Author: Editor's Desk, Tattva News

పోలవరం సాగునీటి ప్రాజెక్ట్ అనుకున్న సమయంలోగా పూర్తికాకపోవచ్చునని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2020, 2022లో సంభవించిన భారీ వరదల కారణంగా నిర్మాణ పనుల్లో జాప్యం చోటుచేసుకుందని వెల్లడించింది.  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ విడివిడిగా ఈ ప్రాజెక్టుపై అడిగిన ప్రశ్నలకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానాలిచ్చారు.  ఆ ప్రకారం మార్చి 2024 నాటికి పోలవరం ప్రాజెక్టును, జూన్ 2024 నాటికి డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ పనులు పూర్తిచేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. భారీ వరదల కారణంగా నిర్మాణ పనుల్లో నెలకొన్న జాప్యంతో పనులు పూర్తి చేయడానికి నిర్దేశిత లక్ష్యం కంటే మరికొంత అదనపు సమయం పడుతుందని సమాధానంలో పేర్కొన్నారు. ఇకపోతే పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటి నుంచి దీనిపై ఖర్చు చేసిన సొమ్మును కేంద్రం తిరిగి చెల్లిస్తోందని తెలిపారు. ప్రాజెక్టులో ‘ఇరిగేషన్…

Read More

భారత్, చైనా బలగాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. డిసెంబర్ 9న అరుణాచల్‌ప్రదేశ్‌లోని వాస్తవాధీన రేఖ నుంచి ఇరు సైన్యాల ఉపసంహరణ సమయంలో స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు సేనలు కొట్లాటకు దిగిన ఈ చిన్నపాటి ఘర్షణలో ఇరువైపులా పలువురు సైనికులు, అధికారులకు స్వల్ప గాయాలయ్యాయని రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. కాగా ఘర్షణ తర్వాత ఇరుదేశాల బలగాలు అక్కడి నుంచి ఎవరివైపు వారు వెనక్కి వెళ్లిపోయారని వెల్లడించాయి. తవాంగ్ సెక్టార్‌లోని యంగ్‌స్టే ప్రాంతంలో ఈ ఘర్షణ జరిగింది. ఈ ప్రతిష్ఠంభనలో ఆరుగురు భారతీయ సైనికులకు గాయాలయ్యాయి. చికిత్స కోసం వారిని గువహటి తరలించినట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి. అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్ వద్ద ఈ ప్రతిష్టంభన చోటుచేసుకుంది. చైనా బలగాలు వాస్తవాధీన రేఖ దాటడాన్ని భారతీయ సైనికులు గట్టిగా ప్రతిఘటించారు. 300లకుపైగా మంది చైనా సైనికులు దాదాపు 17 వేల అడుగుల ఎత్తైన పర్వత శిఖరం మీదకు ఎక్కేందుకు ప్రయత్నించారు. అక్కడున్న…

Read More

తెలంగాణలో గిరిజన రిజర్వేషన్లను పెంచుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన విషయంపై స్పందిస్తూ సుప్రీంకోర్టులో ఉన్న కేసుల పరిష్కారం తర్వాతే గిరిజన రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం లోక్‌సభలో టిఆర్‌ఎస్ ఎంపి రంజిత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ‘తెలంగాణలో గిరిజన రిజర్వేషన్లు పెంపునకు సంబంధించిన బిల్లు కేంద్ర ప్రభుత్వానికి అందింది. ఆ రిజర్వేషన్లను పది శాతం వరకు పెంచాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన బిల్లు కేంద్ర హోంశాఖకు చేరింది. రిజర్వేషన్లకు సంబంధించిన కొన్ని కేసులు ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. న్యాయస్థానంలో కేసుల పరిష్కారం తర్వాతే దీనిపై ముందకు వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది’ అని తెలిపారు. దశాబ్దాలుగా అణచివేతకు, దోపిడీకి గురైన గిరిజనులకు న్యాయం చేసేందుకు రిజర్వేషన్లు పెంచాలని రాష్ట్ర…

Read More

పెట్రోల్‌లో 20 శాతం వరకు ఇథనాల్‌ను కలపలాన్న లక్ష్య సాధనలో 2జీ (రెండో తరం) ఇథనాల్‌ కీలకం కానుందని పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్‌ తెలీ వెల్లడించారు. అందుకోసం 2జీ బయో ఇథనాల్‌ రిఫైనరీల ఏర్పాటుకు కేంద్రం ఆర్థిక సహాయం అందిస్తుందని రాజ్యసభలో సోమవారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి ప్రశ్నకు రాతపూర్వకంగా బదులిస్తూ చెప్పారు. ప్రభుత్వ ఆయిల్‌ రంగ సంస్థలు ఈ ఏడాది నవంబర్‌ 15 నాటికి ఆంధ్రప్రదేశ్‌ నుంచి 16.19 కోట్ల లీటర్ల ఇథనాల్‌ను కొనుగోలు చేసినట్లు ఆయన చెప్పారు. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి గడిచిన 5 సంవత్సరాలలో 385.92 కోట్ల లీటర్ల ఇథనాల్‌ను ప్రభుత్వ రంగ ఆయిల్‌ సంస్థలు కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. 2025 నాటికి పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ మిశ్రమాన్ని సాధించేందుకు రెండో తరం ఇథనాల్ ఉత్పత్తిని ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారన్న ప్రశ్నకు మంత్రి బదులిస్తూ ప్రధాన మంత్రి జేఐ-వన్…

