ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల (పీపీపీ) భాగస్వామ్యంతో సివిల్ ఏవియేషన్ (ఏరోనాటికల్), ఫార్మసీ యూనివర్శిటీలని ఏర్పాటు చేయడానికి తెలంగాణ మంత్రివర్గం ఇటీవల నిర్ణయం తీసుకొంది. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) తరహాలో ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలుగా నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. సివిల్ ఏవియేషన్ విశ్వవిద్యాలయాన్ని బేగంపేటలోని పాత విమానాశ్రయంలో, ఫార్మసీ విశ్వవిద్యాలయాన్ని ఫార్మాసిటీ ఏర్పాటవుతున్న యాచారం, మహేశ్వరం ప్రాంతాల్లో ప్రారంభించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఫార్మసీ వర్శిటీ ఏర్పాటులో రాష్ట్రంలో పేరొందిన ఫార్మా కంపెనీలు హెటిరో డ్రగ్స్, రెడ్డీ ల్యాబ్స్, ఎంఎస్‌ఎన్ ఫార్మా, అరబిందో, లారస్ ల్యాబ్స్, దివిస్, భారత్ బయోటెక్, బయాలజికల్-ఈ వంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని, ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ వర్సిటీలో తరగతులు నిర్వహించేందుకు చర్యలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. బి.ఫార్మసీ, ఫార్మా-డి కోర్సులతో పాటు ఫార్మా కంపెనీలకు అవసరమైన సాంకేతిక నిపుణులను అందించేందుకు అవసరమైన కోర్సులు సిద్ధం చేసి ఈ ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయంలో ప్రారంభించాలని…
Author: Editor's Desk, Tattva News
దేశంలోనే పెద్దపులులకు ఆవాస కేంద్రమైన నల్లమల్ల అటవీ ప్రాంతంలో పెద్దపులులతో పాటు వన్యప్రాణులు వేసవి వచ్చిందంటే దాహార్తితో అలమటిస్తుంటాయి. ముందస్తుగానే అటవీశాఖ అధికారులు నామ మాత్రపు చర్యలు చేపట్టి వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నా ప్రయోజనం ఉండడం లేదు. అభయారణ్యంలో ఉండాల్సిన పెద్దపులి దాహం తీర్చుకునేందుకు జనావాసంలోకి వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు అటవీశాఖ నిధులను ఎంత ఖర్చు చేస్తుంది అనే లెక్కల్లో నేటికీ స్పష్టత లేదు. కేంద్ర ప్రభుత్వం దేశంలో పెద్ద పులుల సంరక్షణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నల్లమల అటవీ ప్రాంతంలోని నాగార్జునసాగర్.. శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యంగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా పరిచయమైన ఈ శాంచారి నల్లమల సొంతం. వాస్తవంగా ఇక్కడ పెద్దపులుల సంతతి తగ్గిపోతుండగా.. ప్రతి సంవత్సరం అటవీశాఖ అధికారులు పులుల లెక్కింపు చేస్తారు. వేసవిలో పెద్ద పులుల మనుగడ దినదినగండంగా మారుతోంది. అడవుల్లో నీటి లభ్యత ఆవాసాలు…
