Author: Editor's Desk, Tattva News

వెస్టిండీస్‌తో శుక్రవారం జరిగిన మూడో, చివరి వన్డేలో టీమిండియా 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ 30 తేడాతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. వెస్టిండీస్‌పై టీమిండియాకు ఇది రికార్డు స్థాయిలో 11వ సిరీస్ విజయం కావడం విశేషం. ఈ నేపథ్యంలో టీమిండియా పలు రికార్డులు బద్దలు కొట్టింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 37.1 ఓవర్లలోనే కేవలం 169 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లు సమష్టి ప్రతిభతో జట్టుకు హ్యాట్రిక్ విజయాన్ని సాధించి పెట్టారు. 2014లో స్వదేశంలో శ్రీలంకతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను 5-0 తో టీమిండియా క్లీన్‌స్వీప్‌ చేయడం ఆఖరుసారి. మళ్లీ ఏడేళ్ల తర్వాత టీమిండియా స్వదేశంలో ఒక జట్టును క్లీన్‌స్వీప్‌ చేసింది. విండీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయడం ద్వారా స్వదేశంలో ఒక జట్టును వైట్‌వాష్‌ చేసిన ఎనిమిదో కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ…

Read More

బడ్జెట్‌లో పేదలకు ఎలాంటి హామీలు ఇవ్వలేదని ప్రతిపక్షాలు చేసిన విమర్శలపై ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ”మానసిక పేదరికం గురించి మాట్లాడాలా? కాస్త స్పష్టంగా చెప్పండి” అంటూ గతంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఎద్దేవా చేశారు. కేంద్ర బడ్జెట్‌పై రాజ్యసభలో జరిగిన చర్చకు ఆర్థిక మంత్రి సమాధానమిస్తూ ఈ వాఖ్య చేయడంతో  శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రి పేదలను ఎగతాళి చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై స్పందించిన ఆర్థిక మంత్రి ”నేను పేదలను ఎగతాళి చేయడం లేదు. పేదలను అపహాస్యం చేసిన వారితోనే మీ పార్టీ పొత్తు పెట్టుకుంది. మీ (కాంగ్రెస్‌ పార్టీని ఉద్దేశిస్తూ) మాజీ అధ్యక్షుడు గతంలో పేదరికానికి కొత్త అర్థం చెప్పారు” అంటూ గుర్తు చేశారు.  “‘పేదరికం అంటే.. దుస్తులు, తిండి, డబ్బు లేకపోవడం కాదు. అది కేవలం మానసిక స్థితి మాత్రమే. ఆత్మ…

Read More

తెలంగాణ స‌ర్కార్ ఉపాధ్యాయులను ఉగ్రవాదులుగా చూస్తోందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి ఆరోపించారు. జీవో 317కు సవరణలు చేయాలని ఇందిరాపార్కులో శాంతియుతంగా నిరసన చేయాలనుకున్న ఉద్యోగులను రాత్రికి రాత్రే ప్రభుత్వం అదుపులోకి తీసుకోవడం దేనికి సంకేతమని ఆమె ప్రశ్నించారు.   ప్ర‌శ్నించే గొంతంటే కేసీఆర్‌కు న‌చ్చ‌దని, ప్రశ్నించే వారిని ఎలాగైనా నోరు మెదప‌కుండా చేయడానికి ఎన్ని పన్నాగాలైనా చేస్తారని ఆమె ఆరోపణలు చేశారు. 317 జీవోపై ప్రజాస్వామ్యబద్దంగా నిరసన తెలిపేందుకు సిద్ధమైన ఉపాధ్యాయులను ఎక్కడికక్కడ నిర్బంధించిన పోలీసులు… టీఆర్ఎస్ నిరసనలకు మాత్రం అనుమతినివ్వడం సిగ్గుచేటని విజయశాంతి మండిపడ్డారు.  తెలంగాణలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని, కల్వకుంట్ల రాజ్యాంగం మాత్రమే అమలవుతోందనడానికి ఇదే నిదర్శనమని ఆమె చెప్పారు. రాష్ట్రం వొచ్చినంక ఎట్లాంటి సమస్యలుండవని ఆశిస్తే… గత పాలకులకన్నా కేసీఆర్ నిరంకుశ పాల‌న చేస్తున్నారని విజయశాంతి ఆరోపించారు.

