Author: Editor's Desk, Tattva News

పాకిస్తాన్ మాజీ ప్రధాని దివంగత బేనజీర్ భుట్టో కుమారుడు బిలావల్ భుట్టో జర్దారీ బుధవారం పాకిస్తాన్ విదేశాంగ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంలో బిలావల్ పాత్రపై గత కొద్ది రోజులుగా సాగుతున్న ఊహాగానాలకు దీంతో తెరపడింది.  అధ్యక్ష నివాసం ఐవాన్ ఇ సదర్‌లో నిరాడంబరంగా జరిగిన ఒక కార్యక్రమంలో 33 ఏళ్ల బిలావల్ చేత విదేశాంగ మంత్రి పాక్ అధ్యక్షుడు ఆలిఫ్ అల్వి ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని షెహబాజ్, మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పిపిపి)కి చెందిన ఇతర నాయకులు పాల్గొన్నారు. 2018లో జాతీయ పార్లమెంట్‌కు మొదటిసారి ఎన్నికైన బిలావల్‌కు అత్యంత కీలకమైన విదేశాంగ మంత్రి పదవి దక్కడం విశేషం. ఆయనకు ప్రభుత్వంలో కీలక పదవి దక్కడం కూడా ఇదే మొదటిసారి. పాకిస్తాన్‌కు మూడుసార్లు ప్రధాన మంత్రిగా ఎన్నికైన బేనజీర్ భుట్టో కుమారుడు బిలావల్.  2007లో రావల్‌పిండిలో ఒక…

Read More

దేశానికి కావాల్సింది రాజ‌కీయ ఫ్రంట్‌లు కాదని, దేశానికి ప్ర‌త్యామ్నాయ ఎజెండా కావాలని, భార‌త‌దేశ ప్ర‌జ‌ల‌కు అనుకూల‌మైన ఫ్రంట్ రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు పిలుపిచ్చారు. బుధవారం పార్టీ 21వ ప్లీనరీలో మాట్లాడుతూ దేశం బాగుప‌డ‌టానికి మ‌న రాష్ట్రం నుంచి ప్రారంభం జ‌రిగితే అది మ‌నంద‌రికీ గ‌ర్వ‌కార‌ణం అని చెప్పారు. దేశంలో కొత్త రాజకీయ శక్తి ఆవిర్భవించాలన్న కేసీఆర్.. అందులో టీఆర్ఎస్ కీలక భూమిక పోషిస్తుందని భరోసా వ్యక్తం చేశారు. “2000 సంవత్సరంలో నేను తెలంగాణ అని మాట్లాడితే, ఏం ప‌ని లేదా అని అన్నారు. కానీ, తెలంగాణ సాధించడమే కాకుండా దేశానికి రోల్‌మోడ‌ల్‌గా తెలంగాణ నిలిచేలా చేశాం. సమైక్య పాలనలో పాల‌మూరు జిల్లాలో వ‌ల‌స‌లు పోయేవారు. ఇవాళ వ‌ల‌స‌లు రివ‌ర్స్ వ‌చ్చాయి. 11 రాష్ట్రాల నుంచి మ‌న వ‌ద్ద‌కు వ‌ల‌స‌లు వ‌స్తున్నారు” అని కేసీఆర్ గుర్తు చేశారు. బీహార్ హ‌మాలీ కార్మికులు లేక‌పోతే తెలంగాణ రైస్‌మిల్లులు న‌డ‌వ‌వు. హైద‌రాబాద్, రంగారెడ్డి, మేడ్చ‌ల్ లో…

