పార్లమెంట్ లైబ్రరీ భవన్‌లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో శనివారం అఖిలపక్ష భేటీ జరిగింది. ఈ సమావేశానికి 23 పార్టీల నుంచి 30 మంది నేతలు హాజరయ్యారు. సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాల నిర్వహణపై అఖిలపక్ష నేతలతో కేంద్రం చర్చించింది. శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం తరపున ప్రవేశపెట్టే బిల్లుల వివరాలు అఖిలపక్ష నేతలకు కేంద్రం అందించింది. ప్రతిపక్షాలు లేవనెత్తే అన్ని అంశాలపై నిర్మాణాత్మక చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, బిజెపియేతర రాష్ట్రాల పట్ల ఆర్థిక వివక్షపై సవివరంగా చర్చించాలని ప్రతిపక్షాలు కోరాయి. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌కి ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులకు హిందీలో పేర్లు పెట్టడంపై అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ఐపిసికి బదులుగా…
Author: Editor's Desk, Tattva News
కృష్ణా జలాల వివాదంపై ఈ నెల కేంద్ర జల్‌శక్తి కీలక సమావేశం నిర్వహించనున్నది. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణపై తెలంగాణ, ఏపీ సీఎస్‌లతో పాటు కృష్ణా నదీయాజమాన్యం బోర్డు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం జరుపనున్నది. ఢిల్లీ నుంచి కేంద్ర జలశక్తి కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ శనివారం వీడియో సమావేశం జరిపారు. అయితే, తెలంగాణ సీఎస్ సమావేశానికి హాజరుకాలేనని.. సమావేశం తేదీ మార్చాలని కోరగా, ఇరు రాష్ట్రాల అధికారులతో చర్చించి 6న నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అన్ని అంశాలను కూలంకషంగా చర్చించి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెబుతూ అప్పటి వరకు రెండు రాష్ట్రాలు పూర్తిగా సంయమనం పాటించాలని కార్యదర్శి ముఖర్జీ సూచించారు. అదే విధంగా నీటి విడుదలకు సంబంధించి ఏపీ ఇచ్చిన ఇండెంట్‌పై ఈ నెల 4న కేఆర్‌ఎంబీ సమావేశం నిర్వహించి నీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాలని చైర్మన్‌కు జలశక్తి శాఖ కార్యదర్శి సూచించారు. అప్పటి వరకూ నాగార్జున సాగర్…
సూర్యుడి అధ్యయనం కోసం ప్రయోగించిన ఆదిత్య ఎల్1 మిషన్ సౌరగాలులపై అధ్యయనం ప్రారంభించింది. సౌరగాలులను రికార్డు చేసింది. ఈ ఫోటోలను ఇస్రో తన సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. ఆదిత్య ఎల్ 1 ప్రయాణంలో ఇది మరో మైలురాయిగా ఇస్రో శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు. ఈ శాటిలైట్ లోని ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్‌పరిమెంట్ పేలోడ్ లోని రెండు పరికరాలు పరిశోధనలను విజయవంతంగా కొనసాగిస్తున్నాయని ఇస్రో వెల్లడించింది. ఈ రెండు పరికరాల్లో సూపర్‌థర్మర్ అండ్ ఎనర్జిటిక్ పార్టికల్ స్పెక్ట్రోమీటర్ ను సెప్టెంబర్ 10న యాక్టివేట్ చేయగా, సోలార్ విండ్ అయాన్ స్పెక్ట్రోమీటర్ (స్విస్)ను నవంబరు 2న యాక్టివేట్ చేశారు. సోలార్ విండ్ అయాన్ స్పెక్ట్రోమీటర్ లోని రెండు సెన్సర్లు 360 డిగ్రీల్లో తిరుగుతూ నవంబర్ లోని రెండు తేదీల్లో సోలార్ విండ్ అయాన్లు, ప్రైమరీ ప్రోటాన్స్, ఆల్ఫా పార్టికల్స్‌ను విశ్లేషించాయని ఇస్రో వెల్లడించింది. ఈ మేరకు సేకరించిన ఎనర్జీ హస్టోగ్రామ్‌ను పరిశీలించగా, ప్రోటాన్,…
