Author: Editor's Desk, Tattva News

పిఆర్‌సిపై వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మధ్య ఘర్షణ తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విషయమై సమ్మె నోటిస్ ఇవ్వడానికి సిద్ధమైన ఉద్యోగ సంఘాల నాయకులను చర్చించేందుకు రావాలని ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ కోరింది. అయితే జివోను రద్దు చేసే వరకూ తాము చర్చలకు రాబోమని నాయకులు తేల్చిచెప్పారు. అలాగే నేడు సమ్మెకు సంబంధించిన నోటీసు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. దీనిపై శుక్రవారమే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అపాయింట్‌మెంట్‌ కోరారు. సమ్మె నోటీసుతో పాటు భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించేందుకు ఆదివారం సాయంత్రం విజయవాడ ఎన్‌జిఓ హోమ్‌లో నాయకులు సమావేశమయ్యారు. మంత్రుల కమిటీతో చర్చలు జరపాలని సాధారణ పరిపాలనాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శశిభూషణ్‌కుమార్‌ నాయకులకు సమాచారం ఇవ్వగా జివోలు రద్దు చేసే వరకూ తాము చర్చలకు రాబోమని నాయకులు తేల్చిచెప్పారు. అన్ని జిల్లాల్లో ఆందోళనా కార్యక్రమాలు విజయవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరింది. ప్రతి జిల్లాకు…

Read More

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ భారత్‌లో సామాజిక వ్యాప్తి స్థాయికి చేరుకుందని కన్సార్షియం (ఇన్సాకాగ్‌) తెలిపింది. వైరస్‌ల జన్యుక్రమాన్ని ఈ సంస్థలు విశ్లేషిస్తుంటాయి. ఢిల్లీ, ముంబయి నగరాల్లో అధికంగా వైరస్‌ వ్యాప్తి చెందిందని వెల్లడించింది.  విదేశీ ప్రయాణికుల నుండి వ్యాపించే దానికన్నా దేశీయంగా అంతర్గత వ్యాప్తే అధికంగా ఉన్నట్లు అంచనా వేసింది. వ్యాక్సిన్‌ పొందిన ప్రయాణికుల్లో మొదట ఒమిక్రాన్‌ వేరియంట్‌ను గుర్తించడం జరిగింది. ఈ వేరియంట్‌ సోకినా  ప్రస్తుతం చాలా మందిలో వైరస్‌ లక్షణాలు బహిర్గతం కావడంలేదు. మరి కొందరిలో స్వల్ప స్థాయి లక్షణాలే కనిపిస్తున్నాయి. అయితే, వ్యాక్సిన్‌ తీసుకోని వారు, హైరిస్కు ఉన్న వ్యక్తులు జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించారు.  వ్యాప్తి తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ, ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం తక్కువేనని, ప్రాణాపాయ ముప్పు కూడా స్వల్పమేనని పేర్కొంది. అయినప్పటికీ ఒమిక్రాన్‌ను నిర్లక్ష్యం చేయడం తగదని, తగు రక్షణ విధానాలను పాటించాల్సిందేనని ఇన్సాకాగ్‌ స్పష్టంచేసింది. ఇలా ఉండగా, కర్నాటకలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. దేశంలో…