రష్యా యుద్ధ నౌక.. మిస్సైల్ క్రూయిజర్ మాస్క్‌వా తీవ్ర స్థాయిలో ధ్వంసమైంది. నల్ల సముద్రంలో ఉన్న రష్యా నౌకా దళానికి చెందిన యుద్ధ నౌక మాస్క్‌వాపై భారీ పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఆ క్రూయిజ్ నౌకను తామే నెప్ట్యూన్ మిస్సైల్స్‌తో పేల్చినట్లు ఉక్రెయిన్ చెబుతోంది. ఆ యుద్ధ నౌకలో సుమారు 510 మంది సిబ్బంది ఉన్నారని, వారిని రష్యా రక్షించలేకపోయినట్లు ఉక్రెయిన్ తెలిపింది. బ్లాక్ సీలోని స్నేక్ ఐలాండ్ వద్ద ఉన్న మాస్క్‌వా క్రూయిజ్ నౌకపై దాడి జరిగినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. కానీ ఆ నౌకలో పేలుడు జరిగినట్లు రష్యా చెబుతోంది. దానిలో ఉన్న సిబ్బంది ఆ యుద్ధనౌకను వదిలి వెళ్లినట్లు రష్యా అంగీకరించింది. యుద్ధ నౌకలో మందుగుండు సామగ్రి పేలడంతో ఈ ప్రమాదం జరిగిందని రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. పేలుడుకి గల కారణాలపై దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపింది. సిబ్బంది మాత్రం సురక్షితంగా బయటపడినట్లు వెల్లడించింది. అయితే రష్యా యుద్ధనౌకపై తామే…
తాను పదవిలో లేకపోతేనే చాలా ప్రమాదకరం అంటూ పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఇప్పుడు పదవి లేదని, తాను మరింత ప్రమాదకరంగా మారుతానని హెచ్చరించారు. అధికారం కోల్పోయిన అనంతరం మొదటిసారిగా పెషావర్‌లో బహిరంగ సమావేశంలో పాల్గొన్నారు. తాను ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రమాదకారిని కాదని, కానీ ఇప్పుడు మరింత ప్రమాదకారిగా మారుతానని స్పష్టం చేశారు. దేశంలో తమ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ప్రతిపక్ష పార్టీల సహాయంతో విదేశీ శక్తులు కుట్ర పన్నినట్లు ఇమ్రాన్ ఖాన్ పునరుద్ఘాటించారు. ఆదివారం నుండి ప్రారంభమైన ర్యాలీలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకున్న ప్రభుత్వాన్ని తాము అంగీకరించబోమని స్పష్టంచేశారు. ఈ చర్యకు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించడం ద్వారా ప్రజల తమ వైఖరిని తెలిపారని పేర్కొన్నారు. ప్రతిసారీ ఒక ప్రధాన మంత్రిని తొలగించినప్పుడు ప్రజలు పండగ జరుపుకుంటారు కానీ తనను పదవి నుండి తొలగిస్తే ప్రజలు నిరసనలు…
తెలుగు అలయెన్సెస్ అఫ్ కెనడా (తాకా) ఆధ్వర్యంలో శ్రీ సీతారామ కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. టొరంటోలోని శృంగేరి విద్యా భారతి ఫౌండేషన్ ఆడిటోరియంలో దాదాపు 600 మందికి పైగా భక్తులు హాజరవ్వగా, మేళతాళాలు, కూచిపూడి నాట్యము, పాటలు, భజనలతో అత్యంత వైభవంగా శ్రీ సీతారాముల వారి కళ్యాణం జరిగింది. ఆదివారం, ఏప్రిల్ 10 వ తేదీ ఉదయం 9 గంటలకు కల్యాణోత్సవాలు ప్రారంభమయ్యాయి. తాకా అధ్యక్షులు కల్పన మోటూరి, కార్యవర సభ్యులు, ట్రస్టీలు, వ్యవస్థాపక సభ్యులు ఉదయము 6 గంటలకు వేడుక వద్దకు చేరుకొని .. పూజా కార్యక్రమాల కోసం అన్నింటిని సిద్ధం చేశారు. ఇందులో తాకా యువ కార్యకర్తలు సాయం అందించారు. టొరంటోలోని ప్రముఖ అర్ఛకులు మంజునాథ్ సిద్ధాంతి, వారి శిష్య బృందంతో సుప్రభాత సేవ, అభిషేకం, షోడశోపచార పూజలతో స్వామి వారి కల్యాణాన్ని మొదలు పెట్టి, తలంబ్రాలు తదితర క్రతువులతో కార్యక్రమాన్నిముగించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు…
