Author: Editor's Desk, Tattva News

జార్ఖండ్‌ రాజకీయం ఆసక్తికరంగా హైదరాబాద్ కు మారింది. ముఖ్యమంత్రి  హేమంత్ సోరెన్ అరెస్ట్ తర్వాత పదవికి రాజీనామా చేయడంతో కొత్త ముఖ్యమంత్రిగా జేఎంఎం శాసనసభా పక్ష నేత చంపాయ్ సోరెన్ బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో శుక్రవారం ఆ రాష్ట్ర గవర్నర్ ప్రమాణం చేయించారు. 67 ఏండ్ల చంపయీ సొరేన్‌ జార్ఖండ్‌కు 12వ ముఖ్యమంత్రి. జార్ఖండ్‌ రాష్ర్టాభివృద్ధికి కట్టుబడి ఉంటానని, హేమంత్‌ సొరేన్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ కొనసాగిస్తానని ఆయన ప్రమాణ స్వీకారం అనంతరం మీడియాకు తెలిపారు. కుట్ర చేసి ఒక గిరిజన సీఎంను ఎలా అరెస్ట్‌ చేశారో దేశమంతా చూస్తున్నదన్నారు. అనంతరం తొలిసారిగా చంపయీ నేతృత్వంలో సమావేశమైన మంత్రివర్గం ఈ నెల 5న అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధమవ్వాలని నిర్ణయించింది. చంపాయ్ సోరెన్ తన ప్రభుత్వ మెజారిటీని నిరూపించుకోవడానికి 10 రోజుల సమయం గవర్నర్ ఇచ్చినట్లు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రాజేష్ ఠాకూర్ తెలిపారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్న…

Read More

భారీ ధరల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు వచ్చే వారం నుంచి భారత్ రైస్ రిటైల్ విక్రయాలను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ భారత్ రైస్ వచ్చే వారం నుంచి కిలో రూ.29 లకే లభిస్తాయి. ధరలను నియంత్రించడానికి అక్రమంగా, భారీగా బియ్యాన్ని నిల్వ చేయకూడదని ప్రభుత్వం వ్యాపారులను ఆదేశించింది. ‘‘వివిధ రకాలపై ఎగుమతి ఆంక్షలు ఉన్నప్పటికీ, గత సంవత్సరంతో పోలిస్తే, బియ్యం రిటైల్ ధరలు 13.8%, హోల్సేల్ ధరలు 15.7% పెరిగాయి. ధరలను నియంత్రించడానికి, ఆహార ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ ధోరణులను నియంత్రించడానికి, సబ్సిడీలో ‘భారత్ రైస్’ ను వచ్చే వారం నుండి రిటైల్ మార్కెట్లో కిలోకు 29 రూపాయలకు విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది” అని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా తెలిపారు. నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (నాఫెడ్), నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా…

Read More

కొద్ది రోజులుగా జార్ఖండ్‌లో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితికి తెర పడినట్టే కనిపిస్తోంది. కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా చంపై సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని రాంచీలోని రాజ్‌భవన్‌లో శుక్రవారం ఆయనతో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అధికారంలో ఉన్న జార్ఖండ్ ముక్తి మోర్చా ఉపాధ్యక్షుడిగా పని చేస్తోన్నారాయన. మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మంత్రివర్గంలో రవాణా మంత్రిగా వ్యవహరించారు. హేమంత్ సోరెన్ తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన స్థానంలో చంపై సోరెన్‌ను తమ నేతగా ఎన్నుకున్నారు జేఎంఎం సభ్యులు. తనకు మద్దతు ఇస్తోన్న శాసన సభ్యులతో కలిసి గురువారం సాయంత్రం రాజ్‌భవన్ వద్ద పరేడ్ సైతం నిర్వహించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలం తనకు ఉందని గవర్నర్‌ సమక్షంలో నిరూపించుకున్నారు. దీనితో ఆయనను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్ ఆహ్వానించారు. చంపై సోరెన్‌తో పాటు మిత్రపక్షం రాష్ట్రీయ జనతాదళ్‌కు చెందిన సత్యానంద్…

