గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై కేసు నమోదుచేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల అధికారికి ఆదేశాలు జారీ చేసింది. అంతే కాదు 72 గంటల పాటు ఎన్నికల సభలు, సమావేశాలు, మీడియా ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని కూడా రాజాసింగ్‌పై నిషేధం విధించింది. యూపీ ఓటర్లను బెదిరిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఈసీ షోకాజ్ నోటీసు జారీ చేసినా రాజాసింగ్ స్పందించలేదు. వివరణ ఇచ్చేందుకు శనివారం మధ్యాహ్నం వరకు గడువు ఇచ్చినా ఆయన నుంచి సమాధానం రానందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. రాజాసింగ్ చెప్పుకునేందుకు ఏమీ లేదని భావిస్తున్నామని, అందుకే ఈసీ తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పింది. ఉత్తర్ప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇటీవల ఓ వీడియో రిలీజ్ చేశారు. అందులో యూపీలో హిందువులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల తర్వాత యోగికి ఓటేయనివారిని గుర్తించి వారి ఇళ్లను బుడ్జోజర్లతో కూలుస్తామని హెచ్చరిక చేశారు. రాజాసింగ్ వ్యాఖ్యలపై…
Author: Editor's Desk, Tattva News
పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కావడానికి కొద్దీ గంటల ముందు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢీల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై పోలీసు కేసు నమోదైంది. అకాలీదళ్, ఇతర రాజకీయ పార్టీలను దూషించారన్న ఆరోపణలపై పంజాబ్ ఎన్నికల పోలింగ్ అధికారి విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలో కేజ్రీవాల్‌పై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. దూషించినట్లు ఒక వీడియో సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవుతుండటంపై ఆయా పార్టీ నేతలు కేజ్రీవాల్‌పై పంజాబ్ ఈసీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మరోవైపు శనివారం సాయంత్రంతో పంజాబ్‌లో ఎన్నికల ప్రచారానికి సమయం ముగిసినప్పటికీ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ ఇంటింటి ప్రచారం నిర్వాహించారంటూ కేసు నమోదైంది. చన్నీతో పాటు కాంగ్రెస్ అభ్యర్థి, పంజాబీ గాయకుడు శుభ్ దీప్ సింగ్ పైనా కూడా కేసు నమోదు చేశారు. ఇలా ఉండగా, కొద్ది రోజుల క్రితం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై సంచలన ఆరోపణలు చేసిన …
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల తర్వాత కూడా కర్నాటకలో హిజాబ్ వివాదం చల్లారలేదు. హిజాబ్‌తో తరగతులకు అనుమతించాలని విద్యార్థినులు పట్టుబడుతుండడం, కాలేజి యాజమాన్యాలు, పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నాలు చేసినా సానుకూల ఫలితాలు రాకపోవడం వంటివి చోటు చేసుకుంటున్నాయి. శనివారం నాడు హిజాబ్ వివాదంపై వెనక్కి తగ్గని 58 మంది విద్యార్థినులను శివమొగ్గ జిల్లా షిరలకొప్పలోని ప్రభుత్వ ప్రీ యూనివర్సిటీ కాలేజి యాజమాన్యం సస్పెండ్ చేసింది. విద్యార్థినులకు తాము ఎంతగా నచ్చజెప్పినప్పటికీ తమ డిమాండ్‌పై పట్టు వీడక పోవడంతో వారిని కళాశాలనుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేయాల్సి వచ్చిందని కళాశాల ప్రిన్సిపాల్ చెప్పారు. కాలేజి అధికారులతో విద్యార్థినులు వాగ్వాదానికి దిగడంతో పోలీసులు జోక్యం చేసుకుని వారిని అక్కడినుంచి చెదరగొట్టారు. మరోవైపు హిజాబ్ ధరించిన విద్యార్థినులు తమను తరగతులకు అనుమతించాలని డిమాండ్ చేయడంతో బెళగావి, యాద్‌గిర్,బళ్లారి, చిత్రదుర్గ, షిమోగా జిల్లాల్లో ఉద్రిక్తతలు తలెత్తాయి. బెళగావిలోని విజయ్ పారామెడికల్ కాలేజి యాజమాన్యం నిరవధిక సెలవు ప్రకటించగా, హరిహరలోని ఎస్‌జెవిపి కాలేజి…
రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఎవరైనా ప్రయత్నిస్తే కఠినచర్యలు తీసుకుంటామని ఏపీ నూతన డిజిపి కెవి రాజేంద్రనాథ్ రెడ్డి హెచ్చరించారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో గౌతం సవాంగ్ నుంచి 6వ డిజిపిగా ఆయన శనివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం లా అండ్ ఆర్డర్ డిజి రవిశంకర్ అయ్యన్నార్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ మత ఉద్రిక్తతలు రెచ్చగొడితే ఎటువంటి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు. ఎక్కడైనా మతానికి సంబంధించిన సున్నితమైన సమస్యలు వస్తే స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం తీసుకుని సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. ప్రజల సహకారంతో పోలీస్ వ్యవస్థను మరింత పటిష్టపరుస్తామని, ప్రతిష్టను పెంచుతామని ఆయన చెప్పారు. రాయలసీమలో ఎర్రచందనం అక్రమ రవాణా, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో గంజాయి సాగు నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. పోలీసులందరూ రాజ్యాంగ బద్దంగా విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు. బాధితులపైనే పోలీసులు కేసులు పెడుతున్నారను ఆరోపణలను ప్రస్తావించగా…
వ్యవసాయంలో సాంకేతికను తీసుకువస్తామని చెప్పిన కేంద్రం ఆ దిశగా అడుగులు వేసింది. 100 కిసాన్ డ్రోన్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో దేశంలోని పలు ప్రాంతాల్లో 100 కిసాన్ డ్రోన్లను ప్రధానమంత్రి వర్చువల్గా ప్రారంభించారు.వీటిని వివిధ ప్రాంతాల్లో పురుగుల మందు పిచికారీ చేయడానికి, వ్యవసాయ సామాగ్రిని తరలించేందుకు వీటిని వినియోగించనున్నారు. రైతులకు సహాయపడే లక్ష్యంతో.. పొలాల్లో పురుగుల మందు పిచికారి చేసేందుకు కిసాన్ డ్రోన్ల కార్యక్రమానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ భారత వ్యవసాయరంగంలో ఈ కార్యక్రమం ఓ సువర్ణాధ్యాయంగా మిగిలిపోతుందని పేర్కొన్నారు. డ్రోన్ రంగంలో పెరుగుతున్న భారత్ సామర్థ్యాన్ని .. ప్రపంచానికి నూతన నాయకత్వాన్ని అందిస్తుందని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. రైతుల కోసం ఇది అద్భుతమైన, ఉత్సాహమైన చొరవగా అభివర్ణించారు. దేశంలో డ్రోన్ల స్టార్టప్‌లు అభివృద్ధి చెందనున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం అవి 200 ఉండగా.. త్వరలో వేలల్లోకి చేరుకుంటాయని తెలిపారు. రాబోయే రెండేళ్లలో గరుడ ఏరోస్పేస్ ఆధ్వర్యంలో…
రాష్ట్రంలో మదరసాలలో ప్రభుత్వ జోక్యం ఉండదని కారాన్తక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పష్టం చేశారు. హైకోర్టులో హిజాబ్ వివాదం సాధ్యమైన త్వరగా పరిష్కారం కావాలని ఆయన ఆయన మీడియాతో మాట్లాడుతూ హిజాబ్ వివాదం కారణంగా హైస్కూళ్లు, పీయూసీ విద్యాసంస్థల్లో విద్యార్థుల విద్యార్జనకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతుండటం చాలా బాధగా ఉందని చెప్పారు. పరీక్షల వేళ ఇలాం టి పరిణామాలు విద్యార్థులకు ఇబ్బందికరమైన పరిణామమేనని చెప్పారు. ఈ వివాదం సమసిపోయి విద్యాసంస్థల్లో మళ్లీ సాధారణ స్థితిగతులు నెలకొనాలని ఆయన ఆకాంక్షించారు. విద్యార్థుల్లో సామరస్యం, ఐక్యత వెల్లివిరియాల్సి ఉందని, చిన్నారుల మనసులో విషం నింపడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉర్దూ పాఠశాలల్లోనూ సాధ్యమైనంతవరకు ఈ వివాదం లేకుండా చూడాల్సిందిగా విద్యాశాఖాధికారులను ఆదేశించామని తెలిపారు. మైనార్టీల హక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. హిజాబ్‌కు సంబంధించి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను 95 శాతం మంది విద్యార్థులు గౌరవించి…
