కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆ పార్టీ కీలక నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ సహా పలువురు రాజకీయ నాయకులకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 2020లో ఈశాన్య ఢిల్లీలో సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన హిందూ వ్యతిరేక అల్లర్లకు మందు వీరు విద్వేషపూరిత ప్రసంగాలు చేశారనే ఆరోపణలపై హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. వీటిని విచారించిన కోర్టు వారికి సోమవారం నోటీసులు జారీ చేసింది. అలాగే ఆప్ నేతలు మనీష్ సిసోడియా, అమానతుల్లా ఖాన్, ఎంఐఎం నేతలు వారిస్ పఠాన్, అక్బరుద్దీన్ ఒవైసీ, మహమూద్ ప్రాచా, హర్ష్ మందర్, నటి స్వర భాస్కర్, తదితరులకు కూడా నోటీసులు ఇచ్చింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పైనా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేందుకు ఆదేశాలివ్వాలని కూడా ఆ పిటిషన్‌లో కోరారు. మరో ప్రత్యేక పిటిషన్‌లో బీజేపీ నేతలు కపిల్ మిశ్రా, అనురాగ్ ఠాకూర్, పర్వేశ్‌వర్మ, అభయ్ వర్మలపై కూడా ఎఫ్‌ఐఆర్ నమోదు…
Author: Editor's Desk, Tattva News
జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అకస్మాత్తుగా సోమవారం రాత్రి బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకోవడం రాజకీయ వర్గాలలో ఆసక్తి కలిగిస్తున్నది. వచ్చే సోమవారం నుండి అసెంబ్లీ బడ్జెట్రు సమావేశాలు ఉండగా, పార్లమెంట్ సమావేశాలు లేని సమయంలో ఢిల్లీ వెళ్లడం వెనుక ఎజెండా బిజెపి వ్యతిరేక కూటమి ఏర్పాటు కోసం వివిధ పార్టీల నేతలతో సమాలోచనలకే అనే అభిప్రాయం కలుగుతున్నది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో రెండు రోజుల పాటు సుదీర్ఘంగా సమాలోచనలు జరిపిన మరుసటి రోజే ఆయన ఢిల్లీకి చేరుకోవడం గమనార్హం. ప్రశాంత్ కిషోర్ సూచనల మేరకు, ఆయన నిర్ణయించిన అప్పాయింట్మెంట్ ల ప్రకారం కొందరు నేతలను కలిసే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. మూడు రోజుల పాటు ఆయన అక్కడే ఉంటారని తెలుస్తోంది. ఈ సందర్భంగా ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులతో పాటు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్యనేతలను కలిసే…
కొంత కాలంగా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై రాజకీయ దాడులను తీవ్రతరం చేయడమే కాదు, జాతీయ స్థాయిలో బీజేపీయేతర పక్షాలను సమీకరించే ప్రయత్నం చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఇప్పుడు రాష్ట్ర గవర్నర్ డా. తమిళశై సౌందరరాజన్ పై దిక్కారధోరణి వ్యక్తం చేస్తున్నారు. బహుశా స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలను ఏప్రిల్ 7 నుండి జరపడానికి సిద్దపడుతున్నారు. గణతంత్రవేడుకలను రాజ్‌భవన్‌కే పరిమితం చేయడం, ప్రభుత్వం తరఫున మంత్రులెవరూ ఆ కార్యక్రమానికి హాజరు కాకపోవడం, ఆ తర్వాత మేడారంలో గవర్నర్‌కు ప్రొటోకాల్ పాటించలేదన్న వివాదాల నేపథ్యంలో ఇప్పుడు గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు జరపాలని కేసీఆర్ నిర్ణయించారు. బడ్జెట్ సమావేశాల నిర్వహణపై సోమవారం అత్యున్నత అధికార సమావేశం నిర్వహించారు. కేసీఆర్ వ్యవహారం చూస్తుంటే కేంద్రంపై ప్రారంభించిన రాజకీయ పోరాటం దృష్ట్యా గవర్నర్ ను రాష్ట్రంలో నిమిత్తమాత్రురాలిని చేసే ప్రయత్నం కనిపిస్తున్నది. గవర్నర్ ఎక్కడ మాట్లాడినా ప్రధాని నరేంద్ర మోదీని, కేంద్ర ప్రభుత్వం పనితీరును పొగడ్తలతో ముంచెత్తడమే…
ఉక్రెయిన్ పై ఈ నెల 24న అకస్మాత్తుగా యుద్ధం ప్రకటించి, ఆ దేశ రాజధాని కీవ్ వరకూ చొచ్చుకెళ్లిన రష్యా సోమవారం తమ దాడి తీవ్రతను, వేగాన్ని తగ్గించింది. గత వారం రోజులుగా సాగుతున్న రష్యా భీకర దాడిని ఉక్రెయిన్ సైనిక దళాలు వీరోచితంగా ప్రతిఘటించి రష్యా దళాలను ముందుకు సాగదీయడం లేదు. కీవ్ నగరానికి ఉత్తరాన 30 కిమీ దూరంలో రష్యాసాయుధ దళాలు మోహరించి ఉన్నాయని, వాటిని ఉక్రెయిన్ దళాలు ధైర్యంగా ప్రతిఘటిస్తున్నాయని బ్రిటన్ రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. రెండు, మూడు రోజులలో ఉక్రెయిన్ కాళ్లబేరానికి రాగలదని ఆశించిన రష్యాకు ఒక విధంగా అసహనంగా ఉన్నట్లు కనిపిస్తున్నది. ఒక వైపు ఉక్రెయిన్ బలగాలు రష్యా సైన్యంపై క్షిపణులు, యుద్ధ ట్యాంకర్లతో దాడి చేస్తుంటే.. మరోవైపు ఉక్రెయిన్ ప్రజలు సైతం ఒక్కో యోధుడిలా తిరగబడుతున్నారు. ఆడామగ, చిన్నా పెద్ద అన్న భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఆయుధాలను చేపట్టి.. దేశాన్ని, రాజధాని నగరాన్ని కాపాడుకునేందుకు పోరాటం…
విదేశాల్లో వైద్య విద్య అభ్యాసనకు జాతీయ వైద్య మండలి(ఎన్‌ఎంసీ) నిబంధనలు మరింత కఠినతరం చేస్తోంది. ప్రస్తుతం మన దేశంలో వైద్య విద్యకు నీట్ పరీక్ష అర్హత ఆధారంగా అడ్మిషన్లు కేటాయించడం, ఎన్‌ఎంసీ నిర్దేశించిన విధానంలో పరీక్షల నిర్వహణతో ముగుస్తుంది. అయితే విదేశాల్లో ఎలాంటి నిబంధనలు లేకుండా ఫీజు ఆధారంగా సీట్లు పొంది కోర్సు పూర్తి చేస్తున్నారు. తాజాగా ఉక్రెయిన్‌లో వైద్య విద్యను అభ్యసిస్తున్న వేల మంది భారతీయ విద్యార్థులు యుద్ధం కారణంగా స్వదేశానికి తిరిగి వస్తున్నారు. అయితే భారత్‌లో కంటే అత్యంత సులువైన పద్ధతితో విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దీంతో విదేశాల్లో ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేసే వారికి కొన్ని నిబంధనలు తీసుకొచ్చేందుకు జాతీయ వైద్య మండలి ప్రత్యేక కసరత్తు చేస్తోంది. ఇప్పటికే కొన్ని రకాల నిబంధనలు ఉన్నా వాటిని మరింత లోతుగా అధ్యయనం చేస్తూ కొత్తగా మార్గదర్శకాలను రూపొందించాలని నిర్ణయించింది. ఎంబీబీఎస్ కోర్సును కనీసం…
