వైసీపీ తిరిగి అధికారంలో వస్తే రాష్ట్రం ఆధోగతి పాలవుతుందని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ప్రజలు ఎంతో నమ్మకంతో అధికారాన్ని కట్టబెడితే వెనుకబాటుతనంలో బిహార్, రాజస్థాన్ రాష్ట్రాల సరసన ఏపీని చేర్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో శుక్రవారం జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. పశ్చిమగోదావరి, ఏలూరు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లా నుంచి అధిక సంఖ్యలో ప్రజలు హాజరై సమస్యలను పవన్ దృష్టికి తీసుకువెళ్లారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఆయన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘వైసీపీ నేత రోడ్ల మీద తిరిగితే రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారని నమ్మారు. ఇప్పుడు ఆ భ్రమలన్నీ తొలగిపోయాయి. అధికారంలోకి వచ్చీ రాగానే జనాల పొట్ట కొట్టడం మొదలుపెట్టారు. ముందుగా రాష్ట్రంలో 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేశారు. ఆ రోజు నుంచి జనసేన…
Author: Editor's Desk, Tattva News
కేంద్రపాలిత ప్రాంతం యానాంలో వరద ఉధృతి కొనసాగుతోంది. గౌతమీ నది ఉధృతితో యానాంలో పది కాలనీలు నీట మునిగాయి. నడుం లోతులో వరద నీరు ప్రవహిస్తుండటంతో ఆయా కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే పలు కాలనీలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. యానాంలోని ఓల్డేజ్ హోం వద్ద ప్రమాదకర స్థాయిలో వరద నీరు ప్రవహిస్తోంది. ముంపు బాధితులకు ఆహారం, త్రాగునీరు, కొవ్వొత్తులను స్థానికంగా ఉన్న నేతలు సరఫరా చేస్తున్నారు. గత 4 రోజుల క్రితమే ఏటిగట్టు పరిసర ప్రాంతాలయిన ప్రాన్స్‌తిప్ప, ఫెర్రీ రోడ్డు, రాజీవ్ బీచ్, అయ్యన్నగర్, పరంపేట ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో రాజీవ్ బీచ్ మార్గం ద్వారా జెండా స్తంభం ప్రాంతం మీదుగా వరదనీరు యానం టౌన్ లోకి ప్రవేశించింది. దీంతో యానం జి.జి.హెచ్., చింతా వారి వీధి, జిక్రియా నగర్, బాలయోగి నగర్, ఓల్డ్ రాజీవ్ నగర్ ప్రాంతాలు జలమయమయ్యాయి.…
భారీ వర్షాల వెనుక విదేశీ కుట్ర ఉందంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించడం హాస్యాస్పదం అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. బహుశా సీఎంకు మతి భ్రమించినట్లుంది. ఆయనను ఎర్రగడ్డ ఆసుపత్రిలో చేర్పించి మెరుగైన చికిత్స అందించాల్సిన అవసరం ఉందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ వరద ముంపు ప్రాంతాల పర్యటనను చూసి జనం నవ్వుకుంటున్నారని అంటూ చెబుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వరద ప్రాంతాల్లో పర్యటిస్తే బాధితులకు భరోసా కలగాలని, ఆదుకుంటారనే నమ్మకం ఏర్పడాలని, కానీ ఈ సీఎం అక్కడికి వెళ్లి చేసిన కామెంట్స్ జోకర్ ను తలపిస్తున్నాయని విమర్శించారు. గోదావరికి వరదలు గతంలో ఎన్నోసార్లు వచ్చినయ్,ఈసారి కూడా వచ్చినయ్, భవిష్యత్తులో రావని కూడా చెప్పలేం, కానీ కేసీఆర్ కు మాత్రం భారీ వర్షాలు మానవ స్రుష్టిలా కన్పిస్తోందని, పైగా విదేశాల కుట్ర అనడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. కుట్రలకే అతిపెద్ద కుట్రదారుడు కేసీఆర్ అంటూ తానే పెద్ద ఇంజనీరింగ్ నిపుణుడినని గొప్పలు చెప్పుకున్న కేసీఆర్…