Read More

మండు టెండను లెక్క చేయలేదు….వడ దెబ్బకు కుంగిపోలేదు… వడ గాలులను పట్టించుకోలేదు. జనంతో మమేకం… జనంతోనే నా పయనం… అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్రను కొనసాగిస్తున్నారు. గత నాలుగైదు రోజులుగా సూర్యభగవానుడు తన ప్రతాపాన్ని చూపుతూ నిప్పులు కక్కుతున్నా పట్టించుకోకుండా బాటసారిలో జనం బాధలు వింటూ వారికి బీజేపీ అండగా ఉందంటూ భరోసానిస్తూ ముందుకు సాగుతున్నారు. 14వ రోజు పాదయాత్రలో భాగంగా బుధవారం మధ్యాహ్నం వరకు ఓబులాపూర్ నుండి చిన్న పోర్ల, మల్లేపల్లి గేట్, ఎడవల్లీ గేట్ మీదుగా కొల్లూరు వరకు పాదయాత్ర చేశారు. దారి పొడవునా ప్రజలను కలుసుకుంటూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మార్గ మధ్యలో మహిళలు, చిన్నారులు, యువతను ఆప్యాయంగా పలకరిస్తూ సాగారు. వృద్ధుల ఆసరా గురించి ఆరా తీస్తూ, మహిళల క్షేమాన్ని తెలుసుకుంటూ వడివడిగా అడుగులు వేస్తూ ముందుకు కదిలారు. ఉపాధి హామీ పనులకు వెళుతున్న మహిళలు…

Read More

ప్రస్తుత వేగవంతమైన సమాచార యుగంలో మాట పెదవి దాటే లోపు, సమాచారం పృథివి దాటుతోందని అందుకే ఇచ్చే సమాచారం సరైనదా కాదా అనేది ఎప్పటికప్పుడు సరి చూసుకోవలసిన అవసరం ఉందని  ఉపరాష్ట్రపతి   ముప్పవరపు వెంకయ్యనాయుడు మీడియాకు సూచించారు. మీడియా అనేది అద్దం లాంటిదని అది సమాజాన్ని ప్రతిబింబించడంతో పాటుగా సమాజంలో సానుకూల మార్పునకు కృషి చేయాలని తెలిపారు.  ఎన్ని పత్రికలు, ప్రసార మాధ్యమాలు ఈ దిశగా స్వీయ నియంత్రణతో పనిచేస్తున్నాయనేది ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు చెప్పారు.  బుధవారం నెల్లూరు జిల్లా కేంద్రంలోని నెల్లూరు ఆలిండియా రేడియో కేంద్రాన్ని జాతికి అంకితం చేసిన అనంతరం, 100 మీటర్ల 10 కిలోవాట్ల ఎఫ్ఎం స్టేషన్ కార్యక్రమాలను ఉపరాష్ట్రపతి ప్రారంభించారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విక్రమ సింహపురికి, ఆకాశవాణికి 6 దశాబ్దాలుగా ఉన్న అవినాభావ సంబంధాన్ని, ఇక్కడి ప్రజల జీవితాల్లో రేడియో పాత్రను ప్రస్తావిస్తూ మీడియాకు పలు సూచనలు చేశారు. ప్రచార, ప్రసార మాధ్యమాలు అందించే వార్తలు…

Read More

ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలంగాణాలో తాము అధికారంలోకి రావడం ఖాయం అంటూ బిజెపి నాయకులు ప్రకటనలు చేయడమే కానీ ఆచరణలో ఆ దిశలో అడుగులు వేయడం లేదని స్పష్టం అవుతున్నది.  రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలలో కనీసం 70 స్థానాలను దక్కించుకునేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వీడుతున్నట్లు ప్రకటించిన నాయకులు అందుకోసం చూపిన ప్రణాళిక ప్రకారం అడుగులు వేయడం లేదు. ముఖ్యంగా `మిషన్ 31′ పేరుతో ఎస్సి, ఎస్టీ రిజర్వేడ్ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించి,  వాటిని గెలిపించుకోవడం కోసం ఇప్పటి నుండే బలమైన అభ్యర్థులను గుర్తించాలని నిర్ణయించారు. ఎందుకంటె వీటులో ఏ పార్టీ ఎక్కువ నియోజకవర్గాలు గెల్చుకొంటుందో ఆ పార్టీయే ఉమ్మడి ఏపీలో కూడా అధికారంలోకి వస్తున్నది.  ఇందులో 19ఎస్సీ నియోజకవర్గాలు కాగా 12ఎస్టీ నియోజకవర్గాలున్నాయి. ఈ నియోజకవర్గాలలో బీజేపీ మొదటి నుంచి అంతంత మాత్రంగానే ఉంది. తొలుత ఈ నియోజకవర్గాలలో పట్టు సాధించాలని నిర్ణయించిన నాయకత్వం మిషన్‌ 19, మిషన్‌ 12…

