Author: Editor's Desk, Tattva News

డాక్టర్‌ నాగసూరి వేణుగోపాల్‌ఆకాశవాణి పూర్వ సంచాలకులు తెలుగు సారస్వత లోకంలో పాతికేళ్ళ క్రితం ఒక సృజనాత్మక ప్రయోగం మొదలైంది. 1997 ఫిబ్రవరి 22న ఆంధ్రప్రదేశ్‌ కొసన ఉండే శ్రీకాకుళంలో తెలుగు కథా సాహిత్యమే ప్రధాన నెలవుగా ‘కథానిలయం’ గ్రంథాలయం ఏర్పడింది. ఇప్పుడు అది శ్రీకాకుళం పట్టణానికి ఒక ఆనవాలుగా భాసిస్తోంది. కాళీపట్నం రామారావు ప్రారంభించిన ఈ గ్రంథాలయం దేశంలోనే ప్రత్యేకమని కొందరంటుండగా ప్రపంచంలోనే అటువంటి ప్రయత్నం జరగలేదని మరికొందరంటున్నారు. అటువంటి మరో ప్రయోగం తెలుగునాట కృష్ణా జిల్లాలో ఉయ్యూరు సమీపాన ఉండే ముదునూరు గ్రామంలో 2022 ఫిబ్రవరి 21వ తేదీన మొదలైంది.  తెలుగులో వెలువడిన స్వీయచరిత్రలు, జీవిత చరిత్రలు, జీవిత విశేషాలను తెలిపే వ్యాసాల సంపుటుల కొరకు ‘నాగులపల్లి సీతారామయ్య, సోమిదేవమ్మ పిల్లల గ్రంథాలయం’గా మీడియా పరిశోధకులు డా.ఎన్‌.భాస్కరరావు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు. స్వాతంత్య్రోద్యమానికి, గ్రంథాలయోద్యమానికి పెద్ద పీట వేసిన ముదునూరులో ఇటువంటి గ్రంథాలయం ప్రారంభం కావడం హర్షణీయం. ఫిక్షన్‌ రచయితలకు,…

Read More

రాష్ట్రంలో రాజకీయంగా ప్రతిపక్షం కన్నా పెను ప్రమాదంగా  భావించడం వాళ్ళనయితేనేమి, ప్రధాన ప్రతిపక్షం టిడిపి, బీజేపీ నేతలకన్నా ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం చర్యలపై దూకుడుగా స్వరం వినిపిస్తుండడం వల్లనైతే నేమి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పట్ల కలత చెందుతున్నట్లు కనిపిస్తున్నది.  జనసేన పార్టీకి క్షేత్రస్థాయిలో చెప్పుకోదగిన యంత్రాంగం లేకపోయినప్పటికీ ఆయన లేవనెత్తుతున్న అంశాలపట్ల ప్రజలనుండి తీవ్రమైన స్పందన వస్తుండడంతో ఖంగారు పడుతున్నట్లు కనిపిస్తున్నది.  అందుకనే వచ్చే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ లేకుండా టిడిపి గాని, బిజెపి గాని ఎన్నికలలో  పోటీచేయలేని పరిస్థితులు నెలకొన్నాయి.  అయితే పవన్ కళ్యాణ్ ను రాజకీయంగా ఎదుర్కొనలేక, ఆయన నటించిన సినిమా విడుదలపై ఆ ఆగ్రహం చూపించడం వైసిపి నేతలు పలువురికి సహితం మింగుడు పడటం లేదు. పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన `భీమ్లానాయక్’ సినిమా విడుదల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు కక్షసాధింపు ధోరణులను వెల్లడి చేస్తున్నట్లు అధికార పార్టీకి మద్దతుదారులు…

