‘‘ఉత్తరాఖండ్ ఏర్పడి 20 ఏళ్లు పూర్తయ్యాయి. ‘మీఇరు ఉత్తరాఖండ్‌ని దోచుకోవచ్చు, కానీ నా ప్రభుత్వాన్ని కాపాడండి’ అని చెప్పుకునే ప్రభుత్వాన్ని నడుపుతున్న వ్యక్తులను ఈ సంవత్సరాల్లో మీరు కూడా చూశారు. ఈ వ్యక్తులు ఉత్తరాఖండ్‌ను రెండు చేతులతో దోచుకున్నారు” అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గత ప్రభుత్వాలపై తీవ్రదాడి చేశారు. ఉత్తరాఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు హల్ద్వానీలో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం రూ 17,500 కోట్ల విలువైన 23 ప్రాజెక్టులను ప్రారంభం లేదా శంకుస్థాపన చేస్తూ జరిగిన బహిరంగసభలో ప్రసంగించారు. ప్రారంభించిన ప్రాజెక్ట్‌లలో చార్‌ధామ్ ఆల్-వెదర్ రోడ్డు యొక్క మూడు వేర్వేరు విస్తరణలు ఉన్నాయి, వీటిని విస్తరించారు, నగీనా-కాశీపూర్ జాతీయ రహదారి, సూరింగ్ గడ్ హైడల్ ప్రాజెక్ట్, నైనిటాల్ వద్ద నమామి గంగే కార్యక్రమం కింద మురుగునీటి పనులు ఉన్నాయి. ఈ నెలలో ప్రధాని మోదీ రాష్ట్రానికి రావడం ఇది రెండోసారి. డిసెంబర్ 4న చివరిసారిగా ఉత్తరాఖండ్‌లో పర్యటించిన మోదీ…
Author: Editor's Desk, Tattva News
కరోనా మహమ్మారి కారణంగా ఎన్నికలు వాయిదా వేయవద్దని, కరోనా నిబంధనలను పాటిస్తూ ఎన్నికలు జరపాలని అన్ని రాజకీయ పార్టీలు కోరడంతో షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది మొదట్లోనే ఎన్నికలు జరుపుతామని భారత ఎన్నికల ప్రధాన కమీషనర్ సుశీల్ చంద్ర వెల్లడించారు. ఎన్నికలను నిర్వహించేందుకు చేపడుతున్న చర్యలను సమీక్షించేందుకు ఎన్నికల కమిషన్ బృందం మంగళవారం నుంచి రాష్ట్రంలో పర్యటిస్తోంది. సీఈసీ సుశీల్ చంద్ర, ఎన్నికల కమిషనర్లు రాజీవ్ కుమార్, అనూప్ చంద్ర పాండే మంగళవారం జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీల నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, కాంగ్రెస్, రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని బీజేపీ దుర్వినియోగం చేయకుండా నిరోధించాలని కోరారు. పోలింగ్ సమయంలో కేంద్ర పారామిలిటరీ దళాలను మోహరించాలని కోరారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు తమను కలిశారని, కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ, శాసన సభ…
బంగ్లా యుద్ధం – 15 భారత్ – పాక్ యుద్ధాలలో మొదటిసారి రెండు దేశాల నావికాదళాలు పాల్గొన్నాయి. అయితే 1965లో యుద్దానికి సిద్ధంగా ఉన్న పాకిస్తాన్ నావికాదళం ఈ పర్యాయం సిద్ధంగా లేకుండానే యుద్ధంలో పాల్గొనవలసి వచ్చింది. లోతయిన సముద్రంలో భారత్ నావికాదళంతో హోరాహోరీగా పోరాటాడగల పటిమ తమకు లేదని పాక్ నావికాదళం ప్రధాన కార్యాలయంలోని కమాండర్ లు అందరికి తెలుసు. పైగా, తమ సముద్ర మార్గాన్ని భారత నావికాదళం ఆక్రమించకుండా రక్షణను పెంపొందించే పరిస్థితులలో కూడా పాక్ లేదు. ఒక పాకిస్తానీ నిపుణుడు తారిక్ అలీ ప్రకారం, పాకిస్తాన్ యుద్ధంలో సగం నౌకాదళాన్ని కోల్పోయింది. 