ఒక వంక తెలుగు దేశం పార్టీ ఏర్పాటు చేసి 40 ఏళ్ళు పూర్తి చేసుకోవడం, మరో వంక పార్టీ వ్యవస్థాపకుడు ఎన్ టి రామారావు శతజయంతి సంవత్సరం కావడంతో ఈ నెలాఖరున ఒంగోలులో జరుపదలచిన పార్టీ వార్షిక సమావేశాలలు మహానాడును అత్యంత వైభవంగా జరపడం కోసం టిడిపి నేతలు సన్నాహాలు చేస్తున్నారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు మహానాడు ఏర్పాట్లను పరిశీలిస్తూ వర్షాలు కురుస్తున్న కారణంగా ఒంగోలు మినీ స్టేడియంలో మహానాడు నిర్వహణకు ప్రభుత్వానికి దరఖాస్తు చేస్తే, అనుమతి నిరాకరించడం ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. ఐఏఎస్ అధికారులు స్వతంత్రంగా వ్యవహరించాలని ఆయన హితవు చెప్పారు. మహానాడు నిర్వహణకు మినీ స్టేడియం అనుమతి ఇవ్వకపోతే, మహానాడు ఆగిపోతుందని వైసీపీ నేతలు భ్రమలో ఉన్నారని యనమల విమర్శించారు. కరోన కారణంగా గడిచిన మూడు సంవత్సరాలుగా మహానాడు నిర్వహించలేక పోయామని, అందుచేత తెలుగు దేశం పార్టీ శ్రేణులు ఎంతో ఉత్సాహంగా మహానాడు…
Author: Editor's Desk, Tattva News
ఒక వంక రాబోయే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలలో స్థానికంగా ప్రాబల్యం గల ప్రాంతీయ పార్టీలతో పొత్తు ఏర్పాటు చేసుకోవాలని ఉదయపూర్ లో కాంగ్రెస్ జరిపిన మూడు రోజుల `చింతన్ శివిర్’ నిర్ణయించగా, ఈ శిబిరంలో రాహుల్ గాంధీ చేసిన వాఖ్యలపై ప్రాంతీయ పార్టీలు ఆగ్రవేశాలు వ్యక్తం చేస్తున్నాయి. పోరాటానికైనా, విజయాల కోసమైనా తమపైనే కాంగ్రెస్ ఆధారపడుతుందని గుర్తు చేస్తూ తమ మద్దతు లేకుండా ఆ పార్టీ రాజకీయ అస్తిత్వమే ప్రశ్నార్ధకం కాగలదని సంకేతం ఇస్తున్నాయి. ‘నవ సంకల్ప చింతన్ శివిర్’ పేరుతో జరిగిన ఈ సమావేశాల్లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) విధ్వంసకర దాడికి సైద్ధాంతిక నిరోధాన్ని కాంగ్రెస్ తీవ్రతరం చేస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీల మాదిరిగా కాకుండా ఆరెస్సెస్ దాడిని నిరోధించేందుకు సైద్ధాంతికంగా తీవ్ర కృషి చేస్తోందని చెప్పారు. ప్రాంతీయ పార్టీలకు సిద్ధాంతం కరువైందని, వాటికి వేర్వేరు దృక్పథాలు ఉన్నాయని అంటూ వాటిని చులకన చేస్తూ మాట్లాడారు. ఈ…
ఈ దశాబ్దం చివరికి 6 జీ సేవలు ప్రారంభించాలని ఆకాంక్షిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని ఆయన వెల్లడించారు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో వర్చువల్ గా పాల్గొని ప్రసంగించారు. దేశంలో 5జీ రాకతో ఇంటర్నెట్ వేగం మాత్రమే కాదు అభివృద్ధిలో కూడా వేగం పెరుగుతుందని, అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు రానున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 5జీ వల్ల దేశ పరిపాలనా వ్యవస్థలో అనేక ప్రజారంజక మార్పులు వస్తాయని, దేశ ఆర్ధిక వ్యవస్థలో 450 బిలియన్ డాలర్లు వచ్చి చేరతాయని ప్రధాని వెల్లడించారు. అంతేకాదు జీవన సౌలభ్యానికి, విధుల నిర్వహణ, వ్యాపారాలకు వెన్నుదన్నుగా నిలుస్తుందని చెప్పారు. 