Author: Editor's Desk, Tattva News

గత పాలకుల పాలనలో ఆర్ధిక నేరస్థుల గడ్డగా ఉన్న మీరట్ ఇప్పుడు క్రీడాకారుల గడ్డగా మారినదని పేర్కొంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అఖిలేష్ యాదవ్ పాలనపై ధ్వజమెత్తారు. మీరట్ లో రూ 700 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన మేజర్ ధ్యాన్‌చంద్ క్రీడా విశ్వవిద్యాలయానికి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఒకప్పుడు నేరస్తులు మీరట్ పరిసర ప్రాంతాల్లో ‘అక్రమ స్వాధీన’ టోర్నీలు ఆడేవారని ప్రధాని ఎద్దేవా చేశారు. నేరగాళ్ల భయంతో ప్రజలు పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింద‌ని, సాయంత్రం దాటినా అక్కాచెల్లెళ్లు, కూతుళ్లు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఉండేద‌ని పేర్కొన్నారు. యువకుల చిలిపి చేష్టల్ని సీరియస్‌గా తీసుకోవద్దంటూ ఎస్‌పి వ్యవస్థాపకుడు ములాయంసింగ్ గతంలో చేసిన వాఖ్యాలను ప్రస్తావిస్తూ అలా సమర్థించడం సరైంది కాదని ప్రధాని హితవు పలికారు. విప్లవకారుల నగరంగా ఉన్న మీరట్‌ ఇప్పుడు క్రీడాకారుల నగరంగానూ గుర్తింపు తెచ్చుకుంటుందని చెప్పారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ పనితీరుపై మోదీ విమర్శలు చేశారు. ‘‘గతంలో…

Read More

తెలంగాణాలో ఒమిక్రాన్‌ వేగంగా వ్యాపిస్తూ ఉండడంతో ఆందోళన కలిగిస్తున్నది. గత వారం రోజుల్లో రోజురోజుకూ కేసులు రెట్టింపయ్యాయి. మూడువారాల కిందట రాష్ట్రంలో తొలి ఒమిక్రాన్‌ కేసు నమోదవగా ఆదివారం నాటికి ఈ కేసులు 84కు చేరుకున్నాయి. ఇదే సమయం లో క్షేత్రస్థాయిలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దాదాపు 3 నెలల తర్వాత రాష్ట్రంలో ఒక్క రోజులో 300కు పైబడి కేసులు నమోదవగా ఇందులో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఒక్కరోజే దాదాపు 200 కేసులు తేలాయి. అయితే కేంద్ర ప్రభుత్వం మార్గదర్శక సూత్రాల ప్రకారం రిస్క్ దేశాల నుండి వచ్చిన ప్రయాణికులకు ఒమిక్రాన్‌ పరీక్షలు జరుపుతున్నారు.  నాన్‌ రిస్క్‌ దేశాల నుంచి వచ్చిన వాళ్లలో 2 శాతం మందికే పరీక్షలు చేస్తున్నారు.  అయితే ఇప్పటి వరకు నమోదైన కేసులలో 70 శాతం నాన్- రిస్క్ దేశాల నుండి వచ్చిన వారే కావడంతో, ఇప్పటికే ఇది కమ్యూనిటీలోకి వెళ్లి ఉంటుందని వైద్యారోగ్య వర్గాలు అనుమానిస్తున్నాయి. రాష్ట్రంలో తాజాగా…

