Author: Editor's Desk, Tattva News

మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు కాన్వాయిను విశాఖ పోలీసులు అడ్డగించారు. రుషికొండ హరిత రిసార్ట్స్‌ను పర్యటించేందుకు జిల్లా నాయకులతో కలిసి వెళ్తుండగా.. గీతం కాలేజీ వద్ద ఆయన కాన్వాయిను పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబు, విశాఖ పార్లమెంట్‌ టిడిపి అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, సీనియర్‌ నాయకులు కొందరు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రుషికొండపై టూరిజం రిసార్ట్స్‌ ఎంతో అందంగా ఉండేవని, వైసిపి ప్రభుత్వం వాటిని ధ్వంసం చేసి కొత్తగా నిర్మాణాల పేరుతో నాటకాలాడుతున్నారంటూ చంద్రబాబు మండిపడ్డారు. టూరిజం రిసార్ట్స్‌ పేరుతో ఇక్కడ పర్యావరణం అంతా నాశనమైందని, దాన్ని చూసేందుకు వచ్చిన తనను రోడ్డుపైనే అడ్డుకోవడం దారుణమని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పర్యటనను ఎందుకు అడ్డుకుంటున్నారని, ఇందులో మింగిందంతా కక్కిస్తానని చంద్రబాబు చెబుతూ వెనుదిరిగారు. సాగర్‌నగర్‌కు చెందిన బోడేపూడి దొరబాబును పోలీసులు అరెస్ట్‌ చేసి ఆటోలో తరలించారు. ఎన్‌సిసికి గతంలో కేటాయింపులు జరిపిన 90 ఎకరాల…

Read More

గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి తాలూకూ రెండు నారాయణ, మూడు చైతన్య విద్యాసంస్థలు పదో తరగతి ప్రశ్నాపత్రాలను లీక్‌ చేశాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆరోపించారు . వాళ్లే ప్రశ్నాపత్రాలను లీక్‌ చేసి…ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. దొంగే దొంగా..దొంగా అన్నట్లుగా ఉందని మండిపడ్డారు. అత్యాచారాలంటూ మళ్లీ కొత్త ప్రచారం మొదలు పెట్టారని, నానా హంగామా చేస్తున్నారని, తనపై బురద జల్లే కుట్ర అంటూ ప్రతిపక్షాలను విమర్శించారు. గురువారం తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ తారకరామ స్టేడియంలో ‘జగనన్న విద్యాదీవెన’ను సిఎం ప్రారంభించారు. మూడో విడత విద్యాదీవెనకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 10,85,000 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ.709 కోట్లను బటన్‌ నొక్కి జమ చేశారు. అనంతరం బహిరంగసభలో విద్యార్థుల తల్లిదండ్రుల ఉద్దేశించి ప్రసంగీస్తూ గత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని పూర్తిగా నీరుగార్చిందని ధ్వజమెత్తారు. తన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఒక్క అడుగు ముందుకువేస్తే, తాను నాలుగు అడుగులు…

Read More

తెలంగాణాలో పార్టీ బలపడాలంటే బలమైన నేతలను పార్టీలోకి ఆహ్వానించాలని స్పష్టం చేస్తూ, ఆ విధంగా వస్తే ‘కూర్చీ పోతుందని చూడకండి.. మీ విషయం పార్టీ చూసుకుంటుంది’ అంటూ రాష్ట్రంలోని బిజెపి నేతలకు జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా హితవు చెప్పారు. రాష్ట్రంలో పోస్ట్ మాన్ తరహాలో నాయకులు పని చేస్తే సరిపోదని, పార్టీని గ్రామ స్థాయి నుంచి పటిష్టంగా బలోపేతం చేయాలని దిశా నిర్దేశం చేశారు. పార్టీ బలోపేతం కోసం కష్టపడకపోతే ఎలాంటి ఫలితం ఉండదన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొనడానికి మహబూబ్ నగర్ కు వచ్చిన ఆయన పార్టీ రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ తో సమావేశమవుతూ వారంలో ఒకరోజు ఏదైనా ఒక నియోజకవర్గంలో నాయకులందరూ పర్యటించాలని స్పష్టం చేశారురు. . పది అంశాల ఫార్ములా పెట్టుకుని అందరూ కష్టపడి పార్టీ కోసం పని చేయాలని ఆదేశించారు. పార్టీలోకి వచ్చే నాయకులను, కార్యకర్తలను ఆహ్వానించాలని చెబుతూ రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తే అందరికీ అవకాశం ఉంటుందని, అధికారంలోకి రాకపోతే ఏం చేయలేమని…