Read More

ర‌ష్యా దాడుల‌పై అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానం ఐసీజేను ఆశ్ర‌యించింది ఉక్రెయిన్. ర‌ష్యా తీవ్ర దుందుడుకు చర్యలతో మారణహోమానికి పాల్పడుతోందని, సైనిక చర్య పేరిట దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ ఆరోపించారు.  జరుగుతున్న దారుణాలకు రష్యాను బాధ్యురాలిని చేయాలని ఐసీజేని కోరారు. రష్యా తక్షణమే సైనిక చర్యలను నిలుపుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కాగా, తమ పిటిషన్ పై వచ్చే వారం విచారణ జరుగుతుందని భావిస్తున్నట్టు జెలెన్ స్కీ వెల్లడించారు. మరోవంక బెలారస్ వేదికగా రష్యాతో చర్చలకు నిరాకరించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మనసు మార్చుకొని సిద్ధమని ప్రకటించారు. చర్చలకు రాకుండా ఉక్రెయిన్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోపించిన కొద్దిసేపటికే జెలెన్స్కీ ఈ ప్రకటన చేశారు. గెమెల్లో భేటీకి అంగీకరించారు.  రష్యా సైనిక దాడికి నిరసనగా యూరోపియన్ దేశాలతోపాటు ఉక్రెయిన్, బెల్జియం, ఫిన్లాండ్, కెనడా దేశాలు రష్యా విమానాలకు తమ గగనతలాన్ని మూసివేశాయి. అమెరికా నేతృత్వంలోని…

Read More

రాజ్యసభ మాజీ సభ్యులు, టిడిపి సీనియర్‌ నేత, శతాధిక వృద్ధుడు యడ్లపాటి వెంకట్రావు (102) సోమవారం తెల్లవారుజామున హైదరాబాదులో మృతి చెందారు. కొంతకాలం క్రితం ఆయన భార్య, కుమారుడు మృతి చెందడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆయన హైదరాబాదులోని కుమార్తె ఇంటి ఉంటున్నారు. ఆరోగ్య సమస్యలు, వృద్ధాప్యంతో ఆయన తుది శ్వాస విడిచారు. యడ్లపాటి స్వగ్రామం గుంటూరు జిల్లా బోడపాడు గ్రామం. తెనాలిలో స్థిరపడిన ఆయన ఆచార్య ఎన్‌.జి.రంగా అనుచరులుగా ఉన్నారు. ఆయన1951లో స్థాపించిన కృషికార్‌ లోక్‌ పార్టీ స్థాపనలో కీలకంగా వ్యవహరించారు. 1959 లో స్వతంత్ర పార్టీలో చేరారు. ఆ పార్టీ నుంచి వేమూరు నియోజకవర్గం తరఫున 1962, 65 లో శాసనసభ్యునిగా పోటీ చేసి ఓటమి చెందారు. అనంతరం 1967, 1972 లో అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1972 లో కాంగ్రెస్‌ ప్రభంజనంలో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా విజయం సాధించిన ఏకైక వ్యక్తిగా యడ్లపాటి రికార్డు…

Read More

మద్యం మత్తులో కారును ఢీకొట్టిన కేసులో భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీని బాంద్రా పోలీసులు అరెస్ట్ చేశారు. తదుపరి విచారణ జరుగుతోందని తెలిపారు. బాంద్రా సొసైటీకి చెందిన ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదుతో కాంబ్లీని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ ఆర్‌డబ్ల్యూ కింద అభియోగాలు నమోదు చేశారు. బాంద్రా సొసైటీ నివాసి ఫిర్యాదు మేరకు వినోద్ కాంబ్లీ (50)ని అరెస్టు చేశారు. అతనిపై ఇండియన్ పీనల్ కోడ్ (ఐపిసి) మోటారు వాహన చట్టం 185 సెక్షన్ కింద అభియోగాలు నమోదు చేశారు. అయితే ఆ రోజే కాంబ్లీ బెయిల్‌పై విడుదలయ్యాడు. ఈ ఘటన తర్వాత కాంబ్లీ కాంప్లెక్స్ వాచ్‌మెన్‌తో పాటు అక్కడ ఉన్న కొంతమంది నివాసితులతో కూడా వాదించాడని ఆరోపించారు. కాంబ్లీ 17 టెస్టులు ఆడారు. 4 సెంచరీలతో సహా 1084 పరుగులు చేశాడు. అతను భారతదేశం తరపున 104 ఒడి1లు ఆడాడు. 2 సెంచరీలతో…

