అత్యంత వేగంగా నడిచే బులెట్ రైళ్ల కోసం తెలుగు రాష్ట్రాల నుండి కేంద్రంపై డిమాండ్లు పెరుగుతున్నాయి. తాజాగా విజయవాడ – హైదరాబాద్ మధ్య బులెట్ రైలు నడపాలని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమకుమార్ రెడ్డి పార్లమెంట్ లో కోరారు. ఈ రెండు ప్రధాన నగరాలను బుల్లెట్ ట్రైన్ ద్వారా కలపడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. దీంతో పాటు హైదరాబాద్ నుంచి బెంగళూరు, ముంబయి వంటి మెట్రో నగరాలను కలుపుతూ.. బుల్లెట్ ట్రైన్స్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విభజన చట్టంలోని హామీ అయిన రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కనెక్టివిటీని పెంచాలన్న ప్రతిపాదన ఇంకా నెరవేరలేదని గుర్తు చేసారు. దేశంలోని ప్రధాన నగరాలైన బెంగళూరు, విజయవాడ,. ముంబయి ప్రాంతాలు హైదరాబాద్‌తో కనెక్ట్ చేసే విధంగా బుల్లెట్ రైలు లేదా హైస్పీడ్ ట్రైన్ సదుపాయాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఎనిమదేళ్ల క్రితం 2014లో చేసిన ‘ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం’లో ఇచ్చిన హామీ మేరకు ఖాజీపేటలో…
Author: Editor's Desk, Tattva News
ఉక్రెయిన్ పై 20 రోజులుగా భీకర యుద్ధం చేస్తున్న రష్యా ఆ దేశ సైన్యం, స్థానిక ప్రజల నుండి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్నా వెనుకడుగు వేయడం లేదు. అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు కఠినమైన ఆర్ధిక ఆంక్షలు విధంచడంతో దేశం అనూహ్యమైన ఆర్ధిక సంక్షోభం ఎదుర్కొనే పరిస్థితులు ఎదురవుతున్నా బెదరడం లేదు. అయితే వనరుల కొరత కారణంగా త్వరలో యుద్ధం ఆపక తప్పదని సైనిక నిపుణులు భావిస్తున్నారు. కీవ్‌లోరష్యా దళాలు పూర్తి పోరాట సామర్థ్యాన్ని మరో “10 నుండి 14” రోజులు మాత్రమే కొనసాగించగలవని సీనియర్ యుకె రక్షణ వర్గాలు భావిస్తుండగా, వారు తీవ్రమైన వనరుల కొరత ఎదుర్కొంటున్నారని అమెరికా సైనిక నిపుణులు పేర్కొంటున్నారు. రెండు వారాలయితే ఇప్పటికే తమ స్వాధీనంలోకి వచ్చిన ప్రాంతాలను కట్టడి చేసుకోవడానికే సంఖ్యా పరంగా రష్యా సైనికులకు కష్టం కాగలదని యుకె నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కీవ్‌లో మాస్కో “పరుగులో ఉంది”, రష్యన్ సైన్యం ఇప్పటికే తమ సామర్ధ్యాన్ని “గరిష్టం”గా ఉపయో గించినదని చెబుతూ…
తమిళనాడులో బలం పుంజుకోవాలని చేస్తున్న రకరకాల ప్రయోగాలు బెడిసి కొడుతూ ఉండడంతో తాజాగా మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చలి జయలలితను దగ్గరకు తీస్తున్నట్లు తెలుస్తున్నది. ఆమెకు అన్నాడీఎంకేను హస్తగతం చేసుకునేందుకు సహకరించడం ద్వారా రాజకీయంగా చైతన్యవంతమైన ఈ దక్షిణాది రాష్ట్రంపై పట్టు పెంచుకోవాలని చూస్తున్నట్లు చెబుతున్నారు. తనపై ఉన్న బహిష్కరణకు తొలగించి, తిరిగి తనను పార్టీలో చేర్చుకోవాలని ఆమె ఎంతగా వత్తిడి తెస్తున్నా ఆ పార్టీలో ఈపీఎస్ వర్గం అన్నివిధాలా అడ్డుకొంటున్నది. దానితో అన్నాడీఎంకే సమన్వయకర్త ఒ.