• 131వ జన్మదిన నివాళి మనం ప్రజాస్వామ్యాన్ని కేవలం రూపంలోనే కాకుండా, వాస్తవానికి కూడా కొనసాగించాలనుకుంటే, మనం ఏమి చేయాలి? నా దృష్టిలో మనం చేయవలసిన మొదటి విషయం ఏమిటంటే, మన సామాజిక, ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి రాజ్యాంగ పద్ధతులను గట్టిగా పట్టుకోవడం. విప్లవం, రక్తపాత పద్ధతులను మనం వదిలివేయాలి. శాసనోల్లంఘన, సహాయనిరాకరణ, సత్యాగ్రహం అనే పద్ధతిని విడనాడాలి. ఆర్థిక, సామాజిక లక్ష్యాలను సాధించడానికి రాజ్యాంగ పద్ధతులకు మార్గం లేనప్పుడు, రాజ్యాంగ విరుద్ధ పద్ధతులకు చాలా సమర్థన ఉంటుంది. కానీ రాజ్యాంగ పద్ధతులు అందుబాటులో ఉన్న చోట, ఈ రాజ్యాంగ విరుద్ధ పద్ధతులకు ఎటువంటి అవసరం ఉండదు. ఈ పద్ధతులు అరాచకత్వానికి సంబంధించిన వ్యాకరణం తప్ప మరేమీ కాదు. వాటిని ఎంత త్వరగా వదిలివేస్తే అంత మంచిది. “మనం చేయవలసిన రెండవ విషయం ఏమిటంటే, ప్రజాస్వామ్య పరిరక్షణపై ఆసక్తి ఉన్న వారందరికీ జాన్ స్టువర్ట్ మిల్ ఇచ్చిన హెచ్చరికను గమనించడం. అంటే “ఒక…
తెలంగాణాలో విశేష ప్రాముఖ్యత గల ప్రాణహిత పుష్కరాలపై కేసీఆర్ ప్రభుత్వం చేతులెత్తేసింది. పుష్కర స్నానాలకు వచ్చే లక్షలాది భక్తుల సౌకర్యాల గురించి అసలేమీ పట్టించుకోలేదు. ఏప్రిల్ 13న సదా, సీదాగా జిల్లాలోని చెన్నూర్ నియోజకవర్గం అర్జునగుట్టలో దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి బుధవారం ప్రాణహిత పుష్కరాలను ప్రారంభించారు. ఏప్రిల్ 13 నుండి 24 వరకు జరిగే ఈ పుష్కారాలకోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిన్నల్టు మంత్రి ప్రకటించినా, కనీసం గత పుష్కరాల సమయంలో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం కట్టిన పుష్కరఘాట్లనైనా మెరుగులు దిద్దే పనే చేయలేదు. పుష్కర ఏర్పాట్లకోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా కేటాయించలేదు. కాళేశ్వరంలో పుణ్యస్నానాలకు వచ్చే భక్తులను మహారాష్ట్రలోని సిరొంచకు తీసుకెళ్లేందుకు పది బస్సులు పెట్టింది. దీంతో కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించాలని భావించిన భక్తులకు నిరాశ తప్పడం లేదు. వాళ్లంతా పొరుగు రాష్ట్రానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవంక, మహారాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్లతో సిరొంచలో ఏర్పాట్లు ఘనంగా చేసింది. ప్రాణహిత నీళ్లపై ఆధారపడి లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన రాష్ట్ర సర్కారు.. అదే ప్రాణహితకు పుష్కరాలను…
