Author: Editor's Desk, Tattva News

ఏపీలో ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు భగ్గుమన్నాయి. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన 23 శాతం ఫిట్‌మెంట్‌ను వ్యతిరేకిస్తున్నారు. అలాగే, హెచ్‌ఆర్‌ తగ్గింపు, సీసీఏ రద్దు, 70-75 సంవత్సరాల పెన్షనర్లకు ఇచ్చే అదనపు పెన్షన్‌కు సంబంధించి విడుదల చేసిన జీవోలపై ఉద్యోగ, ఉపాధ్యాయులు రగిలి పోతున్నారు.  ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు రాష్ట్రవ్యాప్తంగా నిరసన, ఆందోళనలు చేపట్టారు. పీఆర్సీపై ఏకపక్ష జీవోలు జారీ చేసిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఏపీ ఉద్యోగ సంఘాలు సమరానికి సిద్ధమయ్యాయి. సమ్మె అస్త్రాన్ని ప్రయోగించనున్నట్లు తెలిపాయి. అంతేకాదు.. కలెక్టరేట్ల ముట్టడికి పిలుపు ఇచ్చాయి. శుక్రవారం సమ్మె నోటీసు ఇచ్చేందుకు ఉద్యోగ సంఘాల నేతలు సిద్ధమయ్యారు.  అన్ని సంఘాలు, ఇరు జేఏసీల ఐక్య కార్యాచరణ వేదిక చర్చించుకుని నిర్ణయం తీసుకోనున్నాయి. పీఆర్సీ కోసం ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు గతంలో ఎన్నాడూ సమ్మె చేయలేదు. ఇప్పుడు సమ్మె వరకు వెళితే తొలి పీఆర్సీ సాధన…

Read More

ఆంధ్ర ప్రదేశ్, బీహార్ రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా పరిహారం చెల్లింపులో జాప్యం చేయడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తంచేసింది. ఈ వ్యవహారంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు వచ్చి కోర్ట్ ముందు హాజరు కావాలని కూడా సమన్లు జారీ చేసింది. కరోనా పరిహారం చెల్లింపులో జాప్యంపై సుప్రీం కోర్టు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ ఖన్నాలతో కూడిన బెంచ్ బుధవారం విచారణ జరిపింది. ఇరు రాష్ట్రాల సీఎస్లు విచారణకు హాజరుకావాలని బెంచ్ ఆదేశించింది. వారు చట్టానికి అతీతులు కారని స్పష్టం చేసింది. కరోనాతో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు ఎక్స్గ్రేషియా చెల్లింపుకోసం మార్గదర్శకాలను రూపొందించాలని నేషనల్ డిజాస్టర్ మెయింటెనెన్స్ అథారిటీ (ఎన్డీఎంఏ)ని 2021 జూన్ 30న సుప్రీం కోర్టు ఆదేశించింది. ఎక్స్ గ్రేషియా సాయంగా అందించాల్సిన మొత్తాన్ని నిర్ణయించే బాధ్యతను ఎన్డీఎంఏకే వదిలివేసింది. కోర్టు. తర్వాత కరోనా మృతుల కుటుంబాలకు రూ.50 వేల పరిహారం చెల్లించాలని సిఫార్సు చేసినట్లు పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం…

Read More

తొలుత ముగ్గురు మంత్రులతో పాటు 11 మంది ఎమ్యెల్యేలు, ముఖ్యంగా ఓబిసి వర్గాలకు చెందిన వారు బిజెపికి రాజీనామా చేయడం, దాదాపు అందరు సమాజవాద్ పార్టీలో చేరడంతో ఇక ఉత్తర ప్రదేశ్ లో బిజెపి పనైపోయిందని అంటూ దేశంలో కొందరు సంబరాలు చేసుకోవడం ప్రారంభించారు.  అయితే ఈ పరిణామాల పట్ల మౌనంగా, ఏమీ పట్టన్నట్లు వ్యవహరించిన బిజెపిలోకి ఇప్పుడు వలసల బయలుదేరడం ప్రతిపక్షాలలో కలవరం కలిగిస్తున్నది. మొదటగా ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి సిద్ధంగా ఉన్నానని అంటూ సంకేతాలు ఇస్తున్న ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ మరదలు, ఆ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణా యాదవ్ బీజేపీలో చేరడంతో షాక్ కు గురయ్యారు.  ఆ వెంటనే కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన “లడకీ  హూఁ, లడ్ సక్తీ హూఁ’’ (నేను బాలికను, నేను పోరాడగలను) ప్రచారంలో పోస్టర్ గర్ల్, యూపీ మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు  డా. ప్రియాంక మౌర్య బీజేపీలో చేరబోతున్నట్లు కధనాలు వెలువడ్డాయి. శాసన సభ ఎన్నికల్లో తనకు టిక్కెట్ ఇవ్వకపోవడంతో ఆమె కాంగ్రెస్‌పై…

