Author: Editor's Desk, Tattva News

షెహబాజ్ షరీఫ్‌ను పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఎన్నికవడంపై అభినందించిన రెండవ విదేశీ నాయకుడు (టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ తర్వాత) భారత ప్రధాని నరేంద్ర మోదీ. పాకిస్థాన్‌తో తీవ్రవాద రహిత సత్సంబంధాలను కోరుకొంటున్నట్లు తెలిపారు. అందుకు ప్రతిస్పందిస్తూ, ఈ ప్రాంతంలో శాంతి కోసం కాశ్మీర్ సమస్యకు పరిష్కారం అవసరమని షరీఫ్ పేర్కొన్నారు. భారత దేశంతో శాంతిని నెలకొల్పడానికి పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు జనరల్ కమర్ జావేద్ బజ్వా చేసిన నిరంతర ప్రయత్నాలకు మోదీ-షెహబాజ్ పరస్పర సందేశాలు తోడవుతున్నాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ కూడా భారత్‌తో సత్సంబంధాలు కోరుకున్నా భారత్, అమెరికాల పట్ల అనుసరించే విధానాల విషయంలోనే సైన్యం ఆగ్రహానికి గురయినట్లు తెలుస్తున్నది.  పాకిస్థాన్ లో చాలాకాలంగా రక్షణ, విదేశాంగ విధానాలను అక్కడి సైన్యమే నిర్దేశిస్తుంది. కేవలం సైన్యం మద్దతుతో అధికారంలోకి వచ్చిన ఇమ్రాన్ ఖాన్ ఈ విషయంలో సైన్యం విధానాలకు భిన్నంగా వ్యవహరిస్తూ వారి ఆగ్రహానికి గురికావడం, చివరకు పదవి పోగొట్టుకోవలసి రావడం జరిగిన్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు.  2019లో మధ్యవర్తుల ద్వారా పాకిస్థాన్ పర్యటన…

Read More

ఈ ఏడాది డిసెంబర్ లో  గుజరాత్‌లో అసెంబ్లి ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు  రాగానే, గుజరాత్ లో రెండు రోజులపాటు పర్యటించి, రోడ్ షో కూడా జరిపిన ప్రధాని ఇప్పుడు మరోసారి మూడు రోజులపాటు పర్యటిస్తున్నారు.  సోమవారం నుంచి మూడు రోజులపాటు ప్రధాని గుజరాత్‌లోని వివిధ జిల్లాల్లో పర్యటించనున్నారు. సోమవారం  సాయంత్రం గాంధీనగర్‌లోని కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (సీసీసీ)ను సందర్శిస్తారు. ఆ తరువాత మంగళవారం ఉదయం దేవదర్‌లో బనాస్‌ డెయిరీగా ప్రసిద్ధి చెందిన బనస్కాంత జిల్లా కో ఆపరేటివ్‌ మిల్క్‌ ప్రొడ్యూసర్స్‌ యూనియన్‌ లిమిటెడ్‌ క్యాంపస్‌కు శంకుస్థాపన చేస్తారు.  మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు జామ్‌నగర్‌లో.. వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌కు చెందిన గ్లోబల్‌ సెంటర్‌ ఫర్‌ ట్రేడిషనల్‌ మెడిసిన్‌ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం  డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌తో చర్చలు జరుపుతారు.  బుధవారం ఉదయం.. గ్లోబల్‌ ఆయూష్‌…

