Author: Editor's Desk, Tattva News

కాంగ్రెస్ ఎమ్యెల్యేలలో అత్యధికులు తనకు మద్దతు తెలిపినప్పటికీ కేవలం తాను హిందువైనందుననే తనను పంజాబ్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధిష్ఠానం చేయలేదని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు సునీల్ జక్కర్ ఆరోపించారు.  పంజాబ్ లో కార్యకర్తల అభిప్రాయం తెలుసుకొని తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తామని పార్టీ నేత రాహుల్ గాంధీ ప్రకటించిన సందర్భంగా ప్రస్తుతం ఈ పదవికి పోటీ పడుతున్న ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దు, ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీలలో ఎవ్వరికీ పార్టీ ఎమ్యెల్యేల మద్దతు లేదని అంటూ  జక్కర్ పార్టీలో కలకలం సృష్టించారు.   కాంగ్రెస్ నుంచి కెప్టెన్ అమరీందర్ సింగ్ నిష్క్రమించిన తర్వాత పార్టీ అధిష్ఠానం నిర్వహించిన అభిప్రాయ సేకరణలో వీరిద్దరికీ ఎంతమాత్రం మద్దతు కనిపించలేదని ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తున్న సమయంలో జక్కర్ ఈ విధంగా వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అవుతుంది.  అభిప్రాయ సేకరణలో తేలిన వివరాల ప్రకారం తనకు…

Read More

పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధంకర్, ముఖ్యమంత్రి మమతా బనెర్జీలకు మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న పోరాటం నానాటికి తీవ్రరూపం దాలుస్తున్నది. జులై, 2019లో గవర్నర్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ధంకర్, మమతాల మధ్య పొసగడం లేదు. తరచూ రాజకీయ వివాదాలు చెలరేగుతున్నాయి. తాజాగా, తన ట్విట్టర్ ఖాతాలో గవర్నర్ ను తొలగించానని మమతా చేసిన ప్రకటన వారిద్దరి మధ్య నెలకొన్న వైరం తీవ్రమవుతున్నట్లు స్పష్టం చేస్తున్నది. ఈ సందర్భంగా గవర్నర్ ప్రతిరోజూ తనకు `అసభ్యమైన’, `దూషణలతో’ ట్వీట్ లు పెడుతూ తనను `వేధిస్తున్నారు’ అంటూ ఆమె తీవ్రమైన ఆరోపణ చేశారు. ఆమె ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ, ఆ విధంగా తాను పంపిన ఒక ట్వీట్ నైనా చూపమని మీడియా సమావేశంలో గవర్నర్ ధంకర్ సవాల్ చేశారు. ఈ విషయంపై సీఎం మమతను మీడియా ప్రశ్నించకపోవడం అత్యంత దురదృష్టకరమని ఆయన విచారం వ్యక్తం చేశారు. పైగా, ఇది ప్రజస్వామ్యానికి సవాల్ అని ఆయన ధ్వజమెత్తారు. ఆమె…

Read More

వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఆదాయం పన్ను రిటర్న్(ఐటిఆర్) ఫామ్‌లో క్రిప్టోకరెన్సీ ఆదాయానికి సంబంధించిన ప్రత్యేక కాలమ్ ఉంటుందని రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ వెల్లడించారు. ఏప్రిల్ 1 నుంచి క్రిప్టో అసెట్స్ లావాదేవీలపై 30 శాతం పన్నుతో పాటు సెస్, సర్‌చార్జీ విధిస్తారు. గుర్రపు పందేలు, ఇతర స్పెక్యులేటివ్ లావాదేవీల నుంచి వసూలు చేసే విధంగానే ఈ క్రిప్టోపై పన్నును విధించారు. తరుణ్ బజాజ్ మాట్లాడుతూ, కొత్త ఆర్థిక సంవత్సరంలో ఐటిఆర్ ఫామ్‌లో క్రిప్టోకరెన్సీ నుండి లాభం, పన్ను చెల్లింపు కోసం ప్రత్యేక కాలమ్ ఉంటుందని అన్నారు. ఈ కాలమ్‌లో క్రిప్టో కరెన్సీ సంపాదన గురించిన సమాచారం వెల్లడించాల్సి ఉంటుంది. క్రిప్టోకరెన్సీ లాభాలపై ఎల్లప్పుడూ పన్ను ఉంటుందని, బడ్జెట్‌లో ప్రతిపాదించినది కొత్త పన్ను కాదని స్పష్టం చేశారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2022లో క్రిప్టోకరెన్సీలు, ఇతర డిజిటల్ ఆస్తుల లావాదేవీలపై వచ్చే ఆదాయంపై 30 శాతం పన్ను…