పన్నీర్‌సెల్వంకు, ఈపీఎస్ ల మధ్య అగాధం పెంచి, తనను ఆహ్వానించకుండా తప్పని పరిస్థితులు ఏర్పడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా పన్నీర్‌సెల్వం సోదరుడు రాజా ఆమెను రెండు సార్లు కలుసుకొని పార్టీ నుండి బహిష్కరణకు గురయ్యారు. వాస్తవానికి జయలలిత మృతి చెందిన వేంటనే ఆ పార్టీని హస్తగతం చేసుకొనే ప్రయత్నం బిజెపి చేసింది. ముఖ్యమంత్రి పదవి కోసం ఆ పార్టీ రెండుగా చీలిన సమయంలో, బిజెపి మద్దతుతోనే ఈపీఎస్ నిలదొక్కుకోవడం, ఆ రెండు వర్గాల మధ్య బిజెపినే సయోధ్య కుదర్చడం జరిగింది. జైలు శిక్ష పూర్తిచేసుకొని రాగానే పార్టీలోకి రావాలని…
వైసిపి వ్యతిరేక ఓట్ చీలకుండా ఏపీలో కూటమి ఏర్పాటు చేయబోతున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ 9వ ఆవిర్భావ దినం సందర్భంగా మంగళగిరి సమీపంలో జరిపిన భారీ బహిరంగ సభలో వెల్లడించడం రాష్ట్ర రాజకీయాలలో కలకలం రేపుతున్నది. ముఖ్యంగా అధికార పక్షంలో ఒకవిధమైన ప్రకంపనలు రేపుతున్నట్లు కనిపిస్తున్నది. గత రెండు రోజులుగా ఏపీ అసెంబ్లీ లాబీలలో మంత్రులు, అధికార పార్టీ ఎమ్యెల్యేలు ఈ విషయం గురించే మాట్లాడుకోంటుకోవడం కనిపిస్తున్నది. శాసనమండలి వద్ద ఎదురు పడిన ఇద్దరు బిజెపి సభ్యులను కొందరు మంత్రులు ఈ విషయమై ఆరా కూడా తీశారు. మరోవంక, టిడిపి, బిజెపి తిరిగి కలవబోతున్నట్లు పవన్ కళ్యాణ్ సంకేతం ఇవ్వడంతో వైసిపి నేతలతో పాటు వామపక్షాలు, కాంగ్రెస్ నేతలు కూడా పవన్ పై విరుచుకు పడ్డారు. ఆ రెండు పార్టీల చేతులలో `ఆటబొమ్మగా’ మారాదంటూ విమర్శలు కురిపించారు. అయితే ఈ ప్రకటనపై టిడిపి, బిజెపి నేతలు మాత్రం మౌనం పాటించడం…
ఇప్పటి వరకు కాంగ్రెస్ లో నాయకత్వంలో సంస్కరణలు అంటూ పార్టీ అధిష్ఠానంపై తిరుగుబాటు చేస్తున్న జి-23 నేతలు కేవలం రాహుల్ గాంధీ నాయకత్వంపైననే అసమ్మతి వ్యక్తం చేస్తుండగా, మొదటిసారిగా మొత్తం గాంధీ కుటుంభం నాయకత్వం నుండి తప్పుకొంటేనే పార్టీకి రాజకీయంగా మనుగడ ఉంటుందనే వాఖ్యలు చేయడం ప్రారంభించారు. పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబాల్ మొదటిసారిగా మొత్తం గాంధీ కుటుంబంపై దాడి చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాతైనా పార్టీ నాయకత్వ మార్పునకు ‘గాంధీలు’ నడుం బింగించాలని ఆయన పిలుపిచ్చారు. పార్టీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీనే కొనసాగించడంపై కాంగ్రెస్ కార్యకర్తలు సంతోషంగా లేరని ఆయన ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో స్పష్టం చేశారు. ఎన్నో ఏళ్ల చారిత్రక నేపథ్యం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఊహింని విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రలోనూ సరియైన మెజార్టీతో గెలవలేక పోవడంతో గత ఆదివారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఐదు గంటల పాటు పెద్ద సమావేశమైనా పార్టీలో కీలక సంస్కరణల గురించి…
