తెలంగాణ రాజకీయాలలో కలకలం రేపుతున్న దేశ రాజధానిలో చోటుచేసుకున్న మద్యం కుంభకోణం కేసులో తెలుగు రాష్ట్రాల్లో డొంక కదులుతోంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)తో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ జరుపుతున్న ఈ కేసులో ఇప్పటికే విజయ్ నాయర్, సమీర్ మహేంద్రును అరెస్టవగా, తాజాగా తెలుగు వ్యక్తి అభిషేక్ బోయినపల్లి అరెస్టయ్యారు. అభిషేక్‌ను అరెస్టు చేసినట్టు సోమవారం ఉదయం ప్రకటించిన సీబీఐ, మధ్యాహ్నం ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు కాంప్లెక్సులో ఉన్న సీబీఐ స్పెషల్ కోర్టులో హాజరు పరిచింది. మరింత విచారణ జరిపేందుకు 5 రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని కోరగా, న్యాయస్థానం 3 రోజుల పాటు కస్టడీకి అప్పగించింది. సీబీఐ వర్గాల సమాచారం ప్రకారం ఇండోస్పిరిట్ సంస్థ ఖాతా నుంచి అభిషేక్ బోయిన్‌పల్లి ఖాతాకు రూ. 3.85 కోట్లు చేరగా, ఏ లావాదేవీ కోసం ఈ నగదు అందుకున్నారనేది అభిషేక్ చెప్పలేకపోయారని తెలిసింది. రెండు, మూడు ఖాతాల…
Author: Editor's Desk, Tattva News
భారతదేశంలో 5జీ సేవలను. ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 1న దేశంలో ప్రారంభించడంతో 5జీ నెట్‌వర్క్ ఉన్న అతికొద్ది దేశాల జాబితాలో భారతదేశం చేరింది. అయితే ఇంటర్నెట్ స్పీడ్ పరంగా మాత్రం బాగా వెనుకబడి ఉంది. ఇంటర్నెట్ వేగం గురించి సమాచారాన్ని అందించే ఊక్లా ఆగస్టు నెలకు సంబంధించిన స్పీడ్‌టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్‌లో 140 దేశాలలో భారతదేశం 117వ స్థానంలో ఉంది. ఆగస్టులో భారతదేశంలో సగటు వేగం 13.52 ఎంబిపిఎస్. ఇది పాకిస్థాన్ కంటే తక్కువ. పాకిస్థాన్ ఈ నెలలో 14.22 ఎంబిపిఎస్ వేగంతో 116వ స్థానంలో ఉంది. నార్వే అత్యధిక ఇంటరొట్ వేగం కలిగి ఉంది. ఇక్కడ 122.77 ఎంబీపీఎస్ వేగం అందుబాటులో ఉంది. అమెరికాలో వేగం 61.95 ఎంబిపిఎస్ కాగా, చైనాలో 92.53 ఎంబిపిఎస్ ఉన్నది. వినియోగదారుల కోసం చౌకగా డేటా ఉన్నప్పటికీ, భారతదేశంలో చాలా మందికి ఇంటర్నెట్ సదుపాయం లేదు. ఇప్పుడు కూడా ప్రపంచంలో ఇంటర్నెట్ లేని 10 మందిలో నలుగురు…
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంతి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ (82) కన్నుమూశారు. గతకొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. వారం రోజులుగా ఆయనను ఐసీయూలో ఉంచి, చికిత్స అందిస్తున్నారు. ములాయం మరణవార్తను ఆయన తనయుడు అఖిలేశ్ యాదవ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ములాయం మూడుసార్లు పని చేశారు. అలాగే కేంద్రంలో రక్షణ మంత్రిగానూ సేవలందించారు. 1967లో యూపీ శాసనసభకు తొలిసారిగా ఎన్నికయ్యారు. 1939, నవంబర్ 22న ఆయన జన్మనించారు. గత పార్లమెంట్ ఎన్నికలలో ముణిపురి నుంచి ఎంపిగా గెలిచారు. అనారోగ్య సమస్యలు తలెత్తడంతో అక్టోబర్ 2న ఆస్పత్రిలో చేరారు. ఎస్ పి కార్యకర్తలు ములాయం సింగ్ ను ముద్దుగా నేతాజీ అని పిలుచుకునేవారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేతగా దేశ రాజకీయాలపై చెరగని ముద్రవేశారు. రాం మనోహర్ లోహియా వంటి మహానేతల మార్గదర్శకత్వంలో రాజకీయ ఓనమాలు నేర్చుకున్న…
