Author: Editor's Desk, Tattva News

ఉత్తర ప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో బిజెపిని గద్దె దింపి, అధికారం చేపట్టాలని తీవ్ర ప్రయత్నం చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి, సమాజవాద్ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ ప్రధాన ప్రచారకర్త, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో `వ్యూహాత్మక పొత్తు’ పెట్టుకున్నట్లు తెలుస్తున్నది. 2017 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నప్పటికీ ప్రయోజనం లేకపోవడం, రెండు పార్టీల మధ్య ఓట్ల బదిలీ జరగక పోవడంతో ఈ పర్యాయం అఖిలేష్ వ్యూహాత్మకంగా అధికారికంగా పొత్తులేకుండా కాంగ్రెస్ తో తెరవెనుక అవగాహనకు వచ్చిన్నట్లు చెబుతున్నారు. తద్వారా కాంగ్రెస్ కూడా లాభపడవచ్చని ప్రియాంక భావిస్తున్నారు. గత ఏడాది ఒక విమాన ప్రయాణంలో అఖిలేష్, ప్రియాంక కలుసుకొని, పరస్పరం పలకరించుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సందర్భంగా రెండు పార్టీల మధ్య తిరిగి పొత్తు ఉంటుందా అని మీడియా ప్రశ్నించినప్పుడు “భవిష్యత్ లో ఏమి జరుగుతుందో యెట్లా చెప్పగలం?” అంటూ ఆమె నర్మగర్భంగా సమాధానం ఇవ్వడం గమనార్హం. …

Read More

వైసీపీ పాదయాత్ర చేసింది మటన్, చేపలు అమ్ముకోవడానికా? అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. పాదయాత్రలో మత్స్యాకారులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.వైసీపీకి అధికారం ఇచ్చింది మటన్ కొట్లు, చికెన్ కొట్లు నడపమని కాదని పవన్ కళ్యాణ్ హితవు చెప్పారు. నరసాపురంలో జనసేన పార్టీ నిర్వహించిన మత్య్సకారుల అభ్యున్నతి సభలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న లక్షన్నర మంది మత్స్యకారులకు గుదిబండగా మారిందని పవన్ విమర్శించారు.దోపిడి చేసే చట్టాలను పాటించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. జనసేనకు కనీసం 10 మంది ఎమ్మెల్యేలు ఉండి ఉంటే 217 జీవో వచ్చేది కాదని స్పష్టం చేశారు. 217 జీవో పేపర్లను చింపేసిన పవన్.. మత్స్యకారుల కోసమే ఈ పనిచేశానని చెప్పారు. జీవోను చించినందుకు తనను జైలుకు పంపితే వెళతానని చెప్పారు. చట్టాలను తాను నమ్ముతానని కానీ ఇబ్బంది పెట్టే చట్టాలను ఉల్లంఘిస్తానని వెల్లడించారు. చిన్న వలతో సముద్రంలోకి వెళ్లేందుకు ఎంతో ధైర్యం ఉండాలన్న పవన్.. వారి సాహసమే తనకు స్ఫూర్తి అని తెలిపారు. లేని సమస్యలను…

Read More

దేశంలో గుణాత్మక అభివృద్ధి జరగాలంటే ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అవసరమని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు,  మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే పిలుపిచ్చారు. ప్రాంతీయ పార్టీలు అన్ని కలసి అటువంటి వేదికను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ విషయమై త్వరలో ప్రాంతీయ పార్టీల సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.  స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటినా ఏ రంగంలో కూడా చెప్పుకోదగ్గ ప్రగతి సాధించలేక పోయామని విచారం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాల వైఫల్యాలే ఇందుకు కారణమని చెబుతూ  దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఆసనుమైందని వారిద్దరూ పేర్కొన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ వైఫల్యాలు, రాజకీయ దాడులకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే ప్రయత్నంలో కెసిఆర్‌ ఆదివారం ముంబయిలో మహారాష్ట్ర సిఎం ఉద్దవ్‌ ఠాక్రేతో సమావేశమయ్యారు.  కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మతం, భాష, దేశభక్తి ముసుగులో చేస్తోన్న అరాచకాల నుంచి దేశాన్ని రక్షించుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడిందని కెసిఆర్‌ చెప్పారు. రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం…