Read More

ఉక్రెయిన్ రక్షణ స్థావరాలు, నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తే భయంతో ఉక్రెయిన్ ప్రభుత్వం కాళ్ళ బేరానికి వస్తుందని ఆశించిన రష్యా అధ్యక్షుడు పుతిన్ అంచనాలు తలకిందులైన్నట్లు కనిపిస్తున్నది. రెండు రోజుల భీకర దాడుల తర్వాత మూడోరోజు కొంచెం దాడులను నెమ్మదించినా ఉక్రెయిన్ ప్రభుత్వం దిగిరాక పోగా మరింత ఉధృతంగా ప్రతిఘటన చేస్తుండడంతో విస్తుపోయిన్నట్లు కనిపిస్తున్నది. అటువంటి ప్రతిఘటనను ఉహించినట్లు లేదు. అందుకనే నాలుగోరోజు దాడులను మరింత ఉధృతం చేశారు. ఉక్రెయిన్ రాజధానిని స్వాధీనం చేసుకోవడం కష్టతరంగా కనిపించింది. సాధారణ ప్రజలు కూడా తిరగబడుతూ ఉండడం విస్మయం కలిగిస్తున్నది. శాంతి చర్చలకు ప్రతిపాదించినా ఉక్రెయిన్ ప్రభుత్వం విముఖంగా ఉండడం, జనం మధ్య ఉంటూనే ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్ స్కీ..పోరాటానికి నేతృత్వం వహిస్తూ ఉండడంతో కొంచెం ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నది. దానితో దీర్ఘకాలం పోరు తప్పదనే సూచనలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే అంతర్జాతీయంగా విధిస్తున్న ఆంక్షల కారణంగా రష్యా ఆర్ధిక పరిస్థితి విషమంగా మారే ప్రమాదం కూడా లేకపోలేదని నిపుణులు భావిస్తున్నారు. ఉక్రెయిన్ ప్రజల నుంచి రష్యా…

Read More

ప్రముఖ సినీ నటి శృతి హాసన్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. తాను కోవిడ్ జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా పాజిటివ్‎గా వచ్చిందని తెలిపారు. తనతో కొన్ని రోజులుగా టచ్‎లో ఉన్నవారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని కోరారు. కరోనా నుంచి త్వరగా కోలుకొని మళ్లీ మీ ముందుకు వస్తానని ఆమె పేర్కొన్నారు. తెలుగు, తమిళ్, హిందీ సినిమాలలో నటిస్తున్న శృతి హాసన్. తన తండ్రి కమల్ హాసన్ ఇమేజ్‎తో కాకుండా,నటనతో తనకంటూ ఓ ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్‎గా 2000 సంవత్సరంలో తన తండ్రి సినిమా ‘హే రామ్’ తో బాలీవుడ్‎లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత హీరోయిన్ గా 2009లో ‘లక్’ మూవీ ద్వారా కనిపించారు. తెలుగులోకి 2011లో సిద్ధార్థ్ హీరోగా నటించిన ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమా ద్వారా అడుగుపెట్టారు. అనంతరం గబ్బర్ సింగ్, బలుపు, ఎవడు, రేసు గుర్రం, శ్రీమంతుడు,…

Read More

ఒక వంక ఉక్రెయిన్ పై ముప్పేట దాడి చేస్తూ, తీవ్ర విధ్వసం సృష్టిస్తున్న రష్యా శాంతి చర్చలు అంటూ ప్రతిపాదించి, అందుకు తమ అధికారుల బృందాన్ని సహితం బెలారస్ కు పంపించింది. అయితే చర్చలకు సిద్ధమైనా, చర్చల వేదికను మాత్రం ఉక్రెయిన్ తిరస్కరించింది. బెలారస్ రష్యా అనుకూల ప్రాంతమని, ఈ ప్రాంతాన్ని రష్యా తమ దండయాత్రకు లాంచ్‌ప్యాడ్‌గా ఉపయోగిస్తున్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్ స్కీ బెలారస్‌ ఆరోపించారు. రష్యా బెలారస్‌కు ఒక ప్రతినిధి బృందాన్ని పంపుతామని ప్రకటించి గోమెల్ నగరంలో ఉక్రెయిన్‌తో శాంతి చర్చలు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది.అయితే ఈ ప్రతిపాదనను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తిరస్కరించారు. బెలారస్ నుండి ఉక్రెయిన్‌పై రష్యా దాడులు చేస్తోందని, తన దేశం పట్ల దూకుడు ప్రదర్శించని ప్రదేశాలలో మాత్రమే చర్చలకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. “వార్సా, ఇస్తాంబుల్ బ్రాటిస్లావా, బుడాపెస్ట్ మరియు బాకు ఉన్నాయి. ‘క్షిపణులు ఎగరని ఏ దేశంలోనైనా…