నాలుగు రోజుల పాటు ఎంతో వైభవంగా జరిగిన మేడారం మహా జాతర నేటితో ముగియనుంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు వన దేవతలైన సమక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు, అమ్మవార్ల వన ప్రవేశంతో చేయనున్నారు. సమ్మక్కను చిలుకల గుట్టకు, సారాలమ్మను కన్నేపల్లికి, గోవిందరాజును కొండాయికి, పగిడిద్దరాజు ను పూనుగొండ్లకు సాగనంపనున్నారు. ఆదివాసీ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వన దేవతలంతా గద్దెలపై కొలువు దీరడంతో మేడారం జనసంద్రమైంది. మహాజాతరలో మూడో రోజు శుక్రవారం లక్షలాది మంది భక్తులు తరలివచ్చి.. సమ్మక్క, సారలమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. పసుపు, కుంకుమ, బంగారం, చీర, సారె, ఒడిబియ్యం సమర్పించారు. సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు, సమ్మక్క గద్దెలపైకి చేరడంతో శుక్రవారం భక్తులు వెల్లువలా తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసి, కుటుంబసభ్యులతో గద్దెల చెంతకు క్యూ కట్టారు. భక్తులు సమర్పించిన బంగారం (బెల్లం), ఇతర కానుకలతో గద్దెలన్నీ నిండిపోయాయి. గత మూడు రోజులలో కోటి మందికి పైగా భక్తులు మేడారం…
ఆమె ఒకప్పుడు భారత స్టాక్ మార్కెట్ ను ఉజ్వల స్థాయికి తీసుకెళ్లడంలో ఖ్యాతి గడించారు. ఆమె ఏ పదవి చేపట్టినా సంచలనాత్మక ఫలితాలు సాధిస్తూ వచ్చారు. జాతీయస్టాక్ ఎక్సేంజ్ (ఎన్‌ఎస్‌ఇ)కి సిఇఒ, మేనేజింగ్ డైరెక్టర్‌గా 2013 నుండి 2016 కీలక పాత్ర వహించారు. అయితే తాజాగా స్టాక్‌మార్కెట్‌లో అవతవకలు జరగడంతో పాటు సెబీ నిబంధనలు ఉల్లంఘించిన కేసుల్లో సిబిఐ ఆమెపై విచారణ చేపట్టడంతో పాటు లుక్ అవుట్ నోటీసులు కూడా జారీచేయడంతో ఒక్కసారిగా భారత ఆర్ధిక రంగం నివ్వెరపోయింది. పైగా, హిమాలయాలలో ఉండే ఒక `అదృశ్య బాబా’ తనను గత 20 ఏళ్లుగా నడిపిస్తున్నారని, ఆయనే అన్ని విషయాలలో తనకు సలహాలు ఇస్తున్నారని అంటూ ఆమె పొంతనలేని మాటలు చెబుతూ ఉండడంతో అంతా చిత్రవిచిత్రంగా మారిపోయింది. హిమాలయ యోగితో మాజీ ఎన్‌ఎస్‌ఇ సిఇఒ చిత్ర రహస్య సమాచారాన్ని పంచుకునే వారని ఇటీవల మార్కెట్ రెగ్యులేటర్ సెబీ చెప్పడంతో ఆమెపై వార్తలు పతాక స్థాయిలో హల్‌చల్ చేశాయి. రెండు రోజుల క్రితం పన్ను ఎగవేత ఆరోపణలు…
చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో రంగరంగ వైభవంగా జరిగిన విశ్వ సమతామూర్తి శ్రీరామానుజాచార్యుల సమస్రాబ్ధి వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు దూరంగా ఉండడం రాజకీయ దుమారం రుపొంది. చినజీయర్ స్వామి తీరుతో కేసీఆర్ గుర్రుగా ఉన్నారనే ప్రచారం ఈ సందర్భంగా జరిగింది. ఈ ప్రచారం పట్ల వారం రోజులుగా మౌనంగా ఉన్న జియ్యర్ స్వామి ఇప్పుడు ఈ ప్రచారాన్ని ఖండించారు. కేసీఆర్‌తో విభేదాలు లేవని తెలిపారు. సీఎం రాకపోవడానికి అనారోగ్యం లేదా.. పని ఒత్తిడి కారణం కావొచ్చని భావిస్తున్నానని చెప్పారు. పైగా, శనివారం జరిగే శాంతి కల్యాణానికి కేసీఆర్‌ను ఆహ్వానించామని చెబుతూ ఆయన హాజరు కాగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. దానితో ముచ్చింత్‌లో నేడు జరగబోయే 108 దివ్య దివ్యదేశాల శాంతి కల్యాణానికి కేసీఆర్ హాజరు కావడంపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. ముగింపు రోజు జరగాల్సిన శాంతికల్యాణాన్ని ఈ నెల 19కి వాయిదా వేస్తున్నట్లు చినజీయర్ స్వామి గత వారం ప్రకటించారు. ఈ వాయిదా సీఎం కేసీఆర్ కోసమేనంటూ ప్రచారం సాగుతోంది. …
తెలంగాణలో వందలాది మంది రైతులు పిట్టల్లా రాలిపోతుంటే సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఏంటీ?… రాష్ట్రంలో అంత గొప్ప పరిస్థితులు ఏమున్నాయని బర్త్ డే సంబురాలు జరుపుకున్నారు? అంటూ బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి ప్రశ్నించారు. ఒకవేళ అంత సంబురంగా ఉంటే ఇంట్లో చేసుకోవచ్చు కదా? అని ఆమె విస్మయం వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణ అని చెప్పి… కేసీఆర్ కుటుంబమే బాగుపడింది తప్ప, ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఆమె ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమం పుట్టిందే… నీళ్లు, నిధులు, నియమకాల కోసం అని ఆమె గుర్తు చేశారు. కానీ, కేసీఆర్ అధికారంలో వచ్చినప్పటి నుంచి వాటిని గాలికొదిలేసి, ప్రజాపాలనకు బదులు ఫామ్ హౌస్ పాలన చేస్తున్నడని ఆమె విమర్శించారు. ప్రజలు బాధల్లో ఉంటే మానవత్వం ఉన్నవారెవరూ పుట్టినరోజు వేడుకలు జరుపుకోరు. కానీ, ఆ దొరవారికి పబ్లిసిటీ కావాలి కాబట్టి, దేశం మొత్తం తన ఫ్లెక్సీలు, హోర్డింగులు పెట్టించి..…