Read More

కరోనా వేరియంట్ ఒమైక్రాన్ దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దాదాపు లాక్‌డౌన్ తరహా ఆంక్షలను ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీలో పూర్తి స్థాయి కర్ఫ్యూ అమలు అవసరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సోమవారం నుంచి స్కూళ్లు, కాలేజీలు తదితర విద్యాసంస్థలను మూసివేస్తున్నట్టు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రకటించింది. కార్యాలయాలు, సినిమా హాళ్లు, థియేటర్లు, 50 శాతం సిబ్బందితో పనిచేయడానికి అనుమతించింది. పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, మిల్లులు, తేయాకు తోటలు తదితర వాణిజ్య సంస్థల యాజమాన్యాలు కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలని రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హెచ్‌కె ద్వివేది స్పష్టం చేశారు. రోజూ రాత్రి 10 నుంచి తెల్లవారు జాము 5 గంటల వరకు మాత్రమే అత్యవసర సర్వీసులను అనుమతిస్తున్నట్టు ప్రకటించారు. బార్లు, రెస్టారెంట్లు సగం సిబ్బందితో రాత్రి 10 గంటల వరకే పనిచేస్తాయి. రాత్రి 7 గంటల వరకు లోకల్ ట్రైన్లు 50 శాతం ప్రయాణికులతో నడుస్తాయని, షాపింగ్ మాల్స్, మార్కెట్లు,…

Read More

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల మధ్య విభేదాలు ఉన్నాయని వచ్చిన వార్తలపై టీమ్ ఇండియా చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ ఎట్టకేలకు మౌనం వీడారు. వారిద్దరి మధ్య ఎటువంటి విభేదాలు లేవని తేల్చిచెప్పారు. గతంలో వన్డే కెప్టెన్‌గా తొలగించి రోహిత్ స్థానంలో కోహ్లి, రోహిత్ మధ్య పరిస్థితులు సరిగా లేవని ఇటీవల పలు వార్తలు వెలువడ్డాయి. అవన్నీ అభూత కల్పనలే అని తేల్చి చెప్పారు. దక్షిణాఫ్రికా కోసం భారత వన్డే జట్టును ప్రకటించడానికి వర్చువల్ విలేకరుల సమావేశంలో చేతన్ శర్మ మాట్లాడుతూ, “పరిస్థితులు ఖచ్చితంగా బాగానే ఉన్నాయి. అందుకే ఊహాగానాల జోలికి వెళ్లవద్దు అని చెప్పాను. మనమందరం ముందుగా క్రికెటర్లం, తరువాత సెలెక్టర్లం. వారి మధ్య ఏమీ లేదు” అని పేర్కొన్నారు. “కొన్నిసార్లు నేను వారి గురించిన కధనాలు చదివి నవ్వుకొంటాను. భవిష్యత్తు గురించి వారి మధ్య మంచి ప్రణాళిక ఉందని నేను మీకు చెప్తున్నాను. వారి మధ్య సంబంధాలు అద్భుతంగా ఉన్నాయి. మీరు…

Read More

నీట్‌-పిజి అడ్మిషన్లలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఇడబ్ల్యుఎస్‌) కోటాలో పేర్కొన్న వార్షిక ఆదాయ పరిమితుల్లో మార్పులేమీ లేవని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఆదాయ పరిమితిని రూ. 8 లక్షలుగానే ఉంచనున్నట్లు తెలిపింది. నీట్‌-పిజి పరీక్షల్లో ఇడబ్ల్యుఎస్‌లకు రిజర్వేషన్లు కల్పించిన అంశంపై సుప్రీంకోర్టు ఈ నెల 6న విచారణ జరగనుండగా.. కేంద్రం అఫిడవిట్‌ దాఖలు చేసింది. అడ్మిషన్లు, సీట్ల కేటాయింపులు కొనసాగుతున్న ఈ సమయంలో నిబంధనల్ని మార్చడం వల్ల సమస్యలు ఏర్పడవచ్చునని పేర్కొంది. అయితే, వచ్చే ఏడాది సవరణలు చేస్తామని తెలిపింది. ఈ వివాదంపై ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సిఫార్సులను అంగీకరిస్తున్నామని పేర్కొంది. రిజర్వేషన్లు పొందడానికి వార్షిక ఆదాయ పరిమితి రూ. 8 లక్షలుగా ఉండాలని కమిటీ పేర్కొంది. అదేవిధంగా ఐదు ఎకరాల కంటే ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఇడబ్ల్యుఎస్‌ రిజర్వేషన్‌ వర్తించదు. అయితే ఈ సిఫార్సులు ప్రస్తుతం కొనసాగుతున్న అడ్మిషన్‌ ప్రక్రియను మాత్రం ప్రభావితం…

