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దని విద్య నిరుపయోగమైనద’న్న మహాత్మాగాంధీ మాటలను ఉపరాష్ట్రపతి గుర్తుచేస్తూ ఈ దిశగా ఉపాధ్యాయులు పోషించే పాత్ర అత్యంత కీలకమైనదని కొనియాడారు. విద్యలోని పరమార్థాన్ని అర్థం చేసుకోకుండా, కేవలం మార్కుల కోసం, సర్టిఫికెట్ల కోసం చదవడం వల్ల, చదువు విలువ ఉండదని స్పష్టం చేశారు. దేశానికి నాయకత్వం వహించే సమాజాన్ని తయారు చేయడమే లక్ష్యంగా, యువతకు జాతీయ భావాలు నూరిపోసి, నైపుణ్యం, లక్ష్యం, చిత్తశుద్ధి ఉన్న…
గతంలో అలీన విధానంకు నేతృత్వం వహిస్తున్న సమయంలో సహితం భారత్ అంతర్జాతీయ వ్యవహారాలలో సోవియట్ యూనియన్ కూటమి వైపు మొగ్గు చూపుతున్నట్లు వ్యవహరిస్తుండెడిది. సాధారణంగా అమెరికా ఎత్తుగడలకు వ్యతిరేకంగా నిలబడుతూ ఉండెడి. అయితే మొదటిసారిగా, ఉక్రెయిన్ సంక్షోభం భారత్ ను ఎటూ మొగ్గు చూపకుండా `మధ్యస్థం’గా ఉండే పరిస్థితి కల్పిస్తున్నది. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యలపై చర్చకు ఐరాస సాధారణ అసెంబ్లీ ‘అరుదైన అత్యవసర ప్రత్యేక సమావేశం’ కోసం భద్రతా మండలిలో జరిగే ఓటింగ్‌కు దూరంగా ఉండాలని భారత్ నిర్ణయించింది. వారంలో ఓటింగ్ కు దూరమవడం ఇది రెండోసారి. జనరల్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటుపై ఓటింగ్‌కు భద్రతామండలి ఆదివారం సమావేశమైంది. ఈ ఓటింగ్‌కు భారత్, చైనా, యుఎఇ దూరంగా ఉండగా రష్యా వ్యతిరేకంగా ఓటు వేసింది. ఇతర 11 సభ్యదేశాలు (ఆల్బేనియా, బ్రెజిల్, ఫ్రాన్స్, గబాన్, ఘనా, ఐర్లాండ్, కెన్యా, మెక్సికో, నార్వే, బ్రిటన్, అమెరికా) అనుకూలంగా ఓటు వేశాయి. 40 ఏళ్ళ…
ఉక్రెయిన్‌లోని ఖార్కీవ్ రష్యా జరిపిన దాడుల్లో భారతీయ పౌరుడు ఒకరు ప్రాణాలు కోల్పోయారని కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్ బాగ్చీ ట్విట్టర్‌లో వెల్లడించారు. మృతుడు కర్ణాటకలోని హవేరి జిల్లా వాసి నవీన్ శేఖరప్పగా గుర్తించి, వారి కుటుంబానికి సమాచారం అందించారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. తాజా ఘటన నేపథ్యంలో కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి స్పందిస్తూ భారత్‌లోని ఉక్రెయిన్, రష్యా రాయబారులతో ఆయన మాట్లాడారు. ఖార్కీవ్‌తో సహా ఇతర నగరాలలోని భారతీయులకు రక్షణ కల్పించాలని రెండు దేశాలను కోరారు. పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని, ముఖ్యంగా ఉక్రెయిన్ రాజధాని, దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న భారతీయులు వెంటనే ఆ ప్రాంతాలను వీడాలని భారత్ రాయబార కార్యాలయం హెచ్చరికలు జారీచేసింది. నవీన్ ఉక్రెయిన్‌లో మెడిసిన్ నాల్గవ సంవత్సరం చదువుతున్నాడు. ఉదయం సూపర్ మార్కెట్ ముందు నవీన్ ఉండగా బాంబు దాడి జరిగింది. తీవ్రగాయాలతో నవీన్ మృతిచెందినట్లు కేంద్ర విదేశాంగ శాఖ…
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆత్మకథను “ఉంగలిల్ ఒరువన్” (మీలో ఒకరు) పేరుతో సోమవారం చెన్నైలో విడుదల చేస్తూ, జమ్మూ కాశ్మీర్ “స్నాచింగ్” (లాక్కొంటుంది) చేస్తోందని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఒక రాష్ట్రంగా దాని అధికారాలను స్వాధీనం చేసుకొని, కేంద్ర పాలిత ప్రాంతంగా కుదించి, దానిని ఇప్పుడు ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లకు చెందిన బ్యూరోక్రాట్‌లను పాలించేలా చేసిందని ఆయన ఆరోపించారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా, బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమం కేవలం పుస్తక ఆవిష్కరణ కోసమే అయినప్పటికీ బిజెపి వ్యతిరేక ప్రతిపక్షాల సదస్సుగా మారింది. అయితే బిజెపిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బనెర్జీ, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావులు మాత్రం గైర్హాజరయ్యారు. ప్రస్తుతం రాహుల్ గాంధీతో వేదిక పంచుకోవడం ఇష్టం లేకనే రాలేకపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. “నేడు విభజన వాదుల నుండి భారత…