Author: Editor's Desk, Tattva News

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ను క్రైస్తవ మత ప్రచారకుడు, వైఎస్సార్‌ తెలంగాణపార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భర్త బ్రదర్‌ అనిల్‌కుమార్‌ రెండు రోజుల క్రితం కలవడం ఏపీలోని అధికార పక్షంలో దుమారం రేపుతున్నది.  రాజమహేంద్రవరంలోని ఉండవల్లి నివాసంలో ఇరువురి మధ్య సుమారు గంటసేపు సమావేశం జరిగింది. అనంతరం వారిద్దరూ మీడియాతో మాట్లాడారు. షర్మిల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి కావడం, అరుణ్ కుమార్ వై ఎస్ రాజశేఖరరెడ్డికి సన్నిహితుడు కావడం గమనార్హం. కొంత కాలంగా కుటుంభం కలహాల కారణంగా జగన్, షర్మిల ఎడమొఖం, పెడమొఖంగా ఉంటూ వస్తున్నారు. ఆమె తెలంగాణాలో ప్రాంతీయ పార్టీ ఏర్పాటు జగన్ కు ఇష్టం లేదని చెబుతున్నారు.  పైగా ఆమె 2014లోనే కాపాడ నుండి లోక్ సభకు పోటీచేయాలి అనుకొంటే, ఆ సీట్ బాబాయి కొడుకు వైఎస్ అవినాష్ రెడ్డికి ఇచ్చి, తల్లి వైఎస్ విజయలక్ష్మిని విశాఖపట్నం నుండి అభ్యర్థిగా నిలబెట్టడం, ఆమె ఓటమి చెందడం జరిగింది. జగన్ జైలుకు వెళ్ళినప్పుడు ఆయన…

Read More

బిగ్ బాస్ షో ఓ అధికారిక వ్యభిచార గృహం అంటూ సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేశారు.  తెలుగులో స్టార్ మాలో బిగ్ బాస్ షోన్ ఇప్పటివరకు 5 సీజ‌న్‌లుగా ప్రసారం అయ్యింది. బిగ్ బాస్ తెలుగు హిందీతో పాటు పలు ప్రాంతీయ భాషాల్లో కూడా షో నడుస్తున్నది.  తెలుగులో బిగ్ బాస్ ప్రేక్ష‌కులను ఎంతగానో అల‌రించింది. శనివారం నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో ప్ర‌సారం ప్రారంభమైనది. ఈ సందర్భంగా దీనిని రద్దు చేయాలని మరోసారి డిమాండ్ చేశారు.  భ‌క్తి ర‌స చిత్రాల్లో న‌టించిన నాగార్జున బిగ్‌బాస్ వంటి షోకు వ్యాఖ్యాత‌గా చేయ‌డం సిగ్గుచేటని ఆయన మండిప‌డ్డారు.  బిగ్‌బాస్‌ అనే లైసెన్స్‌ పొందిన షోలో 100 మందిని 100 రోజుల పాటు ఒకచోట ఉంచి అనైతిక చర్యలకు పాల్పడేందుకు వీలు కల్పిస్తున్నారని ఆరోపించారు. మహిళలను అవమానపరిచే విధంగా ఈ షో ఉంటోందని పేర్కొంటూ దీన్ని ప్రభుత్వం నిషేధించాలని ఆయన డిమాండ్‌ చేశారు.  బిగ్‌ బాస్‌…

Read More

ఉక్రెయిన్, రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న సమయంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ శనివారం సాయంత్రం భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్‌ చేశారు. రష్యా తమపై చేస్తున్న దాడి గురించి ప్రధానికి వివరించారు. ప్రస్తుతం తమ దేశంలో లక్షమందికిపైగా రష్యా సైనికులు ఉన్నారని జెలెన్‌స్కీ తెలిపారు. నిర్దాక్షణ్యంగా జనాలు నివసిస్తున్న రెసిడెన్షియల్ భవనాలపై సైతం దాడులు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. భద్రతా మండిలిలో రాజకీయ మద్దతు ఇవ్వాలని మోదీని జెలెన్‌స్కీ కోరారు. రష్యా దురాక్రమణను కలిసికట్టుగా అడ్డుకుందామని తెలిపారు. ఇదే విషయంపై ఆయన ట్వీట్ కూడా చేశారు. రష్యా దూకుడును ఆపాలని జెలెన్‌స్కీ కోరారు. మరోవైపు ప్రధాని కార్యాలయం కూడా ఈ మేరకు ప్రకటన చేసింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడారని ట్వీట్ చేసింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న సంఘర్షణ పరిస్థితుల గురించి ప్రధానికి వివరించారని పేర్కొంది. ఆ దేశంపై రష్యా దాడుల కారణంగా…

