ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అహమదాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ను ప్రారంభించి, కాలూపుర్ స్టేశన్ నుండి మెట్రో లో దూర్ దర్శన్ కేంద్ర మెట్రో స్టేశన్ వరకు ప్రయాణించారు. ఈ సందర్భంగా ప్రధాని వెంట గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, గుజరాత్ గవర్నరు ఆచార్య దేవవ్రత్, గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి హర్దీప్ సింహ్ పురిలు కూడా ఉన్నారు. మెట్రో లో ప్రయాణించినపుడు విద్యార్థులతో, క్రీడాకారులతో, సాధారణ ప్రయాణికులతో ప్రధాన మంత్రి మాట్లాడారు. మెట్రో రైలులో ఉన్న అనేక మంది ప్రయాణికులు ప్రధాన మంత్రి ఆటోగ్రాఫ్ ను కూడా తీసుకొన్నారు. అహమదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు బహుళ విధ మౌలిక సదుపాయాల సంబంధిత సంధానానికి గొప్ప ప్రోత్సాహాన్ని అందించేది అని చెప్పాలి. అహమదాబాద్ మెట్రో ప్రాజెక్టు యొక్క ఒకటో దశ లో అపేరల్ పార్క్ నుండి థల్ తేజ్ వరకు ఈస్ట్ -వెస్ట్ కారిడోర్, మొటేరా నుండి గ్యాస్…
Author: Editor's Desk, Tattva News
కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం నామినేషన్ దాఖలుకు చివరి రోజైన శుక్రవారం నామినేషన్లు వేసిన మాజీ కేంద్ర మంత్రులు మల్లిఖార్జున్ ఖర్గే, శశి థరూర్‌ల మధ్యనే పోటీ ప్రధానంగా ఉండే అవకాశం ఉంది. జార్ఖండ్ నేత కేఎన్ త్రిపాఠి కూడా అధ్యక్ష పదవి కోసం నామినేషన్ వేసినా ఆయనను ఎవ్వరు లెక్కలోకి తీసుకోవడం లేదు. నామినేషన్ వేసిన తర్వాత శశి థరూర్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పట్ల తనకు ఒక విజన్ ఉందని, దాన్ని ప్రతినిధులకు తెలియజేయనున్నట్లు వెల్లడించారు. పార్టీ కార్యకర్తల మద్దతు తీసుకుంటానని, అందరి అభిప్రాయాలకు తాను స్వరంగా మారనున్నట్లు చెప్పారు. నిర్ణయాలను తీసుకునే విధానాన్ని కాంగ్రెస్ ఏకీకృతం చేసిందని, ఆ వ్యవస్థను బ్రేక్ చేయాలని, కొందరు ఓ వ్యక్తిని ఏకగ్రీవం చేశారని, కానీ దానికి తాను వ్యతిరేకిని అని స్పష్టం చేయడం ద్వారా పార్టీపై `గాంధీ కుటుంభం’ ఆధిపత్యంను దిక్కరిస్తున్నట్లు పరోక్ష సంకేతాలు ఇచ్చారు. మల్లిఖార్జున్ ఖర్గే…
టీఆర్ఎస్ పార్టీ లోని చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు బీజీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, వారంతా సమయం కోసం ఎదురుచూస్తున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా. కె. లక్ష్మణ్ వెల్లడించారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావాలన్నా, లేదా పార్లమెంట్ తో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగాలన్నా అది ఎన్నికల కమీషన్ నిర్ణయించాల్సి ఉంటుందని చెప్పారు. తెలంగాణ బీజేపీలో ఎలాంటి గ్రూపులు లేవన్న ఆయన పాదయాత్రతో పాటు, ప్రజా గోసా, బీజేపీ భరోసా యాత్రల ద్వారా ప్రతి గ్రామాన్ని టచ్ చేస్తున్నామని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేయడం పై జాతీయ నాయకత్వం నిర్ణయిస్తోందని లక్ష్మణ్ వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ లో క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బిజెపిదే అధికారమని స్పష్టం చేశారు. అలాగే కేసీఆర్ జాతీయ పార్టీ ఫై ప్రశ్నించగా, సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని స్వాగతిస్తున్నామని తెలిపారు. దక్షిణాదిలో కర్ణాటక తరువాత తెలంగాణలోనే అధికారంలోకి వస్తామని చెప్పారు. బిజెపి పార్లమెంటరీ…