జీతాలు పెంచాలని తాము కోరడం లేదని, ప్రస్తుతం ఉను జీతాలను తగ్గించవద్దని మాత్రమే విజ్ఞప్తి చేస్తున్నామని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల వేదిక స్పష్టం చేసింది. ఈ మేరకు వేదిక నాయకులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఏడు ప్రధాన సమస్యలను ప్రస్తావించిన ఈ లేఖను జోసఫ్ సుధీర్‌బాబు, రఘునాథరెడ్డి, కెఎస్‌ఎస్ ప్రసాదు, నక్కా వెంకటేశ్వర్లు, జి.హృదయరాజు, భానుమూర్తి, కులశేఖరరెడ్డి, గణపతిరావు, శౌరిరాయలు, సాల్మన్‌రాజు, అశోక్ కుమార్ సోమవారం విడుదల చేశారు. మంత్రుల కమిటీతో పిఆర్‌సి పై జరిగిన చర్చల ఒప్పందాలకు సంబంధించి హామీల మేరకు జిఓలు విడుదల చేయాలని లేఖలో కోరారు. ఫిట్‌మెంట్ 27 శాతం ప్రకటించాలని డిమాండ్ చేశారు. పిఆర్‌సిపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు అభిప్రాయాలు తెలుసుకునేందుకు నిర్వహించిన ఓపెన్ బ్యాలెట్లో ప్రభుత్వం తీరుపై ఎక్కువ అసంతృప్తి వ్యక్తమైందని తెలిపారు. ఈ సందర్భంగా జోసఫ్ సుధీర్‌బాబు మాట్లాడుతూ పిఆర్‌సిపై నియమించిన మంత్రుల కమిటీ సమావేశంలో జరిగిన కొన్ని నిర్ణయాలపై…
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వై ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు క్రమంగా అధికార పార్టీకి ఆందోళనకర పరిణామాలకు దారితీస్తుంది. ఈ కేసులో కీలక నిందితుడు ముఖ్యమంత్రికి సన్నిహితుడైన మరో బాబాయ్ కుమారుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అంటూ స్వయంగా వివేకానందరెడ్డి కుమార్తె డా. సునీత ఆరోపణ చేస్తుండడంతో సిబిఐ దర్యాప్తు మలుపు తిరిగే అవకాశం కనిపిస్తున్నది. 2020లోనే సిబిఐకు ఇచ్చిన వాంగ్మూలంలో ఆమె స్పష్టం చేసిన అంశాన్ని ఇప్పుడే సిబిఐ బహిరంగ పరచడం గమనిస్తే అవినాష్ రెడ్డి అరెస్ట్ కు రంగం సిద్ధం చేస్తున్నట్లు అధికార పార్టీ నేతలు పలువురు ఆరోపిస్తున్నారు. మరోవంక, ఇదే విషయమై సునీత నేరుగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ వ్రాసారు. తన తండ్రి హత్య కేసులో ఎంపీ అవినాష్ హస్తం ఉందని లేఖలో పేర్కొన్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి పాత్రపై విచారణ జరిపించాలని స్పీకర్‌ను సునీత కోరారు. సీబీఐకి తాను…
గతంలో ‘గుజరాత్ మోడల్’ అంటూ అక్కడి అభివృద్ధిపై జాతీయ స్థాయిలో విస్తృత ప్రచారం చేసి నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి కావడంకోసం ప్రచార వ్యూహాల రూపకల్పనలో క్రియాశీల పాత్రవహించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు `తెలంగాణ మోడల్’ పేరుతో టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావును జాతీయ రాజకీయాలలో క్రియాశీలంగా వ్యవహరించే వ్యూహానికి రూపకల్పన చేసిన్నట్లు తెలుస్తున్నది. సీఎం కేసీఆర్‌తో వరుసగా రెండురోజులు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ భేటీ అయి ఈ విషయమై సుదీర్ఘంగా