Author: Editor's Desk, Tattva News

ప్రభుత్వ నిర్బంధాలను, కక్షసాధింపు చర్యలను ఖాతరు చేయకుండా విజయవాడలో బ్రహ్మాండమైన నిరసన ప్రదర్శన నిర్వహించిన ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులను వారి నాయకత్వం మంత్రులతో జరిపిన చర్చలలో రాజీ పడి, సమ్మె పిలుపును ఉపసంహరించుకోవడం పట్ల సర్వత్రా ఆగ్రవేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఉద్యోగ సంఘాలు గెలుపొందగా, ఉద్యోగులు ఓటమి చెందారని ఎద్దేవా చేస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగ సంఘాల నేతలపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. ప్రతి ఉద్యోగి గెలుపు సాధించేవరకు పోరాటం చేస్తామన్న నేతలు మధ్యలో కాడి ఎత్తేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం మూడు షరతులకు అంగీకరిస్తేనే చర్చలు అని చెప్పిన నాయకులను ప్రభుత్వంలోని పెద్దలు వివిధ మార్గాల ద్వారా, తెరవెనుక వత్తిడులు తెచ్హి, ఎటువంటి అదనపు హామీలు ఇవ్వకుండానే చర్చలకు కూర్చోనేటట్లు చేసి, అర్ధరాత్రి వరకు చర్చలు జరిపి, సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటన చేయించారనే ఆరోపణలు వస్తున్నాయి. పిఆర్‌సి ఒప్పందంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉద్యోగ, ఉపాధ్యాయులో ఆదివారం ఈ విషయంపైనే చర్చ సాగింది. పెద్ద ఎత్తున నిర్వహించిన ఆందోళన తరువాత…

Read More

రాష్ట్ర ప్రభుత్వ ఆధిపత్య ధోరణితో ఉద్యోగులకు ఊరట దక్కలేదని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలకు సంబంధించిన డిమాండ్ల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి కనబరచకుండా ఆధిపత్య ధోరణితో వెళ్లిందని ఆయన ధ్వజమెత్తారు.  దీనివల్ల ఉద్యోగులకు ఊరట లభించలేదని స్పష్టం చేశారు.  ఫిట్‌మెంట్‌, గత హెచ్‌ఆర్‌ఏ కొనసాగింపు, అశుతోష్‌ మిశ్రా నివేదిక ఇవ్వడం లాంటి ప్రధాన డిమాండ్లతో విజయవాడలో ఉద్యోగులు ఉవ్వేత్తున చేసిన భారీ ర్యాలీ ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసిందని ఆయన గుర్తు చేశారు. డిమాండ్లు నెరవేరకుండానే సమ్మె నిర్ణయం ఉపసంహరించుకొని ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పాల్సిన పరిస్థితిని పీఆర్సీ స్టీరింగ్‌ కమిటీ నాయకులకు ప్రభుత్వం కల్పించిందని ఆయన  దుయ్యబట్టారు.  సమ్మె ఉపసంహరణ ప్రకటనపై ఉపాధ్యాయ సంఘాలు విభేదించిన విషయాన్ని వారు ప్రస్తావిస్తున్న అంశాలను జనసేన పరిగణనలోకి తీసుకుంటుందని ఆయన చెప్పారు. ప్రభుత్వ వైఖరితో నష్టపోయిన ఉద్యోగ వర్గం పట్ల జనసేన సానుకూల దృక్పథాన్ని కనబరుస్తూ , వారి భావోద్వేగాలు…

