Author: Editor's Desk, Tattva News

అనేక అవార్డులు గెలుచుకున్న మలయాళం సినీ నిర్మాత సనల్ కుమార్ శశిధరన్‌ను కేరళ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. తన “బతుకు అపాదలో ఉంది” అంటూ సోషల్ మీడియాలో చెప్పడం, “పదేపదే అవమానించడం, బెదిరించడం” చేస్తున్నాడంటూ నటి మంజూ వారియర్ ఫిర్యాదు చేయడంతో కేరళ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని తిరువనంతపురం రూరల్ నుంచి కస్టడీలోకి తీసుకుని కొచికి తరలించారు. 2020లో తను నటించిన ‘కయట్టం’ సినిమాకు శశిధరన్ దర్శకత్వం వహించారని, కానీ ఆ తర్వాత కూడా పదేపదే తనకు సందేశాలు పంపుతూ, సోషల్ మీడియాలో అవమానిస్తూ వేధిస్తున్నాడని నటి మంజూ వారియర్ ఫిర్యాదు చేసింది. మంజు వారియర్‌ ‘కయాట్టమ్‌’ షూటింగ్‌ సెట్‌లో ఆమె మేనేజర్‌తో వివాదం తలెత్తడంతో సమస్యలు మొదలయ్యాయి. సినిమా షూటింగ్ ముగిసిన తర్వాత సనల్ కుమార్ మంజు వారియర్‌ను కలవడానికి చాలాసార్లు ప్రయత్నించాడు. అయితే అతని ప్రవర్తన బాగాలేదని ఆమె గుర్తించింది. దీంతో ఆమెను చూడటానికి కానీ,…

Read More

కోల్‌కతాలోని కాశీపూర్‌లో బిజెవైఎం కార్యకర్త అర్జున్ చౌరాసియా మరణంపై సిబిఐ విచారణను డిమాండ్ చేస్తూ, బెంగాల్‌లో హింస సంస్కృతి, భయానక వాతావరణం ప్రబలంగా నెలకొందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. రాష్ట్రంలోని రెండు రోజుల పర్యటనలో ఉన్న షా, శుక్రవారం చౌరాసియా ఇంటిని సందర్శించారు. అతను అనుమానాస్పద పరిస్థితులలో ఈ ప్రాంతంలోని పాడుబడిన భవనంలో ఉరివేసుకుని ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. గత ఏడాది పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కత్తులు దూసిన బీజేపీ నేత, ఈ ఘోరమైన నేరానికి పాల్పడిన వారిని న్యాయస్థానాల నుంచి కఠినంగా శిక్షించాలని బీజేపీ పార్టీ డిమాండ్‌ చేస్తుందని స్పష్టం చేశారు. “నిన్న టిఎంసి మూడవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి వార్షికోత్సవాన్ని జరుపుకుంది.  ఇప్పుడు చౌరాసియాను చంపిన సందర్భం ఉంది” అని హోం మంత్రి మరణించిన వారి కుటుంబ సభ్యులను కలిసిన తర్వాత విలేకరులతో తెలిపారు. …

Read More

మత విద్వేష వ్యాఖ్యలు చేసిన కేసులో బిజెపి ఢిల్లీ అధికార ప్రతినిధి తజిందర్‌ పాల్‌ సింగ్‌ బగ్గా అరెస్టులో శుక్రవారం హైడ్రామా చోటు చేసుకుంది. ఢిల్లీలోని తజిందర్‌ నివాసం నుంచి పంజాబ్‌ పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్తుండగా, హర్యానా, ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు.  తజిందర్‌ను మళ్లీ కొన్ని గంటల వ్యవధిలోనే ఢిల్లీకి ఢిల్లీ పోలీసులు తీసుకెళ్లిపోయారు. మార్చి 30న మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మత విద్వేష వ్యాఖ్యలు, రెచ్చగొట్టే ప్రకటనలను తజిందర్‌ పాల్‌ చేశారు. పంజాబ్‌లోని ఎస్‌ఎఎస్‌ నగర్‌ జిల్లా మొహాలిలో రాష్ట్ర సైబర్‌ క్రైమ్‌ వింగ్‌ ఏప్రిల్‌ 1న ఐపిసి సెక్షన్లు 153 ఎ, 505, 505 (2), 506 కింద తజిందర్‌ పాల్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది.  ఈ కేసులో ఐదు సార్లు నోటీసులిచ్చినా 36 ఏళ్ల తజిందర్‌ ఉద్దేశపూర్వకంగానే విచారణకు హాజరుకాలేదని పేర్కొంటూ పంజాబ్‌ పోలీసులు శుక్రవారం ఉదయం ఢిల్లీలో అరెస్టు చేశారు. ‘చట్టంలోని నిబంధనలను అనుసరిస్తూ నిందితుడిని న్యూఢిల్లీ, జనక్‌పురిలోని…