ఉప రాష్ట్రపతి ప్రతిపక్షాల అభ్యర్థిగా ఎన్సీపీ చీఫ్ శరద్ కర్నాటకకు చెందిన మాజీ మహిళా గవర్నర్ మార్గరెట్ ఆల్వాను పోటీలో నిలుపుతున్నట్లు ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ వెల్లడించాయిరు. మార్గరెట్ ఆల్వా.. గోవా, రాజస్థాన్, గుజరాత్ గవర్నర్‌గానూ పని చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్ర మంత్రిగా కూడా ఆమె పనిచేశారు. ఎన్డీయే తరఫున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్‌ను బరిలో నిలిపిన విషయం తెలిసిందే. శరద్ పవార్ నివాసంలో ఆదివారంనాడు 17 పార్టీల నేతలు సమావేశమై మార్గరెట్ ఆల్వాను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టాలని నిర్ణయించారు. తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు కూడా తమ నిర్ణయానికి మద్దతు పలకడంతో ఆమెకు తమ్ 19 పార్టీలు మద్దతు పలుకుతున్నట్లయింది. ఇది తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని ఆమె ఓ ట్వీట్ లో తెలిపారు. ”భారత ఉపరాష్ట్రపతి పదవికి విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా నామినేట్ కావడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఈ నిర్ణయాన్ని హుందాగా స్వీకరిస్తున్నారు. నాపై…
దేశ ప్రజలకు 200 కోట్ల డోసుల మేర కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసిన దిశగా భారత్ రికార్డు నమోదు చేయనుంది. శనివారం వరకు దేశంలో 1,99,98,89,097 డోసుల వ్యాక్సిన్‌ను భారత ప్రభుత్వం పంపిణీ చేసింది. మరో 20.11 లక్షల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేస్తే 200 కోట్ల డోసుల వ్యాక్సిన్ పంపిణీ పూర్తి కానుంది. శనివారం ఒక్కరోజే 25,59,840 డోసుల వ్యాక్సిన్‌ను పంపిణీ చేసిన నేపథ్యంలో ఆదివారం 20.11 లక్షల డోసుల పంపిణీ సులువుగానే పూర్తి కానుంది. రికార్డు స్థాయిలో 200 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసిన దేశంగా భాతర్ రికార్డులకు ఎక్కనుంది. ఈ రికార్డు వ్యాక్సినేషన్‌పై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రత్యేక దృష్టి సారించింది. కేంద్ర ఆరోగ్య మంత్రి మనుసుఖ్ మాండవీయ వ్యాక్సినేషన్ జరుగుతున్న తీరును పరిశీలిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు. 200 కోట్ల డోసుల వ్యాక్సిన్ పంపిణీ…
భద్రాచలంలోని వరద ముంపు బాధిత కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ప్రకటించారు. వరద సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపడుతామని, ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలకు ఎత్తైన ప్రదేశంలో రూ.1000 కోట్లతో కొత్త కాలనీ నిర్మిస్తామని సీఎం స్పష్టం చేశారు. భద్రాచలంలో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన అనంతరం స్థానికంగా ఉన్న ఐటీడీఏలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ గోదావరి ఉప్పొంగడంతో భద్రాచలం, పినపాక నియోజకవర్గాల ప్రజలు వరద తాకిడికి ఎక్కువగా గురయ్యాయని, అయితే వరదల వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు. భద్రాచలంలో శాశ్వతంగా ముంపు సమస్యను పరిష్కరించాలని నిర్ణయించిన్నట్లు వెల్లడించాయిరు. వరద ముంపు బాధితులకు శాశ్వత ప్రాతిపదికన ఎత్తైన స్థలాల్లో రూ.1,000 కోట్లతో శాశ్వత కాలనీలను నిర్మించాలని కలెక్టర్ ను ఆదేశించఛాయారు. భద్రాచలం పట్టణ కాంటూరు లెవల్స్ ను పరిగణలోకి తీసుకోవాలని, కరకట్ట ప్రాంతాల్లోని…
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. అదే రోజున రాష్ట్రపతి ఎన్నిక కూడా జరుగనుంది. ఆగస్టు 12 వరకు జరిగే ఈ సమావేశాల్లో అటవీ చట్టంలో మార్పులతో సహా 29 బిల్లులను ప్రభుత్వం సిద్ధం చేసింది. వీటిలో ఐదు బిల్లులను ప్రభుత్వం గత సమావేశాల్లోనే ప్రవేశపెట్టింది. వాటిలో నాలుగు బిల్లులు పార్లమెంటరీ స్థాయీ సంఘం పరిశీలనలో ఉన్నాయి.కొత్త అటవీ నిబంధనలకు సంబంధించిన బిల్లుతో సహా పలు ప్రజావ్యతిరేక బిల్లులపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. ప్రతిపక్షాల అభ్యంతరాలను బుల్డోజ్ చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహ రచనలో పాలక పక్షం ఉంది. గిరిజనుల ప్రయోజనాలను దెబ్బతీసే అటవీ హక్కుల చట్టానికి తూట్లు పొడిచే యత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని వామపక్షాలు, ఇతర ప్రతిపక్షాలు ఇప్పటికే డిమాండ్ చేశాయి. వందలాది రైతు, వ్యవసాయ కార్మిక, గిరిజన, దళిత, విద్యార్థి, యువజన, కార్మిక సంఘాలతో కూడిన భూమి అధికార్ ఆందోళన్ (బిబిఎ) ఇప్పటికే తమ అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వానికి…
