రాష్ట్రంలోని బ్రాహ్మణ నిరుద్యోగులకు సబ్సిడీపై 100 క్యాబ్ టాక్సీలు ఇవ్వనున్నట్లు ఏపీ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ ఛైర్మన్ సీతంరాజు సుధాకర్ తెలిపారు. బ్రాహ్మణ సామాజిక వర్గంలో డ్రైవింగ్ వృత్తిలోని వారికి ఏపీ బ్రాహ్మణ సహకార పరపతి సంస్థ సహకారంతో ‘చాణక్య లఘు పారిశ్రామిక వేత్తల పథకం-రవాణా ఆపరేటర్’ పథకం కింద వీటిని సమకూర్చనున్నట్లు తెలిపారు. పెట్రోల్ టాక్సీ రూ.7.25లక్షల్లో కార్పోరేషన్ సబ్సిడీ రూ.రెండు లక్షలు, లబ్దిదారుల వాటా రూ.72,500గా ఉంటుందని, ఇదే డిజైర్ టూర్ సీఎన్‌జీ/పెట్రోల్ టాక్సీ రేటు రూ.8.25లక్షలకు గాను కార్పోరేషన్ సబ్సిడీ రూ.రెండు లక్షలు, లబ్దిదారుల వాటా రూ.85,500గా ఉంటుందని ఆయన తెలిపారు. ఏపీ బ్రాహ్మణ పరపతి సహకార సంస్థ మంజూరు చేసిన రుణంలో అసలు, వడ్డీ చెల్లించిన తర్వాత సబ్సిడీ మొత్తం విడుదల చేస్తారని పేర్కొన్నారు. రూ.లక్ష లోపు వార్షిక ఆదాయం ఉన్న ఏపీకి చెందిన 21 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్కులు ఇందుకు అర్హులని…
Author: Editor's Desk, Tattva News
పల్నాడు జిల్లా దుర్గి మండలం జంగమేశ్వరపాడులో శుక్రవారం హత్యకు గురైన టిడిపి కార్యకర్త కంచర్ల జల్లయ్య మృతదేహానికి కుటుంబ సభ్యుల అనుమతి లేకుండానే పోలీసులు హడావిడిగా శనివారం ఉదయం శవపరీక్ష జరపడంతో వివాదం తలెత్తింది. అంత్యక్రియలకు బయలుదేరిన పలువురు టిడిపి నాయకులను పొరుగు జిల్లాల్లోనే ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ జల్లయ్య కుటుంబ సభ్యులు, బంధువులు నరసరావు పేట ఆస్పత్రి మార్చురీ ఎదుట ధర్నా చేశారు. తమ పార్టీ నేతలు వచ్చే వరకు పోస్టుమార్టం చేయొద్దంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, మృతుని కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వావాదం, తోపులాట చోటు చేసుకుంది. బంధువులను నెట్టివేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని వైద్యశాల నుండి అంబులెన్స్‌లో బల్లాపల్లి మండలం రావులాపురం గ్రామానికి పోలీసులు తరలించారు. స్వగ్రామం జంగమేశ్వరపాడుకి కాకుండా బంధువులు ఉన్న రావులాపురం గ్రామానికి తరలించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఏరియా ఆస్పత్రి వద్దకు వచ్చిన టిడిపి నరసరావుపేట ఇన్‌ఛార్జి డాక్టర్ చదలవాడ అరవిందబాబును పోలీసులు…
దక్షిణాదిన పార్టీని విస్తరింప చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్న బిజెపి పట్ల బలమైన ప్రాంతీయ పక్షాలలో అవిశ్వాసం వ్యక్తం అవుతున్నది. ఆ పార్టీతో కొంతకాలంగా పొత్తులో ఉన్న ఏకైక ప్రాంతీయ పార్టీ తమిళనాడులోని అన్నాడీఎంకే. ఇప్పుడు ఆ పార్టీలో కూడా ఈ పొత్తు పట్ల అసహనం వ్యక్తం అవుతున్నది. ఈ మధ్య ఆ పార్టీ సీనియర్ నేత సి పొన్నయన్ మిత్రపక్షమైన బీజేపీపై చేసిన ఊహించని దాడి బీజేపీతో పొత్తు పట్ల ఆ పార్టీ శ్రేణులలో పెరుగుతున్న వ్యతిరేకతను వెల్లడి చేస్తుంది. ఒక వంక, డిఎంకె అధినేత, ముఖ్యమంత్రి ఎం కె స్టాలిన్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకొంటూ ఉండడంతో మిత్రపక్షం బిజెపి ఆవలంభిస్తున్న ధోరణులు డీఎంకేకు సానుకూలంగా మారుతున్నట్లు అన్నాడీఎంకే నేతలు భావిస్తున్నారు. ముఖ్యంగా గవర్నర్ కేంద్రంగా స్టాలిన్ – మోదీ ప్రభుత్వాల మధ్య పెరుగుతున్న వివాదాలతో డీఎంకే లాభపడుతున్నట్లు కనిపిస్తున్నది. జయలలిత మరణం తర్వాత రాష్ట్రంలో ఏర్పడిన `రాజకీయ సూన్యత’ను ఆసరాగా తీసుకొని బలం పెంచుకోవాలని ప్రయత్నం చేసిన బిజెపి అన్నాడీఎంకే ప్రభుత్వం కూలిపోకుండా కాపాడటమే కాపాడుకొంటూ…