Read More

`ద క‌శ్మీర్ ఫైల్’ చిత్రం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ నుండి దేశ వ్యాప్తంగా అందరి ప్రశంసలు అందుకోవడమే కాకుండా ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సఫిస్ వద్ద బ్రహ్మాండమైన వసూళ్లు చేసిన దర్శకుడు వివేక్ రంజాన్ అగ్నిహోత్రి తన తదుపరి చిత్రం గురించి సోషల్ మీడియా ద్వారా ప్రకటన చేశారు. తన తర్వాత చిత్రం `ద ఢిల్లీ ఫైల్స్’ అని వెల్లడించారు. ద క‌శ్మీర్ ఫైల్స్ చిత్రంతో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న వివేక్‌… ద ఢిల్లీ ఫైల్స్ చిత్రంతో ఇంకే రేంజ్ లో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తారో అని బాలీవుడ్ సినీ ప్ర‌ముఖులు చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ట‌.  క‌శ్మీరీ పండిట్ల స‌మ‌స్య‌ల‌పై చిత్రం తీసిన వివేక్‌.. ద ఢిల్లీ ఫైల్స్ చిత్రంలో ఇంకే అంశాన్ని ఇతివృత్తంగా తీసుకుంటారోన‌న్న దానిపైనా ఆస‌క్తి నెల‌కొంది.  మ‌రి ఈ చిత్రం ద్వారా ఏం చెప్ప‌నున్నారో చూడాలి. మ‌రి ఈసారి ఢిల్లీలో ఏ సంఘ‌ట‌న‌ని ఆధారంగా చేసుకుంటాడో అని ఇప్ప‌టికే ప‌లువురు…

Read More

మంత్రి కేటీఆర్‌కు తొందర ఎక్కువైందని బీజేపీ ఎమ్మెల్యే ఎన్  రఘునందనరావు విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ పునాదులు కదులుతున్నాయన్న ఆందోళన  కేటీఆర్‌లో కన్పిస్తోందని ఎద్దేవా చేశారు.  సీఎం‌ కేసీఆర్ సంతకం వలనే కృష్ణా జిల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని విమర్శించారు.  290 టీఎంసీలకు కేసీఆర్ సంతకం పెట్టిన విషయం కేటీఆర్‌కు తెలియకపోవటం హాస్యాస్పదమని ధ్వజమెత్తారు. వాస్తవాలు బయటకు రాకూడదన్న ఉద్దేశంతోనే రిటైర్‌ అయి‌న అధికారులను  కొనసాగిస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.  నదీ జలాల పంపకంపై ప్రతినిధుల బృందం ఏర్పాటు చేయకుండా కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.  సుప్రీంకోర్టు కోర్టుకు వెళ్ళటం కారణంగానే కృష్ణా నదీజాలాల పంపకాల్లో జాప్యం జరిగిందని స్పష్టం చేశారు. ఎండుతోన్న పంటతో తెలంగాణ రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఉచిత విద్యుత్ పై క్షేత్రస్థాయిలో వాస్తవాలు భిన్నంగా ఉన్నాయని చెబుతూ ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు చెప్తోన్న టీఆర్ఎస్ పెద్దలు చర్చకు రావాలని  రఘునందనరావు సవాల్ విసిరారు.  గజ్వేల, సిద్ధిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లో మాత్రమే 24 గంటల…

Read More

బండి సంజయ్  ఇది ముమ్మాటికీ ప్రజా వంచన యాత్ర అని.. జుటాకోరు పార్టీ అధ్యక్షుడు చేస్తున్న దగాకోరు యాత్ర  అని మండిపడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు రాష్ట్ర ఐటి మంత్రి కెటి రామారావు బహిరంగ లేఖ వ్రాసారు. పాలమూరులో అడుగుపెట్టే హక్కు బండి సంజయ్ కు లేదని కెటిఆర్ హెచ్చరించారు.  కృష్టా జలాల్లో వాటా తేల్చకుండా జల దోపిడికి జై కొడతారా.? పాలమూరు రైతులకు ద్రోహం చేస్తూ యాత్రలు చేస్తారా? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్రలు చేసిన వాళ్లు.. ఇప్పుడు కపట యాత్రలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ‘‘పచ్చ బడుతున్న పాలమూరుపై కక్ష కట్టిన మీకు.. అక్కడ అడుగుబెట్టే హక్కులేదు. కృష్ణా జిలాల్లో తెలంగాణ వాటా తేల్చకుండా జలదోపిడికి జై కొడుతూ.. పాలమూరు రైతుకు ద్రోహం చేస్తున్న మీరు సిగ్గూ ఎగ్గూ లేకుండా యాత్రలు చేస్తారా?” అంటూ కేటీఆర్ నిలదీశారు. “…