Read More

ప్రముఖ గాయనీ లతా మంగేష్కర్ ఆలపించి ‘రామ్ భజన’ తన చారిత్రక రథయాత్రకు ‘సిగ్నేచర్ ట్యూన్’గా మారిందని బిజెపి సీనియర్ నాయకుడు ఎల్‌కె అద్వానీ(94) అన్నారు. ఆమె మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన మాజీ ఉపప్రధాని ఆమెతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆమె అస్తమయంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెతో తనకు సుదీర్ఘ అనుబంధం ఉందని, అది తన అదృష్టమని వ్యాఖ్యానించారు. సోమ్‌నాథ్ నుంచి అయోధ్య వరకు రథయాత్ర చేపట్టాలని సంకల్పించినప్పుడు లత స్వయంగా రామ్ భజన ఆలపించి తనకు పంపారని అద్వానీ గుర్తుచేశారు. ఆమె ఆలపించిన “రామ్ నామ్ మే జాదూ ఐసా… రామ్ నామ్ మన్ భాయే…మన్‌కీ అయోధ్య తబ్ తక్ సూనీ, జబ్ తక్ రామ్ నా ఆయే…” అంటూ సాగే ఆ చిరస్మరణీయ భజన తన రథయాత్రకు సిగ్నేచర్ ట్యూన్‌గా మారిందని తెలిపారు.  1990లె సాగిన రథయాత్ర బిజెపికి ప్రజల్లో…

Read More

ఇటీవల హరిద్వార్‌లోని హర్‌కీ పైరీలో గంగమ్మను పూజించిన కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీపై విరుచుకుపడిన బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, దేవాలయాలకు వెళ్లి ప్రార్థనలు చేయడంలో బీజేపీ ఆయనకు `మంచి’ నేర్పిందని ఎద్దేవా చేశారు.పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఉత్తరకాశీలో జరిగిన ర్యాలీని ఉద్దేశించి నడ్డా మాట్లాడుతూ, ఈ రోజుల్లో కాంగ్రెస్ నాయకులు దేవాలయాలకు వెళ్లి గంగా, యమునా హారతి చేస్తున్నారని విస్మయం వ్యక్తం చేశారు. ఓటర్లను హెచ్చరిస్తూ, రామ మందిర నిర్మాణానికి అడ్డంకులు కల్పించేది కూడా ఇటువంటి కపటమని ధ్వజమెత్తారు. అయితే అందులో మంచి విషయమేమిటంటే.. చివరకు మా దగ్గరే గుళ్లకు వెళ్లడం నేర్చుకున్నారని.. చివరకు మీరు భారతీయ సంస్కృతిని గుర్తు చేసి బీజేపీ నుంచి గుళ్లకు వెళ్లడం నేర్చుకున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు.ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌లలో బీజేపీ మాత్రమే అభివృద్ధి సాధిస్తుందని స్పష్టం చేస్తూ అభివృద్ధిలో ఒక్క ఇంటిని కూడా వదిలిపెట్టబోమని నడ్డా భరోసా ఇచ్చారు.బీజేపీ కాకుండా ఇతర పార్టీలు వస్తుంటాయి, ప్రలోభపెట్టి వాగ్దానాలు చేసి…

Read More

అమెరికాలో మహాత్ముని విగ్రహానికి మరోసారి అవమానం జరిగింది. న్యూయార్క్‌లోని మన్‌హటన్‌కి సమీపంలోని యూనియన్‌ స్క్వేర్‌లో వున్న గాంధీ నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని కొంతమంది దుండగులు శనివారం ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ చర్యను భారత కాన్సులేట్‌ జనరల్‌ తీవ్రంగా ఖండించారు. ఇటువంటి తుచ్ఛమైన చర్యకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాన్సులేట్‌ జనరల్‌ కోరారు. ఈ చర్య పట్ల భారతీయ అమెరికన్లు తీవ్ర బాధను, దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విగ్రహంలో గాంధీ ముఖాన్ని గుర్తు పట్టడానికి వీల్లేకుండా ధ్వంసం చేశారనికాన్సులేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా పేర్కొంది. వెంటనే ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై విచారణ జరిపి, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. గాంధీ 117వ జయంతిని పురస్కరించుకుని 1986 అక్టోబరు 2న అంతర్జాతీయ గాంధీ మెమోరి యల్‌ ఫౌండేషన్‌ ఈ ఎనిమిది అడుగుల నిలువెత్తు విగ్రహాన్ని డొనేట్‌ చేసింది. 2001లో ఇక్కడ…

