కర్ణాటకలో కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ మృతి రాజకీయ కలకలం రేపుతోంది.ఈ కేసులో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కెఎస్ ఈశ్వరప్పతోపాటు ఆయన సహాయకులు బసవరాజ్, రమేష్ లపై పోలీసులు బుధవారంనాడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో మొదటి నిందితుడిగా ఆయన పేరు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పాటిల్ ను మంత్రి, ఆయన అనుచారులు లంచం అడగాడం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని థాని సోదరుడు ప్రశాంత్ పాటిల్ ఆరోపించారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు మంత్రి ఈశ్వరప్ప, ఆయన ఇద్దరు అనుచరులపై కేసు నమోదు చేసుకొని వేగవంతంగా దర్యాప్తు చేస్తున్నారు. హిండలగ గ్రామంలో రూ.4 కోట్లు విలువచేసే పనులను తన సోదరుడు చేశాడని, ఆ పనులకు సొంత డబ్బులు ఖర్చు చేయగా, బిల్లులు పెండింగ్‌లో ఉంచారని ఆయన తెలిపారు. సొమ్ములు విడుదల చేయాలని ఈశ్వరప్పను పలుమార్లు సంతోష్ కలిసి విజ్ఞప్తి చేశారని, అయితే ఆయన సహచరులైన బసవరాజ్, రమేష్‌లు 40 శాతం కమిషన్…
Author: Editor's Desk, Tattva News
స్పైస్‌జెట్‌కు చెందిన బోయింగ్ 737 మాక్స్ విమానాలను నడుపుతున్న 90 మంది పైలట్లపై ఏవియేషన్ రెగ్యులేటరీ డిజిసిఎ నిషేధం విధించింది. వీరికి సరిగ్గా శిక్షణ ఇవ్వలేదని గుర్తించడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ‘ప్రస్తుతానికి మేము ఈ పైలట్లను బోయింగ్ విమానాలు నడపకుండా నిరోధించాం. వీరంతా మరోసారి శిక్షణ పొంది విమానాలను నడపవచ్చు’ అని డిజిసిఎ చీఫ్ అరుణ్ కుమార్ ప్రకటనలో తెలిపారు. లోపానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. దీంతో పైలట్లు మ్యాక్స్ సిమ్యులేటర్‌పై సరైన పద్ధతిలో మరోసారి శిక్షణ తీసుకోవలసి ఉంటుంది. 2019లో ఆడిస్ అబాబా సమీపంలో ఇధియోపియన్ ఎయిర్‌లైన్స్ 737 బోయింగ్ విమానం కూలి, నలుగురు భారతీయులతో సహా 157 మంది మరణించారు. అనంతరం వీటిపై నిషేధం విధించింది. అమెరికాకు చెందిన విమానాల తయారీ సంస్థ బోయింగ్ విమానంలో అవసరమైన సాఫ్ట్‌వేర్ దిద్దుబాట్లపై డిజిసిఎ సంతృప్తి చెందడంతో గత ఏడాది ఆగస్టులో విమానాలపై…
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యల కేసులను ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టేసింది. రెండు కేసుల్లో అక్బరుద్దీన్ ఒవైసీ నిర్దోషి అని తేల్చింది కోర్టు. అయితే విద్వేష పూరిత ప్రసంగం మళ్లీ చేయరాదని హెచ్చరించింది. కేసులు కొట్టేసినంత మాత్రాన సంబరాలు చేస్కోవద్దని కోర్టు స్పష్టం చేసింది. పదేళ్ల క్రితం ఎంఐఎం సభలో అక్బర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘మీరు వంద కోట్ల మంది అయితే మేము కేవలం పాతిక కోట్లు మాత్రమే.. ఓ 15 నిముషాలు మాకు అప్పగించండి.. ఎవరు ఎక్కువో, తక్కువో చూపిస్తామంటూ వ్యాఖ్యానించారు.’ ఈ కేసును సుదీర్ఘంగా విచారించిన నాంపల్లి కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. ఎలాంటి ఆధారాలు పోలీసులు సమర్పించక పోవడం వల్లే కోర్టు కేసును కొట్టేసిందని అక్బరుద్దీన్ తరపు న్యాయవాది తెలిపారు. అయితే సుదీర్ఘ విచారణలో 38 మంది సాక్షులను విచారించిన కోర్టు ఎస్ఎఫ్ఎల్ రిపోర్టు ను సైతం పరిశీలించినట్లు తెలుస్తోంది. నిజామాబాద్, నిర్మల్ జిల్లాలో పదేళ్ల కింద అక్బరుద్దీన్ చేసిన…
