Author: Editor's Desk, Tattva News

గతంలో ఎన్నడూ లేనంతగా భారీ కేటాయింపులతో,  గత సంవత్సరంకన్నా రెంట్టింపు మొత్తాలతో ఈ సంవత్సరం రూ 2.25 లక్షల కోట్లతో రైల్వే బడ్జెట్ ఉండగలదని ప్రభుత్వ వర్గాలు సంకేతం ఇస్తున్నాయి. ఫిబ్రవరి 1న సాధారణ వార్షిక బడ్జెట్ తో పాటు రైల్వే బడ్జెట్ ను కూడా ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు.  కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్లుగా రైళ్లు సరిగ్గా తిరగడం లేదు. దానితో రైల్వే ఆదాయం కూడా గణనీయంగా పడిపోయింది. పలు రైల్వే ప్రాజెక్ట్ లు కూడా ముందుకు సాగడం లేదు. ఇటువంటి పరిస్థితులలో ప్రయాణికుల సదుపాయాలను విశేషంగా మెరుగుపరచే విధంగా ఈ సారి రైల్వే బడ్జెట్ ఉండగలదని భావిస్తున్నారు.  గతంలో రైల్వే బడ్జెట్‌ను ఆ శాఖ మంత్రి ప్రకటించేవారు. కానీ నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక సాధారణ బడ్జెట్‌లోనే ఓ ప్రత్యేక కేటగిరి కింద ఉంచి కేటాయింపులు చేస్తున్నారు. గతేడాది కేంద్ర  ప్రభుతం రూ.1,10,055 కోట్లను…

Read More

టిడిపి నేత బుద్దా వెంకన్నను విజయవాడలో ఆయన ఇంటికి వద్ద పోలీసులు అరెస్టు చేశారు. డీజీపీ గౌతమ్ సవాంగ్, మంత్రి కొడాలి నానిపై బుద్దా వెంకన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై వైసిపి నేతల ఫిర్యాదు మేరకు వెంకన్నను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.  అయితే పోలీస్ స్టేషన్ లో విచారణ జరిపి రాత్రి 11.15 గంటల ప్రాంతంలో విడుదల చేశారు.  బుద్ధా వెంకన్న అరెస్టుకు ముందు.. నిన్న ఉదయం మంత్రి కొడాలి నాని, రాష్ట్ర డీజీపీలపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి కొడాలి నానికి సంబంధించిన కన్వెన్షన్ సెంటర్‌లో క్యాసినో నిర్వహించినట్టు సాక్ష్యాధారాలున్నా ఎందుకు అరెస్ట్ చేయలేదని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు.  డీజీపీ అంటే డైరెక్టర్ ఆఫ్ జగన్ పార్టీ అని ఆరోపించారు. కొడాలి నానికి రాజకీయ భిక్ష పెట్టిందే చంద్రబాబు అని, అలాంటి వారికి టికెట్లు ఇవ్వడం చంద్రబాబు తప్పని విమర్శించారు. నాని గత చరిత్ర గురించి అందరికీ తెలుసని ఎద్దేవా…

Read More

ఈ ఏడాది ఐసీసీ మహిళా క్రికెటర్‌ అవార్డు స్మృతీ మందానను వరించింది. 2021 సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు గాను ఈ అవార్డును ప్రదానం చేస్తున్నట్లు ఐసీసీ పేర్కొంది. 2021 సీజన్‌లో స్మృతీ ఆడిన మ్యాచ్‌ల వివరాలను ఐసీసీ వెల్లడించింది.  ఈ సీజన్‌లో ఆమె 22 ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌లు ఆడి 38.86 సగటుతో 855 రన్స్‌ చేసిందనీ.. అందులో ఓ సెంచరీ, అయిదు హాఫ్‌ సెంచరీలున్నాయని ఐసీసీ తెలిపింది. వాస్తవానికి 2021 సీజన్‌లో ఇండియా పెద్దగా రాణించకపోయినా.. స్మృతీ మందాన మాత్రం తన బ్యాట్‌తో సత్తా చాటడం వల్లే రేచల్‌ హైవో ఫ్లింటో ట్రోఫీని దక్కించుకున్నదని ఐసీసి వెల్లడించింది. ఇక స్మృతీ మందాన ఆడిన మ్యాచ్‌ల వివరాలు.. దక్షిణాఫ్రికాతో జరిగిన హోమ్‌ సిరీస్‌లో ఇండియా కేవలం రెండు మ్యాచ్‌లను మాత్రమే గెలిచింది. ఆ రెండింటిలో మందాన భారీ ఇన్నింగ్స్‌ ఆడి ఇండియాను విజయ తీరాలకు చేర్చింది. ఓ వన్డే మ్యాచ్‌లో చేజింగ్‌లో…