Read More

దాదాపు గత నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేనిరీతిలో అమెరికాలో ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో నమోదైందని అమెరికా కార్మిక శాఖ తెలిపింది. జనవరిలో వినియమ ధరలు అత్యంత వేగంగా పెరిగాయని పేర్కొంది. దీంతో ఫెడరల్‌ రిజర్వ్‌ మరింత కట్టుదిట్టంగా ద్రవ్య విధానానిు రూపొందించే అవకాశాలు పెరిగాయి.  గత నెల్లో వినిమయ ధరల సూచీ (సిపిఐ) అంతకుముందు నెలతో పోలిస్తే 0.6శాతం పెరిగింది. గతేడాదితో పోలిస్తే 7.5శాతం పెరుగుదల నమోదైంది. 1982 జూన్‌ తర్వాత అతిపెద్ద వార్షిక పెరుగుదల ఇదేనని కార్మిక శాఖ గణాంకాలు తెలిపాయి. డిసెంబరులో 0.5శాతం పెరగగా అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఏడు శాతం పెరిగింది.  ఆహారం, ఇంధనం మినహాయించిన తర్వాత వినిమయ ధరల సూచీ గత 12 మాసాల్లో ఆరు శాతం పెరగగా, డిసెంబరుతో ముగిసిన 12 మాసాల కాలంలో 5.5శాతం పెరిగిందని నివేదిక తెలిపింది. గతేడాది కాలంలో ఇంధన సూచీ 27శాతం పెరగ్గా, ఆహార సూచీ 7శాతం…

Read More

నిపుణుల సంప్రదింపుల తర్వాత క్రిప్టోకరెన్సీలను దేశంలో నిషేదించాలా.. వద్దా? అనే దానిపై . కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పా రు. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా  క్రిప్టోకరెన్సీలపై రాజ్యసభలో ఆమె మాట్లాడుతూ వర్చువల్ కరెన్సీల వల్ల వచ్చే లాభాలపై కేంద్ర ప్రభుత్వం 30 శాతం పన్ను విధించడానికి ప్రైవేట్ క్రిప్టోకరెన్సీల చట్టబద్ధతతో సంబంధం లేదని స్పష్టం చేశారు.   క్రిప్టోకరెన్సీ లావాదేవీల వల్ల వచ్చిన లాభంపై పన్ను విధించే సార్వభౌమ హక్కు ప్రభుత్వానికి ఉందని ఆర్థిక మంత్రి తెలిపారు. “క్రిప్టోకరెన్సీలను దేశంలో నిషేదించాలా.. వద్దా? అనేది నిపుణుల సంప్రదింపుల తర్వాత తెలుస్తుంది” అని సీతారామన్ తెలిపారు.  వ్యక్తి ఆదాయపు పన్ను స్లాబ్‌తో సంబంధం లేకుండా క్రిప్టోకరెన్సీ బదిలీలపై ద్వారా వచ్చే లాభాలపై 30 శాతం పన్ను విధించే ప్రతిపాదనను బడ్జెట్‌లో ఆమె ప్రకటించారు. ఈ ప్రకటనతో దేశంలో క్రిప్టోకరెన్సీలకు చట్టబద్దత వచ్చినట్లేనని పలువురు భావించారు.  ఈ అంశంపై సీతారామన్‌ స్పష్టతనిస్తూ..…