Read More

కర్ణాటకలో చెలరేగిన హిజాబ్ వివాదం అధికారంలో ఉన్న బీజేపీకన్నా ప్రతిపక్ష కాంగ్రెస్ ను ఎక్కువగా ఇరకాటంలో పడవేసిన్నట్లు కనిపిస్తున్నది. ఈ విషయమై ఏమి మాట్లాడినా చివరకు బీజేపీకే ప్రయోజనం చేకూరుతుందనే సందిగ్ధలో పడ్డారు.  అందుకనే ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో హిజాబ్ వివాదంను కాకుండా హిందుత్వ గుర్తయిన కాషాయ జెండా ఏదో ఒకరోజు దేశంలో జాతీయ పతాకంను భర్తీ చేస్తుందని అంటూ సీనియర్ మంత్రి కె ఎస్ ఈశ్వరప్ప చేసిన వాఖ్యలపై రసభ చేస్తున్నారు.  ఫిబ్రవరి 18న బెంగళూరులో కాంగ్రెస్ విలేకరుల సమావేశానికి ముందు, పార్టీ శాసనసభ్యుడు నసీర్ అహ్మద్ కర్నాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు సిద్ధరామయ్యకు హిజాబ్‌పై ముస్లిం సమాజంలో ఉన్న సందేహాలను తొలగించడానికి ఉర్దూ మీడియాను ఉద్దేశించి ప్రసంగించాలని సూచించారు.  మైక్రోఫోన్‌ల ద్వారా జరిగిన తదుపరి సంభాషణలో, మాజీ ముఖ్యమంత్రి ఇలా సమాధానమిచ్చారు: “కెపిసిసి (కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) చీఫ్ (డి కె శివకుమార్) రానివ్వండి. పార్టీని కలుపుకుపోదాం, లేకుంటే సిద్ధరామయ్య…

Read More

రాష్ట్రంలో గిరిజన సంక్షేమం కోసం పనిచేస్తున్న కేరళకు చెందిన ఎన్జీవోలో తాను చేరిన కొత్త ఉద్యోగంపై వివాదం సృష్టించడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ  బంగారం స్మగ్లింగ్ కేసు నిందితుడు స్వప్న సురేష్ తన బతుకును తాను బతకనీయమని,  తనను వేధించవద్దని అంటూ తన ప్రత్యర్థులను వేడుకున్నారు.  విలేఖరులను ఉద్దేశించి సురేష్ మాట్లాడుతూ, తనను వేధించడానికి ఎడతెగని ప్రయత్నాలను చూస్తుంటే నిరుత్సాహంగా ఉందని చెప్పారు. మొదట్లో తనకు  వేధించేందుకు ఓ పుస్తకాన్ని విడుదల చేశారని, ఇప్పుడు తన  ఉద్యోగం చుట్టూ వివాదాలు సృష్టిస్తున్నారని ఆమె ఆరోపించారు. అట్టప్పాడి, ఇతర ప్రాంతాలలో ఆదివాసీలకు నివాసయోగ్యంగా లేని ఇళ్లను నిర్మించారని ఆరోపిస్తూ వచ్చిన ఫిర్యాదులపై ఎన్‌జిఓ హైరేంజ్ రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ (హెచ్‌ఆర్‌డిఎస్)పై కేరళ రాష్ట్ర ఎస్సీ/ఎస్టీల కమిషన్ విచారణ ప్రారంభించిన నేపథ్యంలో ఆమె స్పందించారు. ఇంటర్వ్యూ తర్వాత తనను ఎన్జీవోలో మహిళా సాధికారత & సీఎస్‌ఆర్ డైరెక్టర్‌గా నియమించారని, తనకు ఆర్‌ఎస్‌ఎస్ లేదా బీజేపీతో అనుబంధం ఉన్నందున కాదని…