Read More

కేంద్రం తెలంగాణకు కేటాయించిన ప్రాజెక్టులకు రాష్ట్ర సర్కారు భరించాల్సిన వ్యయాన్ని, కావాల్సిన భూకేటాయింపులను త్వరగా పూర్తిచేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి లేఖ వ్రాసారు. రైల్వే ప్రాజెక్టులపై కేంద్రం వివక్ష చూపుతుందని టీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు.  సకాలంలో ప్రాజెక్టులు పూర్తి కాకపోవడంతో అంచనా వ్యయం భారీగా పెరిగిందని ఆ లేఖలో ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 13 ప్రాజెక్టులకు కేంద్రం కేటాయించిన నిధుల వివరాలను లేఖలో ప్రస్తావించారు. నరేంద్ర మోదీ  ప్రధానిగా వచ్చాక తెలంగాణకు నిధుల కేటాయింపు 9 రెట్లు పెరిగిందని కిషన్ రెడ్డి తెలిపారు.  2014-15 బడ్జెట్ లో తెలంగాణకు కేటాయింపులు రూ.250 కోట్లు కాగా, 2021-22 నాటికి కేటాయింపులు రూ.2,420 కోట్లకు పెరిగాయని ఆయన  వివరించారు. తెలంగాణలో రైల్వే నెట్ వ‌ర్క్ 194 రూట్ కిలోమీటర్లు పెరిగినట్టు కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ క్రమంలో ఏయే ప్రాజెక్టులు ఆలస్యం…

Read More

గత 27 సంవత్సరాల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, రాబోయే  “శుభకృతు” నామ సంవత్సర ఉగాది (ఏప్రిల్ 1, 2022) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు అంతర్జాతీయ స్థాయిలో 27వ ఉగాది ఉత్తమ రచనల పోటీ  నిర్వహిస్తున్నారు.  భారతదేశం మినహా విదేశాలలో ఉన్న తెలుగు రచయితల నుండి నూతన, అముద్రిత రచనలను ఈ పోటీకి ఆహ్వానిస్తున్నట్లు నిర్వాహకులు వంగూరి చిట్టెన్ రాజు, శాయి రాచకొండ, వంశీ రామరాజు తెలిపారు.  ఉత్తమ కథానికకు 116 అమెరికా డాలర్లు చొప్పున రెండు సమాన బహుమతులు, ఉత్తమ కవితకు అదే విధంగా 116 డాలర్ల చొప్పున రెండు సమాన బహుమతులు అందజేస్తారు. అదే విధంగా “మొట్టమొదటి రచన విభాగం”లో కూడా సరికొత్త రచయితలకు అదే విధంగా 116 డాలర్ల చొప్పున రెండేసి బహుమతులు అందజేస్తారు.  ఒకే రచయిత ఒక్కొక్క ప్రక్రియకి ఒక రచన మాత్రమే పంపించాలని, కధలు 15 పేజీల లోపు, కవితలు 5 పేజీల లోపు ఉండాలని తెలిపారు.  విజేతల వివరాలను ఉగాది నాటికి ప్రకటిస్తారు. రచనలను మార్చ్ 15 లోగా sairacha@gmail.com,  vangurifoundation@gmail.com చిరునామాలు పంపించాలి. 