నిత్యావసర వస్తువుల అక్రమ రవాణా, వాహనాల జప్తు వ్యవహారంపై వివరణ ఇచ్చేందుకు డిజిపి రాజేంద్రనాథ్‌రెడ్డి శుక్రవారం ఏపీ హైకోర్టు విచారణకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. నిత్యవసర వస్తువుల చట్టం (ఇసి) ప్రకారం అక్రమ రవాణా జరిగే వాహనాన్ని సీజ్ చేసే అధికారం ఇన్‌స్పెక్టర్‌కే ఉంటుందని, అంతకంటే తక్కువ స్థాయి అధికారులు లేదా సిబ్బంది జప్తు చేస్తే అవి చట్ట నిబంధనలకు వ్యతిరేకమని ఆయన హైకోర్టుకు తెలియజేశారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా విషయంలో బ్లాక్ మార్కెటీర్లతో పోలీసులు కుమ్మక్కైనట్లు కనిపిస్తోందని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. రేషన్ బియ్యం సీజ్ చేసిన తరువాత స్వతంత్ర వ్యక్తులు లేకుండా పంచనామాను ప్రభుత్వ అధికారులే నిర్వహిస్తుండడం ఇందుకు బలం చేకూరుస్తోందని పేర్కొంది. పంచనామాపై వీఆర్వోలు, మహిళా పోలీసులతో సంతకాలు ఎలా చేయిస్తారని నిలదీసింది. చట్టంలో నిర్దేశించిన అధికారులు కాకుండా ఇతరులు బియ్యం అక్రమ రవాణా వాహనాలను జప్తు చేస్తూ నమోదు చేసే కేసులు న్యాయస్థానం ముందు…
బిగ్ బాస్ రియాల్టీ షోను బ్యాన్ చేయాలని దాఖలైన పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. బిగ్ బాస్ షోలో అశ్లీలత ఎక్కువగా ఉందని పిటిషనర్ కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి తెలిపారు. ఐబీఎఫ్ గైడ్ లైన్స్ ప్రకారం సమయాన్ని పాటించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 వరకే బిగ్ బాస్ షో ప్రసారం చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ సందర్భంగా బిగ్‌బాస్‌లో అశ్లీలత ఎక్కువగా ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది శివప్రసాద్ రెడ్డి వాదనలు వినిపించారు. టివి షోలు ఇండియన్ ’బ్రాడ్ క్రాస్టింగ్ ఫౌండేషన్ (ఐబిఎఫ్) నిబంధనలు పాటించడం లేదని తెలిపారు. దీనిపై స్పందించడానికి కేంద్రం తరపున న్యాయవాది సమయం కోరారు. బిగ్‌బాస్‌లో అశ్లీలతపై ఎపి హైకోర్టు ఘాటుగా స్పందించింది. 1970లో ఎలాంటి సినిమాలు వచ్చాయో తెలుసు కదా అని తెలిపిన హైకోర్టు ప్రతివాదులకు నోటీసులపై తదుపరి వాయిదాలో నిర్ణయిస్తామని పేర్కొంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రూ. 3400 కోట్లకు పైగా విలువ కలిగిన వేరు వేరు ప్రాజెక్టుల కు సూరత్ లో శంకుస్థాపన చేయడంతో పాటుగా దేశ ప్రజలకు అంకితం కూడా చేశారు. ఆ ప్రాజెక్టులలో నీటి సరఫరాకు ఉద్దేశించిన పనులు, మురుగునీటి పథకాలు, డ్రీమ్ సిటీ, బయోడైవర్సిటీ పార్కు, పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, వారసత్వ పునరుద్ధరణ, సిటీ బస్/ బిఆర్ టిఎస్ సంబంధి మౌలిక సదుపాయాలు, విద్యుత్తు వాహనాలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు వంటివి ఉన్నాయి. రహదారి మౌలిక సదుపాయాల పనుల తాలూకు ఒకటో దశను, డాయమండ్ రిసర్చ్ ఎండ్ మర్కంటైల్ (డిఆర్ఇఎఎమ్ – డ్రీమ్) సిటీ ప్రధాన ప్రవేశ ద్వారాన్ని ప్రారంభించారు. సూరత్ లో శరవేగంగా వృద్ధి చెందుతున్న వజ్రాల క్రయ విక్రయాల వ్యాపారానికి పూరకంగా ఉండేటట్లుగా వాణిజ్య భవనాలను, నివాస భవనాలను ఏర్పాటు చేయాలన్న డిమాండును నెరవేర్చడం కోసం ప్రారంభించిందే ఈ డ్రీమ్ సిటీ ప్రాజెక్టు. ప్రాజెక్టు రెండో దశకు కూడా…
