ప్రపంచ దేశాల ఐక్యవేదిక ఐక్యరాజ్య సమితిలో రష్యా భారీ షాక్ తగిలింది. మానవ హక్కుల మండలి నుంచి రష్యాను తొలగిస్తున్నట్లు ప్రకటించింది ఐక్యరాజ్య సమితి. శాశ్వత సభ్యత్వం హోదా ఉన్న దేశం ఒకటి ఇలా ఒక ఉన్నత మండలి నుంచి సస్పెండ్‌కు గురికావడం ఇదే తొలిసారి. ఉక్రెయిన్ బుచా పట్టణంలో మారణహోమం సృష్టించిందన్న నెపంతో రష్యాను మండలి నుంచి తొలగించాలంటూ అమెరికా గురువారం ఈ ప్రతిపాదన తీసుకొచ్చింది. ఉక్రెయిన్ ఈ ప్రతిపాదనను సమర్థించింది. బుచాలో నరమేధానికి తెగబడ్డ రష్యా.. యుద్ధ నేరాలతో ఇప్పటికే శాంతి స్థాపనకు విఘాతం కలిగించిందని.. అలాంటి దేశానికి మండలిలో కొనసాగే అర్హత లేదంటూ తీర్మానాన్ని ప్రవేశపెట్టే సమయంలో వాదించింది అమెరికా. ఈ పరిణామంపై ఉక్రెయిన్ హర్షం వ్యక్తం చేసింది. రష్యాను మానవ హక్కుల మండలి నుంచి తొలగించడాన్ని గొప్ప చర్యగా అభివర్ణించింది. రష్యాకు ఈ మండలిలో కొనసాగే అర్హత ఏమాత్రం లేదంటూ సాధారణ అసెంబ్లీలో ఉక్రెయిన్ ప్రతినిధి వాదించారు. ‘‘మానవ హక్కులను కాపాడే లక్ష్యంతో ఉన్న…
Author: Editor's Desk, Tattva News
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఓ దొంగల ముఠా అని, దొంగల ముఠా హైదరాబాద్‌లో ఉంటూ వైసిపి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఆవిర్భావం అనంతరం తొలిసారి పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో గురువారం ఆయన పర్యటించిన సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ వాళ్లంతా మనుషుల రూపంలో ఉన్న దెయ్యాలని ధ్వజమెత్తారు. చంద్రబాబు గతంలో ఎపిని దోచుకుని అప్పులపాలు చేశారని దుయ్యబట్టారు. రెండు రోజుల క్రితం తాను ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్నప్పుడు ఆయన తనకు క్లాస్ ఇచ్చారని ప్రచారం చేస్తున్నారని అంటూ విస్మయం వ్యక్తం చేశారు. తాను ప్రధాని మాత్రమే ఆ గదిలో ఉన్నామని చెబుతూ వీళ్లు ఆ గాడిలో సోఫా కింద ఉండి విన్నారా? అని ఎద్దేవా చేశారు. మారీచులు, రాక్షసులతో యుద్ధం చేస్తున్నామని, ఎల్లో మీడియా ముసుగులో ఉన్నవారంతా…
ఎన్నుకోబడిన ప్రభుత్వం చేపట్టవలసిన రాజకీయంగా సున్నితమైన అంశాలపై నిర్ణయం తీసుకునే బాధ్యత సుప్రీంకోర్టుపై మోపడంపై భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ గురువారం వేదన వ్యక్తం చేశారు. “మీరు ప్రస్తావించిన అన్ని విషయాలను స్వీకరించడానికి నేను అంగీకరిస్తేల కోరిన ఉత్తర్వులను ఆమోదించవలసి ఉంటే, రాజకీయ ప్రతినిధులను ఏ ఉద్దేశ్యంతో ఎన్నుకుంటారు?… లోక్‌సభ… రాజ్యసభ ఏమి చేయాలి?”, అని సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ ప్రశ్నించారు. ఇప్పుడు కోర్టులు బిల్లులను కూడా ఆమోదింప వలసి వస్తుందని విస్మయం వ్యక్తం చేశారు. అక్రమ వలసదారులందరినీ ఏడాదిలోగా గుర్తించి, నిర్బంధించి, బహిష్కరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ప్రార్థనతో అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్‌కి ఆయన ఈ ప్రశ్నను వేశారు. జనవరి 31, 2018న, ఆయన పిటిషన్‌ను ఇద్దరు రోహింగ్యా శరణార్థులు సెప్టెంబర్ 2017లో దాఖలు చేసిన మరో పిటిషన్‌తో ట్యాగ్ చేయాలని కోర్టు ఆదేశించింది. దాని కాపీని కేంద్ర ప్రభుత్వ న్యాయవాదికి అందించాలని ఆదేశించింది.…
గత రెండు సంవత్సరాలుగా పైగా యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు కోట్లాది మంది బలయ్యారు. ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే కరోనా సోకిన తర్వాత చాలామంది పలు ఇతర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆరు నెలల తర్వాత కూడా వైరస్ ప్రభావం శరీరంపై ఉంటుందని పరిశోధకులు కనుగొన్నారు. ముఖ్యంగా శరీరంలో సిరల్లో ప్రవహించే రక్తం గడ్డకడుతుందని బ్రిటీష్ మెడికల్ జర్నల్ (బిఎంజి) అధ్యయనం వెల్లడించింది. అలాగే వైరస్ సోకిన వారికి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా వైరస్ సోకిన కొంతమందిలో మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు కాలి నరాల్లో, ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకడుతుందని, ఆ తర్వాత రక్తస్రావమవుతుందని పరిశోధకులు గుర్తించారు. రెండు మూడు దశల్లో కంటే మొదటి దశలో కోవిడ్ బారిన పడిన వారికే అధిక ప్రమాదముందని వారు గుర్తించారు. అయితే టీకా వేసుకున్న వారికి ప్రమాదం తక్కువగా ఉంటుందని, టీకా అధిక…