Read More

సంచలనం కలిగించిన నెల్లూరు కోర్టులో ఓ కేసుకు సంబంధించిన కీలక సాధ్యధారాలు గల ఫైల్ చోరీ కేసుపై సిబిఐ విచారణకు తమకు అభ్యంతరం లేదని రాష్ట్ర హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం తెలిపింది. గతంలో తెలుగుదేశం నేత  సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విదేశాలలో అక్రమ ఆస్తులు సమకూర్చుకున్నారంటూ ప్రస్తుత మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తాను చేసిన ఆరోపణలకు కొన్ని `సాక్ష్యాధారాలు’ విడుదల చేశారు. అయితే అవి నకిలీ పత్రాలు అని తమ విచారణలో తెలినట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం ఆ కేసు విచారణకు వస్తున్న తరుణంలో మంత్రి సమర్పించిన ఆ `నకిలీ పత్రాలు’ అనూహ్యంగా చోరీకి గురికావడం కలకలం రేపింది. ఓ కోర్టులో దొంగలు పడటం, ఓ మంత్రిపై జరుగుతున్న కేసులోని సాక్ష్యాధారాలను మాత్రమే చోరీ జరగడం విస్మయం కలిగిస్తుంది. బహుశా దేశంలో మరెక్కడా ఇటువంటి సంఘటన జరిగి ఉండకపోవచ్చని భావిస్తున్నారు.  మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై టిడిపికి చెందిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి దాఖలు చేసిన ఫోర్జరీ కేసు పత్రాలు, ఆధారాలు నెల్లూరు కోర్టులో చోరీ…

Read More

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారంటూ కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి ఎట్టకేలకు తెరపడింది. గత ఏడాది కూడా ఇటువంటి ప్రచారం జరిగి, అర్ధాంతరంగా ముగియడం గమనార్హం. ఆ పార్టీని వారే బాగుచేసుకోవాలి అంటూ ఒక విధంగా తన నిస్సహాయతను కిషోర్ వ్యక్తం చేయడం గమనార్హం.   ‘సాధికారిత కమిటీలో భాగంగా పార్టీలో చేరాలని, 2024 పార్లమెంట్‌ ఎన్నికల బాధ్యతలు తీసుకోవాలని కాంగ్రెస్‌ ఇచ్చిన ఆఫర్‌ను తిరస్కరించాను. నా అభిప్రాయం ప్రకారం.. కాంగ్రెస్‌లో లోతుగా పాతుకుపోయిన నిర్మాణపరమైన సమస్యలను పరిష్కరించడానికి నా అవసరం కన్నా.. పార్టీకి నాయకత్వం, సమిష్టి సంకల్పం అవసరం’ అని ఈ సందర్భంగా  ఆయన పేర్కొనడం గమనార్హం.  వరుసగా కాంగ్రెస్ అగ్రనేతలతో జరిపిన భేటీలతో ఆయన విసుగు చెందారా? వారు పెట్టిన షరతులకు జంకారా? లేదా కిషోర్ పార్టీకి పట్ల గల `విధేయత’ పట్ల కాంగ్రెస్ నేతలే ఓ నిర్ధారణకు రాలేక పోయారా? అనే అనుమానాలు ఈ సందర్భంగా వ్యక్తం అవుతున్నాయి.  ఇతర పార్టీలతో పొత్తులు, అభ్యర్థుల…

Read More

దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాలు కాలిపోతుండడం, బ్యాటరీలు పేలిపోతుండడం.. పలువురు మృతి చెందుతుండడం, గాయపడుతున్న ఘటనలు కలవరపెడుతూ ఉండడంతో  మార్కెట్‌లో ఈ-బైకులు కొనేవాళ్ల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. దానితో భవిష్యత్తు అంతా ఈవీదే అనే నమ్మకంతో అడుగుపెట్టిన కంపెనీలకు ఈ పరిణామాలు మింగుడు పడనివ్వడం లేదు.   ఇటువంటి సంఘటనల కారణంగా వీటికి అడ్డుకట్ట వేయబోమని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టం చేశారు. అయితే వాటికి అవసరమైన భద్రతా చర్యలను ఆయా కంపెనీలే పారదర్శకంగా చేపట్టాలని ఆయన హితవు చెప్పారు. లోపాలున్న వాహనాలను తక్షణమే వెనక్కి తెప్పించుకోవాలని ఎలక్ట్రిక్‌ వాహనాల కంపెనీలను ఆయన కోరారు. అంతేకాదు. అయితే,  మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో వేడిమి వల్ల ఈవీ బ్యాటరీలకు సమస్య తలెత్తుతుందని ఆయన అంగీకరించారు. ‘దేశంలో ఈవీ పరిశ్రమ ఇప్పుడే మొదలైంది. కాబట్టి ప్రస్తుత పరిణామాల ఆధారంగా ప్రభుత్వం దీనికి అడ్డుకట్ట వేయాలనుకోవట్లేదు. ఈవీలను వాడుకంలోకి తేవాలన్నదే మా సంపూర్ణ లక్ష్యం’ అని స్పష్టం…