Read More

రష్యా తన సరిహద్దు దేశమైన ఉక్రెయిన్ పై యుద్ధం ప్రారంభించడంతో నిర్దిష్టంగా ఒక విధానం అనుసరించడంలో భారత్ సంకట పరిస్థితిని ఎదుర్కొంటున్నది. ఇది రష్యా – అమెరికాల మధ్య ప్రచ్ఛన్న పోరుగా మారడం, ఆ రెండు దేశాలతో భారత్ కు వ్యూహాత్మకంగా, రక్షణపరమైన సంబంధాలు ఉండడంతో ఏదో ఒకవైపు మొగ్గలేని ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది.  దానితో తాము తటస్థవైఖరిని ఆవలంభిస్తున్నట్లు భారత్ స్పష్టం చేసింది. రష్యా వెంటనే తన దాడిని నిలిపివేయాలని కోరుతూ అమెరికా భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్ లో భారత్ పాల్గొనలేదు. అయితే దౌత్యపరంగా సమస్యలు పరిష్కరించుకొనే ప్రయత్నం చేయకుండా, సాయుధ చర్యకు దిగడం పట్ల అసంతృప్తి మాత్రం వ్యక్తం చేసింది.  ఇక్కడనే భారత్ ఎంతో సున్నితంగా వ్యవహరింప వలసిన పరిస్థితి ఏర్పడింది. నెహ్రూకాలం నుండి భారత్ అనుసరిస్తున్న ఏకూటమిలో చేరని అలీనా విధానం అనుకూలంగానే దాదాపుగా ఇప్పటివరకు వ్యవహరిస్తున్నాము. గత ఒకటిన్నర దశాబ్దకాలంగా అమెరికాతో మన సంబంధాలు మెరుగుపడుతున్నా రష్యా ప్రాధాన్యతను…

Read More

ఉక్రెయిన్ లో యుద్ధం కారణంగా చిక్కుకు పోయిన భారతీయులలో 469 మంది ప్రయాణికులతో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు ఎయిర్ ఇండియా విమానాలు స్వదేశంకు చేరుకొన్నాయి. మొదటి విమానం గత రాత్రి 219 మంది ప్రయాణికులతో ముంబైకు చేరుకోగా, రెండో విమానం 250 మందితో ఆదివారం తెల్లవారుజామున ఢిల్లీకి చేరుకొంది. ఈ సందర్భంగా స్వదేశానికి చేరుకున్న ప్రయాణికులకు స్వయంగా కేంద్ర మంత్రులు ఘనంగా స్వాగతం పలికారు. ముంబైలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విమానాశ్రయంలో స్వాగతం పలకగా, ఢిల్లీ విమానాశ్రయంలో పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విమానంలో ఉన్నవాళ్లంతా మంత్రులను చూడగానే ఆనందోత్సవాలతో జై హింద్ అంటూ నినాదాలు చేశారు. ఎవరూ ఎలాంటి ఆందోళనలు చెందాల్సిన పనిలేదని మంత్రులు వారికి భరోసా ఇచ్చారు. ఉక్రెయిన్‌లో ఉన్న మిగిలిన భారతీయులందర్నీ కూడా క్షేమంగా భారత్‌కు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇప్పటికే ఉక్రెయిన్ అధ్యక్షుడితో…

Read More