Read More

రాహుల్ గాంధీ ఈ రోజుల్లో ట్విట్టర్‌లో తన ఫాలోవర్లు తగ్గిపోతున్నారని ఆందోళన చెందుతున్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఒత్తిడి కారణంగా ట్విట్టర్ తన ఫాలోవర్లను తగ్గిస్తోందని ఆయన అనుమానిస్తున్నారు. అయితే తన పార్టీ ఓట్ల శాతం భారీగా పడిపోవడంపై మాత్రం ఆయన ఆందోళన చెందుతున్నట్లు కనిపించడం లేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఈ ఆరోపణ చేస్తూ ట్విట్టర్ సీఈఓకు లేఖ రాశారు. అందులో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో తన పాపులారిటీని ఉద్దేశపూర్వకంగా అణిచివేస్తున్నారని ఫిర్యాదు చేశారు. అయితే నిజం ఏమిటంటే రాహుల్ గాంధీ నిజాయితీగా తన పాపులారిటీని ఆత్మపరిశీలన చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ నుండి చాలామంది సీనియర్ నేతల తనఅనుచరుల నిష్క్రమణ గురించి ఆందోళన చెందితే ఎక్కువ ఉపయోగం ఉండొచ్చేమే. జూలై 2021 వరకు, ట్విట్టర్‌లో తనను అనుసరించే వారి సంఖ్య నిరంతరం పెరుగుతోందని రాహుల్ చెబుతున్నారు. అయితే ఆ  తర్వాత ఒక్కసారిగా ఆయన్ను ఫాలో అవుతున్న కొత్త వారి సంఖ్య జీరో అయింది. కాగా అప్పటికే…

Read More

మార్చ్ 2న కోర్ట్ ముందు హాజరు కావాలని ఆదేశిస్తూ  పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ముంబై మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ కోర్టు సమన్లు జారీ చేసింది. ఇటీవల మమతా ముంబై వచ్చిన సమయంలో జాతీయ గీతాన్ని అవమానపరిచారనే ఆరోపణలపై దాఖలైన కేసులో ఈ ఆదేశాలు జారీచేసింది.  డిసెంబరు 1, 2021న ముంబైలో ప్రముఖ రచయిత జావేద్‌ అక్తర్‌ నిర్వహించిన ఓ కార్యక్రమానికి సీఎం మమతా బెనర్జీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అయితే ఈ కార్యక్రమంలో మమతా బెనర్జీ జాతీయ గీతాన్ని అవమానించారని మహారాష్ట్రకు చెందిన బీజేపీ కార్యకర్త,  న్యాయవాది వివేకానంద గుప్తా ఆరోపించారు. ఆమెపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని మెజిస్ట్రేట్‌ కోర్టును కోరారు.   ముంబైలో ఈ కార్యక్రమానికి హాజరైన బెనర్జీ జాతీయ గీతంలోని మొదటి రెండు పద్యాలను కూర్చొని ఆలపించారని, ఆ తర్వాత నిలబడి మరో రెండు శ్లోకాలు పఠించారని, ఆ తర్వాత అకస్మాత్తుగా ఆగిపోయారని కోర్టుకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో…