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి తాను పోటీ చేయడం లేదని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. తన విధేయులైన ఎమ్మెల్యేల తిరుగుబాటుకు నైతిక బాధ్యత వహిస్తున్నట్లు తెలిపారు. అయితే ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతారా? లేదా? అన్నది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. రాజస్థాన్ కాంగ్రెస్ లో నెలకొన్న సంక్షోభం ఇప్పట్లో సద్దుమణిగే అవకాశం కనబడటం లేదు. గెహ్లాట్ పార్టీ అధ్యక్ష పదవి చేపడితే ముఖ్యమంత్రి పదవిలోకి రావచ్చని ఎదురు చూసిన సచిన్ పైలట్ ప్రస్తుత పరిణామాలతో ఖంగు తిన్నారు. అయితే రాహుల్ గాంధీ వద్ద తనకు గల సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకొని ధిక్కార ధోరణి ప్రదర్శించిన గెహ్లాట్ ను సీఎం పదవి నుండి తప్పించవలసిందే అని పట్టుబడుతున్నట్లు తెలుస్తున్నది. పైలట్ గురువారం సాయంత్రం సోనియా గాంధీని కలిసి ఈ విషయమై చర్చించారు. తాము ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే విషయం సోనియా ఇస్తామని గెహ్లాట్ మీడియాతో చెప్పినప్పటికీ సచిన్ కు ఆ పదవి కట్టబెట్టడానికి ఎట్టి పరిస్థితులలో…
సైనిక కుటుంబాలను అభ్యంతరకంగా చూపించారని నిర్మాతలైన ఏక్తాకపూర్, శోభా కపూర్ లపై కేసుపెట్టగా వారెంట్ ని జారీ చేశారు. నిర్మాత ఏక్తాకపూర్ సినిమాలతో పాటు సీరియళ్లు, వెబ్ సరీస్ లను కూడా నిర్మిస్తూ చాలా బిజీగా ఉన్నారు. తన వెబ్ సిరీస్ లను స్ట్రీమింగ్ చేయడానికి ఆమె ‘ఆర్ట్ బాలాజీ’ అనే ఓటీటీ ప్లాట్ ఫామ్ ను కూడా ఏర్పాటు చేశారు. తాజాగా ఆమె ‘ఎక్స్ఎక్స్ఎక్స్’ అనే వెబ్ సిరీస్ ను నిర్మించారు. ఈ సిరీస్ రెండు సీన్లు మంచి వ్యూస్ ని సాధించాయి. తాజా సిరీస్ లో సైనిక కుటుంబాలను అభ్యంతరకరంగా చూపించారని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, బీహార్ లోని బేగుసరైలో ఈ సిరీస్ నిర్మాతలైన ఏక్తా కపూర్, ఆమె తల్లి శోభ కపూర్ లపై కేసు నమోదయింది. 2020లో శంభు కుమార్ అనే మాజీ సైనికుడు వీరిపై కేసు వేశారు. కేసు విచారించిన కోర్టు ఏక్తా, శోభలపై…
ఇకపై ప్రతి కారులో కనీసం 6 ఎయిర్ బ్యాగులు ఉండాల్సిందేనని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన ప్రకటించారు. కార్ల వేరియంట్లు, ధరలతో ఏమాత్రం సంబంధం లేకుండా ప్రతి కారులో కనీసం 6 ఎయిర్ బ్యాగులు ఉండాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ప్రమాద సమయంలో కారు వెనుక సీట్లో కూర్చున్నా మిస్త్రీ చనిపోయారు. ఈ ప్రమాదంపై సమగ్ర అధ్యయనం చేసిన కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోంది. ఇకపై జరిగే ప్రమాదాల్లో ముందు సీట్లలో కూర్చున్న వారే కాకుండా వెనుక సీట్లలో కూర్చున్న వారు కూడా సురక్షితంగా ఉండాలన్న ఉద్దేశ్యంతోనే ఈ సరికొత్త నిబంధనను అమలులోకి తీసుకువచ్చింది.ఇకపై ప్రతి కారులో 6 ఎయిర్ బ్యాగులు ఉండేలా కేంద్ర…
మహిళలందరికీ చట్టపరంగా సురక్షితంగా అబార్షన్లు చేయించుకునే హక్కు ఉందని సుప్రీం కోర్ట్ సంచలన తీర్పు ఇచ్చింది. వివాహితులు, అవివాహిత మహిళలు అనే తేడా చూపించడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ‘వైవాహిక అత్యాచారం ‘ కూడా అబార్షన్ పరిధిలోనే ఉంటుందని జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జెబి.పార్దివాలా, జస్టిస్ ఎఎస్.బోపన్నలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. బలవంతపు గర్భధారణ నుండి మహిళలను కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొంది. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగెన్సీ యాక్ట్ ప్రకారం.. అత్యాచారం నిర్వచనంలో వైవాహిక అత్యాచారాన్ని కూడా చేర్చాలని కోర్టు తీర్పునిచ్చింది. దీంతో దేశంలో తీవ్ర చర్చనీయాంశమైన వైవాహిక అత్యాచారంపై విచారణలకు మార్గం సుగమం చేసింది. ఒక మహిళ వైవాహిక స్థితి ఆమె అబార్షన్ హక్కుని హరించడానికి కారణం కాకూడని, అవివాహిత మహిళలు కూడా 24 వారాల్లో అవాంఛిత గర్భాన్ని తొలగించుకునేందుకు అర్హులేనని పేర్కొంది. ఒంటరి లేదా అవివాహిత మహిళలను అవాంఛిత గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతించకపోవడం…