Author: Editor's Desk, Tattva News

త్వరలో జరగనున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో గెలుపు తమదేనని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు డా. కె లక్ష్మణ్ భరోసా వ్యక్తం చేశారు. ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని ఢిల్లీ చేరుకున్న అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కారునే కోరుకుంటున్నారని చెప్పారు. ఉత్తరాఖండ్‌లో 70, యూపీలో 98 అసెంబ్లీ స్థానాల్లో ప్రచారం నిర్వహించే బాధ్యతను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తనకు అప్పగించారని ఆయన తెలిపారు. 5 రాష్ట్రాల్లో బీజేపీ అనుకూల పవనాలు ఉన్నాయని, అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. యూపీలో మోదీ-యోగి, ఉత్తరాఖండ్‌లో మోదీ-ధామి డబుల్ ఇంజిన్ సర్కారు మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని డా. లక్ష్మణ్ తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో యోగి ప్రభుత్వం మాఫియా పనిపట్టి, కనిపించకుండా చేసిందని ఆయన గుర్తు చేశారు. తద్వారా గూండారాజ్ నుంచి ప్రజలకు విముక్తి లభించిందని, ముఖ్యంగా…

Read More

దేశ భవితవ్యాన్ని నిర్దేశించేది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలేనని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్‌లో వరుసగా రెండోసారి అధికారం లోకి రావడానికి బీజేపి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా గురువారం మధురలో అమిత్‌షా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజ్‌వాది పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. అఖిలేశ్‌ను గెలిపిస్తే గూండా రాజ్యం వస్తుందని హెచ్చరించారు. “ అఖిలేశ్ బాబూ… నువు చట్టం గురించి మాట్లాడుతున్నావు. మీ నేత ఆజాం ఖాన్ అరెస్ట్ అయ్యారు. ఆయనపై అనేక కేసులు నమోదయ్యాయి. కొద్దిగా సిగ్గుపడు ” అని హితవు చెప్పారు. “ఒకప్పుడు యూపీని గూండాలు, నేరస్తులు ఏలేవారు. పోలీసులు కూడా వారికి భయపడేవారు. మహిళలు, యువతులు ఓటు వేయడానికి భయపడేవారు. కానీ ఇప్పుడది పూర్తిగా మారిపోయింది. గూండాలు, నేరస్తులు వాళ్లకు వాళ్లుగా పోలీసుల ముందుకు వచ్చి లొంగి పోతున్నారు. వాళ్ల మెడకి వాళ్లే ఉరి బిగించుకుంటున్నారు” అని ఆయన గుర్తు…

Read More

డ్ర‌గ్ కంట్రోల‌ర్ సంస్థ డీసీజీఐ కీల‌క నిర్ణ‌యాన్ని తీసుకుంది. కోవాగ్జిన్, కోవీషీల్డ్ వ్యాక్సిన్ల మార్కెటింగ్ విక్ర‌యాల‌కి అనుమ‌తిని ఇచ్చింది. మెడిక‌ల్ స్టోర్ల‌లో వ్యాక్సిన్లు అందుబాటులో ఉండ‌వ‌ని, హాస్ప‌ట‌ల్స్, క్లీనిక్ లు వ్యాక్సిన్ ల‌ను కొనుగోలు చేయొచ్చ‌ని వెల్ల‌డించింది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ మొదలైనప్పటి నుంచి ప్రజలకు ఎక్కువగా కోవీషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లను ఇస్తున్నారు. ఇప్పటికే ఈ రెండు వ్యాక్సిన్లు కరోనాపై సమర్థవంతంగా పనిచేస్తున్నాయని పలు అధ్యయనాలు తెలియజేశాయి. కోవీషీల్డ్ ను పూణేలోని సీరం ఫార్మా సంస్థ తయారు చేస్తుండగా… కోవాగ్జిన్ ను హైదరాబాద్ బేస్డ్ భారత్ బయోటెక్ సంస్థ తయారు చేస్తోంది. ఈ మేర‌కు టీకా డేటా ప్ర‌తి ఆరు నెల‌ల‌ల‌కి డీసీజీఐకి వెల్ల‌డించాల‌ని తెలిపింది. కోవిన్ యాప్ లో కూడా డేటా అప్‌డేట్ చేయాలనే షరతులును విధించింది. కాగా, ఒమిక్రాన్‌ సోకినవారిలో రోగనిరోధక శక్తి గణనీయంగా పెరిగిందని ఐసీఎంఆర్‌ శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది డెల్టాతో పాటు ఇతర వేరియంట్లను సైతం సమర్ధవంతంగా…