Read More

హైదరాబాద్ నగరంలో ఓ ముస్లిం యువతిని వివాహం చేసుకున్న దళిత యువకుడు పరువు హత్యకు గురయ్యాడు. సరూర్‌నగర్ మండల్‌లోని మర్పల్లి గ్రామంలో బుధవారం రాత్రి ఆ దంపతులపై జరిగిన దాడిలో భర్త చనిపోయాడు. వివరాలలోకి వెళితే…బి. నాగరాజు(25), అష్రిన్ సుల్తానా(23) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొత్తగా పెళ్లి చేసుకున్న వీరిపై భార్య తరఫు కుంటుంబీకులు ఇద్దరు ఇనుప రాడ్లతో దాడిచేశారు. దాడిచేసిన వారు కత్తి తీసుకుని నాగరాజును కసకసా పొడిచేస్తుంటే ఆ దారిన వెళుతున్న వారు దిగ్భ్రాంతికి గురయ్యారు. నాగరాజు దాడి జరిగిన చోటే అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటన అంతా సిసిటివిలో రికార్డు అయింది. కాగా గాయాలపాలైన అష్రిన్ సుల్తానాను దారిన వెళుతున్న వారు దగ్గరిలోని ఆసుపత్రికి తీసుకెళ్ళారు. ఆ దంపతులు మర్పల్లి గ్రామానికి చెందినవారని పోలీసులు తెలిపారు. గత కొన్నేళ్లుగా వారు ప్రేమించుకున్నారని, అయితే వారి సంబంధాన్ని అమ్మాయి తరఫు కుటుంబీకులు వ్యతిరేకిస్తూ వచ్చారని పోలీసులు తెలిపారు. పైగా ఆ…

Read More

ఎన్నికల వ్యూహకర్తగా పలువురు ప్రముఖ నాయకులు, రాజకీయ పార్టీలు ఎన్నికలలో ఘన విజయాలు సాధించి, ప్రభుత్వాలు ఏర్పర్చడంలో కీలకంగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ మాత్రం తన రాజకీయ భవిష్యత్ విషయంలో తికమక పడుతున్నారు. గత ఏడాది పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో మమతా బెనర్జీ మూడోసారి తిరిగి ఎన్నిక కావడంలో కీలకంగా వ్యవహరించి, ఫలితాలు రాగానే ఇక తాను ఎన్నికల వ్యూహకర్తగా ఉండబోనని ప్రకటించారు. తానే రాజకీయ ప్రవేశం చేయబోతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఆ తర్వాత బిజెపికి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలతో కూటమి ఏర్పాటు అని ఒక సారి, కాంగ్రెస్ నేతృత్వంలో కూటమి అంటూ మరో సారి కొన్ని ప్రయత్నాలు చేశారు. చివరకు కాంగ్రెస్ పార్టీలో చేరి, ఆ పార్టీని 2024లో అధికారంలోకి తీసుకు వచ్చేందుకు కృషి చేయబోతున్నట్లు చెప్పారు. అందుకోసం ఓ పెద్ద ప్రణాళిక తయారు చేసి, ఆ పార్టీ అగ్రనాయకులతో వరుస భేటీలు జరిపారు. ఏమయిందో గాని, ఆ పార్టీలో చేరడం లేదని ప్రకటించారు. గత…