2జీ యుగంలో అనేక విధానపరమైన లోపాలు చోటు చేసుకున్నాయని, అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిందని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో పారదర్శకతకు పెద్దపీట వేశామని చెబుతూ 4జీ సేవలు అందుబాటులోకి తెచ్చి 5జీ దిశగా వెళుతున్నామని ప్రధాని…
ప్రధాని నరేంద్ర మోదీ ప్రవచిస్తున్న ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా రెండు అధునాతన యుద్ధ నౌకలను ముంబయిలోని మజగావ్ డాక్ లో నిర్మించారు. దేశీయంగా తయారైన ఈ యుద్ధ నౌకల పేర్లు సూరత్, ఉదయ్గిరి. వీటిని రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ మంగళవారం లాంఛనంగా జల ప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి మాట్లాడుతూ, దేశ సముద్ర భద్రత సామర్థ్యాన్ని ఇనుమడింప చేసే క్రమంలో తమ ప్రభుత్వ అచంచలమైన నిబద్ధతకు ఈ రెండు యుద్ధనౌకలు ప్రతిరూపాలని పేర్కొన్నారు. కరోనా, రష్యా-ఉక్రెయిన్ అంశాలతో యావత్ ప్రపంచం సంక్షోభంలో ఉన్నప్పటికీ, ఆత్మనిర్భర్ భారత్ పై దృష్టి పెట్టి ముందుకు సాగుతున్నామని రాజ్నాథ్ వివరించారు. దేశ సముద్ర సంబంధిత యుద్ధ సామర్థ్యాన్ని పెంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ సడలని నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనమే ఈ యుద్ధ నౌకలని చెప్పారు. ప్రస్తుత భౌగోళిక, రాజకీయ పరిస్థితుల్లో భారత నావికా దళానికిగల వ్యూహాత్మక అవసరాలను తీర్చడం కోసం కృషి చేస్తున్నందుకు ప్రశంసించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన…
శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మంగళవారం పార్లమెంటులో వీగిపోయింది. తమిళ్ నేషనల్ అలయెన్స్ ఎంపీ ఎంఏ సుమంతిరన్ ప్రతిపాదించిన ఈ తీర్మానానికి వ్యతిరేకంగా 119 మంది ఎంపీలు ఓటు వేయడంతో ఈ తీర్మానం వీగిపోయింది. రాజపక్సపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ చర్చించేందుకు వీలుగా పార్లమెంటు స్టాండింగ్ ఆర్డర్స్ను సస్పెండ్ చేయాలని ఈ తీర్మానం కోరింది. ఈ తీర్మానానికి అనుకూలంగా కేవలం 68 మంది ఎంపీలు మాత్రమే ఓటు వేసినట్లు తెలుస్తోంది. అధ్యక్షుడు గొటబయ రాజపక్సపై దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్న నిరసనను పార్లమెంటులో ప్రతిబింబించాలని ప్రతిపక్షాలు భావించాయి. ప్రధాన ప్రతిపక్షం ఎస్జెబి ఎంపి లక్ష్మన్ కిరియెల్లా కూడా ఈ అవిశ్వాసానికి మద్దతు తెలిపారు. అయితే ప్రధాని విక్రమసింఘె మాత్రం అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసినట్లు సమాచారం. శ్రీలంక నూతన ప్రధానిగా రణిల్ విక్రమ్ సింఘె బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంగళవారం శ్రీలంక పార్లమెంట్ మొదటిసారి సమావేశమైంది. డిప్యూటీ స్పీకర్ను ఎన్నుకునేందుకు…