1965 ఇండో-పాకిస్తాన్ యుద్ధం భూభాగంలో కేంద్రీకృతమై ఉండడంతో భారత నౌకాదళం ప్రధాన పాత్ర పోషించలేదు. సెప్టెంబరు 7న, కమోడోర్ ఎస్ ఎం అన్వార్ నేతృత్వంలోని పాకిస్తాన్ నేవీకి చెందిన ఒక నౌకాదళం పాకిస్తానీ నౌకాశ్రయానికి దక్షిణంగా 200 మైళ్ళు (320 కిమీ) దూరంలో ఉన్న భారత నావికాదళం రాడార్ స్టేషన్ ద్వారకపై ఆపరేషన్ ద్వారక అనే బాంబు…
బి రామకృష్ణంరాజు, వ్యవస్థాపకులు, మనొబంధు విశాఖపట్నం బీచ్ లో ఒక మధ్యవయస్సు మహిళ నిరాదరణకులోనై తిరుగుతూ కనిపించింది. ఆమె ఆంగ్లంలో మాట్లాడుతూ ఉండడం, వివిధ కోర్ట్ కేసులలో న్యాయసంబంధ అంశాలను ప్రస్తావిస్తూ ఉండడంతో విషయం తెలిసి పట్టణ, గిరిజన అభివృద్ధి సంఘం (ఎయుటిడి) కార్యదర్శి ప్రగాఢ వాసు తమ షెల్టర్ హోమ్ కు తీసుకు వచ్చారు. ఆమె సుప్రీం కోర్ట్ న్యాయవాది అని, మానిసిక అనారోగ్యంతో ఆ విధంగా తిరుగుతున్నదని గ్రహించి, ఆమెకు తగు వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టారు. ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా ఆ విధంగా వీధులలో నిరాదరణకు గురై తిరుగుతున్న మానసిక రోగులను దరిచేర్చి, వారికి వైద్యం, పునరావాసం కల్పించేందుకు కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థ “మనోబంధు” లో ఆయన గౌరవ సభ్యునిగా పనిచేస్తున్నారు. మానసిక అనారోగ్యం, వైకల్యం మానవ జీవనంపై ఊహించలేని రుగ్మతలకు దారి తీస్తుంది. ఏ రకమైన మానసిక రుగ్మతకైనా జీవితకాల వ్యాప్తి రేట్లు గతంలో అనుకున్నదానికంటే ఎక్కువగా ఉన్నాయి. ఇటీవలి సమూహాలలో…
చరిత్రలో ఓ ముఖ్యమైన ఘట్టాన్ని కాపాడేందుకు, దేశాధినేతగా నేతాజీ రాకకు సరిగ్గా 78 సంవత్సరాల తర్వాత బుధవారం ఉదయం 11.30 గంటలకు అండమాన్, నికోబార్ కమాండ్ (సీన్ కాన్)ను కమాండర్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అజయ్ సింగ్ దేశానికి అంకితం చేశారు. ఈ స్మారకం నేతాజీ నాయకత్వంలోని భారత జాతీయ సైన్యం (ఐఎన్ ఎ) సైనికుల సంకల్పం, వారి అసంఖ్యాక త్యాగాలకు నివాళిగా మాత్రమే కాకుండా, నేతాజీ స్వయంగా ప్రతిష్టించిన విలువలను కూడా గుర్తుచేస్తుంది. “నిష్ఠ, కర్తవ్య ఔర్ బలిదాన్” లేదా “నిబద్ధత, కర్తవ్యం, త్యాగం”. భారత సాయుధ దళాల నైతికత, భారత సైనికుని సంకల్పాన్ని స్పష్టం చేయడం కొనసాగుతుంది. భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో, డిసెంబర్ 30, 1943 ఒక ప్రత్యేక స్థానాన్ని పొందింది. భారత గడ్డపై తొలిసారిగా పోర్ట్ బ్లెయిర్‌లో జాతీయ జెండాను ఎగురవేసింది అదే రోజు కావడం గమనార్హం. నేతాజీ జనవరి 16, 1941న కోల్‌కతా నుండి బ్రిటిష్ నిఘాను ఎమార్హ్సి …