Read More

వాయువ్య పాకిస్తాన్‌లోని 100 ఏళ్ల నాటి పునర్నిర్మించిన మహారాజా పరమహంస్ జీ మందిర్‌లో శనివారం గట్టి భద్రత మధ్య సుమారు 200 మందికి పైగా హిందూ యాత్రికులు ప్రార్థనలు చేశారు. రాడికల్ ఇస్లామిస్ట్‌కు చెందిన గుంపు కూల్చివేసిన ఈ ఆలయంలో ఒక సంవత్సరం తర్వాత ప్రార్ధనలు చేసుకోగలిగారు. హిందూ యాత్రికులతో భారత్ నుండి వచ్చిన వారితో పాటు అమెరికా,గల్ఫ్ దేశాల నుండి వచ్చిన వారు కూడా ఉన్నారు. ఖైబర్ పఖ్తుంఖ్వాలోని కరక్ జిల్లా, తేరి గ్రామంలోని పరమహంస్ జీ మందిరం, ‘సమాధి’ని 2020లో కూల్చివేసిన సంఘటన ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఖండనలకు గురయింది. భారతీయ యాత్రికులు లాహోర్ సమీపంలోని వాఘా సరిహద్దు గుండా ఇక్కడకు చేరుకోగా, వారు సాయుధ సిబ్బంది సహకారంతోతో ఆలయానికి వెళ్లగలిగారు. జాతీయ క్యారియర్ పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ సహకారంతో పాకిస్థానీ హిందూ కౌన్సిల్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంకు మొత్తం తేరి గ్రామంతో పాటు సుమారు 600 మంది…

Read More

ఉత్తర ప్రదేశ్ నుండి బంగాళా దుంపల దిగుమతులను తెలంగాణ ప్రభుత్వం నిలిపి వేయడంతో, ఇక్కడ అధికార పక్షంకు మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి ఉత్తర ప్రదేశ్ లో ఎదురు దెబ్బ తగులుతుంది. వచ్చే ఏడాది మొదట్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థులను పోటీకి దింపి, అక్కడి అసెంబ్లీలో ప్రాతినిధ్యం పొందాలని విస్తృతంగా ప్రచారం చేస్తున్న ఒవైసీని అక్కడి రైతులు నిలదీస్తున్నారు. “మా బంగాళాదుంపలను అక్కడి (తెలంగాణలో) అడ్డుకున్న ప్రభుత్వానికి (తెలంగాణ రాష్ట్ర సమితి) మద్దతు ఇస్తూ అతను (ఒవైసీ) ఇక్కడ ఎలా ప్రచారం చేయగలడు?” అని ఆగ్రాలోని ఆలూ ఉత్పాదక్ కిసాన్ సమితి ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఆలంగీర్‌ ప్రశ్నిస్తున్నారు. ఆయనకు ఆగ్రాకు సమీపంలో ఆరు ఎకరాల బంగాళాదుంపల వ్యవసాయం ఉంది. ప్రతి రోజు 50 కిలోల బంగాళాదుంపల సంచులు 500 మేరకు ఒకొక్క లోడ్ చేయబడిన దాదాపు 100 ట్రక్కులు యుపి నుండి…

Read More

బంగ్లా యుద్ధం – 18 తూర్పు థియేటర్‌లో పాకిస్తాన్ సైన్యం కంటే భారతీయ సైన్యం అన్ని విధాలుగా మొదటి నుండి పైచేయిగా ఉంటూ వచ్చింది. పశ్చిమ దేశంలో దాదాపు పాక్ కు సమఉజ్జిగా ఉంది. ముక్తి బాహినితో భారత్ బలగం మరింతగా పెరిగింది. భారత వైమానిక దళం (ఐఎఎఫ్) అన్ని విధాలా పాకిస్తాన్ వైమానిక దళం (పిఎఎఫ్ కంటే గుణాత్మక, పరిమాణాత్మక ప్రయోజనాన్ని కలిగి ఉంది. భారత నావికాదళంకు విమాన వాహక నౌక తోడు కావడంతో అన్ని విధాలా పాకిస్థాన్ బలగాలకన్నా పటిష్టంగా మన సేనలు ఉన్నాయి. ఈ సందర్భంగా భారత్ సేనల వ్యూహంలో మూడు అంశాలను ప్రధానంగా ఉన్నాయి. తూర్పులో వేగవంతమైన దాడి జరపడం, పశ్చిమంలో కేవలం పాక్ సేనలు ముందుకు రాకుండా కట్టడి చేయడం, ఉత్తర సరిహద్దు వెంబడి రక్షణగా నిలబడడం. తూర్పు పాకిస్తాన్‌ ను విముక్తి చేయడంలో ముక్తి బాహినికి సహాయం చేయడం ద్వారా మన దేశంపై భయంతో వచ్చి చేరిన సుమారు కోటి మంది శరణార్థులు తిరిగి…