Read More

ఎపి రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రాయలసీమ రాష్ట్ర సమితి (ఆర్‌ఆర్‌ఎస్‌) అధ్యక్షుడు కుంచం వెంకట సుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు. మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ ప్రయత్నించడం సరికాదని స్పష్టం చేశారు.  విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటు వల్ల రాయలసీమ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. దీనికంటే అమరావతి రాజధానిగా ఉంటేనే రాయలసీమకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.  రాయలసీమ ప్రాంత ప్రయోజనాల గురించి ఎవరూ ఆలోచించడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం, న్యాయవ్యవస్థ మూడు రాజధానుల ప్రభుత్వ ఆలోచనా విధానాన్ని సమర్ధించడం లేదని తేల్చి చెప్పారు. విశాఖను రాజధానిగా చేస్తే సరిహద్దులో ఉన్న అనంతపురం జిల్లా మడకశిర ప్రాంతం ప్రజలు ఎలా రాగలుగుతారని ఆయన ప్రశ్నించారు. సాగునీటి రంగం, సమగ్రాభివఅద్ధి విషయంలో రాయలసీమ తీవ్ర అన్యాయానికి గురవుతోందని ఆయన ఆరోపించారు. రాయలసీమ పారిశ్రామికంగా వెనుకబడి ఉందని, ఉపాధి కల్పించే పరిశ్రమలు లేవని ఎత్తిచూపారు. కడప ఉక్కు కర్మాగారం ఎండమావిలా…

Read More

బీహార్ ముఖ్యమంత్రి, జెడియు అధినేత నితీష్ కుమార్  తన ఇంతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కుమార్ తో `విందు సమావేశం’ జరపడం, ఇద్దరు సుమారు రెండు గంటల సేపు సమాలోచనలు జరపడం రాజకీయ వర్గాలలో ఆసక్తి కలిగిస్తున్నది.  ఈ సమావేశం యధాలాపంగా జరిగిన్నట్లు ఇద్దరు చెబుతున్నప్పటికీ లోతైన రాజకీయ వ్యూహం ఇమిడి ఉండవచ్చని సర్వత్రా భావిస్తున్నారు. ఢిల్లీలో ఇద్దరూ విందు సమావేశంలో పాల్గొన్న విషయాన్ని మీడియాతో మాట్లాడుతూ నితీష్‌కుమార్ ధ్రువీకరించారు. ప్రశాంత్ కిషోర్‌తో తనకు పాత అనుబంధం ఉందని, అంతేతప్ప ఈ సమావేశం వెనుక ఏవో ఉద్దేశాలు ఊహించుకోవద్దని నితీష్ స్పష్టం చేశారు.  నితీష్ కుమార్ ఒమెక్రాన్ ఇన్‌ఫెక్షన్‌తో ఉన్నప్పుడు ఆయన ఆరోగ్యం గురించి ఫోనులో అడిగి తెలుసుకున్నానని, ఒకసారి ముఖాముఖిగా కలుసుకుందామని నితీష్ అనడంతో సమావేశమైనట్టు ప్రశాంత్ కిషోర్ వివరించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో తమకన్నా తక్కువ సీట్లు వచ్చినా నితీష్ కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినప్పటికీ, అప్పటి నుండి ప్రభుత్వంపై అన్నివిధాలా ఆధిపత్యం వహించే…