Read More

వరుసగా రెండు సార్లు అస్సాం పోలీసులు అరెస్ట్ చేసినా కోర్ట్ నుండి బెయిల్ తీసుకొని బయటకు వచ్చిన గుజరాత్ ఎమ్మెల్యే, దళిత నేత జిగ్నేష్ మేవానీ మరోసారి గురువారం అరెస్టయ్యారు. ఐదేళ్ల క్రితం జరిపిన ‘అజాదీ మార్చ్‌’ కేసులో మేవానీ సహా తొమ్మిది మందిని దిగువ కోర్టు నిందితులుగా పేర్కొంది. 2017 జులైలో బనస్కాంత జిల్లాలోని మెహసానా నుండి ధనేరా వరకు మేవానీతో పాటు తొమ్మిది మంది ఆజాది మార్చ్‌ పేరుతో ర్యాలీ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ర్యాలీకి పోలీసుల అనుమతి తీసుకోలేదని, చట్టవిరుద్ధంగా సమావేశాన్ని నిర్వహించారంటూ వారిని దోషులుగా నిర్థారించింది. దీంతో వీరందరికీ మూడు నెలల జైలుశిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ. వెయ్యిరూపాయల జరిమానా విధించింది. గత ఏప్రిల్‌ నెలలో మేవానీని అస్సోం పోలీసులు రెండు సార్లు అరెస్ట్‌ చేశారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ట్వీట్‌ చేశారంటూ అస్సోం పోలీసులు అరెస్ట్‌ చేశారు. బెయిల్‌పై విడుదలైన వెంటనే…

Read More

జమ్మూ కాశ్మీర్‌లోని సాంబా జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఒక క్రాస్ బోర్డర్ సొరంగాన్ని గుర్తించామని, త్వరలో జరగనున్న అమర్‌నాథ్ యాత్రకు అంతరాయం కలిగించేందుకు పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు వేసిన ప్రణాళికలను భగ్నం చేసినట్లు సరిహద్దు భద్రతా దళం వెల్లడించింది. దీనితో జమ్మూ ప్రాంతంలో అలర్ట్ ప్రకటించారు. బుధవారం సాయంత్రం జమ్మూ కాశ్మీర్‌లోని సాంబాలోని చక్ ఫక్విరా సరిహద్దు ఔట్‌పోస్టు పరిధిలో 150 మీటర్ల పొడవైన సొరంగాన్ని గుర్తించినట్లు బిఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. ”ఈ సొరంగాన్ని గుర్తించడంతో, రాబోయే అమర్‌నాథ్ యాత్రకు అంతరాయం కలిగించడానికి పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదుల యొక్క దుర్మార్గపు డిజైన్లను బిఎస్ఎఫ్-జమ్మూ విఫలం చేసింది” అని సరిహద్దు భద్రతా దళం డిఐజి- ఎస్ పిఎస్ సంధు తెలిపారు. సొరంగం తాజాగా పాకిస్తాన్ వైపు నుండి తవ్విన్నట్లు స్పష్టం అవుతున్నది. దీని ఓపెనింగ్ సుమారు 2 అడుగులు కాగా, సొరంగం నిష్క్రమణను పటిష్టం చేసేందుకు ఉపయోగించిన 21 ఇసుక బస్తాలను స్వాధీనం చేసుకున్నట్లు…

Read More

కేంద్ర పాలిత ప్రాంత డీలిమిటేషన్ తుది ఉత్తర్వులపై జమ్మూ కాశ్మీర్ డీలిమిటేషన్ కమిషన్ గురువారం సంతకం చేసింది. జమ్మూ కాశ్మీర్‌లోని అసెంబ్లీ, పార్లమెంటరీ నియోజకవర్గాల సరిహద్దులను తిరిగి గీయడానికి నియమించబడిన ప్యానెల్, ఈ రోజు డీలిమిటేషన్ కసరత్తును ముగించింది. లోయలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అసెంబ్లీ ఎన్నికలకు మార్గం సుగమం చేసింది. నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత గెజిట్ నోటిఫికేషన్‌ను తీసుకురావడం ద్వారా నియోజకవర్గాల సంఖ్య, వాటి విస్తీర్ణాన్ని వివరించే డీలిమిటేషన్ ‘అవార్డు’ బహిరంగ పరుస్తారు. జూన్ 2018 నుండి ఎన్నికైన ప్రభుత్వం లేకుండా ఉన్న జమ్మూ కాశ్మీర్‌లో ప్రతిపాదిత ఎన్నికలు డీలిమిటేషన్ కసరత్తు ముగిసిన తర్వాతే జరుగుతాయి కాబట్టి ఈ నిర్ణయం చాలా కీలకం.ఎన్నికల తర్వాత ఈ ప్రాంతానికి రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తానని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. మార్చి 2020లో కేంద్రం ఏర్పాటు చేసిన ప్యానెల్‌లో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలోని ప్రధాన ఎన్నికల…