Read More

భారత్‌లో మూడో వేవ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టడం మొదలైంది. గత ఇరవై నాలుగు గంటల్లో 83, 876 కేసులు నమోదు అయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. 11,56,363 మందికి కరోనా టెస్ట్‌లు నిర్వహించగా.. 83 వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. కరోనా మరణాలు 895 చోటు చేసుకున్నాయి. ఒక్కరోజులో 1,99, 054 మంది కరోనా నుంచి కోలుకున్నారు. జనవరి 6 తర్వాత లక్ష మార్క్‌కు దిగువన కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 11, 08, 938 కాగా, రోజూవారీ పాజిటివిటీ శాతం 5, 02, 874గా ఉంది. ఇక ఇప్పటివరకు దేశంలో కరోనాతో 5, 02, 874 మంది (అధికార గణాంకాల ప్రకారం) చనిపోయారు. మొత్తం రికవరీల సంఖ్య 4,06,60,202గా నమోదు అయ్యింది. వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో భాగంగా భారత్‌లో ఇప్పటిదాకా 1,69,63,80,755 డోసులు అందించింది.…

Read More

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాక కీలక సమావేశాలకే పరిమితమైన రాష్ట్ర బీజేపీ అగ్రనేత బీఎస్‌ యడియూరప్ప మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా  జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు.  2023 ఎన్నికల్లో రాష్ట్రంలో తిరిగి బీజేపీ గెలుపే లక్ష్యంగా ఆయన జిల్లాల్లో పర్యటించనున్నారు. మరో రెండు వారాల్లోనే జిల్లాల షెడ్యూల్‌ను ప్రకటించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది.  ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయనకు కేంద్ర ప్రభుత్వం గవర్నర్ పదవిని ఇవ్వజూపిన ఆయన సున్నితంగా తిరస్కరించారని, రాష్ట్రంలో బిజెపిని బలోపేతం చేయడం పట్లనే దృష్టి కేంద్రీకరింపనున్నట్లు స్పష్టం చేశారని గతంలో వార్తా కధనాలు వెలువడ్డాయి.  ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన వెంటనే జిల్లాలవారీగా పర్యటిస్తానని, మరోసారి రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తానని ఆయన ప్రకటించారు. అయితే కరోనా వైరస్‌ కేసులు రాష్ట్రంలో తీవ్రరూపం దాల్చడంతో వెనుకడుగు వేశా రు. ప్రస్తుతం వైరస్‌ కేసులు రోజూ 10వేలకుపైగానే నమోదవుతున్నా తీవ్రమైన ప్రభావం లేకపోవడంతో సర్వత్రా సాధారణ పరిస్థితులు నెల కొంటున్నాయి.  దీంతో…

Read More

లెజెండరీ సింగర్‌ లతా మంగేష్కర్‌ (92) ఇక లేరు. ముంబై బ్రీచ్‌ క్యాండీ ఆస్పత్రిలో ఈ ఉదయం 8గం.12ని. తుదిశ్వాస విడిచిపెట్టారు.  గత 29 రోజులుగా ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. గత నెల 8వ తేదీన కరోనాతో ఆమె ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆపై కరోనా నుంచి రికవరీ అయిన ఆమె.. వెంటిలేటర్‌పై కొన్నాళ్లు చికిత్స పొందారు.  ఈ క్రమంలో ఆమె కోలుకుంటున్నట్లు వైద్యులు ఈమధ్యే ప్రకటించారు కూడా. అయితే పరిస్థితి విషమించడంతో ఆమెకు మళ్లీ వెంటిలేటర్‌ మీదే చికిత్స అందించారు. 1929 సెప్టెంబరు 28 తేదీన సుప్రసిద్ధ సంగీతకారుడు దీనానాథ్ మంగేష్కర్‌కు పెద్ద కుమార్తెగా జన్మించారు లత. అయిదవ ఏటనే తండ్రివద్ద సంగీత శిక్షణ ప్రారంభించిన లత సంగీతమే మరోలోకంగా జీవించారు.   చిన్న తనంలోనే తండ్రి మరణించడంతో పదమూడేళ్ళ వయసుకే కుటుంబ పోషణ బాధ్యత లతపై పడింది. దీంతో  సినీరంగంలోకి ప్రవేశించి 1942లో మరాఠీ చిత్రం పహ్లా మంగళ గౌర్లో…