2020లో భారతదేశం కరోనా మహమ్మారితో పోరాడుతున్న సమయంలో అప్పటి అస్సాం ఆరోగ్య మంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తన భార్య, కొడుకు వ్యాపార భాగస్వాముల కంపెనీలకు మార్కెట్ ధరలకు మించి పిపిఇ కిట్‌లను సరఫరా చేయడానికి కాంట్రాక్ట్‌లు ఇచ్చారని తీవ్రమైన ఆరోపణలు చెలరేగుతున్నాయి. ఈ విషయమై మీడియాలో పలు కధనాలు వెలువడ్డాయి. ఢిల్లీ ఆరోగ్య మంత్రి, ఆప్ నాయకుడు సత్యాంధ్ర జైన్ ను మనీ లాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేసిన నాలుగు రోజులకు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఈ కథనాలను మీడియా సమావేశంలో ఉటంకించారు. శర్మ ఇతర కంపెనీల నుండి పిపిఇ కిట్‌లను రూ. 600 చొప్పున కొనుగోలు చేయగా, తన భార్య, కొడుకుల వ్యాపార భాగస్వాముల సంస్థలకు రూ. 990 చొప్పున అత్యవసర సరఫరా ఆర్డర్‌లు ఇచ్చారని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను ముఖ్యమంత్రి శర్మ, ఆయన భార్య రింకు భుయాన్ తీవ్రంగా ఖండించారు. తన భార్య ప్రభుత్వం…
దేశ వ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ అత్యాచార కేసులో ఓ ఎమ్యెల్యే కొడుకు నిందితుడని స్పష్టం చేస్తూ బిజెపి ఎమ్యెల్యే ఎన్ రఘునందన్ రావు శనివారం ఫోటోలు విడుదల చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఫొటోలు, వీడియోలు తమ వద్ద ఉన్నాయని చెబుతూ పోలీసులు అరెస్ట్‌ను ఎందుకు చూపించడం లేదంటూ ఆయన నిలదీశారు. తన వద్ద ఉన్న ఆధారాలను డిజిపికి ఇస్తానని చెబుతూ ఎల్యేయే కొడుకు లేదని పోలీసులే ఏ విధంగా తీర్పు ఇస్తారని ప్రశ్నించారు. మైనర్‌పై సామూహిక అత్యాచార కేసులో.. పోలీసులు లీకులు ఇచ్చారే తప్ప అరెస్టులు చేయలేదని ధ్వజమెత్తారు. ఈ కేసును సీబీఐతో విచారణ చేయాలని డిమాండ్ చేస్తూ ఒక వేళ ఇది జరగకుంటే తానే స్వయంగా సుప్రీంకోర్టకు వెళ్తానని ఆయన వెల్లడించారు. అవసరమైతే టీఆర్ఎస్ వాళ్లును రిమాండ్ చేస్తారు కానీ ఎంఐఎంను ఎందుకు చేయరు? అంటూ ఎద్దేవా చేశారు. “రెడ్ కలర్ మెర్సిడెస్ బెజ్ కారులో ఈ ఘటన జరిగింది. కానీ పోలీసులు ఇన్నొవాలో…
కశ్మీర్‌లో హిందువుల వరుస హత్యలు చోటుచేసుకుంటున్న వైనంపై మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి కేంద్రం సర్కార్ పై విరుచుకు పడుతూ, ఇటీవల ముగిసిన ఐపీఎల్ లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆ పనిలో విఫలమయ్యారని, అందుకే ఆయన తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అమిత్ షా హోం శాఖను వదిలేసి క్రీడల శాఖను చేపడితే బాగుంటుందని స్వామి ఎద్దేవా చేశారు. రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్న జమ్మూకశ్మీర్‌లో నిత్యం ఓ హిందువు హత్యకు గురవుతున్నారని ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో అమిత్ షా రాజీనామాకు డిమాండ్ చేయాల్సి వస్తోందని ఆయన పేర్కొన్నారు. టాటా ఐపీఎల్ క్రికెట్ ఫలితాలు అవకతవకలకు గురయ్యాయని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలలో విస్తృతమైన భావన ఉందని పేర్కొంటూ ఆయన ట్వీట్ చేశారు. అమిత్ షా కుమారుడు బిసిసిఐకి డిఫాక్టో నియంత అయినందున…
21వ శతాబ్దంలో భారతదేశ అభివృద్ధి చరిత్రకు ఉత్తరప్రదేశ్ ఊపునిస్తుందని, దేశానికి చోదకశక్తిగా మారుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భరోసా వ్యక్తం చేశారు. నేడు ప్రపంచం అన్వేషిస్తున్న ఒక నమ్మకమైన భాగస్వామిగా భారత్ అవతరించిందని చెబుతూ నమ్మకమైన భాగస్వామిగా తనను తాను నిరూపించుకొనే సత్తా ప్రజాస్వామ్యదేశమైన భారత్‌కు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. లక్నోలో మూడో యుపి పెట్టుబడిదారుల సదస్సును ప్రధాని మోదీ లాంఛనంగా ప్రారంభించారు. వివిధ రంగాల్లో రూ.80,000 కోట్లకు పైగా విలువైన 1,406 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పెట్టుబడిదారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రస్తుత ప్రపంచ పరిణామాలు భారత్‌కు ఎన్నెన్నో గొప్ప అవకాశాలను తెచ్చిపెట్టాయని వివరించారు. ప్రపంచమంతా భారత్‌వైపు చూస్తోందని, మన శక్తి సామర్థ్యాలను కొనియాడుతోందని గుర్తుచేశారు. ‘జి–20 ఆర్థిక వ్యవస్థల్లో భారత్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. గ్లోబల్ రిటైల్ సూచికలో రెండో స్థానంలో నిలిచింది. ప్రపంచంలో చమురు, విద్యుత్, గ్యాస్ శక్తిని ఉపయోగించుకొనే దేశాల్లో…