Read More

ఇప్పటికే అనేక సమస్యలతో సతమతమవుతున్న కర్ణాటక బిజెపి ప్రభుత్వంకు ఓ సీనియర్ మంత్రి, తిరిగి ముఖ్యమంత్రి పదవి కోసం పోటీపడుతున్న కె ఎస్ ఈశ్వరప్పపై అవినీతి ఆరోపణలు చేసి సంతోష్ పటేల్ ఆత్మహత్యకు పాల్పడటం ఇరకాట పరిస్థితి సృష్టిస్తోంది. ఈ విషయమై ఈశ్వరప్ప ప్రతిపక్షాల ఆందోళనలు ఉధృతం అవుతూ ఉండడంతో తప్పక రాజీనామా చేయవలసి రావడంతో రాష్ట్రంలో బిజెపి ప్రతిష్ట అవినీతి మరక పెను సవాళ్లు ఎదుర్కొంటున్నది. రాజీనామా చేసే ప్రసక్తి లేదని ప్రకటించిన మరుసటి రోజే, గురువారం నాడు పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఈశ్వరప్ప రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా చేయాలన్న ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ఆదేశాల మేరకు రాజీనామా చేసినట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను శుక్రవారం ముఖ్యమంత్రికి అందజేస్తానని ఈశ్వరప్ప ప్రకటించారు. రాజీనామా చేసినా ప్రభుత్వంపై పడిన అవినీతి మరకను చెరిపేసుకోవడం అంత సులభం కాబోదు. రాజీనామా విషయంలో బిజెపి సత్వరం నిర్ణయం తీసుకోలేక పోవడంతో రాజకీయంగా ఆ పార్టీ కొంత మూల్యం చెల్లించుకోవలసి పరిస్థితి ఏర్పడింది.  …

Read More

కేసీఆర్​గడీలు బద్దలు కొడతాం, కుటుంబ పాలనను తరిమికొడతాం అంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ తన ప్రజా సంగ్రామ యాత్ర రెండో దశను గురువారం జోగులంబ అలంపూర్ నుండి ప్రారంభించారు. ప్రజాస్వామ్య తెలంగాణ సాధించేందుకే బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టిందని చెప్పారు. బీజేపీ అలా కాదని, అంబేద్కర్ జయంతి రోజే రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టామని చెప్పారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వచ్చాక అందరికీ ఉచిత విద్య, వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. ఐదో శక్తి పీఠమైన జోగులాంబ అమ్మవారి గుడి అభివృద్ధిని కేసీఆర్ విస్మరించాడని, ఆయనకు అమ్మవారంటే భయం లేదని సంజయ్ ధ్వజమెత్తారు. తొలిరోజు బండి సంజయ్​ నాలుగు కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఇమాంపూర్​ గ్రామానికి చేరుకున్నారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులో రాత్రి నిద్ర చేశారు.  అంతకు ముందు  జోగులాంబ అమ్మవారికి పూజలు చేసి అలంపూర్‌‌‌‌లో నిర్వహించిన బహిరంగ సభలో సంజయ్ మాట్లాడుతూ…

Read More

మరోకొద్దీ నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న గుజరాత్  లో కాంగ్రెస్ కుమ్ములాటలు శృతి మించుతున్నాయి. తనను పార్టీ నుండి బైటకు పంపలేక తనకు పొగ పెడుతున్నారని అంటూ ప్రముఖ పటిదార్ ఉద్యమ నాయకుడు, ప్రదేశ్ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు హార్దిక్ పటేల్ ధ్వజమెత్తారు.  తాను పార్టీలో ఉండగా, తనకు ఎటువంటి విలువ లేకుండా మరో ప్రముఖ్ పటిదార్ నేతను పార్టీలో చేర్చుకొని ప్రయత్నాల పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గుర్తింపు ఉన్న ఖొదాల్దమ్‌ టెంపుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ నరేష్‌ పటేల్‌ను పార్టీలో చేర్చుకోవడానికి కాంగ్రెస్‌ ప్రణాళికలు రూపొందిస్తోంది.  అదే జరిగితే ఇక పార్టీకి తన అవసరం ఉండకపోవచ్చని తన అసంతృప్తికి కారణాన్ని వెల్లడి చేశారు.  ‘‘2017లో మీరు హార్దిక్‌ని ఉపయోగించుకున్నారు. 2022 వచ్చేసరికి మీకు నరేష్‌ కావాల్సి వచ్చారు. 2027లో మరో పాటిదార్‌ నాయకుడు కోసం చూస్తారు. హార్దిక్‌ పటేల్‌నే శక్తిమంతుడిగా మీరు తయారు చెయ్యలేరా?’’ అంటూ అధిష్టానాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర పార్టీ నాయకులు…