Read More

కర్నాటకలో సంచలన వివాదానికి దారితీసిన హిజాబ్‌ అంశాన్ని పరిశీలించేందుకు సుప్రీంకోర్టు సుముఖత వ్యక్తంచేసింది. కర్ణాటక హైకోర్టు తీర్పును సవాల్‌చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించేందుకు మంగళవారం అంగీకరించింది. పిటిషనర్లలో ఒకరి తరఫున సీనియర్‌ న్యాయవాది మీనాక్షి అరోరా ఈ విషయాన్ని సుప్రీం దృష్టికి తీసుకెళ్లారు.  ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం ఉందని సీజేఐ ఎన్‌వి రమణ, న్యాయమూర్తులు కృష్ణమురారి, హిమా కోహ్లితో కూడిన ధర్మాసనాన్ని కోరారు. దీనిపై సీజేఐ స్పందిస్తూ, ఈ పిటిషన్‌ను జాబితా చేస్తామని చెప్పారు. రెండు రోజులు వేచివుండాలని కోరారు.  రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 25 ప్రకారం హిజాబ్‌ ధరించడం తప్పనిసరి మతపరమైన ఆచారంలో భాగం కాదంటూ కర్ణాటక హైకోర్టు తీర్పు చెప్పింది. దీనిని సవాల్‌చేస్తూ సుప్రీంలో పిటిషన్లు దాఖలయ్యాయి. స్కూల్‌ యూనిఫాం ప్రిస్కిప్షన్‌ అనేది ఒక సహేతుకమైన పరిమితి మాత్రమేనని, రాజ్యాంగబద్ధంగా అనుమతించదగినదేనని, దీనికి విద్యార్థులు అభ్యంతరం చెప్పజాలరని హైకోర్టు పేర్కొంది. ఈ సందర్భంగా మతస్వేచ్ఛ, మనస్సాక్షి స్వేచ్ఛ అనే…

Read More

వైద్య సేవలు నగరాలకు, మరీ కేవలం హైదరాబాద్‌కే పరిమితం కావడం, పట్టణ జనాభా విపరీతంగా పెరగడంతో హైదరాబాద్‌లో ఉన్న ఆస్పత్రులలో సేవలు సరిపోవడం లేదని గుర్తించిన  ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు  వికేంద్రీకరణ దిశగా దృష్టి సారించారు. ఆ  మేరకు హైదరాబాద్‌ చుట్టూ మల్టిd సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల కల్పనకు నడుం బిగించారు.  వ్యాధులను త్వరితగతిన గుర్తించి ప్రివెంటివ్‌ చికిత్స కోసం, సూపర్‌ స్పెషాలిటీ వైద్యం కోసం ఇప్పటి వరకు తెలంగాణలో ప్రభుత్వ వ్యవస్థ పోవడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టారు. వైద్య సేవల్లో విప్లవాత్మక నిర్ణయంతో ఇప్పటికే కొనసాగుతూ వచ్చిన మూడంచెల సేవలను ఐదంచెల వ్యవస్థగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా వైద్య సేవల కల్పనకు సీఎం కేసీఆర్‌ మంగళవారం శంకుస్థాపనలు చేశారు. హైద‌రాబాద్ న‌గ‌రంలోని కొత్త‌పేట‌(ఎల్బీన‌గ‌ర్‌), ఎర్ర‌గ‌డ్డ చెస్ట్ హాస్పిట‌ల్ (స‌న‌త్ న‌గ‌ర్‌), అల్వాల్‌లో మ‌ల్టీ సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రుల‌కు భూమి పూజ‌ నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమలులో ఉన్న మూడంచెల వైద్య…

Read More