Read More

దేశం విభజనకు కారకుడైన మోహ్హమద్ ఆలీ జిన్నా పేరుతో స్వతంత్ర భారత దేశంలో ఓ టవర్  ఉండడం ఏమిటని బిజెపి అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఆత్మరక్షణలో పడిన వైసిపి ప్రభుత్వం దానికి జాతీయ జెండా రంగులు వేయవలసి వచ్చింది. స్థానిక  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మహ్మద్‌ ముస్తఫా  స్వయంగా ఆ టవర్ ను  త్రివర్ణపతాకంలో చిత్రించారు.  భారతీయ జనతా పార్టీ దాని పేరు మార్చాలని డిమాండ్ చేయడంతో గత నెలరోజులుగా అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. పైగా, పేరు మార్చని పక్షంలో తాము దానిపై  జాతీయ జెండాను ఎగరవేస్తామని బిజెపి జిల్లా అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ హెచ్చరించడంతో ప్రభుత్వం ఏదో ఒక సర్దుబాటు చర్యకు దిగక తప్పలేదు.  నిషేధ ఉత్తర్వులు ఉన్నప్పటికీ, టవర్‌పై జాతీయ జెండాను ఎగురవేయడానికి ప్రయత్నించినందుకు హిందూ వాహిని సంస్థకు చెందిన ముగ్గురు వ్యక్తులను రిపబ్లిక్ దినోత్సవం నాడు  అదుపులోకి తీసుకోవాల్సి రావడంతో పరిస్థితులు విషమించి అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం గ్రహించిన్నట్లు కనబడుతున్నది.  …

Read More

ఉగ్రవాదుల మద్దతుదారునిగా పేరొందిన మసూద్ ఖాన్ ను అమెరికాలో తమ రాయబారిగా పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నియమించడం పట్ల ఆ దేశంలో కలకలం రేగుతున్నది. ఇప్పటికే అతని దౌత్యపర ఆధారాలు స్వీకరించడాన్ని అమెరికా విదేశాంగ శాఖ వాయిదా వేసింది. వాయిదా  కాదని, అతనిని పూర్తిగా తిరస్కరించాలని కోరుతూ అమెరికా కాంగ్రెస్ సభ్యుడు స్కాట్ పెర్రీ  అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు లేఖ వ్రాసారు.  మసూద్ ఖాన్ జిహాదీలను అనుకరించేలా యువకులను ప్రోత్సహించాడని,  విదేశీ ఉగ్రవాద సంస్థలను మెచ్చుకుంటూ ఈ ప్రాంతంలో అమెరికా ప్రయోజనాలను అణచివేయడంకోసం పనిచేస్తున్న పనిచేస్తున్న ఒక మంచి ఉగ్రవాద సానుభూతిపరుడని, పైగా అమెరికా మిత్రదేశం భారత్ కు వ్యతిరేకంగా ఉగ్రవాదులను రెచ్చగోడుతున్నాడని అంటూ ఆ లేఖలో తీవ్రమైన ఆరోపణలు చేశారు.   గత ఏడాది ఆగస్టు వరకు పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) అధ్యక్షుడిగా పనిచేసిన మసూద్ ఖాన్, నవంబర్‌లో అమెరికా పాకిస్తాన్ రాయబారిగా నామినేట్ అయ్యారు. రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు స్కాట్…

Read More

సమ్మెకు సిద్దమైన ఉద్యోగ సంఘాల నాయకులను చర్చలకు రమ్మనమని పదే పదే కబుర్లు పంపి, మరోమారు వారిని చర్చలకు తీసుకొచ్చిన ఏపీ మంత్రుల కమిటీ చివరకు వారు లేవనెత్తిన డిమాండ్లపై నోరు మెదపకుండా, వాటిని పరిష్కరించడం సాధ్యం కాదని చేతులెత్తేయడం పట్ల ఉద్యోగులు ఆగ్రవేశాలు వ్యక్తం చేస్తున్నారు. చర్చల పేరుతో కాలయాపన చేస్తూ  తమను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారుమంత్రుల కమిటీతో భేటీ తీరుపై ఉద్యోగ సంఘాల నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజా భేటీలో మళ్లీ మోస మే జరిగిందని, తమ డిమాండ్లను అంగీకరించలేదని చెబుతూ గురువారం ‘చలో విజయవాడ’కు లక్షలాదిగా తరలి రావాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు.  ‘‘ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థికశాఖ అధికారులు కొన్ని పేస్లిప్‌లు చూపి సమాజాన్ని భ్రమింపచేసే ప్రయత్నాలు చేస్తున్నారు. పేస్లి్‌పకు కొత్త ఫార్మాట్‌ను ఎందుకు డిజైన్‌ చేశారు? పేస్లి్‌పలో జీతం పడినట్లు చెప్పారు. కానీ బ్యాంకుల్లో డబ్బు జమ కాలేదే? మెసేజ్‌ వచ్చిన ఏ…