Read More

నేతాజీ 125వ జయంతి డా. టి ఇంద్రసేనారెడ్డి సుమారు వేయేళ్లు వలస పాలనాలలో ఆర్ధికంగా, సాంస్కృతికంగా తీవ్రమైన దోపిడీకి గురైన భారతదేశం ప్రపంచ దేశాలలో అస్తిత్వమే కోల్పోయే పరిస్థితులు నెలకొన్న సమయంలో, భారత్ ను ఒక జాతిగా మనుగడ సాగించే పరిస్థితులు లేవని భారతీయులు కూడా ఆత్మనూన్యతా భావనలో మ్రగ్గుతున్న సమయంలో ఇద్దరు మహా పురుషులు ప్రపంచ దేశాలలో అజేయమైన భారత పౌరుషాన్ని ప్రదర్శించారు. తద్వారా భారతీయులు సగర్వంగా ఆత్మవిశ్వాసంతో తలయెత్తుకొని తిరిగే విధంగా చేయగలిగారు. వారిలో మొదటివారు స్వామి వివేకానంద. చికాగోలోని ప్రపంచ మతాల సదస్సుకు హాజరై, భారతీయ తాత్విక ఆలోచనలు ఎంతటి మహోన్నతమైనవో మొత్తం ప్రపంచంకు తెలియచేయ గలిగారు. భారత దేశ వ్యాప్తంగానే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా పర్యటనలు జరిపి భారతీయ ఔనత్యంకు ప్రపంచం నీరాజనాలు పలికేవిధంగా చేయాలిగారు. ఎవ్వరి ఒక విదేశీ మ్రగ్గడం కాకుండా స్వరాజ్యం అనే ఆలోచనలు మరచిపోయిన భారత జాతిని స్వాతంత్య్రం కోసం సమాయత్తం చేయగలిగారు. మరణించే ముందు 50 సంవత్సరాలకు భారత్…

Read More

అసమాన స్వతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుమార్తె, అనితా బోస్ ఫాఫ్ మాట్లాడుతూ, నేతాజీ వారసత్వం సంవత్సరాలుగా దోపిడీ చేయబడిందని, కాంగ్రెస్ పార్టీ తన తండ్రికి ఇవ్వాల్సిన గౌరవం,  వారసత్వాన్ని ఇవ్వలేదని ఆరోపించారు. “నేతాజీ వారసత్వం దోపిడీకి గురయింది. నేతాజీకి అన్యాయం చేసిన కాంగ్రెస్‌లోని ఒక వర్గం ఉంది. తిరుగుబాటుదారుడైన మా నాన్నను మేనేజ్ చేయలేక పోవడం వల్ల గాంధీ నెహ్రూకు మొగ్గు చూపారు” అంటూ జీ న్యూస్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె తెలిపారు. ఇండియా గేట్‌ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం గురించి ఆమె ఇంకా మాట్లాడుతూ, భారత ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. ఇది అద్భుతమైన గుర్తింపు అని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఆ విగ్రహం గురించి తెలిసి తాను “ఆశ్చర్యపోయాను” అని ఆమె చెప్పింది.ఈ అంశంపై మైలేజీని పొందేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఒక కమిటీని వేసిందని, అయితే ఆ తర్వాత…

Read More

బిల్డర్ తన వద్ద ఫ్లాట్లను కొనేవారికి కలలను అమ్మినపుడు, ఆ కలలు సాకారమయ్యే విధంగా సదుపాయాలను కల్పించడంలో విఫలమైతే, వారు పెట్టిన పెట్టుబడిని వడ్డీతో సహా తిరిగి రాబట్టుకునే హక్కు వారికి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బిల్డర్ ఐఆర్ఇఓ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన అపీలుపై ఈ తీర్పు చెప్పింది. గురుగ్రామ్‌లో గోల్ఫ్ కోర్స్ ఎక్స్‌టెన్షన్ రోడ్డులో స్కీఒన్ ప్రాజెక్టును ఐఆర్ఇఓ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మిస్తోంది. ఇటాలియన్ మార్బుల్ ఫ్లోర్, గోల్ఫ్ కోర్స్ వ్యూ, ఇతర విలాసవంతమైన సదుపాయాలతో కూడిన ఫ్లాట్‌ను అమ్ముతానని బ్రోచర్‌లో హామీ ఇచ్చింది. దీనిని నమ్మిన ఫ్లాట్ కొనుగోలుదారులు ఒక్కొక్కరు రూ.2 కోట్లకుపైగా పెట్టుబడి పెట్టారు. హామీ ఇచ్చిన సదుపాయాలేవీ కల్పించకపోవడంతో తమ సొమ్ము తమకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ఐఆర్ఇఓ స్పందిస్తూ 20 శాతం సొమ్మును తగ్గిస్తామని బెదిరించింది. వెంటనే ఫ్లాట్ బయ్యర్లు జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ (ఎన్‌సీడీఆర్‌సీ)ని ఆశ్రయించారు. విచారణ…

