Author: Editor's Desk, Tattva News

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్ఫూర్తితో వివిధ సామజిక క్షేత్రాలలో పనిచేస్తున్న సంస్థల ముఖ్య కార్యకర్తలతో మూడు రోజులపాటు జరిగే ఆర్ ఎస్ ఎస్ జాతీయ స్థాయ సమన్వయ సమావేశం బుధవారం హైదరాబాద్ లో ప్రారంభమైనది. సంఘ్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్, సర్ కార్యవాహ దత్తాత్రేయ హాసభలే తో పాటు ఆ సంస్థకు చెందిన మొత్తం ఐదుగురు సహా సర్ కార్యవహ్ లు, ఇతర ముఖ్యమైన కార్యనిర్వాహకులు పాల్గొన్నారు. వివిధ సామజిక క్షేత్రాలలో పనిచేస్తున్న 36 సంస్థలకు చెందిన 216 మంది ముఖ్య కార్యనిర్వాహకులు సమావేశానికి హాజరయ్యారు. అయితే ఈ సమావేశాలలో ఎటువంటి విధాన నిర్ణయాలు తీసుకోమని, కేవలం పరస్పరం సమాచారాన్ని, అభిప్రాయాలను పంచుకోవడం మాత్రమే చేస్తామని సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ తెలిపారు. సంవత్సరానికి ఒకసారి జరిగే ఈ సమావేశాలు గత ఏడాది గుజరాత్ లోని కర్ణావతిలో జరిగాయి. ఆ సమావేశాలలో ఆర్ధిక, ఉపాధి సంబంధ అంశాలపై సమాలోచనలు జరుగగా, ఈ పర్యాయం విద్యాసంబంధ అంశాలపై చర్చలు జరుగుతాయని…

Read More

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను 14 రోజులపాటు రిమాండ్ కు పంపుతూ కింది కోర్ట్ ఇచ్చిన ఉత్తరువును తెలంగాణ హైకోర్టు తప్పుపట్టింది. దానిని కొట్టివేస్తూ, వెంటనే వ్యక్తిగత పూచీపై విడుదల చేయమని ఆదేశించింది. కరోనా నిబంధనలు ఉల్లంఘించారని రిమాండ్ రిపోర్టు ఇవ్వడం సరికాదని స్పష్టం చేసింది. పైగా, అరెస్ట్ చేసిన విధానాన్ని కూడా ప్రశ్నించింది. రిమాండ్ చేయడంలో మీ ప్రత్యేక శ్రద్ధ ఏంటని అంటూ పోలీసులను నిలదీసింది. పోలీసులు పెట్టిన 333 సెక్షన్ అక్రమమని, ఎఫ్ఐఆర్ లో నుండి ఆ సెక్షన్ తొలగించాలని పేర్కొంటూ చట్టాన్ని అందరికి సమానంగా వర్తింపజేయాలని హితవు చెప్పింది. కరీంనగర్‌లో తనపై నమోదు చేసిన కేసులపై బండి సంజయ్‌ హైకోర్టును ఆశ్రయించారు. తనపై కరీంనగర్‌ మెజిస్ట్రేట్‌ ఇచ్చిన జ్యూడిషియల్‌ రిమాండ్‌ ఆర్డర్‌ను రద్దు చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. బండి సంజయ్‌ పిటిషన్‌ను విచారించిన కోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. బండి సంజయ్ ను విడుదల చేయాలని జైళ్లశాఖ డీజీకి హైకోర్టు ఆదేశమిచ్చింది. రెండు విషయాలలో పోలీసుల తీరును న్యాయస్థానం తప్పబట్టింది. ఎఫ్ఐఆర్…