దేశవ్యాప్తంగా కరోనా మళ్లీ కలకలం సృష్టిస్తోంది. ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఢిల్లీలో బుధవారం ఏకంగా 923 కేసులు నమోదయ్యాయి. మంగళవారంతో పోలిస్తే పాజిటివ్ కేసుల సంఖ్య 86 శాతం పెరిగాయి. మే 30 తర్వాత దేశ రాజధానిలో ఇంత భారీ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. కరోనా కేసులు పెరుగుతుండటంతో అప్రమత్తమైన ఢిల్లీ సర్కారు ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. స్కూళ్లు, కాలేజీలు మూసివేయడంతో పాటు ఆంక్షలు మరింత కఠినం చేసింది. కర్నాటకలోనూ భారీగా కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో కొత్తగా 566 మందికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. 245 మంది కోలుకోగా.. ఆరుగురు మృతి చెందారు. బెంగాల్ లో బుధవారం 1089 కోవిడ్ కేసులు రికార్డయ్యాయి. 807 మంది కరోనా నుంచి కోలుకోగా.. 24 గంటల వ్యవధిలో 12 మంది చనిపోయారు. కొద్దీ రోజుల్లో క్లిష్టదశలో భారత్ ఈ తరుణంలో …
రెండు డోసుల కరోనా టీకాలు తీసుకున్న వారిని మాత్రమే నూతన సంవత్సరం వేడుకలలోకి అనుమిర్థించాలని హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ సివి ఆనంద్ స్పష్టం చేశారు. కరోనా, ఒమిక్రాన్ నేపథ్యంలో జంట నగరాల్లో నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించడంతో పాటు మార్గదర్శకాలను ఆయన విడుదల చేశారు. నగరంలోని పబ్‌లు, రెస్టారెంట్‌లతో పాటు నగర వాసులు భౌతిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలని లేకపోతే కఠిన చర్యలు తప్పవని సిపి హెచ్చరించారు. ఈసారి నగర నూతన సంవత్సర పార్టీల్లో డిజెలకు అనుమతి ఉండదని, పబ్‌లు, రెస్టారెంట్లు భౌతిక దూరం తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పబ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్‌ల సమీపంలో నివాసముంటున్న స్థానికులను ఇబ్బందులకు గురి చేసినట్లు ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే కరోనా నిబంధనలను అతిక్రమించినా చర్యలు తప్పవని చెప్పారు. ఇందులో భాగంగా కరోనా పరీక్షలు నిర్వహించాకే వాళ్లను ఈవెంట్లలోకి అనుమతించాలని ఈవెంట్ నిర్వాహకులకు సూచించారు. ఇక రెండు రోజుల…
బంగ్లా యుద్ధం – 14 1971లో పాకిస్థాన్ పై జరిగిన యుద్ధంలో భారత దేశం విజయం సాధించడమే కాకుండా, బంగ్లాదేశ్ పేరుతో ఒక కొత్త దేశం అవతరించడానికి సహకరించడం అపూర్వమైన, చారిత్రాత్మక పరిణామం అనడంలో సందేశం లేదు. ఈ యుద్ధం జరిగిన 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుకొంటున్నాము. ఇదే సమయంలో మనం స్వాతంత్య్రం పొంది 75 ఏళ్ళు అవుతున్న సందర్భంగా కూడా పెద్ద ఎత్తున సంబరాలకు సిద్దపడుతున్నాము. ఈ 75 ఏళ్ళ చరిత్రలో ఒక అపూర్వమైన మజిలీ ఈ యుద్ధం అని చెప్పవచ్చు. భారత సైన్యం అంతటి నిర్ణయాత్మకమైన విజయం సాధించిన యుద్ధం మరొకటి లేదు. మరో దేశం భూభాగంలోకి చొచ్చుకుపోయి యుద్ధం చేసిన మరో సందర్భం కూడా లేదు. కేవలం సైనిక ఎత్తుగడలలోనే కాకుండా రాజకీయ, దౌత్య అంశాలలో సహితం భారత్ ఒక విధమైన సాహసాన్ని ప్రదర్శించింది. స్పష్టమైన రాజకీయ, సైనిక వ్యూహం ఈ విజయానికి కారణం…