నూజివీడు నియోజకవర్గంలోని ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం పోరస్ కెమికల్ ఫ్యాక్టరీకి బుధవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గత రాత్రి 11 గంటల సమయంలో ఫ్యాక్టరీ ఆవరణలోని యూనిట్ 4 లో భారీ శబ్దంతో మంటలు చెలరేగి ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా.. పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై గవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన కుటుంబాలకు రూ. 25 లక్షల చొ ప్పున, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 5 లక్షలు, గాయపడిన వారికి రూ. 2 లక్షలను సిఎం పరిహారంగా ప్రకటించారు. ఈ సంఘటనపై పూర్తి దర్యాప్తు చేయవల్సిందిగా జిల్లా కలెక్టర్ ను, ఎస్పీని ఆదేశించారు. 40 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఫ్యాక్టరీలో 150 మంది షిఫ్ట్ డ్యూటీ లో ఉన్నట్ల్లు సమాచారం. అయితే ప్రమాదం జరిగిన బ్లాక్ లో 30 మంది పని చేస్తున్నట్లు తెలుస్తోంది.…
అధ్యక్ష కార్యాలయాన్ని ముట్టడించిన ఆందోళనకారులతో సమావేశం కావడానికి శ్రీలంక ప్రధాని మహిందా రాజపక్సా ముందుకొచ్చారు. దేశ ఆర్థిక, సామాజిక, రాజకీయ వ్యవస్థల ఇబ్బందులను పరిష్కరించడానికి వారికి గల ఆలోచనలు ఏంటో వినడానికి తాను సిద్ధంగా వున్నానని చెప్పారు. ప్రధాని సోదరుడు అధ్యక్షుడు రాజపక్సా రాజీనామాను డిమాండ్ చేస్తూ ఆందోళనకారులు వరుసగా ఐదో రోజూ కార్యాలయాన్ని ముట్టడించారు. అవినీతి, తప్పుడు పాలన వల్లనే ఈ పరిస్థితి దాపురించిందంటూ మొత్తంగా వారి కుటుంబం అధికారం నుండి వైదొలగాలని కోరుతున్నారు. కాగా ప్రధాని చేసిన ఆఫర్‌ను కొంతమంది ఆందోళనకారులు తిరస్కరించారు. దేశంలోని మెజారిటీ ప్రజలు తిరస్కరిస్తున్న సమయంలో అనుభవజ్ఞుడైన రాజకీయ నేత మొత్తంగా గద్దె దిగడానికి చూడాలి కానీ చర్చలు జరిపేందుకు సిద్ధపడకూడదని ఉపాధ్యాయుడైన నువాన్ కాలురచి వ్యాఖ్యానించారు. మొత్తంగా రాజపక్సా కుటుంబం అధికారాన్ని వీడాలన్నది ఈ దేశ ప్రజల ఏకగ్రీవ డిమాండ్ అని స్పష్టం చేశారు. ఇదిలావుండగా, శ్రీలంక విదేశీ రుణాలను భరించలేనిదిగా అంతర్జాతీయ…
బ్రిటన్ ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో నమోదవుతోంది. గత 30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా గత నెల్లో వినిమయ ధరలు పెరిగాయి. ఇంధన, మోటారు ఇంధనాలకు అవుతున్న ఖర్చులు పెరగడంతో వాటి ప్రభావం నిత్యావసరాలపై పడింది. ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మార్చితో ముగిసిన గత 12మాసాల కాలంలో బ్రిటన్‌లో ద్రవ్యోల్బణం 7శాతానికి చేరింది. 1992 మార్చి తర్వాత ఇంత అధికం వుండడం ఇదే ప్రధమమని జాతీయ గణాంక విభాగ కార్యాలయం తెలిపింది. ఇంధన వ్యయం పెరగడం, ఆహార ధరలు ఆకాశాన్నంటడం, అధిక పన్నులు ఇవన్నీ కలిసి పెరిగిన వేతనాల ప్రభావాన్ని కప్పిపుచ్చుతున్నాయి. పైగా 1950వ దశకం తర్వాత ప్రజల జీవన ప్రమాణాలు ఇంతలా దిగజారడం కూడా ఇదే కానుంది. కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. దాన్నుండి పూర్తిగా తేరుకోకముందే ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధం పరిస్థితులను మరింత దిగజార్చింది. ఈ యుద్ధ కారణంగా ఇంధన…