Read More

భారత్‌లో గతేడాది డిసెంబర్‌ నాటికి 5.3 కోట్ల మంది నిరుద్యోగులున్నారని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమి (సిఎంఐఇ) తెలిపింది. వీరిలో మహిళలు ఎక్కువగా ఉన్నట్టు వివరించింది. కాగా, మొత్తం నిరుద్యోగుల్లో 3.5 కోట్ల మంది క్రియాశీలంగా ఉపాధిని కోరుకుంటున్నవారు కాగా, 1.7 కోట్ల మంది పని చేయాలనే తపన ఉన్నప్పటికీ ఉద్యోగాన్ని చురుకుగా కోరుకోనివారని సీఎంఐఈ వివరించింది.  కాగా, ఉద్యోగం చేయాలనే తపన ఉన్నప్పటికీ నిరుద్యోగులుగా మిగిలిపోయిన 3.5 కోట్ల మందికి తక్షణమే ఉపాధి చూపెట్టాల్సిన అవసరం భారత్‌కు ఉన్నదని సీఎంఐఈ విశ్లేషించింది. ఈ 3.5 కోట్ల మంది నిరుద్యోగుల్లో 23 శాతం మంది అంటే 80 లక్షల మంది మహిళలు ఉన్నారు.  ఇక, 1.7 కోట్ల మంది నిరుద్యోగుల్లో 53 శాతం మంది, అంటే 90 లక్షల మంది వరకు మహిళలున్నారు. ‘ఇంత సంఖ్యలో మహిళలు నిరుద్యోగులుగా ఉండటానికి ఉద్యోగాలు లేకపోవడమా? లేదా శ్రామిక శక్తిలో భాగమయ్యేందుకు సామాజిక మద్దతు…

Read More

గవర్నర్ డా. తమిళశై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుల మధ్య కొద్దికాలంగా అంతర్గతంగా కొనసాగుతున్న విబేధాలు ప్రస్తుతం బహిరంగం అవుతున్నాయి. ముఖ్యంగా కేసీఆర్ ఈ మధ్య కాలంలో బిజెపిపై బహిరంగంగా పోరాటం ప్రారంభించడం, గవర్నర్ ఇదివరకు తమిళనాడు బిజెపి అధ్యక్షురాలు కావడంతో సహజంగానే వారిద్దరి మధ్య దూరం పెరగడానికి దారితీస్తుంది.  బుధవారం గవర్నర్ ప్రసంగించిన రిపబ్లిక్ దినోత్సవంకు ముఖ్యమంత్రి గైరాజరు కావడం రాజకీయంగా చాలా అనూహ్యంగా పరిశీలకులు భావిస్తున్నారు. పైగా మంత్రులెవ్వరు సహితం పాల్గొనక పోవడం భవిష్యత్ లో చెలరేగనున్న రాజకీయ దుమారాన్ని వెల్లడి చేస్తున్నది. ఆమె ప్రసంగాన్ని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదింపలేదని కూడా తెలుస్తున్నది.  గణతంత్ర దినోత్సవానికి వెళ్లకూడదన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఉత్సవాన్ని రాజ్‌భవన్‌కు పరిమితం చేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గత సంవత్సరం కూడా డెల్టా వేరియంట్‌ విజృంభించిన సమయంలో పబ్లిక్‌ గార్డెన్‌లో గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించడం, సీఎం కేసీఆర్‌ కూడా హాజరు కావడం గమనార్హం.  అప్పుడు లేని కరోనా భయం ఇప్పుడే పుట్టుకొచ్చిందా?…