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలలో 5 శాతం సీట్లు కేటాయిస్తూ అస్సాం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివిన విద్యార్థులకు ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల్లో 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని అస్సాం విద్యాశాఖ మంత్రి డాక్టర్ రనోజ్ పెగు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీల్లో 5 శాతం సీట్లను ప్రభుత్వ పాఠశాలల్లో చదివి, ఉత్తీర్ణులైన విద్యార్థులకు కేటాయించాలని అస్సాం ప్రభుత్వం నిర్ణయించిందని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ వెల్లడించారు. కేబినెట్ సమావేశంలో రాష్ట్ర సంక్షేమం కోసం అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నామని, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే అన్ని మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీలలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించే నిర్ణయం అందులో ఒకటని తెలిపారు. అయితే, ఆ విద్యార్థులు కనీసం 7వ తరగతి నుంచి 10వ తరగతి…
2022లో ఆగ్నేయాసియా ప్రాంతంలో 66 శాతం మలేరియా కేసులు భారతదేశంలేనే నమోదు అయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) ప్రచురించిన ప్రపంచ మలేరియా నివేదిక – 2023లో పేర్కొంది. వీటిలో దాదాపు 46 శాతం ప్లాస్మోడియం వైవాక్స్ వల్ల సంభవించాయని తెలిపింది. దోమ తెరలు, మందులు వినియోగించడం ద్వారా చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలలో మలేరియాను నివారించడంలో సహాయపడతాయని తెలిపింది. ఆగ్నేయాసియా ప్రాంతంలో 77 శాతం మరణాలు తగ్గాయని తెలిపింది. కాగా ఆగ్నేయాసియాలోని మొత్తం మలేరియా మరణాలలో 94 శాతం మరణాలు భారతదేశం,ఇండోనేషియాలో ఉన్నాయని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 2019లో 233 మిలియన్ల మలేరియా కేసులు నమోదు కాగా, 2022లో 249 మిలియన్ కేసులు చేరుకున్నాయి. 2019 కంటే 2022లో 16 మిలియన్ కేసులు పెరిగాయని నివేదిక పేర్కొంది. కోవిడ్-19, మాదకద్రవ్యాలు మరియు పురుగుమందుల నిరోధకత, మానవతా సంక్షోభాలు, వనరుల పరిమితులు, వాతావరణ మార్పుల ప్రభావాలు వంటివి మలేరియాపై పోరాటానికి ఆటంకం కలిగిస్తున్నాయని పేర్కొంది.…
ఎగ్జిట్ పోల్స్ చాలావరకు తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని సంకేతం ఇస్తున్నప్పటికీ స్పష్టమైన మెజారిటీ ఆ పార్టీకి లభించే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. అందుకనే మెజారిటీకి అటు- ఇటుగా సీట్లు వస్తే ప్రభుత్వం ఏర్పాటు చేయడం కష్టం కాగలదని భయం వారిని వెంటాడుతున్నది. మరోవంక, స్పష్టమైన మెజారిటీ వచ్చిన్నప్పటికీ తమ ఎమ్యెల్యేలు కొందరిని బిఆర్ఎస్ ఆకట్టుకోవచ్చనే భయం కూడా వారికి ఆందోళన కలిగిస్తున్నది. మరోవంక, ముఖ్యమంత్రి కేసీఆర్ మనమే తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్లు పార్టీ నేతలకు భరోసా ఇస్తుండటం, సోమవారం రాష్ట్ర కేబినెట్ సమావేశం కూడా ఏర్పాటు చేయడంతో కేసీఆర్ ఎత్తుగడలు అర్ధంగాక కాంగ్రెస్ నేతలు కలవరం చెందుతున్నారు. అందుకనే కౌంటింగ్ కు ముందు అధ్యర్థులు ఎవరూ చేజారకూడదని, ఎలాంటి ప్రలోభాలకు లోంగకుండా ఉండేందుకు కాంగ్రెస్ అధిష్టానం చర్యలకు సిద్ధమైంది. పార్టీ అభ్యర్థులందరినీ హైదరాబాద్ కు రప్పించాలని హోటల్ తాజ్ కృష్ణలో అభ్యర్థులకు ఎఐసిసి ప్రతినిధులు సూచించినట్లు…
నవంబర్ మాసానికి సంబంధించిన జీఎస్టీ వసూళ్ల డేటాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ నెలలో వసూళ్లు స్వల్ప తగ్గుదలను నమోదు చేసింది. అయితే అత్యధిక మెుత్తంలో జీఎస్టీ వసూళ్లు నమోదైన రాష్ట్రంగా మహారాష్ట్ర తొలిస్థానంలో నిలిచింది. నవంబర్ 2023లో మెుత్తం జీఎస్టీ వసూళ్లు రూ.1.68 లక్షల కోట్లుగా నమోదయ్యాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. జీఎస్టీ వసూళ్లు రూ.1.5 లక్షల కోట్లు దాటడం ఇది వరుసగా తొమ్మిదో నెల కావటం గమనార్హం. అక్టోబర్ 2023లో వీటి విలువ రూ.1.72 లక్షల కోట్లుగా ఉన్నాయి. అంటే అక్టోబరుతో పోల్చితే వసూళ్లు 2 శాతం తగ్గుదలను నమోదు చేసింది. ఇదే సమయంలో ఏడాది ప్రాతిపధికన వసూళ్లు 15.1 శాతం పెరిగినట్లు కేంద్రం ప్రకటించింది. నవంబర్‌లో సీజీఎస్టీ వసూళ్లు రూ.30,400 కోట్లు కాగా, ఎస్జీఎస్టీ వసూళ్లు రూ.38,200 కోట్లు. ఇది కాకుండా నవంబర్‌లో ఐజీఎస్టీ వసూళ్లు రూ.87,000 కోట్లుగా ఉన్నాయి. గత 7…