Read More

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరిగి కొద్దికాలం సినిమాలకు విరామం ఇచ్చి, రాజకీయాలపై దృష్టి సారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలు వేగంగా మారుతూ ఉండడం, వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పలు వర్గాల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటూ ఉండడంతో పాటు, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి తీవ్ర సంక్షోభంలో చిక్కుకోవడంతో ముందస్తు ఎన్నికలు అనివార్యమనే సంకేతాలు వెలువడుతున్నాయి.  పైగా, రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ తో జత కలపనిదే వైసిపిని ఎదుర్కోవడం కష్టం అని ఒక వంక తెలుగు దేశం పార్టీ, మరోవంక బిజెపి భావిస్తున్నాయి. అందుకనే ముందుగా పార్టీ యంత్రాంగాన్ని పటిష్ట పరచుకోవడంతో పాటు, నేరుగా ప్రజలలోకి వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది. ఎన్నికల పొత్తుల గురించిన గందరగోళంలోకి ఇప్పుడు వెళ్లకుండా బలమైన నియోజకవర్గాలు, అభ్యర్థుల ఎంపిక పట్ల దృష్టి సారించేందుకు కసరత్తు చేయనున్నట్లు చెబుతున్నారు.  జనసైనికుల అభీష్టం మేరకే ఎన్నికల పొత్తు ఉంటుందని ఇటీవల పవన్ కళ్యాణ్ చెప్పడం గమనార్హం.…

Read More

2014  లోక్‌సభ ఎన్నికలలో ఒక సీట్ కూడా గెలుపొందలేని బహుజన సమాజ్ పార్టీ, 2019 ఎన్నికలలో అనూహ్యంగా నరేంద్ర మోదీ ప్రభంజనంలో కూడా 10 సీట్లు గెల్చుకొని, తిరిగి రాష్ట్ర రాజకీయాలలో  నిర్ణయాత్మక శక్తిగా మాయావతి ఎదుగుతున్నట్లు సంకేతం ఇచ్చాయి. అయితే ఈ విజయానికి సమాజ్ వాద్ పార్టీతో పొత్తు ఏర్పరచుకోవడం ఒక ప్రధాన కారణం కావచ్చు.  అయితే అప్పటి నుండి ఆమె రాష్ట్ర రాజకీయ చిత్రం నుండి క్రమంగా కనుమరుగవుతున్నారు. మీడియా, సోషల్ మీడియాకే పరిమితం అవుతున్నారు. వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకోసం  చిన్న, చితక పార్టీలు సహితం గత ఆరు నెలలుగా హడావుడి చేస్తుంటే ఆమె శిబిరం ఒక విధంగా మౌనంగా ఉంటూ వచ్చింది. ఆమె బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అందుకు కరోనా మహమ్మారి మాత్రమే కాకుండా ఆమె ఆరోగ్యం కూడా సహకరించడం లేదని చెబుతున్నారు.  మరోవంక, ఆమె ఓట్ల ప్రాతిపదిక కుంచించుకు పొత్తు రావడం మరో…