నామినేషన్ల ఘట్టం ప్రారంభం కావడంతో రెండు నెలలుగా రాజకీయంగా తెలంగాణాలో ఉద్రిక్తలు కలిగిస్తున్న మునుగోడు ఉపఎన్నికలో తమ ప్రభావం కాపాడుకోవడం కోసం మూడు ప్రధాన పార్టీలు హోరాహోరాగా ఎత్తుగడలు ప్రారంభించాయి. తమ రాజకీయ భవిష్యత్తు కోసం ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తూ అమీతుమీ తేల్చుకునే రీతిలో పోటీ చేస్తుండడం ఉత్కంఠ రేపుతోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ తరపున బరిలోకి దిగారు. తమ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పాల్వాయి స్రవంతిని ఎన్నిక బరిలో నిలిపింది. టీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా మారుతున్న కీలక తరుణంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి బీఫాం ఇచ్చి ఉప ఎన్నిక బరిలోకి దింపింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు సోమవారం తమ నామినేషన్లను దాఖలు చేయనున్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ జరుగనున్న దృష్ట్యా ఈ ఎన్నిక ఫలితం తమ రాజకీయ భవిష్యత్ ను నిర్ధేశిస్తుందని మూడు పాటు పార్టీలు భారీ కసరత్తు చేస్తున్నాయి . అందుకనే కేవలం పోటీ…
తెలంగాణాలో అవినీతి, కుటుంబ పాలన నడుస్తోందని చెబుతూ వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయం అని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ స్పష్టం చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ లో భూపేందర్ యాదవ్ సమక్షంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి పలువురు నేతలు బీజేపీ పార్టీలో చేరారు. అనంతరం నర్సాపూర్ లో ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కేంద్రం నుంచి సంక్షేమ పథకాల కోసం నిధులు వచ్చినా ఇక్కడ ఆగిపోతున్నాయని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పేదలకు పథకాలు అందకుండా పోతున్నాయని తెలిపారు. తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. టీఆర్ఎస్ ప్రజలు ఆ పార్టీకి విఆర్ఎస్ పలకడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణాలో కేసీఆర్ అడ్రస్ గల్లంతు చేసేదాకా బీజేపీ పోరాటం ఆగదని ఎమ్యెల్యే ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. మునుగొడులో రాజగోపాల్ రెడ్డి గెలుపు ఖాయం అని చెబుతూ మునుగోడు తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధించి అధికారంలోకి వస్తుందని భరోసా…
మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై టీఆర్‌ఎస్ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. వేల కోట్ల ప్రాజెక్టు తీసుకొని బీజేపీలో చేరానని చెప్పిన ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్‌ను ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎన్నికల అధికారిని కలిసిన వారిలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే గాదరి కిషోర్, పార్టీ జనరల్ సెక్రటరీలు శ్రీనివాస్‌రెడ్డి, సోమ భరత్ ఉన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. మునుగోడులో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్టి తాను రూ.18 వేల కోట్ల ప్రాజెక్టు తీసుకొని బీజేపీలో చేరానని ఓ న్యూస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారని. అందుకని రాజగోపాల్ రెడ్డిని అసెంబ్లీ బైపోల్‌లో పోటీ చేయకుండా అనర్హుడిని చేయాలని రాష్ట్ర ఎన్నికల అధికారికి మెమోరాండం సమర్పించారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటూనే బీజేపీ…
ఢిల్లీలో బౌద్ధ మత కార్యక్రమంలో మతమార్పిడి ప్రమాణం వంటి విషయాలు వివాదానికి కారణమయ్యాయి. ఢిల్లీ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్ ఆదివారం అరవింద్ కేజ్రీవాల్ మంత్రివర్గం నుండి రాజీనామా చేశారు. రాజేంద్ర పాల్ గౌతమ్ ఒక మత మార్పిడి కార్యక్రమంలో హిందూ దేవతలను దూషించినట్లు దేశ రాజధానిలో జరిగిన ఈవెంట్కి సంబంధించిన వీడియో ఒకటి వైరల్గా మారింది. దీంతో పలువురు బీజేపీ లీడర్లు, ప్రజాప్రతినిధులు దీనిపై విమర్శలకు దిగారు. ఈ విషయంపై ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను కూడా వారు వదిలిపెట్టలేదు. ఇది హిందూ, బౌద్ధమతాలను అవమానించడమేనని, ఆప్ మంత్రులు అల్లర్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ విమర్శలు చేశారు. ఆ మంత్రిని వెంటనే పార్టీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కాగా, వైరల్ అయిన వీడియోలో గౌతమ్‌తో పాటు వందలాది మంది ప్రమాణం చేయడం కనిపించింది. ఉద్దేశ్యపూర్వకంగా మైక్రోఫోన్‌లో ఉన్న వ్యక్తి ప్రమాణం…