తనను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు `దత్తపుత్రుడు’ అని విమర్శించడం పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నన్ను ఇంకోసారి సీబీఎన్ (చంద్రబాబునాయుడు నారా) దత్తపుత్రుడని విమర్శిస్తే… వైసీపీ అగ్రనాయకత్వాన్ని నేను సీబీఐ దత్తపుత్రులని పిలుస్తాను. టీడీపీ-బీ టీమ్.. జనసేన అని వారు మాట్లాడితే.. వారిని చర్లపల్లి జైలు షటిల్ టీమ్ అంటాను’’ అని హెచ్చరించారు. జగన్ పాలనలో ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ 7 లక్షల చొప్పున సహాయం అందించాలని డిమాండ్ చేసిన ఆయన తమ పార్టీ తరపున రూ 1 లక్ష చొప్పున సహాయం అందించనున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఆ మేరకు మంగళవారం పుట్టపర్తి మండలం కొత్తచెరువులోని బాధిత కౌలురైతు సాకే రామకృష్ణ నివాసానికి చేరుకొని, పిల్లల చదువుల బాధ్యత జనసేన తీసుకుంటుందని ఆత్మస్థైర్యాన్ని నింపి, రూ.లక్ష చెక్కును ఆ కుటుంబానికి అందజేశారు. అక్కడి నుంచి…
కేంద్రంలో పూర్తిగా రైతు వ్యతిరేక ప్రభుత్వం ఉందని మండి పడుతూ తెలంగాణాలో ప్రతి గింజను తామే కొటామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రకటించారు. మంగళవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడుతూ కేంద్రం పంట కొనడం చేతకాక తెలివి తక్కువ మెలికలు పెడుతుందని ధ్వజమెత్తారు. వ్యవసాయాన్ని కార్పోరేట్లకు అప్పగించాలని కేంద్రం కుట్ర చేస్తుందని ఆరోపించారు. యాసంగిలో పండిన వడ్లు కొనుగోలు చేయబోమని కేంద్రం చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కెసిఆర్ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మే 20 నుంచి జూన్ 5 వరకు మరోసారి ఉద్ధృతంగా పల్లెప్రగతి, పట్టణప్రగతి నిర్వహిస్తామని పేర్కొన్నారు.మద్దతు ధర ప్రకారం క్వింటాల్ ధాన్యానికి రూ.1,960 చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రతి ఊరిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రైతులు తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవద్దని ఆయన రైతులను కోరారు. ధాన్యం డబ్బులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. మూడు,…
అందరూ అనుమానిస్తున్నట్లే పంజాబ్ లోని ఆప్ ప్రభుత్వంపై `రిమోట్ కంట్రోల్’ ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చేతిలో ఉన్నట్లు వివాదం చెలరేగింది. పంజాబ్ విద్యుత్ శాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించడం వివాదాస్పదంగా మారింది. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ లేకుండానే ఈ సమావేశం జరగడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఆయన ఓ రిమోట్ కంట్రోల్ అంటూ విరుచుకు పడుతున్నాయి. పంజాబ్ లో 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ పంజాబ్ స్టేట్ పవర్ కార్పోరేషన్ లిమిటెడ్ (పిఎస్‌పిఎల్) ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విద్యుత్ శాఖ కార్యదర్శి సైతం పాల్గొన్నారు. పంజాబ్ రిమోట్ కంట్రోల్ ఢిల్లీ చేతుల్లో ఉందంటూ కాంగ్రెస్, అకాలీదళ్ పార్టీలు విమర్శించాయి. సిఎం భగవంత్ మాన్ గైర్హాజరవుతారని తెలిసినా ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ ఐఎఎస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. పేరుకే…
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ, తాజాగా జరిగిన శాసనమండలి ఎన్నికల్లో సైతం తిరుగులేని ఆధిక్యత కనబరిచింది. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో మాత్రం బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఇక్కడ, స్వతంత్ర అభ్యర్థి అన్నపూర్ణ సింగ్.. సమీప బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించారు. యూపీ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లోని లోకల్ అథారిటీ ఏరియాలోని 36 స్థానాల్లో 33 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఈ భారీ విజయంతో యూపీ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో బీజేపీకి పూర్తి మెజారిటీ సొంతమైంది. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీపై బీజేపీ స్పష్టమైన అధిక్యతను సంపాదించింది. ఈ ఎన్నికల్లో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు కూడా గెలుపొందారు. 36 యూపీ ఎమ్మెల్సీ స్థానాల్లో మొదటనే 9 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 27 శాసనమండలి స్థానాల్లో మొత్తం 95 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ భారీ గెలుపు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్…
