దేశంలో ఎమర్జెన్సీ విధించిన తర్వాత ఇందిరాగాంధీకి పట్టిన గతే పోలీసుల రాజ్యం సాగిస్తున్న కేసీఆర్‌కూ పడుతుందని బిజెపి నేత, అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ హెచ్చరించారు. హనుమకొండలోని దీన్‌దయాల్‌నగర్‌లో 317 జీవోకు, బండి సంజయ్ అరెస్టుకు వ్యతిరేకంగా హనుమకొండలోని దీన్‌దయాల్‌నగర్‌లో నిర్వహించిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొంటూ సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, దమన నీతితో పరిపాలన సాగించిన వారంతా కాలగర్భంలో కలిసి పోయారని గుర్తు చేశారు. 2013 ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ప్రజాశక్తి ముందు ధన బలం పని చేయదని హుజూరాబాద్ ఎన్నికలు రుజువు చేశాయని స్పష్టం చేశారు. కమ్యూనిస్టులు కాలగర్భంలో కలిసిపోతున్నారని, అలాంటి వారికి కేసీఆర్ విందు భోజనాలు ఏర్పాటు చేయడం చూస్తుంటే, కనుమరుగైపోయే పార్టీలన్నీ ఒక్కదగ్గర చేరుతున్నట్టు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. నైజాంలను మించిన నిరంకుశ పాలనతో సీఎం కేసీఆర్ పూర్తిగా ప్రజల విశ్వాసం కోల్పోయారని, ఇప్పుడాయనకు పోలీసులు తప్ప ఎవరి మద్దతూ లేదనిస్పష్టం చేశారు.తెలంగాణను…
Author: Editor's Desk, Tattva News
ఒమైక్రాన్ వ్యాప్తితో దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్వరలో రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. ఆయా రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితులు, వైరస్ కట్టడి, ప్రజారోగ్య సన్నద్ధత గురించి తెలుసుకోనున్నారు. మోదీ ఆదివారం కేంద్ర మంత్రులు, పలువురు కీలక అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. దేశంలో కరోనా పరిస్థితిపై విస్తృతంగా చర్చించారు. మౌలిక వైద్య వసతులు, పిల్లలు, పెద్దలకు వ్యాక్సిన్ పంపిణీ తీరు తదితరాలను సమీక్షించారు. జిల్లా స్థాయిలో వైద్య వసతులను సంసిద్ధం చేసుకోవాలని.. పిల్లలకు టీకా పంపిణీని యుద్ధప్రాతిపదిక చేపట్టాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కరోనా కట్టడిలో ఆరోగ్య కార్యకర్తల విశేష కృషిని కొనియాడిన ప్రధాని మోదీ, వారితో పాటు ఫ్రంట్‌లైన్ కార్యకర్తలకూ ముందుజాగ్రత్త డోసును యుద్ధప్రాతిపదికన ఇవ్వాలన్నారు. పెద్ద సంఖ్యలో కేసులు వస్తుండడాన్ని దృష్టిలో పెట్టుకుని, లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలున్న పాజిటివ్‌ల హోం ఐసొలేషన్‌ను సమర్థంగా అమలు చేయాలని…
రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయంగా బిజెపికి పట్టు లభించేటట్లు చేయడం కోసం కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగిన్నట్లు కనిపిస్తున్నది. రెండు రాష్ట్రాలలోని పార్టీ నేతలతో వ్యక్తిగతంగా భేటీలు జరుపుతూ, వారికి మార్గనిర్ధేశం చేస్తున్నారు. తెలంగాణలో 2023లో అధికారంలోకి వచ్చే విధంగా, ప్రస్తుతం ప్రాతినిధ్యం లేని ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ బలమైన ప్రాతినిధ్యం పొందేవిధంగా వ్యూహాత్మకంగా అడుగులు వేసే విధంగా వారికి ఆదేశాలు ఇస్తున్నారు. వాస్తవానికి 2014లో బిజెపి అధ్యక్ష పదవి చేపట్టిన్నప్పుడే ఇప్పటి వరకు పార్టీకి చెప్పుకోదగిన ప్రాతినిధ్యం చట్టసభలలో లేని దక్షిణాది, తూర్పు రాష్ట్రాలలో పార్టీని బలోపేతం చేయడమే తన లక్ష్యంగా ప్రకటించారు. ఆ తర్వాతనే అస్సాం, త్రిపుర, పుదుచ్చేరి లలో అధికారంలోకి రావడం, పశ్చిమ బెంగాల్ లో అధికారం కోసం గట్టి ప్రయత్నం చేయగలగడం చేశారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో బిజెపికి చెప్పుకోదగిన ప్రాతినిధ్యం చట్టసభలలో లభించడం లేదు. జనవరి, 2015లో హైదరాబాద్, విజయవాడలలో పర్యటించిన ఆయన 2019 నాటికి అధికార పక్షంగా…
బుల్లిబాయి ఉదంతంపై కొన్ని సంస్థలు, మీడియా మతోన్మాదం కోణాన్ని ఆపాదించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ అనేకమంది ప్రముఖ మహిళలపై ఆన్‌లైన్ దుర్వినియోగపరచి అవమానకరమైన విధంగా వ్యవహరించిన చర్యలపై జరుగుతున్న దర్యాప్తులో వాస్తవాలు వెలుగు చూసేవరకు వేచి ఉండాలనిపేట్రియాటిక్ పీపుల్స్ ఫ్రంట్ అస్సాం (పిపిఎఫ్ఎ) హితవు చెప్పింది. ఈ యాప్ లో వందమందికి పైగా కొందరు జర్నలిస్ట్ లతో సహా ప్రముఖ మహిళలు, వారిలో అత్యధికంగా ముస్లిం మహిళల ఫోటోలను మార్చి పని మనుషులుగా అమ్మకానికి సిద్ధంగా ఉన్నారని అంటూ గత వారం ఆన్‌లైన్ లో ప్రకటనలు రావడం కలకలం రేపడం తెలిసిందే. అయితే ఆలస్యంగా యాప్ ను సంబంధిత వ్యక్తులే మూసివేశారు. ఈ విషయంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ పలువురు మహిళా కార్యకర్తలు వివిధ సెక్షన్ల కింద న్యూఢిల్లీ, ముంబైలలో పోలీసులకు ఫిర్యాదులు చేశారు. లింగ పక్షపాతం, లైంగిక వేధింపులు, మతపరమైన శత్రుత్వంతో వ్యవహరించే నిబంధనలను ప్రస్తావించారు. ఈ నేరంతో సంబంధం ఉన్నదనే అనుమానంతో ఇప్పటి వరకు అస్సాంలోని జోర్హాట్ కు…
భారత్ లో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ కార్యాలయాలు, చట్టసభలు, కోర్టుల్లో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా పార్లమెంట్ లో 400 మంది సిబ్బందికి, సుప్రీం కోర్ట్ లో నలుగురు న్యాయమూర్తులకు కరోనా అని తేలడంతో మొత్తం 150 మంది సిబ్బందిని క్వారంటైన్ కు తరలించారు సుమారు 400మందికి పైగా పార్లమెంట్ సిబ్బంది కరోనా బారినపడినట్లు అధికారులు తెలిపారు. జనవరి 4 నుండి 8 తేదీల మధ్య ఈ కేసులు వెలుగు చూశాయని అన్నారు. వచ్చే నెలలో పార్లమెంట్ బట్జెట్ సమావేశాలు జరగనున్న తరుణంలో కరోనా మహమ్మారి ఆందోళనకు గురిచేస్తున్నది. పార్లమెంటులోని 1,409 సిబ్బందికి పరీక్షలు నిర్వహించగా 402 మందికి పాజిటివ్‌గా నిర్థారణైందని, వేరియంట్ నిర్థారణ కోసం వారి నమూనాలను జినోమ్ సీక్వెన్సింగ్‌కు పంపామని పేర్కొన్నారు. కరోనా బారినపడ్డ ప్రతిఒక్కరూ ప్రభుత్వ నిబంధనల్ని పాటించాలని అంతర్గతంగా సిబ్బందికి సందేశం పంపినట్లు సమాచారం. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన…
తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఒక వంక ఉభయ కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనేతలతో భేటీలు జరుపుతూ, జాతీయ స్థాయిలో బిజెపిని గద్దె దింపడం గురించి సమాలోచనలు జరుపుతున్న సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కి ఫోన్ చేసి తెలంగాణ రాజకీయ పరిణామాల గురించి దాదాపు 15 నిమిషాల పాటు సంభాషించారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలను కూడా అడిగి తెలుసుకొంటూ . బండి సంజయ్ చేపట్టిన జాగరణ దీక్ష గురించి, అరెస్ట్ తదితర అంశాల గురించి చర్చించారు. సంజయ్ కార్యాలయంపై పోలీసుల దాడికి దారితీసిన పరిస్థితుల గురించి తెలుసుకున్నారు. ఇప్పటికే కరోనా నిబంధలను అధిగమించి జాగరణ దీక్ష చేపట్టారని అంటూ సంజయ్ ను బెయిల్ ఇవ్వడానికి వీలులేని నిబంధనలతో అరెస్ట్ చేయడం, రాష్ట్ర హైకోర్టు జోక్యం చేసుకొని పోలీసులకు చివాట్లు వేసి, విడుదల చేయడం తెలిసింది. ఈ సందర్భంగా బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా దగ్గర నుండి పలువురు…
బంగ్లా యుద్ధం – 24 ఇది కేవలం సైనిక విజయం మాత్రమే కాదు, భారత విదేశాంగ విధానంలో మొదటిసారి అత్యంత దూకుడుతనం ప్రదర్శించి, తిరుగుబాటు ధోరణిని వ్యక్తం చేసిన సమయం. ఒక నూతన భారత దేశం ఆవిర్భవించినదని ప్రపంచానికి సందేశం ఇచ్చిన సమయం కూడా. అప్పటి వరకు జవహర్ లాల్ నెహ్రు ఆవలంభించిన అలీన ఉద్యమంపై భిన్నంగా ఆచరణాత్మక రాజకీయాలను దౌత్యం విధానంలో అమలు పరచి, మొత్తం ప్రపంచాన్ని అబ్బుర పరచిన సందర్భం కూడా. 1971 యుద్ధంలో భారతదేశాన్ని దురాక్రమణదారుగా చూడకూడదని ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ చాలా స్పష్టమైన ప్రయత్నం చేశారు. యుద్దానికి ముందు పాకిస్తాన్ సేనలు సాగిస్తున్న మారణకాండ గురించి వివరించడం కోసం ఆమె ప్రపంచ దేశాలను చుట్టి వచ్చారు. ఆమె స్వయంగా జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, బెల్జియం, అమెరికాలలో 21 రోజుల పర్యటన చేశారు. తూర్పు బెంగాల్‌లోని సంక్షోభానికి రాజకీయ పరిష్కారం కోసం యాహ్యా ఖాన్ పాలనపై ఒత్తిడి తీసుకురావాలని, పాక్ జైలులో పంజాబ్ ప్రావిన్స్‌లోని మియాన్‌వాలిలో ఏకాంత నిర్బంధంలో ఉన్న షేక్ ముజిబుర్ రెహమాన్‌కు…
దేశంలో మరోసారి కరోనా కేసులు లక్షల సంఖ్యలో వస్తూ ఉండడంతో ప్రజలలో ఆందోళన చెలరేగుతుంది. గత ఏడాది మాదిరిగా తిరిగి దేశవ్యాప్తంగా లేదా తీవ్రంగా ఉన్న రాష్ట్రాలలో సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తారని భయాలు చెలరేగుతున్నాయి. ఆ విధంగా చేస్తే తిరిగి ఆర్ధిక, ఉపాధి కార్యక్రమాలు కోలుకోలేని విధంగా దెబ్బ తింటాయని ఖంగారు పడుతున్నారు. అయితే ఈ విషయమై నిబంధనలను ప్రజలు పాటిస్తుంటే సంపూర్ణ లాక్‌డౌన్ అవసరం లేదని, దాని వల్లన కరోనా కట్టడి సాధ్యం కాదని పలువురు నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తాజాగా, ప్రభుత్వ ఆంక్షలను ప్రజలు విధిగా పాటిస్తే కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్రం లో మరో సంపూర్ణ లాక్‌డౌన్ అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రధాన శాస్త్రవేత్త సౌమ్యా స్వామినాథన్ స్పష్టం చేశారు. ఈ వైరస్ ప్రజలతో శాశ్వతంగా సహజీవనం చేస్తుందని పేర్కొంటూ దేశంలో కరోనా వైరస్ వెలుగు చూసిన తొలి దశలో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట ఏవిధంగా వేయాలన్న అంశంపై పెద్దగా అవగాహన…
సొంత మంత్రులకు, పార్టీ నేతలకు, ఉన్నతాధికారులకు సహితం కలవడానికి అందుబాటులో ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఒకే రోజున రెండు కమ్యూనిస్ట్ పార్టీల అగ్ర నేతలతో విడివిడిగా కలవడం, రాజకీయ సమాలోచనలు జరపడం విస్మయం కలిగిస్తుంది. పైగా, ఆ పార్టీలతో కలసి `బిజెపి ముక్త్ భారత్’ కోసం పోరాడాలని పిలుపు ఇచ్చిన్నట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ లేని ఫెడరల్ ఫ్రంట్ ద్వారా బిజెపిని ఎదుర్కోవాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రితో కలసి చాలాకాలంగా చెబుతున్న కేసీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి సన్నిహితుడిగా, ఆమెకు `రాజకీయ సలహాదారుడు’గా పేరొందిన సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో భేటీ కావడం ఆసక్తి కలిగిస్తుంది. కాంగ్రెస్ లేని కూటమి బిజెపిని ఎదుర్కోలేదని ఆయన స్పష్టంగా చెప్పేసారు కూడా. ఏచూరితో పాటు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, త్రిపుర మాజీ సిఎం మాణిక్ సర్కార్, సిపిఎం కేంద్ర పొలిట్ బ్యూరో సభ్యులు రామచంద్రన్ పిళ్లై , బాల కృష్ణన్, ఎం ఎ బేబీ…
వంద రోజుల్లోనే పంజాబ్ లో ముగ్గురు డీజీపీలు మారారు. కొత్త డీజీపీగా 1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారి వీరేష్ కుమార్ భవ్రా ఛార్జ్ తీసుకున్నారు. ఎన్నికల కమిషన్ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే కొద్ది గంటల ముందు వీరేష్ కుమార్ భావ్రా కొత్త డీజీపీగా నీయమితులయ్యారు. అలాగే పంజాబ్ లో ఏడుగురు ఐపీఎస్ లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇంటెలిజెన్స్ ఐజిగా ఉన్న నౌనిహాల్ సింగ్ ను జలంధర్ కమిషనర్ గా పంపారు. హ్యూమన్ రైట్స్ ఐజిగా ఉన్న అరుణ్ కుమార్ మిట్టల్ ను రూప్ నగర్ రేంజ్ ఐజీగా నియమించారు. .ఫిరోజ్‌పూర్ ఎస్ ఎస్ పిని హర్మన్‌దీప్ సింగ్ హన్స్లూను థియానాలోని 3వ ఐ ఆర్ బి కమాండెంట్‌గా నియమించారు. ఫిరోజ్‌పూర్ కొత్త ఎస్‌ఎస్పీగా నరీందర్ భార్గవ్ నియమితులయ్యారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాన్వాయ్ ఫ్లైఓవర్‌పై చిక్కుకున్న బుధవారం “భద్రతా లోపం” సమయంలో హన్స్ ఫిరోజ్‌పూర్ ఎస్ ఎస్ పి మోదీ…