2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో ఎట్లాగైనా అధికారంలోకి రావాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న బిజెపి మొదటగా రిజర్వేడ్ సీట్లపై దృష్టి సారించింది. 19 ఎస్సి, 12 ఎస్టీ రిజెర్వేడ్ సీట్లు అన్నింటిని గెల్చుకోవడం ద్వారా, అధికారంలోకి రావడానికి బలమైన పునాది ఏర్పర్చుకోవాలని భావిస్తున్నది. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా మార్గనిర్ధేశంతో రూపొందిస్తున్న వ్యూహాలతో భాగంగా ఆయా వర్గాల ప్రజల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై అసంతృప్తి, స్థానిక ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఆ సీట్లలో పాగా వేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా వచ్చే రెండేళ్లపాటు ఆ నియోజకవర్గాల్లో చేపట్టబోయే కార్యక్రమాలపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయడంలో నిమగ్నమైంది. ఇందుకోసం ప్రత్యేక బృందాలను నియమించి ఒక రోడ్‌మ్యాప్‌ను, ఫార్మూలాను ఖరారు చేయనుంది. ఎస్సీ స్థానాలపై పార్టీ ముఖ్య నేతలతో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మంగళవారం నిర్వహించిన అంతర్గత వర్క్‌షాప్‌లో ఈ నియోజకవర్గాలలో చేపట్టవలసిన కార్యక్రమాల గురించి చర్వహించారు. 2009లో…
భారతదేశంలో అవినీతి పద్ధతులు, క్రైస్తవ మతాన్ని ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తూ, ప్రముఖ హిందీ వార పత్రిక పాంచజన్య అమెజాన్‌పై దాడి చేసిన కొన్ని నెలల తర్వాత, భారతదేశంలో కార్యకలాపాలు నిర్వహించడానికి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు మంజూరు చేసిన అన్ని అనుమతులను ఉపసంహరించుకోవాలని స్వదేశీ జాగరణ్ మంచ్ ( ఎస్‌జెఎం) డిమాండ్ చేసింది. గ్వాలియర్ లో ముగిసిన రెండు రోజుల జాతీయ మహాసభలలో ఆమోదించిన ‘ప్‌కార్ట్-వాల్‌మార్ట్ భారత్‌లో పనిచేయడానికి అమెజాన్‌కు అనుమతులను ఉపసంహరించుకోండి’ అనే తీర్మానంలో వారి కార్యకలాపాలన్నీ చట్టవిరుద్ధమైనవిగా ప్రకటించాలని స్పష్టం చేసింది. ఈ కంపెనీల వ్యవహారాలపై సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తూ, “విచారణ నిస్పక్షపాతంగా జరిగేందుకు వీలుగా ఈ సంస్థల నుండి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా లబ్ధి పొందుతున్న ఉన్నత కార్యాలయాల్లో కూర్చున్న వ్యక్తులతో సహా ప్రభుత్వ అధికారుల జాడ కనిపించిన వెంటనే, వారిని సెలవుపై పంపాలి. వారు పాల్పడిన నేరాలకు తగు శిక్షలను విధించాలి’ అని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ ఏడాది…