Read More

దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ ఎల్‌ఐసిలో పెట్టుబడుల ఉపసంహరణకు సులభతరం చేసే చర్యలకు కేంద్రం ఉపక్రమించింది. ఐపిఒగా మారనున్న ఎల్‌ఐసిలో ఆటోమేటిక్‌ విధానంలో 20 శాతం వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డిఐ) కేంద్రం క్యాబినేట్‌ ఆమోదం తెలిపింది.  ప్రధాని నరేంద్ర మోదీ  అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గం సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఎల్‌ఐసిలో ఎఫ్‌డిఐ దారులు పాల్గొనే వీలు కలుగుతుంది. ఇప్పటికే దేశీయ బీమా రంగంలో 74 శాతం వరకు ఎఫ్‌డిఐకి నేరుగా అనుమతి ఉండేది కానీ.. ఇందుకు ఎల్‌ఐసి మినహాయింపు.  పార్లమెంట్‌లో చట్టం చేసి ఎల్‌ఐసిని ప్రత్యేక సంస్థగా ఏర్పాటు చేయడం వల్ల ఈ నిబంధన ఈ సంస్థకు వర్తించదు. ఇప్పుడు ఎల్‌ఐసిలోకి ఎఫ్‌డిఐ అనుమతించడంతో విదేశీ పెన్షన్‌ ఫండ్‌లు, బీమా సంస్థలు దేశంలోనే అతిపెద్ద ఐపిఒగా భావిస్తున్న ఎల్‌ఐసి పబ్లిక్‌ ఇష్యూలో పాల్గనే వీలుంటుంది. దేశీయ సంస్థల్లో 10 శాతం అంతకన్నా ఎక్కువ…

Read More

ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడం భారత్‌ను గతంలో ఎన్న లేనంతగా అంతర్జాతీయ సంబంధాలలో ఇరకాటంలో పడవేసింది.  రష్యా దాడిని ఖండించాలని ఒకవంక అమెరికా, పశ్చిమ దేశాలు, ఉక్రెయిన్ వత్తిడి చేస్తుండగా, మరోవంక రష్యాతో కీలకమైన వ్యూహాత్మక బంధాన్ని దూరం చేసుకొనే పరిస్థితుల్లో లేము.  రష్యాతో భారత్‌కు ఉన్న సంబంధాలలో ఎక్కువగా కనిపించే అంశం ఆయుధాల ఒప్పందాలు. రష్యా హార్డ్‌వేర్ ఇప్పటికీ భారతదేశ ఆయుధాలలో దాదాపు 70 శాతం వాటాను కలిగి ఉంది. అయితే ఆయుధ సరఫరాలో ఉక్రెయిన్ సహితం భారత్ కు కీలక భాగస్వామి అని చాలామందికి తెలియదు.  రష్యా ఆయుధాల కోసం కీలకమైన ఉపవ్యవస్థలను అందించడంతోపాటు, భారత సైన్యానికి సరఫరాదారుగా ఉక్రెయిన్ కీలక పాత్ర పోషిస్తున్నది.  ఉక్రెయిన్ భారతదేశం భారత వైమానిక దళానికి చెందిన 100కి పైగా ఆంటోనోవ్ యాన్-32 రవాణా విమానాలను అప్‌గ్రేడ్ చేసే క్లిష్టమైన ప్రక్రియలో నిమగ్నమై ఉంది. 2014లో క్రిమియాలో జరిగిన సంఘర్షణతో ఆంటోనోవ్ అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్ క్లుప్తంగా…