Read More

హుజురాబాద్ ఉపఎన్నికల ఓటమితో దిక్కుతోచక, ప్రజల దృష్టి మళ్లించడం కోసం, తన ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చు కోవడం కోసం ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు చేపట్టిన వరి రాజకీయం ఆయన ప్రభుత్వాన్నే రాజకీయంగా సుడిగుండంలోకి నెట్టుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్న్యాయంగా బీజేపీ ప్రజల దృష్టిని ఆకట్టుకొంటూ ఉండడంతో తట్టుకోలేక, అర్ధాంతరంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు ప్రారంభించారు. మొన్నటి వరకు మద్దతు ఇస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వ విధానాలను తూర్పురా బట్టడా ప్రారంభించారు. ఆయనతో పాటు ఆయన మంత్రులు కూడా పల్లవి అందుకొంటున్నారు. అంతటితో ఆగక పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా వడ్ల కొనుగోలుపై అసత్య కథనాలతో నిరసనలకు దిగారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టమైన ప్రకటనలు చేసినప్పటికీ వినిపించుకోకుండా ఉభయ సభలలో అడ్డంకులు కల్పించే ప్రయత్నాలు చేశారు. తాము చేస్తున్న నిరసనలకు మరెవ్వరు మద్దతు ఇవ్వక పోగా, ఇతర పార్టీల దృష్టిలో చౌకబారుగా తేలుతున్నట్లు గ్రహించి సమావేశాలను బహిష్కరించి, అందరిని హైదరాబాద్ కు తిరిగి రమ్మనమని కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు.…

Read More

చైనా తన విస్తరణ కాంక్షను వదులుకోదు, కాకపోతే విరామమిస్తుంది ఆగి ఆగి రగిలే నిప్పులా, నివురు నింపుకొంటూ విడుస్తూ ప్రతాపం చూపించాలనుకొంటుంది. 1962 యుద్ధం తర్వాత దాదాపు 60 ఏళ్ల పాటు ప్రశాంతంగా ఉన్న భారత, -చైనా సరిహద్దులను తిరిగి 2020లో రక్తసిక్తం చేసింది. 2020 మే లో లడఖ్ సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ ఉల్లంఘనకు పాల్పడిన చైనా మళ్ళీ ఇప్పుడు అరుణాచల్‌ప్రదేశ్‌లోని 15 ప్రాంతాలకు పేర్లు ప్రకటించి అవి తన భూభాగాలని చెబుతోంది. లడఖ్ వద్ద యధాపూర్వ స్థితిని నెలకొల్పుకొనే చర్చల్లో ప్రతిష్టంభన సృష్టించి తమాషాలు చేస్తున్న చైనా రూటు మార్చి అరుణాచల్ వద్ద కొత్త ఘర్షణ రంగాన్ని తెరవాలనుకొంటున్నదా? అరుణాచల్‌ప్రదేశ్‌లో 90,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనా తనదిగా చెప్పుకొంటున్నది. చైనా భాషలో జంగ్నన అని దీనిని పిలుస్తున్నది. దక్షిణ టిబెట్ అంటున్నది. చైనా తన మ్యాపుల్లో కూడా అరుణాచల్‌ప్రదేశ్‌ను సొంత ప్రాంతంగా చూపిస్తుంది. మన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి…

Read More