Read More

పర్యాటకుల భద్రత, రక్షణ అనేది రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశం. అయితే, పర్యాటకులకు కల్పించాల్సిన భద్రతపై పర్యాటక మంత్రిత్వ శాఖకు పూర్తి అవగాహన ఉంది. పర్యాటకులకు సురక్షితమైన, సురక్షితమైన వాతావరణాన్ని అందించడానికి పర్యాటక మంత్రిత్వ శాఖ సాధ్యమైన అన్ని చర్యలను తీసుకుందని పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి లోక్‌సభలో లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలిపారు. ఈ అంశంలో గతంలో పర్యాటక మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు/కేంద్రపాలిత ప్రాంతాల యంత్రాగాలతో చర్చలు జరిపింది. పర్యాటకులకు భద్రత మరియు రక్షణ కల్పించడానికి చర్యలు తీసుకోవాలని సూచించింది. పర్యాటకులకు ఊహించని విధంగా అవాంఛనీయ సంఘటన జరిగిన సమయంలో పరిస్థితిని ఎదుర్కోవడానికి, పర్యాటకులకు సంతృప్తికరమైన పరిష్కారాన్ని అందించడానికి పటిష్టమైన శాంతి భద్రతల వ్యవస్థ అభివృద్ధి చేయాలని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు పర్యాటక శాఖ సూచించింది. పర్యాటక మంత్రిత్వ శాఖ సూచనకు ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, గోవా, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, మధ్యప్రదేశ్, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు/కేంద్రపాలిత ప్రాంతాలు స్పందించాయి. రంగంలోకి దిగాయి.పర్యాటకుల భద్రత, రక్షణ కోసం పోలీసు వ్యవస్థను సిద్ధం చేశాయి. పర్యాటకులకు అవసరమైన పోలీసు యంత్రాంగం పనిచేయాల్సిన తీరు తెలుసుకుని, పర్యాటకుల అవసరాలపై పోలీస్ శాఖకు అవగాహన కల్పించి దీనికి అనుగుణంగా…

Read More

గుజరాత్ సీఎంగా బీజేపీ నాయకుడు భూపేంద్ర పటేల్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా సమక్షంలో గవర్నర్ ఆచార్య దేవవ్రత్ భూపేంద్ర పటేల్‌తో ప్రమాణం చేయించారు. గాంధీ నగర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. భూపేంద్ర పటేల్‌తో పాటు మంత్రులుగా హర్ష సంఘవి, జగదీష్ విశ్వకర్మ, నరేష్ పటేల్, బచుభాయ్ ఖబద్, పర్షోత్తమ్ సోలంకి గుజరాత్ కేబినెట్‌లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా హాజరయ్యారు. ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తిరుగు లేని విజయాన్ని సొంతం చేసుకుంది. ఏడోసారి అధికార పగ్గాలను చేజిక్కించుకుంది. ఆరేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి తన అధికారాన్ని సుస్థిరం చేసుకుంది.  మొత్తం 182 స్థానాలకి 156 స్థానాల్లో…

Read More

వైఎస్సార్ బిడ్డను కేసీఆర్ పంజరంలో పెట్టి బంధించవచ్చని అనుకుంటున్నారని, అది కేసీఆర్ తరం కాదని వైఎస్సార్ టిపి అధ్యక్షురాలు వై ఎస్ షర్మిల హెచ్చరించారు. ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరని అంటూ మళ్లీ చెప్తున్నా వైఎస్సాఆర్ సంక్షేమ పాలన కోసమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టామని స్పష్టం చేశారు. తిరిగి వైఎస్సార్ పాలన తిరిగొచ్చే వరకు రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తామని ఆమె తేల్చి చెప్పారు. హైకోర్టు పాదయాత్ర చేసుకోమని అనుమతి ఇచ్చినా కేసీఆర్ పోలీస్ భుజాన తుపాకీ పెట్టి పాదయాత్రను అడ్డుకొంటారా అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్రకు అనుమతివ్వాలని ఆమె ఇంటి వద్దనే చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను భగ్నం చేసిన పోలీసులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలో ఎమర్జెన్సీ వార్డు నుంచే సీఎం కేసీఆర్ కు ఆమె హెచ్చరిక సందేశం పంపారు.ఆమరణ దీక్ష చేస్తుంటే నన్ను మా కార్యకర్తలను బందీలను చేశారని, తమ నాయకులను, కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారని ఆమె మండిపడ్డారు. లోటస్ పాండ్ చుట్టూ…