Read More

ఉక్రెయిన్ పై రష్యా దాడితో  రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మొదటిసారిగా ఐరోపాలో తీవ్రమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి.  తన పశ్చిమ పొరుగున ఉన్న ఉక్రెయిన్‌పై రష్యా దాడి సెప్టెంబర్ 1939లో పోలాండ్‌ను ఆక్రమించిన నాజీ జర్మనీని గుర్తు చేస్తున్నది. పుతిన్ ఉక్రెయిన్ తో ఆగిపోతారా, లేదా రాబోయే రోజులలో పోలాండ్ వంటి దేశాలపై కూడా నాటో నుండి నిష్క్రమించామని వత్తిడి చేస్తూ దాడులకు దిగుతారా అని మొత్తం ఐరోపా వణికి పోతున్నది.  ఆసియా, పసిఫిక్‌లను చుట్టుముట్టిన రెండవ ప్రపంచ యుద్ధంలో 40 మిలియన్లకు పైగా ప్రజలు మరణించారు. 1989లో ప్రచ్ఛన్న యుద్ధం ముగియడంతో, అలాంటి పీడకల మళ్లీ మళ్లీ రాదని అందరూ భావించారు. ఉక్రెయిన్‌లో రష్యా జోక్యాన్ని మూడవ ప్రపంచ యుద్ధానికి సంకేతంగా  చిత్రించడం అతిశయోక్తి కావచ్చు.  కానీ పశ్చిమ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) సైన్యం, వైమానిక శక్తి పోలాండ్, లాట్వియా, లిథువేనియా, ఎస్టోనియా, రుమానియాలో ఉండడం రష్యాకు ఇబ్బందికరంగానే ఉంటుంది.  ఎప్పుడైనా, ఎటువంటి చిన్న సంఘటన…

Read More

కొద్ది రోజుల క్రితం ఇల్కర్ ఐసీని ఎయిర్ ఇండియాకు కొత్త చీఫ్‌ ఎగ్జిక్యూటీవ్‌ ఆఫసర్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా నియమిస్తూ టాటా సన్స్‌ తీసుకున్న నిర్ణయం పట్ల స్వదేశీ జాగరణ్ మంచ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది . 2022 ఫిబ్రవరి 14న జరిగిన బోర్డు మీటింగ్‌లో కొత్త సీఈఓగా ఇల్కర్ ఐసీని నియమిస్తున్నట్లు టాటా గ్రూప్ వెల్లడించింది. టర్కీలో తన మునుపటి రాజకీయ సంబంధాలను ఉటంకిస్తూ.. ఎయిర్ ఇండియా చీఫ్‌ ఎగ్జిక్యూటీవ్‌ ఆఫసర్‌గా ఇల్కర్ ఐసీ నియామకాన్ని అడ్డుకోవాలని మంచ్ కేంద్రాన్ని కోరింది. ప్రస్తుత టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ 1994లో ఇస్తాంబుల్ మేయర్’గా పనిచేసినప్పుడు అతనికి సలహాదారుగా ఇల్కర్ ఐసీ ఉన్నారని తెలుపుతూ, అతని పూర్వ కార్యకలాపాలను క్షుణ్ణంగా దర్యాప్తు చేయలని కేంద్రాన్ని కోరింది. టర్కిష్ ఎయిర్ లైన్స్ మాజీ చైర్మన్ ఐసీ ఈ విషయంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇటీవల 2.4 బిలియన్ డాలర్ల రుణభారంతో ఉన్న విమానయాన సంస్థను స్వాధీనం చేసుకున్న తర్వాత టాటా గ్రూప్ ఎయిర్…