Read More

ఒక వ్యక్తిని భారతీయుడిగా విదేశీ ట్రిబ్యునల్‌ (ఎఫ్‌టి) పరిగణించిన ఆ వ్యక్తి ఎప్పటికీ భారతీయుడేనని గుహవటి హైకోర్టు విదేశీ ట్రిబ్యునల్‌ బెంచ్‌ పేర్కొంది.  భారతీయ పౌరునిగా గుర్తించిన అనంతరం అదే వ్యక్తిని రెండోసారి ట్రిబ్యునల్‌ ఎదుట హాజరుపరిస్తే విదేశీయునిగా ప్రకటించలేమని జస్టిస్‌ ఎన్‌.కోటీశ్వర్‌ సింగ్‌, జస్టిస్‌ నాని త్యాగిలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.   గతంలో భారతీయులుగా ప్రకటించబడినప్పటికీ.. మరోసారి విచారణలో విదేశీయులుగా ప్రకటించారంటూ కొందరు పిటిషనర్లు హైకోర్టుని ఆశ్రయించారు. ఈ పిటిషన్‌లపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఒక వ్యక్తి పౌరసత్వంపై ఎఫ్‌టి ఇచ్చిన అభిప్రాయం రెస్‌ జ్యుడికాటా లా ప్రకారం పనిచేస్తుందని పేర్కొంది. అంటే సంబంధిత న్యాయస్థానం ఇచ్చినదే తుది తీర్పు.. ఇదే అంశంపై ప్రతివాదులు మరోసారి కోర్టుకు వచ్చినా ఆ కేసు విచారించబడదని తెలిపింది. అలాగే రెస్‌ జ్యుడికాటా వర్తించే గతంలోని రెండు కేసుల్లో తీర్పులను ప్రస్తావించింది.  మొదటిది .. అమీనా ఖాతూస్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా (2018)…

Read More

కేసీఆర్ కు వ్యతిరేకంగా ఒంటరిగా పోరాటం జరిపి, పట్టభద్రుల నియోజకవర్గం నుండి జరిగిన ఎమ్యెల్సీ ఎన్నికలలో అధికార పక్షంకు చుక్కలు చూపించి, సంచలనం కలిగించిన తీన్మార్ మల్లన్న రాజకీయ భవిష్యత్ మరోసారి సందిగ్ధతలో పడింది. ఇప్పటి వరకు తాను తూర్పురా బడుతున్న అధికారపక్షం టి ఆర్ ఎస్ లో చేరబోతున్నారనే  ఊహాగానాలు వెలువడుతున్నాయి.  కేసీఆర్ ప్రభుత్వం పొలిసు కేసులతో వేధిస్తూ, అరెస్ట్ కూడా చేయగా ఎంతో ఆర్భాటంగా బీజేపీలో చేరారు. పార్టీ జాతీయ నాయకత్వం కూడా ఆదరించింది. అయితే ఆ తర్వాత మంత్రి కేటీఆర్ కుమారుడిపై ఇచ్చిన వివాదాస్పద ట్వీట్ విషయంలో బిజెపి ఆయనకు మద్దతు ఇవ్వలేదు.  అప్పటి నుండి క్రమంగా బిజెపికి దూరం జరుగుతున్నట్లు స్పష్టం అవుతున్నది. ప్రస్తుతం జరుగుతున్న రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్ర రెండో దశలో కూడా ఎక్కడ కనిపించడం లేదు. బీజేపీ నాయకులు సహితం ఎవ్వరు ఆయన పట్ల ఆసక్తి చూపుతున్నట్లు లేదు.  తన సొంత…