Read More

దేశం లోని 14 మంది మాజీ ప్రధానులకు అంకితం చేసిన కొత్త మ్యూజియం “ప్రధాన మంత్రి సంగ్రహాలయ” ను గురువారం ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించారు. దాన్ని సందర్శించేందుకు తొలి ప్రవేశ టికెట్‌ను ఆయన కొనుగోలు చేశారు.  దేశ రాజధాని ఢిల్లీ లోని తీన్‌మూర్తి ఎస్టేట్‌లో ఈ మ్యూజియం ఉంది. అభివృద్ధి చెందుతోన్న భారత్‌ను ప్రతిబింబించేలా ఈ మ్యూజియంను రూపొందించారని అధికారులు తెలిపారు. 14 మంది ప్రధానుల గురించి వారి సేవల గురించి, వారు అనుసరించిన సిద్ధాంతాలు, ఇవన్నీ అవగాహన కల్పించేందుకు ఈ మ్యూజియాన్ని అభివృద్ధి చేశారు.  ఇదే సమయంలో స్వాతంత్య్ర పోరాట ఘట్టాలను కూడా తెలుసుకునే ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శన కోసం అధునాతన సాంకేతికతను వినియోగించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ మ్యూజియాన్ని ప్రధాని మోదీ  ప్రారంభించారు. ఇప్పటి వరకు భారత ప్రధానిగా పనిచేసిన వారందరికీ ఈ మ్యూజియంను గత ప్రధాన మంత్రులకు అంకితం చేశారు.  భారతదేశానికి ప్రధానమంత్రులుగా…

Read More

కర్ణాటక బేలూర్‌లోని చారిత్రాత్మక చెన్నకేశవ ఆలయంలో ఖురాన్ భాగాలను పఠించిన తర్వాత రథోత్సవాన్ని (రథోత్సవం) కొనసాగించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ ఆలయ అధికారులను ఆచరణను కొనసాగించడానికి అనుమతించింది. జిల్లా పోలీసుల కట్టుదిట్టమైన నిఘాలో వార్షిక వేడుకలు బుధవారం ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే ఉత్సవాలను తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి వందలాది మంది చెన్నకేశవ ఆలయానికి తరలివచ్చారు. ఖురాన్‌లోని ఆయత్ లను    చదవడం ఆనవాయితీ.   అయితే ఈ ఏడాది ముస్లిం వ్యాపారులు స్టాళ్లను ఏర్పాటు చేయకుండా ఆలయ అధికారులు నోటీసులు జారీ చేయడంతో గందరగోళం నెలకొంది.  అయితే, దేవాదాయ శాఖ వివిధ పూజారుల సూచనలను స్వీకరించింది,  సంప్రదాయాన్ని కొనసాగించాలని నిర్ణయించుకుందని దేవాదాయ శాఖ అధికారి ఒకరు తెలిపారు. సాంప్రదాయం ప్రకారం, చెన్నకేశవ ఆలయంలో వేడుకల ప్రారంభానికి గుర్తుగా ఒక మౌల్వీ ఖురాన్ ఆయత్ లను  చదువుతారు.  ఇటీవల, కర్నాటకలో మతపరమైన ఉద్రిక్తత పెరుగడంతో, హిందువుల పండుగలో పాల్గొనకుండా ముస్లిం వ్యాపారులను నిషేధించాలని…

Read More