Read More

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ దర్యాప్తు వేగం పుంజుకొంటున్న కొద్దీ అధికార పక్షంలో కలకలం రేగుతున్నది. సిబిఐ తాజాగా దాఖలు చేసిన చార్జిషీట్ లో కడప ఎంపీ అభ్యర్థి ఎంపిక విషయంలో అధికార పక్షంలో  విబేధాలు ఈ హత్యకు దారితీసిన్నట్లు పేర్కొనడంతో అనుమానాలు ముఖ్యమంత్రికి సన్నిహితుడైన మరోబాబాయి కుమారుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై సిబిఐ దృష్టి సారించినట్లు స్పష్టం అవుతున్నది.  ఈ సమయంలో ప్రధాన నిందితుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటూ టిడిపి నేతలు ఆరోపిస్తూ, ముఖ్యమంత్రిని కూడా సిబిఐ విచారించాలని సూచిస్తుండడం రాజకీయ దుమారం రేపుతున్నది. వివేకానంద‌రెడ్డి హ‌త్య‌ కేసులో ప్రధాన నిందితుడు సీఎం జగన్‌రెడ్డేనని, జగన్‌తో పాటు అతని కుటుంబసభ్యులను సీబీఐ విచారించాలని టిడిపి నేత మాజీమంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు.   ఎన్నికల్లో ఎంపీ అవినాష్‌రెడ్డిని సానుభూతితో గెలిపించుకునేందుకు  వివేకాను హత్య చేసి సొంత మీడియాలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై ఆరోపణలు చేశారని ఆయన…

Read More

 2008 అహ్మదాబాద్‌ వరుస పేలుళ్లతో సమాజ్‌వాదీ పార్టీకి సంబంధాలు ఉన్నాయని, ఆ పార్టీ నేత ఒకరు ఉగ్రవాదులకు రక్షణ కల్పించారని అంటూ  బీజేపీ తీవ్రమైన ఆరోపణ చేసింది. ముఖ్యంగా కీలకమైన మూడో దశ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ సంచలన ఆరోపణ చేశారు. పేలుళ్ల సూత్రధారుల్లో ఒకరు సమాజ్‌వాదీ పార్టీ నేత కొడుకు అని ఠాకూర్ తీవ్ర ఆరోపణలు చేశారు. 56 మందిని బలిగొన్న, 200 మందికి పైగా గాయపడిన ఈ కేసులో ట్రయల్ కోర్టు 38 మంది దోషులకు మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. మరో 11 మందికి జీవిత ఖైదు పడింది.  కేంద్ర మంత్రి ఆరోపణ ప్రకారం, సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు షహబాద్ అహ్మద్ కుమారుడు మహమ్మద్ సైఫ్ సూత్రధారులలో ఒకరు. సమాజ్‌వాదీ పార్టీ బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని, ఎస్పీ హయాంలో గూండాలు, ఉగ్రవాదులు బలపడ్డారని ఆయన ఆరోపించారు. ఈ విషయమై ఠాకూర్…

Read More

మేడారం సమ్మక్క-సారలమ్మ వనప్రవేశం వైభవంగా శనివారం సాయంత్రం ముగిసింది. గిరిజన సాంప్రదాయ పద్ధతిలో  సమ్మక్క సారలమ్మ అమ్మవార్లు వనప్రవేశం చేశారు. డప్పులు, డోలువాయిద్యాల మధ్య అమ్మవార్లను వనంలోకి తీసుకెళ్లారు పూజారులు. గద్దెలపై ప్రత్యేక పూజలు చేసి ఆ తర్వాత భారీ పోలీసు బందోబస్తు మధ్య అమ్మవార్లను వనప్రవేశానికి తీసుకెళ్లారు. చిలుకలగుట్టకు సమ్మక్క, కన్నెపల్లికి సారలమ్మ.. పూనుగొండ్లకు సమ్మక్క భర్త పడిగిద్దరాజు, కొండాయికి గోవిందరాజులను తరలించారు.  గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ వనదేవతలను దర్శించుకున్నారు. అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించి పూజలు చేశారు. అమ్మవార్ల దీవెనలు  ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. తన రాక సందర్భంగా భక్తులకు ఇబ్బంది కలిగితే క్షమించాలని గవర్నర్ కోరారు.   తెలంగాణలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగే మేడారం గిరిజన జాతర విజయవంతంగా ముగిసిందని జాతర పరిశీలకులుగా ఉన్న మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రటించారు. తల్లుల రాకకు ముందే దాదాపు 60లక్షల మంది భక్తులు మేడారనికి వచ్చారని జాతర సమయంలో…

Read More