నిరుద్యోగుల ఆత్మహత్యలకు కేసీఆర్‌దే బాధ్యత అని వైఎస్ఆర్ టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే సీఎంలో చలనం కూడా లేదని, దున్నపోతు మీద వాన కురిసినట్టు కెసిఆర్ ఉన్నారని ఆమె ధ్వజమెత్తారు. యాదాద్రి భువనగిరి జిల్లా – వలిగొండ మండలం గోల్నేపల్లి పరిధిలోని బూర్లగడ్డలో మంగళవారం షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష చేబడుతూ ఎప్పటికప్పుడు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వాల్సి ఉండేదని పేర్కొన్నారు. ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ఇంత మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకునేవారా? అంటూ ఆమె నాయకుడికి ముందు చూపు ఉండాలని చెబుతూ ఎంత మంది రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు? ఎన్ని ఉద్యోగాలు అవసరం అవుతాయి? ఎంతమందికి స్వయం ఉపాధికి లోన్లు ఇవ్వాలి? ఎంత మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ? ఇలా అన్ని విషయాలు తెలియాలని హితవు చెప్పారు. ఇన్నేళ్లకు 80 వేల ఉద్యోగాలు భర్తీ…
అప్రజాస్వామికంగా తెలంగాణ అసెంబ్లీ నుండి బీజేపీ ఎమ్మెల్యేలను సభను సస్పెండ్ చేసినందుకు నిరసనగా ఈ నెల 17న ఇందిరా పార్క్ దగ్గర రాజ్యంగ పరిరక్షణ దీక్ష చేపట్టనున్నట్లు బిజెపి ఎమ్యెల్యే, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు. ఆ రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష చేపడుతామని, ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ చట్ట సభ్యులు, జిల్లా నేతలు, పార్టీ ప్రతిధులంతా పాల్గొంటారని ఈటల తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలైన తొలి రోజునే సభ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు రాజా సింగ్, రఘునందర్ రావు, ఈటల రాజేందర్- ముగ్గురినీ స్పీకర్ సస్పెండ్ చేశారు. వారు సభలో నిరసన తెలుపగా,ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తున్నట్లు ఆదేశించారు. దీంతో వారు తమను సభలోకి అనుమతించేలా స్పీకర్ కు సూచించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు ధర్మాసనం స్పీకర్ ను…
అప్పులను అప్పుగా చూడొద్దని, వనరుల సమీకరణగా చూడాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సూచించారు. .అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా వివరణ ఇస్తూ అప్పుల్లో మన రాష్ట్రం దేశంలో 25వ స్థానంలో ఉందని చెప్పారు. ఆర్థిక క్రమశిక్షణను కఠినంగా పాటిస్తున్నామని స్పష్టం చేశారు. మనకంటే ఎక్కువ అప్పులు చేస్తున్న రాష్ట్రాలు చాలానే ఉన్నాయని పేర్కొన్నారు. మన అప్పుల శాతం 23 శాతమేనని చెబుతూ ప్రస్తుతం భారత దేశ అప్పు రూ 152 లక్షల కోట్లు అని తెలిపారు. బడ్జెట్ పై ప్రతిపక్షాలు విమర్శించడం సహజమేనని చెబుతూ బడ్జెట్ అంటే అంకెలు మాత్రమే కాదని, బడ్జెట్ అంటే బ్రహ్మపదార్థం అన్నట్లు భావిస్తున్నారని పేర్కొన్నారు. పూర్తి పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నామని చెబుతూ రాష్ట్రాల ఉనికి లేకుండా చేస్తాం..రాష్ట్రాలను అణిచివేస్తామనే దుర్మార్గ వైఖరితో కేంద్రం ఉందని కేసీఆర్ మండిపడ్డారు. కేంద్రం ఇష్టమున్నట్లు నిధుల సమీకరణ చేసుకుంటుందని అంటూ రాష్ట్రాలకు ఇచ్చే నీతినే కేంద్రం పాటించాలని స్పష్టం చేశారు.…
ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలలో పాలుపంచుకోబోమని యూనివర్శిటీ విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుండి రాతపూర్వక హామీ పత్రం తీసుకోవాల్సిందిగా యూపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. క్యాంపస్ ఆవరణలో గాని లేదా వెలుపల గాని ఎటువంటి దేశ వ్యతిరేక, సామాజిక వ్యతిరేక కార్యకలాపాలలో భాగస్వాములంకామని, అలాంటి కార్యక్రమాలకు మద్దతు ఇవ్వమని, ప్రచారం చేయబోమని సంతకం చేయించుకున్నట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుండి వచ్చిన ఆదేశాలను తాము అమలు చేయనున్నట్లు బెన్నెట్ యూనివర్శిటీ ప్రకటించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుండి వచ్చిన ఆదేశాల మేరకు మీరు అదనపు బాధ్యతను తీసుకోవాలని, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంతకం చేసిన ఫారమ్‌ను జత చేయాలని ఈ నెల 14న విద్యార్థులకు పంపిన మెయిల్‌లో పేర్కొంది. యుపిలోని గ్రేటర్ నొయిడాలో 2016లో ప్రారంభించడిన బెన్నెట్ యూనివర్శిటీలో 2500 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. చట్ట విరుద్ధమైన సమావేశాలు, నిరసనలు, ఆందోళనలను దేశ వ్యతిరేక కార్యకలాపాలుగా పరిగణించనున్నట్లు తెలిపింది. అంటే కేంద్రంలోని మోడీ…
తెలంగాణ ఆర్థిక స్థితి గతులపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరళ్ (కాగ్) రూపొందించిన నివేదికను రాష్ట్రప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది. 2019-20 ఏడాదికి సంబంధించిన ఆర్థిక పరిస్థితులపై నివేదికలో కాగ్ పేర్కొంది. ఐదేళ్లలో తొలిసారిగా రాష్ట్రం రెవెన్యూ మిగులు సాధించలేదని..ద్రవ్యలోటులో 97 శాతం మార్కెట్ రుణాల ద్వారా వచ్చిందని తెలిపింది. అయితే ప్రభుత్వం చేస్తున్న అప్పులపై కాగ్ అభ్యంతరం వ్యక్తంచేసింది. తీసుకుంటున్న అప్పులు ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో ఉన్నా బడ్జెటేతర అప్పులు పరిమితికి మించి ఉన్నాయని తెలిపింది. 2019-20లో ప్రభుత్వం తీసుకున్న రుణంలో.. 75 శాతం 2018-19లో తీసుకున్న అప్పులు చెల్లించేందుకే సరిపోయిందని కాగ్ రిపోర్టు తెలిపింది, 2019-20 బడ్జెట్ వాస్తవానికి దగ్గరగా లేదని తేల్చిచెప్పింది,. బడ్జెట్ పర్యవేక్షణలో సర్కారుకు నియంత్రణ లేదని స్పష్టంచేసింది. కొన్ని కేటాయింపులు అసెంబ్లీ ఆమోదం లేకుండానే ఖర్చు చేశారని, కొన్ని శాఖల్లో మిగులు బడ్జెట్ ను తగిన సమయంలో తిరిగి చెల్లించలేదంది. వివిధ శాఖల్లో పదేపదే మిగులు బడ్జెట్ ఏర్పడినా సంబంధిత శాఖలను హెచ్చరించలేదని…