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ బుధవారంనాడు కలుసుకోవడం రాజకీయ కలకలం రేపుతున్నది. పార్లమెంట్‌లో ఉభయులూ సుమారు 20 నుంచి 25 నిమిషాల పాటు సమావేశమయ్యారు. దీంతో వీరి సమావేశం వెనుక కారణం ఏమై ఉండవచ్చనేది ప్రధానంగా మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. శివసేన కీలక నేత సంజయ్ రౌత్ ఆస్తులను ఈడీ జప్తు చేయగానే, ఈడీ అధికారులపై తలెత్తిన అవినీతి ఆరోపణలపై మహారాష్ట్ర ప్రభుత్వం సిట్ ను నియమిస్తున్నట్లు ప్రకటించిన మరుసటి రోజుననే ఈ సమావేశం జరగడం గమనార్హం. పైగా, మహారాష్ట్ర మజీ హోంమంత్రి, ఎన్‌సీపీ నేత అనిల్ దేశ్‌ముఖ్‌ను బుధవారం ఉదయం సీబీఐ కస్టడీలోకి తీసుకుంది. మహారాష్ట్రలోని అధికార మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) నేతలపై, ముఖ్యంగా ఎన్‌సీపీ, శివసేన నేతలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరెక్టరేట్ (ఈడీ) వరుస దాడులకు పాల్పడుతుండంతో మోదీని పవార్ కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, సంజయ్ రౌత్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తీసుకున్న చర్య ‘అన్యాయం’ అని శరద్…
రానున్న కాలంలో ఆర్‌ఎస్‌ఎస్, బిజెపిని ఒంటరి చేసి ఓడించాలని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ పిలుపిచ్చారు. కేరళలోని కన్నూర్ లో సిపిఎం 23వ అఖిల భారత మహా సభల సందర్భంగా ఆయన ప్రారంభ ఉపన్యాసం చేస్తూ ఆర్‌ఎస్‌ఎస్, బిజెపిని ఓడించేందుకు వామపక్ష ప్రజాతంత్ర శక్తులన్నీ ఐక్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్, బిజెపిని ఒక్క రాజకీయ రంగాల్లోనే కాకుండా, సైద్ధాంతిక, సాంస్కృతిక, సామాజిక రంగాల్లో ఒంటరిని చేయాలని దిశానిర్ధేశం చేశారు. అందుకోసం తీసుకోవాల్సిన చర్యలపై ఈ 23వ పార్టీ మహా సభల్లో చర్చిస్తామని చెప్పారు. హిందూత్వ ఎజెండాకు వ్యతిరేకంగా పోరాటాలను బలపరిచే విధంగా.. మహాసభ నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. దేశంలో లౌకికత్వ పరిరక్షణ కోసం ఉధృతంగా.. రాజీలేని పోరాటాలు చేయటం ద్వారానే హిందూ మతోన్మాదానికి అడ్డుకట్ట వేయగలమని ఏచూరి స్పష్టం చేశారు. ఆ పోరాటాలకు సిపిఎం, వామపక్షాలు నాయకత్వ పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. వామపక్షాల నాయకత్వంతో కూడిన అలాంటి పోరాటాలే మతోన్మాదానికి…
తెలంగాణ ప్రభుత్వానికి, రాష్ట్ర గవర్నర్‌కు మధ్య చెలరేగిన ప్రోటోకాల్ వివాదం ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు చేరింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వం ప్రొటోకాల్ పాటించడంలేదంటూ ప్రధానికి గవర్నర్ డా. తమిళి సై సౌందరరాజన్ ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. గవర్నర్ కార్యాలయ ఆదేశాలకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు స్పందించడంలేదని, ఉద్దేశపూర్వకంగానే అలా వ్యవహరిస్తున్నారని పిఎం దృష్టికి ఆమె తీసుకెళ్లారు. బుధవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ గవర్నర్ భేటీఅయి రాష్ట్రంలోని తాజా పరిణామాలను ఆయనకు వివరించారు. సాంకేతిక కారణాల సాకుతో బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ ప్రసంగంలేకుండా చేశారని, ప్రభుత్వ కార్యక్రమాల్లో రాజ్‌భవన్ ప్రమేయం ఉండకూడదనే విధంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వ్యవహరిస్తున్నారని ఆమె ఫిర్యాదు చేశారు. ప్రధానంగా సిఎస్, సీనియర్ ఐఎఎస్‌లు కొంతమంది సహకరించడంలేదని ప్రధానికి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తున్నది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ వైఖరిపై కూడా ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు.…