Read More

మూడు ఐరోపా దేశాల పర్యటనలో భాగంగా ఫ్రాన్స్‌లో ఆ దేశ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్‌ మాక్రోన్‌తో భేటీ కావడంతో భారత ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల విదేశీ పర్యటన ముగిసింది. భారత కాల మానం ప్రకారం.. బుధవారం అర్ధరాత్రి వీళ్ల భేటీ జరిగింది. ఈ సందర్భంగా మాక్రోన్‌తో భేటీని ఇద్దరు మిత్రుల కలయికగా ప్రదాయి మోదీ అభివర్ణించారు. బుధవారం సాయంత్రం ఫ్రాన్స్‌లో అడుగుపెట్టిన ప్రధాని మోదీ ప్యారిస్‌లోని అధ్యక్ష అధికార భవనం ఎల్‌వైసీ ప్యాలెస్‌కి చేరుకున్నారు. అక్కడ వీళ్లద్దిరి భేటీ జరిగింది. ఇరువురు నేతలు ద్వైపాక్షిక, వ్యూహాత్మక అంశాలపై చర్చించుకున్నారు. అలాగే మంగళవారం మాక్రోన్‌, పుతిన్‌ మధ్య సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఉక్రెయిన్‌ పరిణామాలపై ప్రధాని మోదీ, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రోన్‌ మధ్య ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మేక్రాన్‌ మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన నేపథ్యంలో మోదీ ఆయనను అభినందించారు. ‘నమస్తే ప్యారిస్‌’ అంటూ తన ఫ్రాన్స్‌ పర్యటన…

Read More

భారత్‌లో అపారమైన అవకాశాలు ఉన్నాయని భరోసా ఇస్తూ  పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని నార్డిక్‌ దేశాల పెట్టుబడిదారులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపిచ్చారు.  భారత కంపెనీలతో జట్టుకట్టాలని కోరుతూ,  ప్రధానంగా టెలికాం, డిజిటల్‌ రంగాల్లో అద్భుత అవకాశాలు ఎదురు చూస్తున్నాయని తెలిపారు. ప్రధాని తన మూడు రోజుల ఐరోపా పర్యటన చివరి రోజైన బుధవారం  డెన్మార్క్‌ రాజధాని కోపెన్‌హగెన్‌లో నార్డిక్‌ దేశాలైన నార్వే, స్వీడన్, ఐస్‌లాండ్, ఫిన్‌ల్యాండ్‌ దేశాల అధినేతలతో వేర్వేరుగా సమావేశమయ్యారు. భారత్‌–ఆయా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించారు.  తొలుత నార్వే ప్రధాని జోనాస్‌ గాహ్ర్‌స్టోర్‌తో భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య తొలిభేటీ ఇదే కావడం విశేషం. బ్లూ ఎకానమీ, క్లీన్‌ ఎనర్జీ, స్పేస్‌ హెల్త్‌కేర్‌ తదితర కీలక అంశాలపై జోనాస్‌తో ఫలవంతమైన చర్చలు జరిపినట్లు మోదీ ట్వీట్‌ చేశారు. భారత్‌ ఇటీవల ప్రకటించిన ఆర్కిటిక్‌ పాలసీలో నార్వే ఒక మూలస్తంభం అని కొనియాడారు. …

Read More