Read More

బంగ్లా యుద్ధం – 21 1971 యుద్ధంలో ఢాకా ముట్టడిలో కీలకమైన ప్రళయంను తలపించే విధంగా ఉండే మేఘనా నదిని భారత సైన్యం దాటుకొంటూ వెళ్లడం ఒక అద్భుతమే అని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు. బంగ్లాదేశ్ గుండా బంగాళాఖాతంలోకి ప్రవహించే చాలా నదుల వలె కాకుండా, మేఘన హిమాలయాలలోని హిమానీనదాలనుండి వస్తుంది.  ఇప్పటికీ, ఇది శక్తివంతమైన నదులలో ఒకటి. మేఘన బంగ్లాదేశ్ మైదానాలలోకి దిగి, తూర్పు భారతదేశంలోని రోలింగ్ కొండల నుండి సముద్ర మట్టానికి ఎగబాకిన అత్యంత వేగంగా ప్రవహించే ప్రవాహాల సంగమం ద్వారా ఏర్పడింది. ప్రపంచంలోనే అతి పెద్ద రుతుపవన వర్షపాతాన్ని ఈ నది పొందుతుంది. తత్ఫలితంగా, రుతుపవనాల సమయంలో, నది ఉబ్బి, ఒడ్డున పగిలి దేశంలోని చాలా భాగాన్ని నీటి అడుగున ఉంచుతుంది.  అది కేవలం సముద్రపు జలాల మట్టంకన్నా ఎత్తుగా ప్రవహిస్తుంది. నీరు తగ్గుముఖం పట్టడంతో, అది చిత్తడి నేలలు, శాశ్వత సరస్సులను వదిలివేస్తుంది. దానితో అత్యంత అధునాతన సైనిక విన్యాసాలు కూడా అక్కడ…

Read More

రెండేళ్లుగా మహారాష్ట్రలో ఎన్సీపీతో పాటుగా కాంగ్రెస్ తో కలసిన కూటమి ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్నప్పటికీ ఆ పార్టీ పట్ల శివసేన ఎడమొఖం, పెడముఖంగా ఉంటూ వస్తున్నది. ఎన్సీపీని తప్ప తమను పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ సహితం తన అసంతృప్తిని బహిరంగానే వ్యక్తం చేస్తూ వచ్చింది. శివసేన సహితం కాంగ్రెస్ ను నమ్మదగిన భాగస్వామిగా పరిగణించడం లేదు. రాహుల్ గాంధీకి సన్నిహితుడైన ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోల్ శివసేన తమ పార్టీని ఉద్దేశ్య పూర్వకంగా పాలనలో పక్కన పెడుతున్నట్లు పలుసార్లు విమర్శించారు. పైగా, శరద్ పవార్ ను కూటమికి “రిమోట్ కంట్రోల్” అంటూ ఎద్దేవా కూడా చేశారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుందని ప్రకటించడం ద్వారా శివసేనతో తమ పొత్తు తాత్కాలికమే అనే సంకేతాలు ఇస్తూ వస్తున్నారు. అయితే గత నెలలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బనెర్జీ ముంబైకు వచ్చి, ప్రతిపక్షంగా కాంగ్రెస్ పోరాడలేక పోతున్నదని అంటూ, కాంగ్రెస్ లేకుండా ప్రాంతీయ పక్షాల కూటమి మాత్రమే బిజెపిని ఓడించగలదని చెప్పిన తర్వాత శివసేన వైఖరిలో అకస్మాత్తుగా మార్పు కనిపిస్తున్నది. కాంగ్రెస్…

Read More

అంతర్జాతీయ పరిణామాల కారణంగా చైనాను వదిలి భారత్ వైపు చూస్తున్న బహుళజాతి పారిశ్రామిక సంస్థలను బెదిరించే రీతిలో భారత్ లో వారితో సంబంధం ఏర్పర్చుకొనే కంపెనీలలో కార్మిక అశాంతి అస్త్రాన్ని చైనా ప్రయోగిస్తుందా? అవుననే నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. తమిళనాడులో బహుళజాతి కంపెనీలకు అతిపెద్ద సముదాయమైన శ్రీపెరంబూరు పారిశ్రామికవాడలోని పరిణామాలు అటువంటి అనుమానాలు కలిగిస్తున్నాయి. ఆపిల్ ఇంక్ తమ సరఫరాదారుగా ఎంపిక చేసుకున్న చెన్నై సమీపంలోని శ్రీపెరంబుదూర్ వద్ద గల ఫాక్స్‌కాన్ కంపెనీలో ఇటీవల చెలరేగిన కార్మికుల అశాంతికి వామపక్ష కాంతిక సంఘాలకు చైనా అందిస్తున్న సహాయమే కారణమని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. కొంతమంది సిబ్బందికి అనారోగ్యాన్ని కలిగించే నాసిరకం క్యాంటీన్ ఆహారం కారణంగా మోకాలి నొప్పులు కలిగించేటట్లు చేయడం పారిశ్రామిక సంస్థలను అస్థిరపరిచే అంతర్జాతీయ ఎత్తుగడను సూచిస్తున్నట్లు ఆ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ కంపెనీ పట్ల చైనాకు ఆగ్రహంతో ఉన్నదన్నది బహిరంగ రహస్యమే అని ఈ సందర్భంగా పారిశ్రమైక వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదివరలో ఆపిల్ ఐఫోన్ కోసం 48 శాతం భాగాలు చైనాలో ఉత్పత్తి…