Read More

ఉత్తర ప్రదేశ్ లో ఒక సీట్ విషయంలో బిజెపి ఇరకాట పరిస్థితి ఎదుర్కొంటున్నది. అక్కడి నుండి తామే పోటీ చేస్తాం అంటూ భార్య, భర్తలు ఇద్దరు ఎవ్వరికీ వారుగా చెప్పుకొంటున్నారు. భార్య ప్రస్తుతం అక్కడ శాసనసభ్యురాలు. పైగా మంత్రి కూడా. ఆమె  అప్పుడే ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తూకొంటున్నారు. భర్త కూడా తానే అభ్యర్థిని అని చెప్పుకొంటున్నారు. ఒకరి ప్రచారంలో మరొకరి పేరు, ఫోటో లను ప్రస్తావించడం లేదు.  ఆమె యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో మహిళా సంక్షేమ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యతలు) స్వాతి సింగ్, ఆమె భర్త, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు దయాశంకర్ సింగ్.  ఇద్దరు ఎవ్వరికీ వారుగా లక్నో జిల్లాలోని సరోజినీ నగర్ నుండి పోటీ చేస్తున్నట్లు చెప్పుకొంటున్నారు. యూపీలో నాలుగో దశ ఎన్నికల్లో ఫిబ్రవరి 23న ఇక్కడ ఓటింగ్ జరుగుతుంది.   దయాశంకర్ 2016లో మాయావతిపై కించపరిచే వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. బీఎస్పీ నేతలు నిరసన వ్యక్తం చేయడం,…

Read More

బంగ్లా యుద్ధం – 35 బంగ్లాదేశ్‌లో హిందువులపై విస్తృతంగా, సమన్వయంతో జరుగుతున్న దాడులు పాలక అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలు, నాయకుల ప్రమేయం లేకుండా సాధ్యమయి ఉండెడిది కాదని పరిశీలకులు భావిస్తున్నారు. ఇస్లామిస్ట్ మూకలు హిందువులపై దాడి చేసి చంపినప్పుడు, హిందువులు, బాలికలపై అత్యాచారం చేసినప్పుడు, దుర్గా పూజ పండళ్లను ధ్వంసం చేసినప్పుడు, మందిరాలపై దాడి చేసి, గృహాలు, వ్యాపారాలను దోచుకుని, అపవిత్రం చేసినప్పుడు, హిందువును లక్ష్యంగా చేసుకున్నప్పుడు పోలీసులు అధికార పక్ష సభ్యుల ప్రమేయం కారణంగానే మౌనంగా ఉన్నట్లు ఆరోపణలు చెలరేగుతున్నాయి. బంగ్లాదేశ్‌లోని మైనారిటీ సంస్థల అత్యున్నత సంస్థ అయిన బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ నేతలు ఈ అంశాన్ని స్పష్టం చేస్తున్నారు. అలాగే రాడికల్ బంగ్లాదేశ్ జమాత్-ఇ-ఇస్లామీ పాత్ర ఉన్నట్లు కూడా పేర్కొంటున్నారు. బంగ్లాదేశ్‌లోని ఇస్కాన్ (ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ కృష్ణ కాన్షియస్‌నెస్) ప్రధాన కార్యదర్శి చారు చంద్ర దాస్ బ్రహ్మచారి, మందిరాలు, హిందూ మత సంస్థలపై దాడులలో అవామీ…

Read More

గోదావరికావేరి నదుల అనుసంధనంతోనంతో గోదావరి నదిలో  గుర్తించిన   324టిఎంసిల మిగులు జలాలలో 247 టీఎంసీలు తరలించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ఉత్తర భారతం నుంచి దక్షిణ భారత దేశానికి మిగులు జలాలను తలించాలన్న నదుల అనుసంధాన ప్రక్రియను కార్యరూపంలోకి తెచ్చే చర్యలను కేంద్రం చేపట్టింది.  కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ కార్యదర్శి అధ్యక్షతన జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ 69వ బోర్డు సమావేశంలో దక్షిణ భారతంలో కృష్ణా, పెన్నా , బేసిన్‌ల పరిధిలో నీటి వనరుల కొరతను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం తొలిదశగా గోదావరి-కావేరి నదులు అనుసంధానం కార్యక్రమాన్ని ప్రతిపాదించింది. పైగా, నదులు అనుసంధానం కోసం అయ్యే వ్యయంలో సింహభాగం నిధులు కేంద్రప్రభుత్వమే భరిస్తుందని కూడా వెల్లడించింది. అయితే ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగా గోదావరి  జలాల పంపిణి విషయంలో తమ, తమ హక్కుల విషయం తేల్చాలని పట్టుబడుతున్నాయి.  ఇందుకు సంబంధించిన డిపిఆర్‌ను రూపొందించింది. తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చంపల్లి నుంచి గోదావరి నీటిని తమిళనాడులోని గ్రాండ్ అనికట్ వరకూ 1210కిలోమీటర్ల…