భారతీయ జనతాపార్టీ దేశభక్తికి అంకితమైతే, ప్రత్యర్ధి పార్టీలు బంధుప్రీతికి మొగ్గు చూపుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అయితే ప్రజాస్వామ్యానికి వంశపాలన పార్టీలు ప్రధానశత్రువులని క్రమంగా ప్రజలు తెలుసుకున్నారని ప్రధాని తెలిపారు. భారతీయ జనతా పార్టీ 42వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం మోదీ పార్టీ కార్యకర్తలతో వర్చ్యువల్ గా మాట్లాడుతూ వంశపాలన పార్టీలు రాజ్యాంగ నిబంధనలపై తక్కువ గౌరవ భావం కలిగి కుటుంబ పాలనకే అంకితమయ్యారని ఆరోపించారు. వివిధ రాష్ట్రాల్లో అవి చురుకుగా ఉన్నప్పటికీ, అవినీతి, ఇతర దుశ్చర్యలు పరస్పరం కప్పిపుచ్చుకొంటుంటాయని వ్యాఖ్యానించారు. రష్యాఉక్రెయిన్ సంక్షోభం గురించి మాట్లాడుతూ ఈ సమయంలో ప్రపంచం మొత్తం రెండు వర్గాలుగా విడిపోయినప్పటికీ, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని భారత్ ఎటువంటి ఒత్తిడులకు తలొగ్గకుండా అంతర్జాతీయ సమాజం ముందు దృఢంగా నిల్చుందని పేర్కొన్నారు. రాజకీయ ప్రత్యర్ధులను లక్షంగా చేసుకుని మాట్లాడుతూ ఈ పార్టీలు జాతీయ స్థాయిలో లేదా రాష్ట్రస్థాయిలో అధికారం లోకి రాడానికి క్రియాశీలకంగా వ్యవహరిస్తుంటాయని విమర్శించారు. కొన్ని…
ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన వైద్య విద్యార్థుల భవితవ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వారి చదువు కొనసాగింపుకు భరోసా ఇస్తూ విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ లోక్‌సభలో కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌లోని పరిస్థితులుపై లోక్‌సభలో చర్చ సందర్భంగా జైశంకర్ మాట్లాడుతూ విదేశీ విద్యార్థులకు సడలింపు ఇచ్చేందుకు ఉక్రెయిన్ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. భారత విద్యార్థులను అకామిడేట్ చేయడానికి.. హంగరీ, పొలాండ్, చెక్ రిపబ్లిక్ సహా పలు దేశాలతో కేంద్రం చర్చలు జరుపుతోందని వివరించారు. రష్యా సైనిక చర్య నేపథ్యంలో అత్యంత క్లిష్టపరిస్థితుల్లో ఉక్రెయిన్ నుంచి కేంద్రప్రభుత్వం భారతీయులను తరలించింది. ఆపరేషన్ గంగ ద్వారా దాదాపు 25వేల మంది భారతీయ విద్యార్థులు, పౌరులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చింది. అయితే మెడికల్ స్టూడెంట్స్ చదువు అర్థాంతరంగా ఆగిపోవడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులను భారతీయ వైద్య కళాశాలల్లో అకామిడేట్ చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సహా పలు పార్టీలు పార్లమెంట్‌లో కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. కాగా, శాంతి, అహింసే భారత విధానమని…
‘బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని కేసీఆర్ స్వయంగా కేంద్రానికి లేఖ రాసి, రైతుల్ని నట్టేట ముంచాడని విమర్శిస్తూ కేసీఆర్ సంతకం రైతులకు మరణశాసనమైందని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. యాసంగిలో బాయిల్డ్ రైస్ వస్తుందని తెలిసి కూడా కేంద్రానికి బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని ఎలా లేఖ రాశారు? అంటూ ఆమె ప్రశ్నించారు. ఆమె చేపట్టిన ‘ప్రజా ప్రస్థానం’ యాత్ర 47వ రోజు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తాళ్ల చెరువు గ్రామంలో కొనసాగుతోంది. కూసుమంచి మండలం పెద్దపోచారం గ్రామంలోని రైతు వేదిక దగ్గర… యాసంగి వడ్లను కేసీఆర్ కొనాలని డిమాండ్ చేస్తూ ధర్నాలో పాల్గొన్నారు. 80 వేల పుస్తకాలు చదివిన అపరమేధావికి ఈ విషయం తెలియదా? అంటూ ఆమె ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. కేసీఆర్ లేఖ వల్లనే కేంద్రం వడ్లు కొనమని చెబుతోందని పేర్కొంటూ, అందువల్ల కేసీఆరే వడ్లన్నీకొనుగోలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. వరి వేసుకునే హక్కు…