* సిరీస్ 3-1తో కైవసం స్పిన్నర్ అక్షర్ పటేల్‌కి తోడు రవి బిష్ణోరు బౌలింగ్‌లో రాణించడంతో భారతజట్టు 20పరుగుల తేడాతో ఆసీస్‌ను చిత్తుచేసింది. భారత్ నిర్దేశించిన 175పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 8 వికెట్ల నష్టానికి 154 పరుగులే చేయగల్గింది. స్పిన్నర్ అక్షర్ పటేల్(3/16), బిష్ణోరు(1/17) పొదుపు గా బౌలింగ్ చేసి ఆస్ట్రేలియాను కట్టడి చేశారు. తొలుత రింకు సింగ్(46), జైస్వాల్(37), గైక్వాడ్(32) బ్యాటింగ్‌లో రాణించడంతో భారతజట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174పరుగులు చేసింది. రింకూ సింగ్ 29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 46 పరుగులు, వికెట్ కీపర్ జితేశ్ శర్మ 19 బంతుల్లో ఫోర్, 3 సిక్సులతో 35 పరుగులు సాధించాడు. శ్రేయస్ అయ్యర్ (8), సూర్యకుమార్ యాదవ్ (1) నిరాశపరిచారు. 4వికెట్ల నష్టానికి 167పరుగులతో పటిష్టంగా ఉన్న టీమిండియా.. ఏడు పరుగుల వ్యత్యాసంలో…
ప్రపంచ స్థాయిలో వాతావరణ పరిరక్షణకు అన్ని దేశాలు కలిసికట్టుగా వ్యవహరించాలని, గణనీయ రీతిలో కార్బన్ ఉద్గారాల కట్టడికి చర్యలు తీసుకోవాలని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దుబాయ్ వేదికగా ఆరంభమైన పర్యావరణ ప్రపంచ స్థాయి సదస్సు కాప్ 28లో ఆయన శుక్రవారం ప్రసంగిస్తూ కేవలం ఆషామాషీగా లేదా నామమాత్రంగా గ్లోబల్ వ్యర్థాల కట్టడికి దిగితే సరిపోదని స్పష్టం చేశారు. తులనాత్మక గణనీయ స్థాయిలో తగు విధంగా నియంత్రణ చర్యలకు దిగాల్సి ఉంటుందని ప్రధాని తెలిపారు. వ్యర్థాల కట్టడి విషయంలో భారతదేశం ఇతర దేశాలకు ఆదర్శంగా ఉంటుందని, గణాంకాలే ఈ విషయం స్పష్టం చేస్తున్నాయని ఆయన వివరించారు. భారతదేశ జనాభా ప్రపంచ జనాభాతో పోలిస్తే 17 శాతం ఉంది. అయితే వ్యర్థాల విషయంలో ప్రపంచవ్యాప్తంగా చూస్తే కేవలం 4 శాతం కార్బన్ ఉద్గారాలే వెలువడుతున్నాయని గుర్తు చేశారు. భారతదేశంలో ప్రజల ప్రాతినిధ్యంతో గ్రీన్ క్రెడిట్ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. దీనికి…
నాగార్జున సాగర్ నీటి విడుదలపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం చెలరేగడం, వందలాది మంది పోలీసులతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం బలవంతంగా కుడికాలువకు నీటిని విడుదల చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి అజయ్‌కుమార్ భల్లా రంగ ప్రదేశం చేసి తాత్కాలిక ఉపశమనం కలిగించారు. ప్రస్తుతం నెలకొన్న వివాదం గురించి తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక చర్చిద్దామంటూ అప్పటివరకు గత నెల 30 ముందున్న పరిస్థితిని కొనసాగించాలని స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో వర్చ్యువల్ గా జరిపిన భేటీలో డ్యామ్ నిర్వహణను కృష్ణా వాటర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు అప్పగించేందుకు నిర్ణయించారు. అదేవిధంగా డ్యామ్ పై రెండు రాష్ట్రాల పోలీసులను వెనుకకు పంపి, సీఆర్పీఎఫ్ దళాల పర్యవేక్షణ బాధ్యతలు అప్పచెప్పనున్నట్లు ప్రకటించారు. అంతకు ముందు, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వందలాదిమంది పోలీసులను మోహరింపచేసి, బలవంతంగా నాగార్జున సాగర్ కుడికాలువకు నీటిని విడుదల…