విద్యుత్ సౌకర్యం లేని మారుమూల ప్రాంతాల వ్యవసాయ బోర్లకు సౌర విద్యుత్ సౌకర్యం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సూచనలు చేసింది. వ్యవసాయ బోర్ల వద్ద ఏర్పాటు చేసే సౌర ఫలకాల నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్‌ను కరెంట్ లైన్లకు కలపకుండానే (ఆఫ్‌గ్రిడ్ ) అదే వ్యవసాయ బోరు నేరుగా మోటారుకు వినియోగిస్తారు. దీని వల్ల అటవీ, మారుమూల గ్రామాల్లోని పోలాల వద్దకు సాధారణ కరెంటు లైన్లు వేయడానికి ట్రాన్స్‌ఫార్మర్స్, స్తంభాల ఏర్పాటు, తీగలు లాగేందుకు విద్యుత్ పంపిణీ సంస్థలు ( డిస్కంలు) వెచ్చిస్తున్న రూ.వందల కోట్ల సొమ్ము ఆదా అవుతుందని కేంద్ర విద్యుత్ శాఖ స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఎనిమిదేళ్లలో విద్యుత్ పంపిణీ, సరఫరా లైన్ల వ్యవస్థ బలోపేతానికి రాష్ట్రంలోని రెండు డిస్కంలు రూ.37,099 కోట్లు వెచ్చించాయి. గత ఎనిమిదేళ్లలో కొత్తగా 7.93 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఇచ్చాయి. ఒక్కో దానికి డిస్కంలు రూ.70 వేల వరకు…
కర్నాటకలో ఎస్‌సి/ఎస్‌టి రిజర్వేషన్ల పెంపుదల నిర్ణయానికి రాష్ట్ర మంత్రిమండలి శనివారం తుది ఆమోదం తెలిపింది. దీనితో ఎస్‌సిలకు ఇప్పటివరకూ ఉన్న 15 శాతం కోటా ఇకపై 17 శాతానికి పెరుగుతుంది. ఇదే విధంగా ఎస్‌టికోటా ఇప్పుడున్న 3 శాతం నుంచి 7 శాతానికి చేరుతుంది. సంబంధిత కోటా పెరుగుదలపై రాష్ట్ర ప్రభుత్వం వెనువెంటనే కార్యాచరణ ఆర్డర్ వెలువరిస్తుంది. అయితే సంబంధిత కోటా హెచ్చింపు ప్రక్రియకు రాజ్యాంగపరంగా చర్యలు తీసుకోవల్సి ఉంటుంది. కోటా పెంపును రాజ్యాంగంలోని 9వ అధికరణలో చేర్చేలా నిర్ధేశించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది. కేబినెట్ భేటీ తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై విలేకరులతో మాట్లాడుతూ కోటా పెంపునకు సంబంధించి తాము శుక్రవారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశామని, ఈ సందర్భంగా కోటా పెంపుదలను ప్రతిపాదిస్తూ జస్టిస్ హెచ్‌ఎన్ నాగమోహన్ దాస్ కమిటీ ఇచ్చిన నివేదికను ఆమోదించడం జరిగిందని తెలిపారు. దీనికి అనుగుణంగానే ఇప్పుడు కోటా పెంపుదలకు…
ఎన్నికల్లో ఒక అభ్యర్థి ఒకచోటే పోటీ చేసేలా కేంద్ర ఎనిుకల సంఘం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖకు కేంద్ర ఎన్నికల కమిషనరు రాజీవ్ కుమార్ లేఖ రాశారు. వచ్చే ఎన్నికల నుంచి ఈ నిర్ణయాలు అమలు చేసేలా ప్రయత్నించాలని లేఖలో సూచించారు. ప్రస్తుతం ఎనిుకల్లో అర్హత ఉన్న ఒక అభ్యర్థి రెండు వేర్వేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. 2014, 2019 ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ రెండేసి నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. మోదీ వడోదర, వారణాసి నుంచి.. రాహుల్ గాంధీ అమేథీ, వయనాడ్ నుంచి పోటీ చేశారు. కానీ భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితి లేకుండా చేసేందుకు చెక్ పెట్టాలని కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. కొన్ని సందర్భాల్లో అసెంబ్లీ లేదాలోక్‌సభ ఎన్నికల్లో రెండేసి స్థానాల్లో పోటీ చేయడమే కాకుండా పదవిలో ఉండగానే పార్లమెంటు సభ్యులు అసెంబ్లీ ఎన్నికల్లో,…