Read More

ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో తిరిగి బిజెపి అధికారంలోకి వస్తుందని జీ న్యూస్ నిర్వహించిన ఒపీనియన్ పోల్ వెల్లడి చేసింది.  జీ న్యూస్ నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లో ప్రతిబింబించే డేటా ప్రకారం, ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం ఓట్లలో 41 శాతం ఓట్లతో బీజేపీ కూటమి ముందంజలో ఉంటుందని, సమాజ్‌వాదీ పార్టీ 34 శాతం ఓట్లతో రెండో స్థానంలో ఉంటుందని తెలిపింది. ఇక బీఎస్పీ 10 శాతం, కాంగ్రెస్ 6 శాతంతో చాలా దూరంలో ఉన్నట్లు పేర్కొన్నది.  రాష్ట్రంలో బిజెపి కూటమి మెజారిటీ సీట్లను గెలుచుకునే అవకాశం ఉందని కూడా వెల్లడిల్న్చింది.  యూపీ ఎన్నికల్లో బీజేపీ 267 (245 నుండి 267 వరకు) సీట్లు గెలుచుకుంటుందని, ఎస్పీ దాదాపు 125 నుంచి 148 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఇది బీఎస్పీ 5 నుండి 9, కాంగ్రెస్ 3 నుండి 7 సీట్లు మాత్రమే గెల్చుకోగలవు.  రాబోయే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉత్తరప్రదేశ్‌లో కాబోయే ముఖ్యమంత్రి అభ్యర్థులలో…

Read More

తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి కరోనా కేసులు దాదాపు రెట్టింపు సంఖ్యలో భారీగా పెరిగాయి. పీలో ఐదారు వేలుగా నమోదవుతున్న రోజువారీ కేసులు…బుధవారం ఏకంగా 10 వేలు దాటగా, తెలంగాణలో రెండు, రెండున్నర వేలుగా నమోదవుతున్న కేసులు 3,557లకు పెరిగాయి.  తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,11,178 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 3,557 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,18,196కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. మొత్తం కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 1,474 కేసులు నమోదయ్యాయి.మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 321, రంగారెడ్డి జిల్లాలో 275 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 4,065కు చేరింది. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా మారింది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 41,713 మందికి కరోనా…

Read More

భారతదేశపు అత్యంత విజయవంతమైన మహిళా టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఇక క్రీడా పోటీల నుండి విరమించుకొంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఓపెన్ 2022 తొలి రౌండ్ లో ఓటమి అనంతరం తన టెన్నిస్ కెరీర్ కు ముగింపు పలుకుతున్నట్లు వెల్లడించారు. టెన్నిస్ ర్యాంకింగ్స్ లో 68వ స్థానంలో ఉన్న సానియా మీర్జా సింగిల్స్ విభాగంలో 27వ ర్యాంకులో సత్తా చాటుతోంది. 2016లో జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ లో మార్టినా హింగిస్ తో కలిసి టైటిల్ సాదించింది. భారత్ తరపున తొలి గ్రాండ్ స్లామ్ అందుకున్న భారతీయురాలిగా చరిత్ర సృష్టించి ఎన్నో విజయాలతో భారత టెన్నిస్ కు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన హైదరాబాదీ సానియా మీర్జా కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలోనే పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను వివాహం చేసుకుంది. పెళ్లి చేసుకుని షోయబ్ మాలిక్ తో వైవాహిక జీవితం గడుపుతున్నప్పటికీ టెన్నిస్ రాకెట్ విడిచిపెట్టలేదు. పిల్లాడిని…

Read More

బంగ్లా యుద్ధం – 34 బంగ్లాదేశ్ లో మైనారిటీలైన బెంగాలీ హిందువులకు 2021లో నవరాత్రి ఉత్సవాలు కాళరాత్రులుగా మారాయి. వారు ప్రతియేడూ భక్తి శ్రద్దలతో జరుపుకొనే దుర్గామాత మండపాలపై హింసాయుత దాడులు జరిగాయి. హిందూ ప్రార్ధనా మందిరాలు, వారి ఇళ్ళు, వ్యాపార సముదాయాలపై దాడులు జరిగాయి. విధ్వంసం సృష్టించారు. అక్టోబర్ 13 నుండి నాలుగు రోజులపాటు నిరాటంకంగా దేశ వ్యాప్తంగా ఈ దాడులు జరిగాయి. బాంగ్లాదేశ్ ఏర్పడి 50 ఏళ్ళ తర్వాత కూడా ఇటువంటి ఉండడం ఆందోళన కలిగిస్తుంది. భారతదేశపు అత్యంత అస్థిర పొరుగు దేశాలలో ఒకటైన బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులు జరగడం ఇదే మొదటిసారి కాదు. గత ఐదు దశాబ్దాలుగా బంగ్లాదేశ్‌లో నివసిస్తున్న హిందువుల జనాభా 25 శాతం నుంచి ఏడు శాతానికి తగ్గింది. ఇస్కాన్, రామకృష్ణ మిషన్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఎదుర్కొంటున్న హింస ఈసారి దాడులకు కేంద్ర బిందువుగా నిలిచాయి. రామకృష్ణ మిషన్ కు బెంగాలీల హృదయాలలో మహోన్నత స్థానం ఉంది. అందుకనే మొదటిసారిగా పశ్చిమ…

Read More