అమరావతి రైతులు చేపట్టిన ఉద్యమం శనివారంతో తొమ్మిది వందల రోజుకి చేరుకోనుంది. ఈ సందర్భంగా అమరావతి సాధన సమితి నాయకులు అమరావతిలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అమరావతి కోసం అసువులు బాసిన అమరవీరులకు నివాళులతో పాటు న్యాయదేవత, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాలకు పాలభిషేకాలు నిర్వహిస్తున్నారు. అమరావతిపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినా ప్రభుత్వం ఇంకా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తోందని ఐకాస నాయకులు ఆరోపించారు. అమరావతినే రాజధానిగా కొనసాగించి అభివృద్ధి చేపట్టాలని సూచించడడంతో రైతులు కోర్టు నిర్ణయాన్ని స్వాగతించారు. అయితే వైసీపీ ప్రభుత్వంలోని కొందరూ మంత్రులు మూడు రాజధానుల వైఖరీని కొనసాగిస్తుండడంతో రైతులు తమ ఆందోళనలను మరింత విస్తృతం చేయాలని భావిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల్లో ప్రాంతాల వారీగా విభజించి వర్గ వైషమ్యాలను రెచ్చగొడుతున్నారని, రాజకీయ ప్రాబల్యం కోసం ప్రజలను పావులుగా వాడుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా, గేట్‌వే హోటల్‌లో ‘…
కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరును స్వాగతిస్తున్నామని స్పష్టం చేస్తూ కోనసీమ వివాదంలో రాజకీయ కుట్ర ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. అనంతబాబు హత్య చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన కేసును పక్కదారి పట్టించేందుకే అమలాపురం ఘటన సృష్టించారని విమర్శించారు. అంబేద్కర్ పేరును రాజకీయం చేశారని తప్పుబట్టారు. కోనసీమ ఘటనపై సీఎం జగన్, డీజీపీ స్పందించకపోవడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. ఒకే పార్టీలో రెండు వర్గాల గొడవను కుల ఘర్షణగా మార్చారని మంది పడుతూ కోనసీమ తగులబడుతుంటే మంత్రులు బస్సు యాత్ర చేస్తారా అని ప్రశ్నించారు. ఘటనపై డీజీపీ స్పందించకుంటే కేంద్రమంత్రి అమిత్‌షాకు లేఖ రాస్తానని స్పష్టం చేశారు. ఈ విషయమై డిజిపిని కలిసేందుకు పదేపదే కోరుతున్నా అపాయింట్‌మెంటు ఇవ్వడం లేదని చెబుతూ శనివారం ఉదయంలోపు ఇవ్వకపోతే కేంద్ర హోమ్‌శాఖ మంత్రి అమిత్‌షాకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఏపీలో ఘర్షణలు సృష్టించాలనే కుట్ర జరుగుతోందని పేర్కొంటూ సమస్యలను పక్కదారిపట్టించడమే వైసీపీ సర్కార్ విధానం అని, …
హైదరాబాద్ లో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం కేసును సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ డిమాండ్ చేశారు. అమ్మాయిలకు హైదరాబాద్ సేఫ్ జోన్ కాదని, క్రిమినల్స్ కు, అక్రమ వ్యాపారాలు చేసే వాళ్లకు అడ్డాగా మారిందని ఆయన ఆరోపించారు. మైనర్ బాలికపై గత నెల 28న (మే 28న) అత్యాచారం జరిగిందని బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే 31వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, అందులో నిందితుల పేర్లను ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. బాధితురాలు నిందితుల పేర్లు చెప్పినా ఎఫ్ఐఆర్ లో ఎందుకు చేర్చలేదని ధ్వజమెత్తారు. నిందితులను ఇప్పటి వరకూ అరెస్ట్ చేయకపోవడానికి కారణం ఏంటో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. సాక్షాత్తు ప్రజాప్రతినిధుల పిల్లలపై ఆరోపణలు వస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని నిలదీసేరు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ధ్వజమెత్తారు. నిందితులను కాపాడే…