Read More

సమాజ్‌వాదీ పార్టీ “బుజ్జగించే రాజకీయాలు”కు పెట్టింది పేరుకాగా, గాల్వాన్ ఘర్షణలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ నాయకుడు చైనా మీడియాను మాత్రమే నమ్ముతాడని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ధ్వజమెత్తారు. ఉత్తర ప్రదేశ్ లోని బల్దియో అసెంబ్లీ నియోజకవర్గంలోని ఫరా పట్టణంలో బీజేపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే పురాణ్ ప్రకాశ్ ప్రచారం సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ రాజకీయాలు మతానికి అతీతంగా ఉండాలని హితవు చెప్పారు. ‘రాజకీయ ప్రాథమిక ఉద్దేశం ప్రభుత్వాన్ని నడపడం మాత్రమే కాదు, సమాజం, దేశ సంక్షేమం కోసం పనిచేయడం’ అని పేర్కొన్నారు, విభజన రాజకీయాలను బిజెపి ఎప్పటికీ అంగీకరించదని ఆయన స్పష్టం చేశారు. సమాజ్‌వాదీ పార్టీ బుజ్జగింపు రాజకీయాలు చేస్తుందని, రాజకీయాలు కేవలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసమే తప్ప ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసమే జరగాలని, కులం, మతాల ఆధారంగా రాజకీయాలు చేయరాదని హితవు చెప్పారు. ఎస్పీ మతం, కులాల మధ్య చిచ్చు పెడుతోందని మండిపడ్డారు. యూపీ పురోగతితోనే నవ భారత…

Read More

శ్రీరామానుజాచార్యుల బోధనలు ఎప్పటికీ అనుసరణీయమైనవని, ఆయన చేసిన బోధనల సారాన్నే తమ ప్రభుత్వం కూడా అమలు చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మారుతున్న భారతావనిలో ప్రతి ఒక్కరూ సమానంగా, ఒకే విధమైన ప్రయోజనం, గౌరవం పొందాలన్న ఉద్దేశంతో తమ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని, ఈ రకమైన విధానం ఉండాలనే రామానుజాచార్య వెయ్యేళ్ల క్రితమే సందేశం ఇచ్చారని ఆయన చెప్పారు. శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో నిర్మించిన 216 అడుగుల ఎత్తయిన రామానుజాచార్యుల (సమతా మూర్తి) విగ్రహాన్ని శనివారం సాయంత్రం జాతికి అంకితం చేస్తూ సమాజంలో అణచివేతకు గురైన వర్గాలను రామానుజాచార్యులు ఎంతో ప్రత్యేకంగా గౌరవించారని, పుట్టిన జాతి వల్ల కాకుండా గుణం వల్ల గౌరవం లభించాలని, మానవులంతా సమానమేనని ఆయన చెప్పారని గుర్తు చేసారు. రామానుజుల వారు 11వ శతాబ్దంలోనే మానవ కల్యాణం గురించి ఆలోచించారని, మూఢ విశ్వాసాలను పారద్రోలి, భక్తికి కులం, జాతితో సంబంధం లేదని, అంతా సమానమేనని చాటి చెప్పారని ప్రధాని చెప్పారు.…

Read More