Read More

తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన పార్టీ కసరత్తులు చేస్తోంది. దీనిలో భాగంగా 32 నియోజవర్గాల్లో కార్యనిర్వహకులను నియమించింది. తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కార్యనిర్వాహకులను నియమించామని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జ్ నేమూరి శంకర్ గౌడ్ తెలిపారు. కొత్తగా కార్యనిర్వాహకులుగా బాధ్యతలు చేపట్టిన వారంతా ఆయా నియోజకవర్గాల్లోని పరిస్థితులపై పార్టీకి నివేదికలను అందజేస్తారని తెలిపారు. నివేదికల ఆధారంగానే నియోజకవర్గాల్లో జనసేన తరపున అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని సూచించినట్టు తెలిపారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు 32 నియోజకవర్గాల్లో కార్యనిర్వాహకులను ప్రకటించినట్టు వేమూరి శంకర్ గౌడ్ వివరించారు. ఏపీలో జనవాణి కార్యక్రమంతో తన గ్రాఫ్‌ పెంచుకున్న పవన్‌ కళ్యాణ్‌ ఇప్పుడు తెలంగాణలోనూ పార్టీని బలోపేతం చేసే పనిలో ఉన్నారు. కొండగట్టు నుంచి తెలంగాణలో రాజకీయ ప్రస్థానాన్ని…

Read More

దేశంలో సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలకంగా మారిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీబీఐ విచారణ ఆదివారం ముగిసింది. ముందే చెప్పిన విధంగా ఉదయం పదకొండు గంటలకే వచ్చిన అధికారులు.. సుదీర్ఘంగా విచారణ చేశారు. సుమారు ఏడున్నర గంటల పాటు కవితపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. పదకొండు గంటలకు వచ్చిన అధికారులు విచారణ మొదలు పెట్టగా.. ఆరున్నర వరకు ఈ విచారణ సాగింది. కవిత ఇంట్లో ప్రత్యేక గదిలో.. ఆమె అడ్వకేట్ ఆధ్వర్యంలోనే విచారణ సాగింది. ఈ కేసుకు సంబంధించిన పలు కీలక అంశాలను కవిత నుంచి తెలుసుకున్నారు. ఈ కేసులో అధికారులకు ఉన్న సందేహాలను సంధించిన అధికారులు . ఆమె ఇచ్చిన సమాధానాలను రికార్డు చేసుకున్నారు. లిక్కర్‌ కేసు నిందితులు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగానే సీబీఐ అధికారులు విచారించింది. అమిత్‌ అరోరా ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా అధికారులు కవితను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సిసోడియా, అరోరా, అభిషేక్‌…

Read More

కాంగ్రెస్ లో అసమ్మతి నేతగా పేరొందిన మనీష్ తివారి లోక్ సభలో ప్రవేశ పెట్టిన బిల్లు సొంత పార్టీనే కాకుండా అన్ని రాజకీయ పార్టీలను ఖంగారుకు గురిచేస్తుంది. ఈ బిల్లును దాదాపు ఏ పార్టీ కూడా అంగీకరించే అవకాశం లేదు. దేశంలోని అన్ని రిజిస్టర్డ్ రాజకీయ పార్టీల అంతర్గత పనితీరును క్రమబద్ధీకరించి, పర్యవేక్షించే సామర్థ్యాన్ని భారత ఎన్నికల కమిషన్ కు కల్పించాలని ఈ బిల్లులో ప్రతిపాదించారు. పార్టీల పనితీరు పారదర్శకంగా, జవాబుదారీతనంతో, నియమ, నిబంధనల ఆధారంగా ఉండేలా చూడాలని పేర్కొన్నారు. ఈ బిల్లు ఆమోదం పొందితే రాజకీయ పార్టీలలో అంతర్గత ప్రజాస్వామ్యంను పర్యవేక్షించే అధికారం ఎన్నికల కమీషన్ కు దాఖలవుతుంది. అంటే వారి సభ్యత్వం, సంస్థాగత ఎన్నికలు వంటి అంశాలపై కమీషన్ పర్యవేక్షణ తప్పనిసరి అవుతుంది. చట్టప్రకారం జరగని పక్షంలో ఆయా పార్టీల సభ్యులు ఎన్నికల కమిషన్ కు, ఆ తర్వాత ఉన్నత న్యాయస్థానాలు సహితం ఫిర్యాదు చేసే అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం చాలా రాజకీయ పార్టీలలో సంస్థాగత…

Read More