2002లో గుజరాత్ అల్లర్ల అనంతరం అప్పటి బిజెపి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ కుట్ర పన్నారని, ఆ కుట్ర అమలుకు సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ సహకరించారని గుజరాత్ పోలీసులు తమ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తీస్తా, మాజీ ఐపిఎస్ పి.బి.శ్రీకుమార్‌ల బెయిల్ పిటిషన్లను పోలీసులు వ్యతిరేకించారు. గుజరాత్‌లో మతోన్మాద ఘర్షణల్లో ఉన్నతాధికారులను ఇరికించేందుకు కల్పిత సాక్ష్యాలను సృష్టించడం ద్వారా ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు భారీ కుట్ర జరిగిందని, అందులో తీస్తా, ఆర్.బి.శ్రీకుమార్, సంజీవ్ భట్‌లకు పాత్ర వుందని పోలీసులు ఆరోపించారు. సంజీవ్‌భట్‌తో కలిసి కాంగ్రెస్‌నేత అహ్మద్ పటేల్‌ను ఆయన నివాసంలో సెతల్వాద్ కలుసుకున్నారని, మతోన్మాద ఘర్షణల్లోని బాధితులకు న్యాయం జరగాలనే పేరుతో గుజరాత్ ప్రభుత్వంపై న్యాయ పోరాటం చేస్తూనే మరోపక్క తనకు రాజ్యసభ సీటు కోసం తీస్తా సెతల్వాద్ ప్రయత్నించారని పోలీసులు పేర్కొన్నారు. ”అప్పటి ముఖ్యమంత్రి ఇతరులను ఇరికించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని లక్ష్యం…
పోలీసులు ఏ వ్యక్తిని రౌడీగా ముద్ర వేయకూడదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఏ వ్యక్తిని పోలీస్ స్టేషన్కు పిలిపించి, నిఘా కోసం లేదా సమాచారాన్ని సేకరించేందుకు ఏ ఇంటికీ వెళ్లరాదని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ పోలీసులు తమపై రౌడీ షీట్లు తెరవడాన్ని కొనసాగించడాన్ని ప్రశ్నిస్తూ పలువురు వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. పోలీసులు అనుచితమైన నిఘా వేయడం రౌడీ షీట్లు తెరవడం ద్వారా వారిపై రౌడీలుగా ముద్ర వేయడం వారి ఫోటోలను సేకరించడం లేదా ప్రదర్శించడం చేయడం సరికాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఇది వ్యక్తుల గోప్యత హక్కును ప్రత్యక్షంగా ఉల్లంఘించడమేనని తేల్చిచెప్పింది. రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ప్రకారం పోలీసు స్టాండింగ్ ఆర్డర్లు అర్హత పొందలేవని, చట్టం అనుమతి లేకుండా పోలీసులు వ్యక్తుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం,…
ఎన్‌డిఎ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్‌కర్ (71) పేరుని ప్రకటించారు. ప్రస్తుతం ఆయన పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. జగదీప్ ధన్‌కర్ పేరును ఖరారు చేస్తూ అధికారికంగా బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి.నడ్డా ప్రకటన చేశారు. వచ్చే ఏడాది జరగనున్న రాజస్థాన్ ఎన్నికల్లో జాట్ కమ్యూనిటీ ఓటర్లు కీలక పాత్ర పోషించనున్నారు. దీంతో జాట్ కమ్యూనిటీకి చెందిన జగదీప్ ధన్‌కర్ పేరుని ప్రకటించడంతో ఆ కమ్యూనిటీకి కీలక సందేశం పంపినట్లు కేంద్రం భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆయన అభ్యర్థిత్వం ఖరారు చేసిన బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశంకు ప్రధాని నరేంద్ర మోదీ, ప్రముఖ నేతలు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ , నితిన్ గడ్కరీ, మధ్యప్రదేశ్ సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్ హాజరయ్యారు. ధన్‌ఖర్ పరిపాలనాదక్షులు, రాజ్యాంగ విషయపరిజ్ఞానులు, చట్టసభల వ్యవహారాలతో సముచిత అనుభవజ్ఞులుగా ఉన్నారని, ఆయన అభ్యర్థిత్వానికి తమ మద్దతు అని ప్రధాని మోదీ ట్వీటు వెలువరించారు. రాజ్యసభ నిర్వాహక…