Read More

(నేడు దీనదయాళ్ జీ వర్ధంతి)చదువులలో చిన్నతనం నుంచే విశేషమైన ప్రతిభను ప్రదర్శించారు.  అయితే ఉన్నత ప్రభుత్వ ఉద్యోగాలవైపు చూడకుండా రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్ ఎస్ ఎస్) పట్ల ఆకర్షితులై, సంఘ ప్రచారక్ గా తన జీవితాన్ని సామాజిక సంఘటన కోసం అంకితమైన పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ స్వతంత్ర భారత దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందడం కోసం, మొత్తం ప్రజల వికాసం కోసం విశేషమైన ఏకాత్మ మానవతావాద సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.  భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక సభ్యునిగా, ఒక రాజకీయ పార్టీగా దాని ఎదుగుదలకు మొదటి నుండి బలమైన పునాది ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర వహించారు. అంతేకాదు మిగిలిన రాజకీయ పార్టీలు భిన్నంగా విశిష్టమైన ఆర్ధిక, సామాజిక, ధార్మిక సైద్ధాంతిక పునాదిని పార్టీకి ఏర్పాటు చేశారు. ఆ తర్వాత బిజెపిగా రూపాంతరం చెంది, పలు రాష్ట్రాలలో, కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అనుసరిస్తున్న విధానాలు, అమలు పరుస్తున్న పలు కార్యక్రమాలకు దీనదయల్ ప్రబోధించిన  విలువలు, సిద్ధాంతాలే…

Read More

216 అడుగుల విగ్రహం రామానుజాచార్యుల మరో అవతారంగా భావిస్తున్నాట్లు చెబుతూ రామానుజాచార్యుల విగ్రహ ఏర్పాటుతో యుగయుగాలకు రామానుజాచార్యుల సందేశం అందుతుందని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం భగవద్రామానుజుల విగ్రహాన్ని దర్శించుకున్నారు. 108 దివ్యదేశాలను దర్శించుకొని, యాగశాలలో శ్రీలక్ష్మీనారాయణ మహాయజ్ఞంలో పాల్గొన్నారు. రాజ్‌నాథ్ సింగ్‌ తో పాటు ఏపీ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ శ్రీశ్రీ రవిశంకర్‌జీ, కేంద్రమాజీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ కూడా ప్రధాన యాగశాలలో పెరుమాళ్‌కు పూజలు చేశారు. రాజ్‌నాథ్‌ సింగ్‌కు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌స్వామీజీ మంగళాశాసనాలు అందించారు. ప్రవచన మండపంలో రాజ్‌ నాథ్‌ సింగ్‌ భగవద్రామానుజాచార్యుల చరిత్రను చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. రామానుజాచార్యుల సమతా సిద్ధాంతాన్ని వివరించారు.  రామానుజాచార్యుల విశాల విగ్రహాన్ని ఏర్పాటు చేసిన త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ, మైహోంగ్రూప్‌ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావులను అభినందించారు.   రామానుజాచార్యుల శిష్యుల్లో అన్నికులాలకు చెందినవారున్నారని చెబుతూ తనకు గురువు చెప్పిన ముక్తిమంత్రాన్ని గుప్తంగా…

Read More

ట్రిపుల్ తలాక్ పద్ధతిని నిషేధించడం ద్వారా బీజేపీ ప్రభుత్వం ముస్లిం మహిళలకు న్యాయం చేసిందని పేర్కొంటూ  “కానీ మన ముస్లిం సోదరీమణులు మోదీని ప్రశంసించడం చూసిన ప్రతిపక్ష పార్టీలు వారిని అడ్డుకోవాలని భావించాయి” అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. “ముస్లిం మహిళల  వారి హక్కులు, ఆకాంక్షల మార్గంలో అడ్డుగా నిలబడడానికి కొత్త మార్గాలతో ముందుకు వస్తున్నారు” కర్ణాటకలోని హిజాబ్ వివాదాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ విమర్శించారు.   ‘‘ఇప్పుడిప్పుడే హక్కులను, అభివృద్ధిని సాధించుకుంటున్న ముస్లిం మహిళలను అడ్డుకోవడానికే ఇలాంటి కొత్త ఎత్తులు వేస్తున్నారు’’ అంటూ కర్ణాటకను రగిలిస్తున్న హిజాబ్‌ ధారణ అంశాన్ని పరోక్షంగా ఆయన ప్రస్తావించారు శాసన సభ ఎన్నికల ప్రచారంలో, కరోనా మహమ్మారి ఆంక్షల నేపథ్యంలో, తొలిసారి  ప్రత్యక్షంగా యూపీలోని సహరాన్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని ప్రసంగిస్తూ, ముస్లిం మహిళలపై నేరాలను అరికట్టేందుకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ప్రధాని కొనియాడారు. అయితే మరోవైపు ప్రతిపక్షాలు ఓట్ల కోసం ముస్లిం…

Read More

అభివృద్ధిలో భాగమైన రైల్వే లైన్ల నిర్మాణం, విస్తరణలపై ఎపి ప్రభుత్వానికి ఎంతమాత్రం చిత్తశుద్ధి లేదని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ విమర్శించారు. రైత్వే మంత్రిత్వశాఖ ఇచ్చిన వివరణతో రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల్లో ఎందుకు జాప్యం జరిగిందో తెలుస్తోందని,వైసిపి ప్రభుత్వ వైఖరి తేటతెల్లమైందని ధ్వజమెత్తారు. “నిధులు ఇవ్వరు.. భూసేకరణ కూడా చేయరు. రాష్ట్ర ప్రభుత్వం తన భాధ్యతను విస్మరిస్తే రైల్వే ప్రాజెక్టులు ఎలా పూర్తవుతాయి? మౌలిక వసతుల అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది? ఇలాగైతే ఆయా లైన్లు ఎప్పటికి పూర్తవుతాయి? ” అని ఆయన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. రైల్వేశాఖ, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో పూర్తి కావచ్చిన ప్రాజెక్టులు ఎపి ప్రభుత్వ అలసత్వంతోనే జాప్యం అవుతున్నాయని సోషల్ మీడియా పోస్ట్ లో ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా సమకూర్చాల్సిన నిధులను విడుదల చేయకపోతే పనులు ఎలా సాగుతాయని పవన్‌ ప్రశ్నించారు. ”కీలకమైన రైల్వే లైన్లు అసంపూర్తిగా ఉండిపోయాయి. కోటిపల్లి ానరసాపురం…

Read More

రాష్ట్రంలోని విద్యాసంస్థలను తెరుచుకోవచ్చని పేర్కొంటూ ఈ సమస్య పరిష్కారం అయ్యేంతవరకు విద్యార్థులు తమ మతాచారాలను ప్రతిబింబించేలా ఎలాంటి దుస్తులు ధరించకూడదని స్పష్టం చేస్తూ విద్యార్థునులపై హిజాబ్ నిషేధం కొనసాగించే విధంగా కర్ణాటక హైకోర్టు కీలకమైన తీర్పు ఇచ్చింది. కళాశాల విద్యార్థినులు హిజాబ్ ధరించడంపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన త్రిసభ్య ధర్మాసనం మధ్యంతర ఉత్తరువులు ఇవ్వడానికి నిరాకరించింది. సమస్య పెండింగ్‌లో ఉన్నంత కాలం విద్యార్థులు మతపరమైన ఎలాంటి దుస్తులు ధరించరాదని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను సోమవారానికి (14వ తేదీ) వాయిదా వేసింది. అయితే ఈ ఆదేశాలు తమ క్లయింట్ రాజ్యాంగ హక్కులను సస్పెండ్ చేయడమేనన్న తన అభ్యంతరాన్ని పరిశీలించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది దేవదత్త కామత్ కోరగా, ఈ ఏర్పాటు సమస్య పరిష్కారమయ్యేంత వరకు కొద్ది రోజులు మాత్రమేనని చీఫ్ జస్టిస్ రితురాజ్ అవస్థి పేర్కొన్నారు. విచారణను వాయిదా వేయడానికి ముందు చీఫ్ జస్టిస్ అవస్థి…

Read More