Read More

రాజకీయ ప్రవేశం గురించి కొంతకాలంగా ప్రచారం జరుగుతుండగా మౌనం వహిస్తూ వస్తున్న తమిళ నటుడు విజయ్ చివరకు తన సొంత పార్టీని ఏర్పాటు గురించి  ప్రకటించారు. తమిళనాట ఇళయ దళపతిగా లక్షలాదిమంది అభిమానులు,మద్దతుదారులను సంపాదించుకున్న ఉన్న విజయ్ రాజకీయ అరంగేట్రం చేస్తూ తాను నెలకొల్పిన పార్టీ పేరును అధికారికంగా ప్రకటించారు. తమిళగ వెట్రి కజగం నామకరణం చేసినట్లు ఓ ప్రకటన విడుదల చేశారు. విజయ్ రాజకీయ అరంగేట్రం చేస్తారంటూ చాలాకాలం తమిళనాడులో వార్తలు వినిపిస్తూ వస్తుంది. అప్పట్లో దీనికి సంబంధించిన బ్యానర్లు, పోస్టర్లు విస్తృతంగా వెలిశాయి.పార్టీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ పనులను విజయ్‌ తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్‌ఏ చంద్రశేఖర్‌ పూర్తి చేశారు.శుక్రవారం ఉదయం చెన్నైలో పార్టీ కార్యవర్గ సమావేశం సైతం విజయ్ అధ్యక్షతన సమావేశమైంది. ఇందులో అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై ఇందులో చర్చించారు. కొన్ని కీలక తీర్మానాలను ఆమోదించారు.వాటి వివరాలను విజయ్ వెల్లడించారు.  త్వరలో జరగబోయే లోక్‌సభ…

Read More

* మొబైల్ విడిభాగాలపై దిగుమతి సుంకం తగ్గింపుఎన్నో అంచనాలు పెట్టుకున్నప్పటికీ ఓటాన్ బడ్జెట్‌లో కేంద్రం తాయిలాలు ప్రకటించలేదు. అయితే, మధ్యతరగతి వర్గానికి కాస్త ఊరట కల్పించే నిర్ణయాలు తీసుకుంది. వేతనజీవులకు ఈసారి నిరాశే ఎదురైంది. సమ్మిళిత అభివృద్ధి, ఆర్థిక వృద్ధిపైనే దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను సహా ఇతర పథకాల జోలికి పెద్దగా వెళ్లలేదు.  ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ ఫిబ్రవరి 1న ప్రవేశ పెట్టిన బడ్జెట్ మోదీ 2.0. లో చివరి పద్దు అని తెలిసిందే. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక జులైలో పూర్తి స్థాయి బడ్జెట్ మరోసారి ఉంటుంది. అయినా తాయిలాల జోలికి పోలేదు ఎన్‌డీఏ సర్కార్.   బడ్జెట్ అనగానే ముఖ్యంగా పన్ను చెల్లింపుదారులు సహా మధ్యతరగతి వర్గం ముఖ్యంగా వేటి ధరలు తగ్గుతాయి? వేటి ధరలు పెరుగుతాయి?  అనేదే ప్రధానంగా చూస్తారు. ఇది వారిపై నేరుగా ప్రభావం చూపుతుంటుంది. 2024 బడ్జెట్ ప్రసంగంలో…

Read More

కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను అప్పగించేందకు తెలం గాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అంగీకరించాయి. గురువారం జలసౌధలో బోర్డు చైర్మన్ శివ్‌నందన్ కుమార్ అధ్యక్షతన జరిగిన కృష్ణాబోర్డు సమవేశంలో తెలంగాణ రాష్ట్రం నుంచి నీటిసారుదల శాఖ ఈఎన్సీ మురళీ ధ ర్ , ఎపి నుంచి ఇఎన్‌సి నారాయణరెడ్డి పాల్గొన్నా రు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షణలో ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టును బోర్డుకు అప్పగించేందుకు ఇఎన్‌సి మురళీధర్ అంగీకారం తెలపగా, ఎపి పర్యవేక్షణలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టును కూడా బోర్డుకు అప్పగించేందుకు ఆ రాష్ట్ర ఇఎన్‌సి నారాయణరెడ్డి సుముఖత తెలిపారు. దీంతో రెండు రాష్ట్రాల మధ్య ప్రాజెక్టుల అప్పగింతపై రెండేళ్లకు పైగా కొనసాగుతూ వస్తున్న చిక్కుముడులు వీడిపోయాయి. తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్న తొమ్మది ఔట్‌లెట్లను బోర్డుకు అప్పగించేందకు అంగీకరించగా, ఎపి కూడా తన పరిధిలో ఉన్న ఆరు ఔట్‌లెట్లను అప్పగిస్తున్నట్టు వెల్లడించింది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి…

Read More

కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన రైల్వే బడ్జెట్ వివరాలను వెల్లడించారు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్. ఈ సారి రెండు తెలుగు రాష్ట్రాలకు అత్యధికంగా రూ. 14 వేల 209 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. గతంలో యూపీఏ సర్కార్ ఉన్నప్పుడు రెండు రాష్ట్రాలకు కలిపి ఇచ్చిన బడ్జెట్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ కేటాయింపులు జరిపినట్లు వెల్లడించారు.  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రైల్వేలకు సంబంధించి పలు మౌలిక సదుపాయాలు, భద్రతకు సంబంధించిన ప్రాజెక్టుల కోసం ఈ కేటాయింపులు చేసినట్లు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్‌లోని రైల్వే మౌలిక, రక్షణ సంబంధించిన ప్రాజెక్టుల కోసం రూ. 9,138 కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు.  యూపీఏ ప్రభుత్వం హయాంలో 2009 నుంచి 2014 మధ్య ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కోసం రూ. 886 కోట్లు కేటాయిస్తే.. దానికి 10 రెట్లు ఎక్కువగా 931 శాతం మేర ఎక్కువ బడ్జెట్…