వైసిపి ఎంపిక చేసిన నలుగురు రాజ్యసభ అభ్యర్థులలో ఇద్దరు తెలంగాణ ప్రాంతంకు చెందినవారే కావడం గమనార్హం. వారిలో ప్రముఖ బిసి నాయకుడు ఆర్ కృష్ణయ్య కూడా ఉన్నారు. ఆయన 2014 ఎన్నికల సమయంలో అకస్మాత్తుగా టిడిపిలో చేరి, ఎల్బీ నగర్ నుండి తెలంగాణ అసెంబ్లీకి పోటీ చేసి, టిడిపి అభ్యర్థిగా ఎన్నికయ్యారు. ఆయన బిసి సంక్షేమసంఘం జాతీయ అధ్యక్షుడు. అయిన టిడిపి రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఆయన ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ నుండి రాజ్యసభ ఎన్నికలలో వైసిపి అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. అదే విధంగా తెలంగాణకు చెందిన సుప్రీం కోర్ట్ న్యాయవాది నిరంజన్ రెడ్డి ని ఎంపిక చేశారు. ఆయన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సిబిఐ కోర్టులలో ఎదుర్కొంటున్న అవినీతి కేసులలో ఆయన తరపున వాదిస్తున్నారు. వైసిపి పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి వరుసగా రాజ్యసభకు పోటీ చేసే అవకాశం ఇచ్చారు. ఆయనతో పాటు నెల్లూరు జుల్లకు చెందిన బిసి నాయకుడు బీద మస్తాన్రావును కూడా ఎంపిక చేశారు. ఆయన కూడా టిడిపి నుండి…
వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో శవలింగం బయటపడిన కొలను ఉన్న ప్రాంతానికి రక్షణ కల్పించాలని వారణాసి జిల్లా మెజిస్ట్రేట్ ను సుప్రీం కోర్ట్ ఆదేశించింది. అదే సమయంలో, జ్ఞానవాపి మసీదులో నమాజ్ చేసుకునేందుకు అనుమతించాలని సూచించింది. జ్ఞానవాపి మసీద్ కాంప్లెక్స్లో వీడియోగ్రాఫిక్ సర్వేకు వారణాసి కోర్టు ఆదేశించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. అంజుమాన్ ఇంతెజమీయా మసీద్ కమిటీ దాఖలు చేసిన పిటిషన్ ను జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడా సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది. జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ ప్రాంతంలో శాంతి భద్రతల పరిస్థితిని సమీక్షించే బాధ్యత కలెక్టర్కు అప్పగించింది. మరోవంక, ఈ కేసు విచారిస్తున్న వారణాసి కోర్టు కోర్ట్ కమిషనర్ అజయ్ కుమార్ మిశ్రాను తొలగించింది. అజయ్ కుమార్ మిశ్రా పూర్తి స్థాయిలో సహకరించడం లేదనే ఆరోపణలు రావడంతో ఆయనను తొలగించింది. మరోవైపు నివేదిక సమర్పించేందుకు రెండు రోజుల సమయం కావాలని అసిస్టెంట్ కోర్ట్ కమిషనర్…
దేశ స్టాక్ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద ఐపీఓగా నిలిచిన ఎల్ఐసీ షేర్లు ఐపీఓ షేర్లు స్టాక్మార్కెట్లలో నేడు లిస్ట్ కాగా, ఎన్నో ఆశలతో పెద్ద ఎత్తున పెట్టుబడులతో ముందుకు వచ్చిన ముదుపరులు ఖంగుతిన్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఎల్ఐసీ షేర్లు స్టాక్ మార్కెట్ లో భారీ డిస్కౌంట్ తో లిస్ట్ అయ్యాయి. 