Read More

చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి భారతదేశ పొరుగున ఉన్న మాల్దీవులు, శ్రీలంకతో సహా హిందూ మహాసముద్రం లోని ఐదు సముద్ర తీర రాష్ట్రాలను సందర్శించి నూతన సంవత్సరాన్ని ప్రారంభించారు. హిందూ మహాసముద్రంలో ప్రాబల్యం కోసం భారత్, చైనా రెండూ పోటీ పడుతున్నాయి. విదేశాంగ మంత్రి పర్యటన బీజింగ్ భద్రతతో పాటు ఈ ప్రాంతంలో ఆర్థికపరమైన ప్రాబల్యం లక్ష్యంగా సాగుతున్నది. జనవరి 4 నుంచి 7 వరకు ఎరిట్రియా, కెన్యా, కొమొరోస్‌లలో మొదటి విడత పర్యటన ఉంటుంది. ఆ తర్వాత మాల్దీవులు, శ్రీలంకలో పర్యటిస్తారు. చైనా ఆఫ్రికన్ దేశాలను ఆకర్షించడం ప్రారంభించినప్పటి నుండి, సంవత్సరం ప్రారంభంలో ఆఫ్రికాను మొదటగా సందర్శించడం చేయడం చైనా నాయకులకు సంప్రదాయంగా మారింది.అయితే “ఇండియా ఔట్” ప్రచారం పుంజుకుంటున్న మాలేకు వాంగ్ యి పర్యటన న్యూఢిల్లీకి మరింత ఆసక్తిని కలిగిస్తుంది. అక్కడ, బీజింగ్ అనుకూల మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ నవంబర్ 30న అన్ని అవినీతి ఆరోపణల నుండి క్లియర్…

Read More

అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా రాజధాని అమరావతి అభివృద్ధి పట్ల ఏమాత్రం శ్రద్ద చూపని వైసిపి ప్రభుత్వం అకస్మాత్తుగా పలు చర్యలకు పాల్పడటం రాజకీయంగా కలకలం రేపుతున్నది. మూడు రాజధానుల పేరుతో అమరావతిని `అరణ్య రోదన’గా మారి, సంవత్సరంకు పైగా ఆందోళన చేస్తున్న ఉచితంగా భూములిచ్చిన రైతులను పట్టించుకొనే ప్రభుత్వం ఇప్పుడు అకస్మాత్తుగా రాజధాని అమరావతిలోని 19 గ్రామ పంచాయతీలను కలిపి ‘అమరావతి క్యాపిటల్‌ సిటీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ‘ పేరుతో ప్రత్యేక నగర పాలక సంస్థ ఏర్పాటుకు ప్రతిపాదనను మళ్లీ తెరపైకి తీసుకు రావడం పలువురికి విస్మయం కలిగిస్తున్నది. కేవలం అమరావతి గ్రామాలలో విభజన తీసుకు రావడం కోసమే దురుద్దేశపూర్వకంగా చేస్తున్నారని అంటూ ఆ ప్రాంత రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది రాజధానిలోని కొన్ని గ్రామాలను తొలగించి మంగళగిరి తాడేపల్లి మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసిన ప్రభుత్వం కొత్త సంవత్సరం ప్రారంభంలోనే అమరావతి కేపిటల్‌ సిటీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ పేరుతో హడావుడి ప్రారంభించింది. తుళ్లూరు మండలంలోని 16 గ్రామ పంచాయతీలు, మంగళగిరి మండలంలోని 3…