Read More

పార్టీ గేట్’ కుంభకోణం ఆ దేశంలో వివాదాస్పదమైన నేపథ్యంలో ప్రధాని పదవికి రాజీనామా చేయాలని వత్తిడులు పెరుగుతున్నా చేసే ప్రసక్తి లేదని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ స్పష్టం చేస్తున్నారు.  తనపై ఎంత ఒత్తిడి తీసుకువచ్చినా రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.  గతేడాది కరోనా లాక్‌ డౌన్‌ సమయంలో నిబంధనలను ఉల్లంఘించారని బోరిస్‌ పై దేశ వ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు జరుతున్న నేపధ్యంలో ఆయన మరోసారి స్పందించారు. ఎటువంటి పరిణామాలనైనా ఎదుర్కొందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు.  కరోనా కట్టడిలో బోరిస్‌ విఫలం అవ్వడంతో పాటు తన జన్మదిన వేడుకలు లాక్‌ డౌన్‌ లో కోవిడ్‌ నిబంధలకు విరుద్ధంగా జరుపుకున్నారు. దీంతో ప్రధాని పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు కూడా డిమాండ్‌ చేస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలలో కరోనా ఆంక్షలను ఉల్లంఘిస్తూ ‘పార్టీ గేట్‌’ లపై లండన్‌ మెట్రోపాలిటన్‌ పోలీసులు విచారణ చేపట్టారు. రాజీనామా చేయాలని అన్ని వర్గాల నుండి వస్తున్న…

Read More

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి గులామ్ నబీ ఆజాద్‌కు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ ప్రకటించడంపై కాంగ్రెస్‌లో కలకలం రేగుతున్నది. దీనిపై పార్టీలో వ్యవస్థాగత సంస్కరణల పేరుతో రాహుల్ గాంధీ నాయకత్వంపై బహిరంగంగానే తిరుగుబాటు ప్రకటిస్తున్న జీ 23 సభ్యులు, గాంధీ కుటుంబానికి విధేయులనే పేరుతో రాహుల్ కు బాసటగా ఉంటున్న నేతల మధ్య స్పష్టమైన చీలిక వెల్లడవుతుంది.  అయితే ప్రతిపక్ష నేతలకు `పద్మా’ అవార్డులు ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. గతంలో పివి నరసింహారావు ప్రభుత్వం బిజెపి నేత వాజపేయికి `పద్మ విభూషణ్’ పురస్కారం అందించింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం సహితం ఎన్సీపీ అభినేత శరద్ పవర్ కు `పద్మ విభూషణ్’, జీవితం అంతా కాంగ్రెస్ లో గడిపిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖేర్జీకి `భారత రత్న’ పురస్కారాలను అందించింది.  జీ 23 సభ్యులైన కేంద్ర మాజీ మంత్రులు ఆనంద్‌శర్మ, కపిల్ సిబాల్, శశిథరూర్ ఆజాద్‌కు పద్మభూషణ్ రావడాన్ని బహిరంగంగానే స్వాగతించారు. ప్రజాసేవలకు, పార్లమెంటరీ…

Read More

భారతదేశం, పాకిస్తాన్ ల మధ్య వాణిజ్యం, ప్రయాణాలు పూర్తిగా నిలిచిపోయిన, ధార్మిక క్షేత్రాల సందర్శనకు హిందూ, ముస్లిం, సిక్కు యాత్రికులు విమానంలో ప్రయాణించడానికి భారత్ అనుమతించాలని పాకిస్తాన్ హిందూ కౌన్సిల్ కోరింది. అందుకోసం లాహోర్ నుంచి  పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పిఐఎ) కు చెందిన  రెండు చార్టర్డ్ విమానాలను అనుమతించాలని కోరుతూ   పాకిస్తాన్ హిందూ కౌన్సిల్ (పిహెచ్‌సి) చీఫ్ ప్యాట్రన్ రమేష్ వాంక్వానీ వ్రాసిన లేఖను ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ భారత  విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఇఎ)కు అందజేసింది.   ఈ విషయమై భారత ప్రభుత్వం స్పందించవలసి ఉంది.  డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) సీనియర్ అధికారి ఒకరు  “ప్రస్తుతం విమానయాన సంస్థ నుండి ఎటువంటి అభ్యర్థన రాలేదు” అని చెప్పారు. గత ఏడాది నవంబర్‌లో ప్రారంభమైన శ్రీనగర్-షార్జా విమానాలకు పాకిస్తాన్ ఓవర్‌ఫ్లైట్ అనుమతిని నిరాకరించిందని, డిసెంబర్‌లో భారతీయ యాత్రికులను పాకిస్తాన్‌కు తీసుకెళ్లడానికి పిఐఎ విమానాలను అనుమతించడానికి భారతదేశం నిరాకరించిందని అధికారులు గుర్తు చేశారు. అనుమతులు…