Read More

ప్రజల జీవనాన్ని సులభతరం చేసేందుకు ప్రతి జిల్లాకు రెండేళ్ల విజన్‌ నిర్దేశించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. వివిధ ప్రభుత్వ పథకాల అమలు జరుగుతున్న తీరు, వాటి పురోగతి గురించి నేరుగా తెలుసుకునేందుకు ఆయన శనివారం నాడు వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎంపిక చేసిన కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.  ప్రభుత్వ పథకాలు, సేవలు, సదుపాయాలు నూరు శాతం సాకారమయ్యేలా చేసేందుకు, ప్రజల జీవనాన్ని సులభతరం చేసేందుకుగాను వచ్చే రెండేళ్లకు ‘విజన్‌’ రూపొందించుకోవాలని జిల్లాల కలెక్టర్లను ప్రధాని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక యంత్రాంగం కలిసికట్టుగా పని చేయడం వల్ల ఆశావహ జిల్లాల్లో సత్ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు.  22 రాష్ట్రాల నుంచి గుర్తించిన 142 జిల్లాలు ఏవో రెండు కొలబద్దల్లో వెనుకబడి ఉన్నంత మాత్రాన వాటిని వెనుకబడిన జిల్లాలు అని చెప్పలేమని ప్రధాని చెప్పారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, గుజరాత్‌, రాజస్థాన్‌, కర్ణాటక రాష్ట్రాల…

Read More

“పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిన వెంటనే” జమ్మూ కాశ్మీర్‌కు పూర్తి రాష్ట్ర హోదా లభిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం తెలిపారు, డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు జిల్లా స్థాయిలో పరిపాలన యొక్క ఒకే విధమైన బెంచ్‌మార్కింగ్ కోసం రోడ్‌మ్యాప్‌ను అందించే భారతదేశపు మొట్టమొదటి “జిల్లా మంచి పాలన సూచిక”ను విడుదల చేసిన వర్చువల్ ఈవెంట్‌లో అమిత్ షా మాట్లాడుతూ, “ప్రజాస్వామ్య ప్రక్రియకు సంబంధించినంతవరకు, డీలిమిటేషన్ మొదలైంది. ఆ తర్వాత ఎన్నికలు జరగనున్నాయి. వారు (రాజకీయ పార్టీలు) ఏమి చెప్పినా, జమ్మూ కాశ్మీర్ కు పూర్తి రాష్ట్ర హోదా వస్తుంది” అని భరోసా ఇచ్చారు. “నేను పార్లమెంటులో ఈ హామీని ఇచ్చాను – జైసే హై స్థితి సామాన్య హో జాయేగీ, జమ్మూ కాశ్మీర్ కో పూర్ణ రాజ్య కా దర్జా మిలేగా (పరిస్థితి సాధారణ స్థితికి…

Read More

నూతనంగా సవరించిన వేతనాల పట్ల ఉద్యోగుల నిరసనలను, సమ్మె హెచ్చరికలను పట్టించుకోకుండా అమలుకు  ప్రయత్నిస్తున్న వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంకు ఉద్యోగుల నుండి తిరస్కారం ఎదురవుతున్నది. ఈ మేరకు ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను అమలు చేయడానికి ట్రెజరీ ఉద్యోగులు ఇప్పటికే తిరస్కరించగా, తాజాగా పే అండ్‌ అక్కౌంట్స్‌ సిబ్బంది కూడా అడ్డం తిరిగారు. ఆ పనిచేసేది లేదని స్పష్టం చేశారు. జీతాల బిల్లులు తయారు చేసి, చెల్లింపులు చేయడానికి ట్రెజరీ ఉద్యోగులు తిరస్కరించడంతో, ఆ బాధ్యతను పే అండ్‌ అక్కౌంట్స్‌ సిబ్బందికి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఆ శాఖ ఉద్యోగులు భగ్గుమన్నారు. కొత్త పిఆర్‌సిని వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తుంటే, ఆ ఉత్తర్వుల అమలుకు కసరత్తు చేయాలనితమను ఆదేశించడమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయలేమని స్పష్టం చేశారు.. ఈ మేరకుపే అండ్‌ ఎకౌంట్స్‌ ఆఫీస్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎం వెంకటేశ్వరరెడ్డి, ప్రధాన…