Read More

కోర్ట్ ధిక్కార కేసులలో ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష పడటం, ఆ తర్వాత కోర్టును ఆశ్రయించి ఉపశమనం పొందడం సాధారణంగా మారింది. తాజాగా హైకోర్టు తీర్పును అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ముగ్గురు ఐఏఎస్‌ అధికారులకు నెల రోజుల జైలు శిక్ష, 2 వేల రూపాయల జరిమానా విధించింది.  వీరిలో వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఆ శాఖ మాజీ కమిషనర్ హెచ్. అరుణ్‌కుమార్, పౌర సరఫరాల సంస్థ ఎండీ జి.వీరపాండియన్ ఉన్నారు.  జరిగిన విచారణకు అరుణ్ కుమార్, వీరపాండియన్ హాజరయ్యారు. వీరిద్దరి అభ్యర్థన మేరకు తీర్పు అమలును ఆరు వారాలపాటు నిలిపేస్తూ న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఆదేశాలు జారీ చేశారు.  అదే సమయంలో పూనం మాలకొండయ్య కోర్టుకు హాజరు కాకపోవడంతో తీర్పు అమలును నిలుపుదల చేసేందుకు నిరాకరించారు. ఈ నెల 13వ తేదీ లోపు హైకోర్టు రిజిస్ట్రార్ (జుడీషియల్) ఎదుట లొంగిపోవాలని ఆమెను ఆదేశించారు.  అయితే, సింగిల్…

Read More

మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి(73) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఇవాళ కన్నుమూశారు. గోపాలకృష్ణారెడ్డి చిత్తూరు జిల్లా శ్రీకాళాహస్తి నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అలిపిరి బాంబ్ బాస్ట్ లో చంద్రబాబునాయుడుతో పాటుగా బొజ్జల గాయపడ్డారు. 1989, 1994, 1999, 2009, 2014లో 5 దఫాలుగా గెలుపొందిన బొజ్జల ఉమ్మడి రాష్ట్రంలో ఐ.టీ మినిస్టర్ గా ఏ.పీ తొలి మంత్రివర్గంలో అటవీశాఖ మంత్రిగా పని చేశారు. 1994-99లో రోడ్లు భవనాలు శాఖ మంత్రిగా ఆయన పనిచేశారు. 2014లో చంద్రబాబు క్యాబినెట్‌లో అటవీ శాఖ మంత్రిగా బొజ్జల పని చేశారు. 2004-09లో కాంగ్రెస్ నేత ఎస్‌సివి నాయుడు చేతిలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఓటమి చెందారు. గోపాలకృష్ణారెడ్డి మృతిపై ఏపీ, తెలంగాణ రాజకీయ నేతలు సంతాపం తెలిపారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మరణం…

Read More

భారత్‌లోనే అత్యధిక కరోనా మృతులు నమోదయ్యాయన్న ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) నివేదికపై కేంద్రం మండిపడింది. ఈ నివేదికలో వాస్తవం లేదని, అర్థరహితమని కొవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ చీఫ్‌ డాక్టర్‌ ఎన్‌.కె. అరోరా తెలిపారు. డబ్ల్యుహెచ్‌ఒ తీరు దుర్మార్గంగా ఉందని, అంచనాలు ఆమోద యోగ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. డబ్ల్యుహెచ్‌ఒ అనుసరిస్తున్న లెక్కింపు విధానాన్ని తోసిపుచ్చారు. డబ్ల్యుహెచ్‌ఒ అనుసరిస్తున్న గణిత విధానాలపై తాము ఎప్పటికప్పుడు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉన్నామని గుర్తు చేశారు. అయినా పట్టించుకోకుండా ఈ అంచనాలను విడుదల చేసిందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. డబ్ల్యుహెచ్‌ఒ నివేదిక ఆమోదయోగ్యం కాదని, దురదృష్టకరమని చెప్పారు. అధికారిక గణాంకాల ప్రకారం శుక్రవారం నాటికి 5.24 లక్షల మందకరోనాతో మరణించారని, భారత్‌ పేర్కొనగా.. డబ్ల్యుహెచ్‌ఒ అంచనాలు దీనికి 9 రెట్లకు పైగా ఉండటం గమనార్హం. కరోనా ప్రభావంతో ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ప్రపంచవ్యాప్తంగా రెండేళ్లలో సుమారు 1.50 కోట్ల మంది మరణించినట్లు డబ్ల్యుహెచ్‌ఒ అంచనా…