చర్చించినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో గుజరాత్‌ను మించి, దేశంలో ఎక్కడాలేని విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కానీ ఆశించిన రీతిలో వాటిని ప్రచారం చేసుకోలేకపోతుందనే అభిప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ‘తెలంగాణ మోడల్’పేరిట ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో చర్చించారు. కేంద్ర ప్రభుత్వం నుండి మద్దతు లేకపోయినా కాళేశ్వరం వంటి భారీ సాగునీటి పధకం పూర్తి చేయడం, తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న రైతుబంధు…
ఉక్రెయిన్‌పై రష్యా దాడి సందర్భంగా ఆ దేశంలో పలు దేశాలు విధించిన తీవ్రమైన ఆర్ధిక ఆంక్షలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అస్థిరపరుస్తాయని కధనాలు వెలువడుతున్నాయి. కానీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో రష్యా ఎంత ముఖ్యమైనది? అణు-సాయుధ బలగంతో పెద్ద భౌగోళిక రాజకీయ శక్తిగా ఎదిగినప్పటికీ, ఆర్థికంగా, రష్యా మధ్య స్థాయి దేశం మాత్రమే కావడం గమనార్హం. అయినప్పటికీ, చమురు, సహజవాయువు ఎగుమతుల్లో పెద్ద దేశం, కాబట్టి రష్యా దండయాత్ర, ఫలితంగా ఏర్పడే ఆంక్షల నుండి ఏవైనా ఆటంకాలు ఎదురైతే రష్యా బాలగంపై ఆధారపడే దేశాలను, ముఖ్యంగా పశ్చిమ ఐరోపాలోని అనేక దేశాలను మాత్రమే ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ఐరోపాలో ఇంధనం, ఆర్ధిక మార్కెట్లలో జర్మనీ, యుకె ప్రధాన దేశాలు. నార్డ్ స్ట్రీమ్ 2 పైప్‌లైన్‌ను అడ్డుకోవడం వల్ల జర్మనీ ముఖ్యమైనది. అయితే అనేక రష్యన్ ఒలిగార్చ్‌లకు ముఖ్యమైన ఆర్థిక మార్కెట్ బ్రిటన్. విస్తృతంగా చూస్తే అంతర్జాతీయ ఆర్ధిక శక్తులలో రష్యా అగ్రశ్రేణిలో లేదని చెప్పవచ్చు. ఒక దేశపు…
ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో పోటీ ప్రధానంగా ముఖ్యమంతి యోగి ఆదిత్యనాథ్, సమాజవాద్ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ల మధ్యనే ఉన్నదనడంలో సందేశం లేదు. ఎన్నికల ప్రచారంలో ఎవ్వరి స్టైల్ వారిదిగా ఉంటుంది. అందరికన్నా విలక్షణంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రచారం జరుగుతున్నది. ఆమెకు పార్టీకి పెద్ద సంఖ్యలో సీట్లను గెలిపించలేక పోయినా ప్రజాభిమానాన్ని మాత్రం విశేషంగా మూటగట్టుకొని అవకాశం ఉంది. ఆదిత్యనాథ్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులతో బిఎజిపి అగ్రనేతలు అందరు ప్రచారం చేటున్నారు. 2017 ఎన్నికలలో ప్రధాని మోదీని చూసి ఓట్ వేయమని కోరిన బీజేపీ ఈ సారి మాత్రం యోగిని చూసి వేయమంటున్నది. ప్రధాని కూడా యోగి పాలనను మెచ్చుకోకుండా ఎక్కడా ప్రచారం చేయడం లేదు. వాస్తవానికి గత మూడేళ్ళుగా యోగి ప్రచారం చేస్తున్నట్లే వ్యవహరిస్తూ వస్తున్నది. ప్రతిరోజూ ఉదయాన్నే లేచే ఆదిత్యనాథ్ తన రోజును ఉదయం 4 గంటలకు పూజలతో ప్రారంభిస్తారు. ఉదయం 6.30 నుంచి అధికారులతో…