అంతర్జాతీయ మార్కెట్ తో పోటీ పడేలా భారతీయ వస్త్ర పరిశ్రమను తీర్చిదిద్దాల్సిన అవసరముందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. మన సంప్రదాయ శక్తి సామర్థ్యాలకు పదునుపెడుతూ, ఆధునిక పద్ధతులను అవలంబిస్తూ ప్రపంచ వస్త్ర పరిశ్రమలో మనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకునేలా భారతీయ వస్త్ర పరిశ్రమ దూసుకెళ్లాలని ఆయన ఆకాంక్షించారు. భారతదేశంలో వ్యవసాయం తర్వాత వస్త్ర పరిశ్రమ రెండో అతిపెద్ద ఉపాధికల్పన రంగంగా ఉందన్న విషయాన్ని ఉపరాష్ట్రపతి ప్రస్తావిస్తూ ఈ రంగంలో సాంకేతికత వినియోగాన్ని పెంచడంతోపాటు కార్మికుల నైపుణ్యానికి మరింత పదును పెట్టడం, చిరు వ్యాపారులకు, చిరు ఉత్పత్తిదారులకు ఆర్థికంగా, ఇతర అవసరాలకు అనుగుణంగా మద్దతుగా నిలవడం వంటివి మన వస్త్ర పరిశ్రమ రంగాన్ని అనుకున్న లక్ష్యాలకు తీసుకెళ్లగలవని తెలిపారు. వివిధ రకాల పత్తి రకాలను అభివృద్ధిచేయడంతోపాటు ఎక్స్ ట్రా లాంగ్ స్టేపుల్, సేంద్రియ పత్తి వంటి వాటికి ప్రోత్సాహాన్ని అందించాలని పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ టెక్స్…
మేక్ ఇన్ ఇండియాకు ఊతం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుతం స్థానిక తయారు రంగానికి భారత్ పెద్ద ఎత్తున రాయితీలు కల్పిస్తున్నది. పీఎల్‌ఐ స్కీంలో భాగంగా.. చిన్న చిన్న కంపెనీలను ఆర్థికంగా ఆదుకుంటున్నది. 2020, ఏప్రిల్ నుంచి ఎలక్ట్రానిక్ గూడ్స్‌తో పాటు ఐటీ హార్డ్‌వేర్‌లు స్థానికంగా రూపొందిస్తున్నారు. దీంతో గడిచిన ఐదేళ్లలో చూసుకుంటే.. ఉత్పత్తిలో గణనీయ వృద్ధి సాధించారు. అదేవిధంగా ఎగుమతులు భారీగా పెరిగాయి. ఎలక్ట్రానిక్, ఐటీ మంత్రిత శాఖ తెలిపిన అధికారిక గణాంకాల ప్రకారం.. 2016-17 నుంచి 2020-21 మధ్య కాలంలో ఎలక్ట్రానిక్ వస్తువుల ఎగుమతిలో 104 శాతం వృద్ధి సాధించింది. ఇదే కాలంలో ఈ వస్తువుల తయారీ.. 74.7 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. 2016-17లో భారత్ నుంచి ఎగుమతి అయిన ఎలక్ట్రానిక్ గూడ్స్ విలువ రూ.39,980 కోట్లు ఉంటే 2020-21 నాటికి.. 104 శాతం పెరిగి.. రూ.81,948 కోట్లకు చేరుకుంది. 2016-17లో భారత్ రూ.3,17,331 కోట్లు విలువ చేసే ఎలక్ట్రానిక్ గూడ్స్‌ను ఉత్పత్తి చేసింది.…
దేశంలో ఎక్కడున్నా భారత్‌యేనని, ఉత్తరాది మాత్రమే భారతదేశం కాదని ప్రముఖ సంగీత దర్శకుడు ఎఆర్ రెహ్మాన్ స్పష్టం చేశారు. చెన్నై నగరంలో సిఐఐ ఆధ్వర్యంలో దక్షిణ్ పేరిట నిర్వహించిన ‘సౌత్ ఇండియా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్’ లో రెహ్మాన్‌ను ‘ది ఐకాన్’ పురస్కారంతో సత్కరించారు.ఈ సందర్భంగా ఎఆర్ రెహ్మాన్ మాట్లాడుతూ ఏడేళ్ల కిందట మలేషియా వెళ్లగా తనతో ఓ చైనీయుడు ఉత్తర భారతదేశం బాగుంటుందని చెప్పారని, వారి చిత్రాలను ఇష్టపడి చూస్తానని చెప్పినట్లు తెలిపారు. ఆ మాటలు విని ఆయన దక్షిణ భారతదేశ చిత్రాలు చూశారా? అనే ప్రశ్న తనకు కలిగిందని పేర్కొన్నారు. తమిళ చిత్రాల మాదిరిగానే మలయాళం, ఇతర చిత్రాలు కూడా ఉంటాయని తెలిపారు. దేశంలో ఎక్కడున్నా భారత్‌యేనని, అందులో ఉత్తర, దక్షిణ అని వేర్వేరుగా లేవని చెప్పారు. దక్షిణ భారతదేశ చిత్రాల్లో నల్లగా ఉండేవారికి ఉత్తమ, బలమైన కథాపాత్రలు ఇవ్వాలని, అందరికీ మన రంగే ఇష్టమని తెలిపారు. తమిళమే…