Read More

ఆత్మనిర్భర్ భారత్ – 2’స్వయం-ఆధారిత భారతదేశం’ సృష్టించడానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కనీస దిగుమతి, గరిష్ట ఎగుమతి విధానాన్ని అనుసరించారు. ఈ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి, ప్రభుత్వం  రూ 27 లక్షల కోట్ల కంటే ఎక్కువ ఖర్చుతో మూడు ప్యాకేజీలను ప్రకటించింది. ఈ ప్యాకేజీల ప్రత్యేకత ఏమిటంటే అవి సమాజంలోని అన్ని వర్గాలను ఊహించడం.  ఈ ప్యాకేజీలు తలపై బుట్ట పెట్టుకుని కూరగాయలు లేదా పండ్లను విక్రయించే వ్యక్తికి లేదా వందల కోట్ల రూపాయల విలువైన పరిశ్రమ గల వ్యక్తికి కూడా చెందినవని కూడా మనం చెప్పగలం. అందరికీ ఈ ప్యాకేజీలలో కొన్ని నిబంధనలు ఉన్నాయి.  అదేవిధంగా, ఈ ప్యాకేజీలలో ప్రతి ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. మన దేశంలో జరిగే ఉపాధి కల్పనలో ఎక్కువ భాగం చిన్న, మధ్య తరహా రంగం నుండి జరుగుతున్నది. ఈ పరిశ్రమలు దేశంలోని మొత్తం ఉపాధిలో 30% కంటే ఎక్కువ అందిస్తున్నాయి.  మన మొత్తం ఎగుమతుల్లో ఈ రంగం…

Read More

కేంద్ర బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశ పెడుతున్న సందర్భంగా వచ్చే సంవత్సరం నుంచే డిజిటల్ రుపీని ప్రవేశ పెడుతున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించడంతో దీని పట్ల ప్రజలలో ఆసక్తి కలుగుతున్నది. రిజర్వు బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ (సిబిసిడి)ని డిజిటల్‌ రూపీ రూపంలో పరిచయం చేయనున్నట్లు ఆమె తెలిపారు. రాబోయే ఆర్థిక సంవత్సరం నుండి సిబిసిడిని రిజర్వ్‌ బ్యాంక్‌ తీసుకురానుంది. ఇది బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. ఆ విధంగా కేంద్రం ప్రణాళికలు చేస్తోంది. సిబిసిడి అనేది డిజిటల్‌ రూపంలో సెంట్రల్‌ బ్యాంక్‌ జారీ చేసే చట్టపరమైన టెండర్‌.  ఇది కాగితంలో జారీ చేసే ఫియట్‌ కరెన్సీ విలువతో సమానంగా ఉంటుంది. ఏదైనా ఇతర ఫియట్‌ కరెన్సీతో పరస్పరం మార్చుకోవచ్చు. వినియోగదారులకు డిజిటల్‌ సౌలభ్యం, భద్రతతో పాటు సాంప్రదాయ బ్యాకింగ్‌ వ్యవస్థ నియంత్రణ సదుపాయాలను కల్పించడం. బడ్జెట్‌లో డిజిటల్‌ రూపీ ప్రస్తావన తీసుకు రావడం ద్వారా ఈ మధ్య…

Read More