8.62 శాతం డిస్కౌంట్తో రూ.867 దగ్గర లిస్ట్ కావడంతో ఎల్ఐసీ షేర్లు లక్షలాది మంది మదుపర్లకు తీవ్ర నిరాశను మిగిల్చాయి. ఈ లెక్కన కనీసం 15 షేర్లున్న ఒక లాట్ కు రూ 14, 235 పెట్టుబడిగా పెట్టిన ముదుపరులకు రూ 1,155 నష్టం తప్పలేదు. ఎల్ఐసీ షేర్లు ప్రీమియంతో లిస్ట్ అవుతాయని అంతా అంచనా వేశారు. కానీ అంతర్జాతీయ పరిస్థితులు,అమెరికా, భారత్ లలో వడ్డీ రేట్ల పెంపుతో మార్కెట్లు వరుసగా డౌన్ అవుతున్నాయి. ఈ ప్రభావం ఎల్ఐసీపై కూడా పడడంతో ప్రీమియం తగ్గిపోవడమే కాకుండా షేర్లు నెగిటివ్ లో లిస్ట్ అయ్యాయి. ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో మునిగిపోయిన సమయంలో ఎల్ఐసీ లిస్ట్…
ఎనిమిదేళ్ల క్రితం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ట్వీట్ ను ప్రస్తావిస్తూ, ఇప్పుడేం జరిగింది అంటూ తెలంగాణ ఐటి మంత్రి కెటి రామారావు ప్రశ్నలు కురిపించారు. వీలు చిక్కినప్పుడల్లా ఈ మధ్య ప్రధానిని లక్ష్యంగా చేసుకొని ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. 8 ఏళ్ల పాలనపై వీలైనప్పుడు ట్విట్టర్లో విమర్శలతో పాటు ప్రశ్నలు సందిస్తున్నారు. ప్రధాని మోదీ 8 ఏళ్ల క్రితం భారత్ గెలిచింది..ఇది దేశం సాధించిన విజయం అచ్చేదిన్ వస్తున్నాయని ట్వీట్ ను రీ ట్వీట్ చేస్తూ ప్రశ్నలు సందించారు. అచ్చేదిన్ హామీ ఇచ్చి 8ఏళ్లు పూర్తయిందన్న కేటీఆర్..అచ్చేదిన్ ఇవేనా అంటూ ప్రశ్నించారు. మోదీ ఎనిమిదేళ్ల పాలనలో రూపాయి కనిష్ట స్థాయికి రూ 77.80 చేరిందని పేర్కొన్నారు. 45 ఏళ్లలో అత్యధిక నిరుద్యోగం ఉందని తెలిపారు. 30 ఏళ్లలో అత్యధిక ద్రవ్యోల్బణం నమోదయ్యిందని గుర్తు చేశారు. ప్రపంచంలోనే అత్యధికంగా ఎల్పిజి ధర పెరిగిందని తెలిపారు. 42 ఏళ్లలో అత్యంత దారుణ…
నాటో సైనిక కూటమిలో చేరేందుకు ఫిన్లాండ్, స్వీడన్లు తీసుకున్న నిర్ణయాలపై రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం మరో తీవ్ర తప్పిదమని, దీనిపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ”ఇది, సుదీర్ఘకాలంలో తీవ్ర పర్యవసానాలు కలిగించగల మరో ఘోరమైన తప్పిదం” అని రష్యా ఉప విదేశాంగ మంత్రి సెర్గీ రిబకోవ్ స్పష్టం చేశారు. దీని వల్లనా సైనిక ఉద్రిక్తతల స్థాయి పెరుగుతుందని ఆమె హెచ్చరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏం చేయాలనే ఆలోచనలు సరిగా లేకపోవడం విచారకరమని తెలిపారు. ఇటువంటి నిర్ణయాలతో ఇరుదేశాల భద్రత పటిష్టం కాబోదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఇక్కడితో విడిచి పెడతామని భావించరాదని, మాస్కో తగిన రీతిలో చర్యలు తీసుకుంటుందని రిబకోవ్ స్పష్టం చేశారు. తప్పనిసరిగా ప్రతీకార చర్యలు తీసుకుంటామని మాస్కో ఫిన్లాండ్ను హెచ్చరించింది. శనివారం ఫిన్లాండ్ ప్రధాని సాలి నితినిస్తో రష్యా అధినేత పుతిన్తో మాట్లాడారు. ఈ నిర్ణయంతో ముందుకు సాగడం తప్పు కాగలదని పుతిన్ స్పష్టం…