Read More

ఉత్తర్‌ప్రదేశ్ సహా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బహిరంగ ప్రచార కార్యక్రమాలపై అమలవుతున్న నిషేధాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెలాఖరు వరకు పొడిగించింది. ఎన్నికల తేదీలు ప్రకటించిన సమయంలోనే కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని బహిరంగ సభలు, ర్యాలీలు, పాదయాత్రలు వంటి భారీ జనసందోహానికి తావిచ్చే కార్యక్రమాలపై నిషేధాన్ని విధించిన విషయం తెలిసిందే.  ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా కరోనా  కొత్త కేసుల సంఖ్య, ఒమిక్రాన్ రకం కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం నిషేధాజ్ఞలను జనవరి 31 వరకు పొడిగిస్తూ, మొదటి, రెండవ విడత అభ్యర్థుల విషయంలో కొన్ని మినహాయింపులు ఇచ్చింది.  శనివారం ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర నేతృత్వంలో సమావేశమైన ఎన్నికల సంఘం అధికారులు, కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ సహా మరికొందరు ఉన్నతాధికారుల వీడియో కాన్ఫరెన్స్ విధానంలో కరోనా  పరిస్థితిపై సమీక్ష…

Read More

వ్యాక్సిన్ తీసుకున్న‌వారికి కూడా క‌రోనా సోకుతూ ఉండడం, పైగా ఎప్పటికప్పుడు కొత్త రకపు వేరియంట్లు వేస్తుండడంతో అన్ని వేరియంట్లకు కట్టడిగా  రెండు కొత్త ఔష‌ధాల‌పై ల‌క్నోలోని సెంట్ర‌ల్ డ్ర‌గ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూడ్ ప‌రిశోధ‌న చేస్తోంది. దాంతో ఎవ‌రి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉండే మందును రోగులకు అందజేసే  కృషి చేస్తున్నారు.  క‌రోనా రోగులకు సురక్షితమైన ఔషధ కాంబినేషన్ ను ఇవ్వడంపై చీఫ్ సైంటిస్ట్ రవి శంకర్ నేతృత్వంలోని బృందం దానిపై ఇప్పటికే రీసెర్చ్ మొదలుపెట్టింది. వేర్వేరుగా పనితీరును కనబరిచే యాంటీ వైరల్ మందులను కలిపి వాడితే మెరుగైన ఫలితాలుంటాయని నిపుణులు వెల్ల‌డించారు.  అలాంటి రెండు కాంబినేషన్లపై తాము ప్రయోగాలు చేస్తున్నామని రవిశంకర్ తెలిపారు.  ఉమిఫెనోవిర్–మోల్నుపిరవిర్, ఉమిఫెనోవిర్–నిక్లోసమైడ్ (యాంటీ పారాసైటిక్) మందులతో ట్రీట్ మెంట్ చేయడంపై దృష్టి సారించామని తెలిపారు. మోల్నుపిరవిర్ తో దుష్ప్రభావాలు ఎక్కువగా ఉండడంతో కేవలం అత్యవసర వినియోగానికే మన దేశంలో ఆమోదం లభించింద‌ని చెప్పారు.  ఈ నేపథ్యంలోనే మోల్నుపిరవిర్…

Read More