Read More

ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ఎన్నికల శంఖారావాన్ని రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పూరించారు. ఏకకాలంలో రాష్ట్రంలోని 25 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఎన్నికల కార్యాలయాలను ఆమె ప్రారంభించారు. నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని భీమవరంలో వర్చువల్ పద్ధతిలో రాష్ట్రంలోని అన్ని కార్యాలయాలను గురువారం ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పురందరేశ్వరి మాట్లాడుతూ శంఖం పూరించడం ద్వారా ఎన్నికల నగారా మోగించామని తెలిపారు.  ఫిబ్రవరి 20 నుంచి 29 వరకు ప్రజా పోరుయాత్ర నిర్వహిస్తామని చెబుతూ ప్రతి కార్యకర్త చేతిలో బీజేపీ జెండా గుండెలో ఏపీ అభివృద్ధి అజెండా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. కేంద్రం చేసే ప్రతి కార్యక్రమం ప్రజల్లోకి తీసుకెళ్లాలని వివరించారు.  ఏపీలో బీజేపీ బలోపేతానికి పార్టీశ్రేణులు కృషి చేయాలని కార్యకర్తలకు ఆమె సూచించారు. ప్రజల్ని మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కావాలా? మోడీ ప్రభుత్వం కావాలా? అనేది ప్రజలు ఆలోచించుకోవాలని ఆమె సూచించారు. మీ…

Read More

లోక్‌సభలో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌ అభివృద్ధి చెందుతున్న భారత్ కు చిహ్నం అని బిజెపి ఓబిసి మోర్చా అధ్యక్షుడు, ఎంపీ డా. కె లక్ష్మణ్ కొనియాడారు. నేటి యువతరం ఆకాంక్షలకు ప్రతిరూపంగా ఉంది. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ అవతరించేందుకు ఈ బడ్జెట్‌ ఓ గ్యారెంటీగా నిలుస్తుందని హర్షం ప్రకటించారు. పేదలు, యువత, అన్నదాత, మహిళల సంక్షేమానికి, వారి మేలు కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని, అన్ని రంగాలకు విశ్వసనీయతను కల్పించేదిలా బడ్జెట్ ఉందని తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ప్రధాని నరేంద్ర మోదీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 4 కోట్ల మంది రైతులకు బీమా సౌకర్యం కల్పిస్తూ, సమ్మిళిత అభివృద్ధి గ్రామస్థాయికి చేర్చేలా, క్రీడాకారులకు ఆత్మస్థైర్యం పెంచేలా, యువతకు పెద్దపీట వేసేలా నరేంద్ర మోదీ ప్రభుత్వం ముందడుగు వేస్తోందని హర్షం ప్రకటించారు. సాంకేతికత రంగంలో…

Read More

జ్ఞానవాపి మసీదులో పూజలకు అనుమతిస్తూ వారణాసి జిల్లా కోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేయగానే రాత్రికి రాత్రి పూజలు పునః ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని కాశీ విశ్వనాథ ఆలయ ట్రస్టీ తెలియజేశారు. మూడు దశాబ్దాలుగా ఇక్కడ పూజలు జరగడం లేదు. మసీదు భూగృహంలో విగ్రహాల ముందు పూజారి పూజలు చేయవచ్చని జిల్లా కోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు జారీ అయిన కొన్ని గంటలకే వ్యాస్‌జీ భూగృహం 31 ఏళ్ల తరువాత తెరవబడిందని ఆలయ ట్రస్ట్ అధ్యక్షుడు నాగేంద్ర పాండే తెలియజేశారు. దక్షిణ సెల్లార్ బుధవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో తెరవడమైందని తెలిపారు. కోర్టు ఉత్తర్వును తాను పాటించానని జిల్లా మెజిస్ట్రేట్ ఎస్. రాజలింగం తెలిపారు. సెల్లార్‌ను పరిశుభ్రం చేసిన తరువాత లక్ష్మీ, గణేశ్ దేవుళ్ల విగ్రహాలకు హారతి ఇవ్వడమైందని స్థానికులు కొందరు తెలిపారు. బుధవారం రాత్రి 9.30 గంటలకు కాశీ విశ్వనాథ్ ఆలయ ట్రస్ట్ తమను…

Read More