Read More

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఒమిక్రాన్‌ కేసులు సరికొత్త ప్రమాదాన్ని పెంచవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) వెల్లడించింది. కేసుల పెరుగుదల భవిష్యత్‌లో ప్రమాదకర వేరియంట్‌గా పరిణమించవచ్చని హెచ్చరిస్తోందని డబ్ల్యుహెచ్‌ఒ సీనియర్‌ ఎమర్జెన్సీస్‌ ఆఫీసర్‌ కేథరీన్‌ స్మాల్‌వుడ్‌ తెలిపారు. ఒమిక్రాన్‌ వేగంగా వ్యాపిస్తూ.. ప్రజల్లో అధకంగా వైరస్‌ని విస్తరింపచేస్తుందని, దీంతో మరోకొత్త వేరియంట్‌ ఉత్పన్నంకావచ్చని, .. మరణాలకు దారితీయవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. డెల్టా కంటే తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ.. అనంతరం వచ్చే వేరియంట్‌ తీవ్రత ఎలా ఉంటుందో ఎవరూ ఊహంచలేరని పేర్కొన్నారు. మహమ్మారి ప్రారంభమైనప్పటినుండి ఐరోపాలో పది కోట్ల కేసులు నమోదవగా.. గతేడాది చివరి వారం నుండి 50 లక్షలకు పైగా కేసులు వచ్చాయని పేర్కొంటూ గతంలో కన్నా తీవ్రమైన పరిస్థితులు రావచ్చని హెచ్చరించారు. ప్రస్తుతం ప్రజలు ప్రమాదకర దశలో ఉన్నారని, పశ్చిమ ఐరోపాలో వ్యాధి రేటు గణనీయంగా పెరుగుతోందని, అయితే పూర్తి ప్రభావం ఇంకా స్పష్టంగా లేదని చెప్పారు. డెల్టాతో పోలిస్తే.. ఒమిక్రాన్‌ వేరియంట్‌తో…

Read More

హుజూరాబాద్‌‌లో ఓడిపోయినప్పటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ మానసిక సమతుల్యతను కోల్పోయారని అంటూ బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా ఘాటుగా విమర్శించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ కు నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ జరపడానికి కరోనా నిబంధనల పేరుతో పోలీసులు అనుమతి ఇవ్వక పోవ్వక పోవడంతో సికింద్రాబాద్ లో గాంధీ విగ్రహం వద్ద నివాళులు అర్పించి, నిరసన వ్యక్తం చేసి పార్టీ కార్యాలయానికి మంగళవారం సాయంత్రం చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంజయ్ విడుదల కోసం తమ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రజాస్వామ్య వ్యతిరేక ప్రభుత్వ పాలన కొనసాగుతోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చెప్పారు. తెలంగాణలో రెండు రోజులుగా జరుగుతున్న ఘటనలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయని విమర్శించారు. తెలంగాణలో ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా జీవో 317 తెచ్చారని తెలుపుతూ జీవోకు వ్యతిరేకంగా శాంతియుతంగా జాగరణ దీక్ష చేస్తున్న బండి సంజయ్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆయన…

Read More

గల్వాన్‌ లోయలో గత ఏడాది భారత సైనికుల చేతిలో చావుదెబ్బ తిన్న చైనా సరిహద్దుల్లో కవ్వింపు చర్యలను మాత్రం మార్చుకోవడం లేదు. రెండు దేశాల మధ్య సైనికుల స్థాయిలో పలు సార్లు చర్చలు జరిగినా ద్వైపాక్షిక ఒప్పందాలను గౌరవిస్తూ తమ సేనలను వెనుకకు మళ్లించడం గురించి మాట్లాడటం లేదు. గత ఆగష్టు నుండి చర్చలు కూడా జరగడం లేదు.  తాజాగా, జనవరి 1న నూతన సంవత్సరం రోజున  గల్వాన్‌లో ఏకంగా తమ జెండాను ఎగురవేసి కవ్వింపు చర్యలకు పాల్పయింది. రెండు దేశాల సైనికులు మిఠాయిలు పంచుకున్న రోజుననే ఈ దుశ్చర్యకు దిగడం గమనార్హం. ఇంకో వైపు, లద్దాఖ్‌లోని పాంగాంగ్‌ సరస్సులో చైనా వంతెనను నిర్మిస్తోంది పైగా, జెండా ఎగరవేయడంపై ఒక వీడియోను చైనా ప్రభుత్వ మీడియా సంస్థ గ్లోబల్‌ టైమ్స్‌ ట్విటర్‌లో షేర్‌ చేసింది. ఒక అంగుళం భూమిని కూడా వదులుకునేది లేదంటూ ఆ వీడియోకు కాప్షన్‌ను జత చేసింది. కొత్త సంవత్సరంలో…

Read More