Read More

రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర పోరు కొనసాగుతున్న వేళ రష్యా అధ్యక్షుడి కార్యాలయం కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్ అధికారుల బృందంతో చర్చలకు సిద్ధమని తెలిపింది. చర్చలకు బెలారస్ రాజధాని మిన్‌స్క్‌కు రష్యా బృందాన్ని పంపిస్తామని వెల్లడించింది. ఉక్రెయిన్ బలగాలు ఆయుధాలు వీడితే తాము చర్చలకు సిద్ధమేనని అంతకు ముందే రష్యా విదేశాంగ మంత్రి ప్రకటించారు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో టెలిఫోన్‌లో సంభాషించిన తర్వాత రష్యా అధ్యక్ష కార్యాలయం ఈ కీలక ప్రకటన చేయడం గమనార్హం. యుద్ధాన్ని ఆపాలని జిన్‌పింగ్ కూడా పుతిన్‌కు సూచించారు. మరోవైపు యుద్ధాన్ని ఆపాలని, చర్చలు జరపాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా రష్యాను కోరారు. ఉక్రెయిన్‌కు తటస్థ స్థాయిపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కూడా ఆయన తెలిపారు. ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరరాదని, తటస్థ వైఖరి అవలంబించాలని రష్యా మొదటినుంచీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో…

Read More

టీడీపీకి చెందిన మాజీ మంత్రి పరిటాల రవీంద్రను ప్రత్యర్థులు హత్య చేసిన రీతిలోనే తనను కూడా హత్య చేస్తారని మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు  ఆదినారాయణ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. “నా భార్య నా జీవితం గురించి భయపడుతోంది, కానీ నేను ఆమెను ధైర్యంగా ఉండమని, నేను ఉన్నా లేదా లేకుండా జీవితంలో ముందుకు సాగాలని కోరాను” అని వెల్లడించారు.  అమరావతి రైతులు 800 రోజులు జరుపుకుంటున్న ఆందోళనకు బీజేపీ నేత సంఘీభావం తెలుపుతూ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వైజాగ్‌లో వేల ఎకరాల భూములు కొన్న జగన్, ఈ భూముల విలువను పెంచేందుకు రాజధానిపై నరకయాతన పడ్డాడని ఆరోపించారు. గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు జగన్‌ అధికారంలోకి వస్తే విశాఖను రాజధానిగా చేస్తాడని చంద్రబాబుకు తెలియజేసిన తన జోస్యం నిజమైందని పేర్కొన్నారు. వైఎస్ వివేకా హత్యపై ఆదినారాయణ రెడ్డి వివేకా సన్నిహితులే చంపారని ఆరోపించారు. వివేకాకు సన్నిహితులైన వ్యక్తులు అతన్ని…

Read More

ఏప్రిల్ 8 నుండి ప్రారంభం కానున్న ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యే విషయంలో తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సందిగ్ధతలో ఉన్నట్లు తెలుస్తున్నది. ప్రభుత్వ వర్గాల ప్రకారం తొలి రోజు గవర్నరు ప్రసంగం ఉంటుంది. అలాగే కొద్ది రోజుల క్రితమే మరణించిన రాష్ట్ర మంత్రి గౌతమ్‌రెడ్డికి ఉభయ సభలు సంతాపం ప్రకటించాల్సి ఉంటుంది. వాస్తవంగా రెండు అంశాల్లోనూ వెంటనే సభలను వాయిదా వేయాల్సి ఉంటుంది. అందుకే గవర్నరు ప్రసంగం, గౌతమ్‌రెడ్డికి సంతాపం రెండూ ఒకేరోజు నిర్వహించి సభను వాయిదా వేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. మార్చి 11వ తేదీన శుక్రవారం బడ్జెట్‌ను ప్రతిపాదించి, రెండు రోజుల విరామం అనంతరం మార్చి 14న సభలను పున్ణప్రారంభించాలని భావిస్తున్నట్లు సమాచారం. మొత్తం సమావేశాలను ఎనిమిది నుంచి పది పనిదినాల పాటు నిర్వహించే అవకాశాలున్నాయి. ప్రతిపక్ష సభ్యుల పట్ల అధికార పక్షం అరాజకంగా వ్యవహరిస్తుండటం, స్పీకర్ సహితం ఏకపక్షంగా వ్యవహరిస్తుండడంతో హాజరై ప్రయోజనం ఏమిటని కొంతమంది టిడిపి…

Read More