Read More

‘‘టీఆర్‌ఎస్‌ అంటే.. తెలంగాణ రాష్ట్ర సమితి కాదు.. తెలంగాణ రజాకార్ల సమితి” అంటూ బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ఎద్దేవా చేశారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా గురువారం సాయంత్రం మహబూబ్‌నగర్‌ లోని ఎంవీఎస్‌ కళాశాలలో జరిగిన భారీ బహిరంగసభలో మాట్లాడుతూ  రాష్ట్రంలో అవినీతి సర్కారు రాజ్యమేలుతోందని ధ్వజమెత్తారు.  కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌కు ఏటీఎంలా మారిందని చెబుతూ రూ.20 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును రూ.లక్ష కోట్లకు పెంచి కమీషన్లు దండుకున్నారని ఆరోపించారు. ఇది కేసీఆర్‌ అవినీతికి మచ్చుతునక అని చెప్పారు.  ప్రధాని మోదీ ఆశీస్సులు తెలంగాణ ప్రజల పై ఎప్పుడూ ఉంటాయని పేర్కొంటూ తెలంగాణలో వచ్చేది డబుల్‌ ఇంజిన్‌ సర్కారేనని భరోసా వ్యక్తం చేశారు.  రాష్ట్రంలో ల్యాండ్‌ మాఫియా రాజ్యమేలుతోందని చెబుతూ  కేసీఆర్‌ కేంద్ర పథకాలను తన పథకాల పేరుతో అమలు చేసుకుంటున్నాడని విమర్శించారు. ఆయుష్మాన్‌ భారత్‌ కేంద్ర పథకంతో రాష్ట్రంలో…

Read More

దేశంలో వివిధ ప్రాంతాలలో మావోయిస్టుల ఉనికిని దెబ్బతీయడంలో విశేషంగా విజయాలు సాధిస్తున్నకేంద్ర భద్రతా బలగాలను దెబ్బతీసేందుకు మావోస్టులు తాజాగా సమకూర్చుకున్న మారణాయుధం ‘దేశీ’ వారిలో ఖంగారు పుట్టిస్తున్నది. ఈ ఆయుధం పేరు బారెల్ గ్రెనేడ్ లాంచర్ (బిజిఎల్). ఇంతకుముందు ఒక రోజులో 5-10 బిజిఎల్‌లను మాత్రమే కాల్చగలిగిన నక్సలైట్లు ఇప్పుడు స్వదేశీ మోడల్ వచ్చిన తర్వాత ఒక్క రాత్రిలో భద్రతా దళాలపై, ముఖ్యంగా సిఆర్‌పిఎఫ్ క్యాంపులపై 150-200 బిజిఎల్‌లను కాల్చగలుగుతున్నట్లు తెలుస్తున్నది. గతంలో భద్రతా దళాలు లేదా పోలీసుల నుండి ఎత్తుకెళ్లిన బిజిఎల్ లను పరిమితంగానే ఉపయోగించేవారని, కానీ ఇప్పుడు వారే స్థానికంగా తయారు చేసుకో గలగడంతో ఎక్కువగా ప్రయోగించ గలుగుతున్నారని తెలుస్తున్నది. దానితో సిఆర్‌పిఎఫ్ నక్సల్ ప్రభావిత రాష్ట్రాల పోలీసులతో సహా వివిధ భద్రతా సంస్థలు ఇప్పుడు ‘బిజిఎల్’ స్థానిక నమూనా లోగుట్టు వేలుకి తీయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దీనితో 200 మీటర్ల వరకు లక్ష్యాన్ని ఛేదించే అవకాశం ఉన్నందున ఎక్కువగా భద్రతా దళాల నుండి రాత్రివేళ తప్పించుకునేందుకు ఉపయోగిస్తుంటారు. …

Read More