Read More

రాష్ట్రంలోని 13 జిల్లాలను 26 జిల్లాలుగా పునర్విభజన కావిస్తూ నోటిఫికేషన్ జారీ చేసిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రములో గల 13 జిల్లా పరిషద్ లను మాత్రం అదే విధంగా కొనసాగించేందుకు ఆలోచిస్తున్నది. ఈ మధ్యనే జిల్లా పరిషద్ ఎన్నికలు జరగడం, అన్నింట్లో అధికార పక్షమే ఆధిపత్యం వహిస్తూ ఉండడంతో,  ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకొనే వరకు అదే విధంగా కొనసాగించాలని చూస్తున్నారు.  తెలంగాణాలో 10 జిల్లాలను 31 జిల్లాలుగా మార్చినప్పుడు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరావు అదే విధంగా చేశారు. వెన్యూపరమైన అంశాల ప్రాతిపదికనే జిల్లాలను విభజిస్తూ ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ను జారీ చేయడంతో కొత్తగా ఏర్పడే జిల్లాలకు కొత్త జిల్లా పరిషద్ పాలకవర్గాలు ఏర్పడే అవకాశాలు కనిపించడం లేదు .రాష్ట్రంలోని జిల్లా ప్రజా పరిషత్‌లకు గతేడాది సెప్టెంబర్‌లో ఎన్నికలు జరగ్గా, అక్టోబర్‌లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. జిల్లాల విభజన కార్యరూపం దాల్చినప్పటికీ, జెడ్‌పి చైర్‌ పర్సన్‌, వైస్‌ చైర్మన్‌లసహా పాలకవర్గాలు ఐదేళ్లపాటు కొనసాగే అవకాశం ఉందని పంచాయతీరాజ్‌ నిపుణులు చెబుతున్నారు.  పంచాయతీరాజ్‌ చట్టం…

Read More

దాడులతో బీజేపీ నాయకులను, కార్యకర్తలను భయపెట్టాలని చూస్తే… వెన్నుచూపే ప్రసక్తే లేద‌ని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి  స్ప‌ష్టం చేశారు. అత్యంత ధైర్యవంతులు, సాహసవంతులైన త‌మ‌ పార్టీ కార్యకర్తలకు ఉద్యమాల్లో ప్రాణాలకు తెగించిన పోరాడిన చరిత్ర ఉంద‌ని ఆమె గుర్తు చేశారు.  “మీ కుట్రలను కసిగా తిప్పికొడుతూ మీ ప్రజావ్యతిరేక కార్యక్రమాలపై తిరగబడటం ఖాయం” అని విజ‌య‌శాంతి హెచ్చ‌రించారు. తెలంగాణలో రోజురోజుకు బీజేపీ బలపడుతుండడం చూసి ఓర్వలేని టీఆర్ఎస్ సర్కార్… రాజకీయంగా ఎదిరించలేక గూండా రాజకీయాలకు తెరతీస్తూ బీజేపీ నాయకులు, కార్యకర్తలపై భౌతిక దాడులకు తెగబడటం సిగ్గుచేటని ఆమె ధ్వజమెత్తారు.  నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ జిల్లాలోని గ్రామాలలో ఎంపీ ఫండ్స్‌తో అభివృద్ధి పనులను ప్రారంభించడానికి వెళ్తే టీఆర్ఎస్ గూండాలు దారిలో అడ్డుకుని, ఆయన కాన్వాయ్ పై రాళ్లు రువ్వి, అడ్డుగా ఉన్న బీజేపీ కార్యకర్తలను కత్తులతో బెదిరిస్తూ కర్రలతో దాడి చేయడం…

Read More