Read More

శ్రీకాళహస్తి ఆస్థాన జ్యోతిష సిద్ధాంతి, శ్రీశైల పీఠాధిపతి, వీరశైవ పీథాధిపతి  ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి ఆదివారం   రాత్రి 8.30 నిమిషాలకు శివైక్యం చెందారు.  ఆయన గుండె పోటుతో మరణించారు.  ఆదివారం సాయంత్రం ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబీకులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే తుదిశ్వాస విడిచారు.  దాదాపు 4 దశాబ్ధాలకు పైగా నిస్పక్షపాతమైన, నిజమైన జ్యోతిష ఫలితాలను,  భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలను తన పంచాంగం ద్వారా ప్రజలకు తెలియజేస్తూ, లక్షలాది మందికి మార్గదఋసనం చేస్తున్న ములుగు సిద్ధాంతి గుంటూరు నుంచి వచ్చి హైదరాబాద్ లో స్థిరనివాసం ఏర్పరుచుకున్నారు.  ఎంతోమంది సిని, రాజకీయ, వ్యాపార ప్రముఖులకు, దేశ విదేశాలనుంచి వచ్చేవారికి వంశపారంపర్యంగా వస్తున్న తమ దైవ కృప వలన జాతక విశ్లేషణ చేసి వారి సమస్యలకు పరిష్కారాలు తెలిపి ఎన్నో కుటుంబాలకు ఆరాధ్యులుగా నిలిచారు.  శ్రీశైలంలో ఆశ్రమం స్థాపించి, వేదాలలో, పూజా, హోమాది క్రతువులలో శిక్షణపొందిన బ్రాహ్మణులతో ప్రతీ మాస శివరాత్రికి పాశుపతహోమాలు…

Read More

నేతాజీ సుభాష్ చంద్రబోస్ బ్రిటిష్ వారి ముందు తలవంచేందుకు నిరాకరించారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. నేతాజీ 125వ జన్మదినోత్సవం సందర్భంగా ఇండియా గేట్ వద్ద హోలోగ్రామ్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరిస్తూ,  త్వరలో హోలోగ్రామ్ విగ్రహం స్థానంలో గ్రానైట్ విగ్రహాన్ని ఏర్పాటు చేయగలమని చెప్పారు. నేతాజీ విగ్రహం ప్రజాస్వామ్య విలువలను, భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిస్తుందని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. “స్వతంత్ర భారతావని కలపై విశ్వాసం కోల్పోవద్దు, భారతదేశాన్ని కదిలించగల శక్తి ప్రపంచంలో ఏదీ లేదు” అని నేతాజీ చెప్పేవారని ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేశారు.  “ఈ రోజు మనం స్వతంత్ర భారతదేశపు కలలను నెరవేర్చడం లక్ష్యంగా పెట్టుకున్నాము. స్వాతంత్య్రం వచ్చిన 100వ సంవత్సరం, 2047లోపు కొత్త భారతదేశాన్ని నిర్మించాలనే లక్ష్యంతో ఉన్నాము” అని ప్రధాని చెప్పారు.  నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కి సంబంధించిన ఫైళ్లను బయటపెట్టే అవకాశం మన ప్రభుత్వానికి లభించడం తన  అదృష్టం  అని పేర్కొన్నారు.  దేశానికి సేవ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన ఎన్డిఆర్ఎఫ్,…

Read More

మరో వారం రోజులలో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావలసి ఉండగా ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్యనాయుడుతో సహా 875 మంది సిబ్బంది కరోనా బారిన పడటం అధికార వర్గాలకు ఆందోళన కలిగిస్తున్నది. వెంకయ్య నాయుడు కరోనా బారిన పడటం ఇది రెండోసారి కావడం గమనార్హం. . అధికారిక వర్గాల ప్రకారం, జనవరి 20 వరకు 2,847 మందికి కరోనా  పరీక్షలు నిర్వహించగా, వారిలో  875 మంది పార్లమెంటరీ సిబ్బంది పాజిటివ్ గా తేలారు. వీరిలో, రాజ్యసభ సెక్రటేరియట్ మొత్తం 915 మందికి పరీక్షలు చేయగా, వారిలో  271 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.ఆదివారం మధ్యాహ్నం, ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు కూడా హైదరాబాద్‌లో కరోనాకు గురైనట్లు ట్విట్టర్ ద్వారా  తెలిపారు. ట్విట్టర్‌లో భారత ఉపరాష్ట్రపతి కార్యాలయం వారు ఇలా చెప్పారు:  “హైదరాబాద్‌లో ఉన్న ఉపరాష్ట్రపతి, ఎం వెంకయ్య నాయుడుకు ఈ రోజు కరోనా  పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయన…

Read More