Author: Editor's Desk, Tattva News

రాష్ట్రాన్ని నీట్‌ నుండి మినహాయించాలని కోరుతూ శాసనసభలో రెండోసారి ఏకగ్రీవంగా ఆమోదించిన్న బిల్లును ఎట్టకేలకు రాష్ట్రపతి ఆమోదానికి పంపేందుకు తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి సిద్ధమైనట్లు సంకేతం ఇచ్చారు. సోమవారం ఉదయం ముఖ్యమంత్రి స్టాలిన్‌ శాసనసభలో సభా నిబంధన 110 కింద నీట్‌ బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపనందుకే గవర్నర్‌ తేనీటి విందులో పాల్గొనలేదని ప్రకటిస్తున్న సమయంలోనే రాజ్‌భవన్‌ నుంచి మీడియాకు ‘లీకులు’ రావడం గమనార్హం. ఆ మేరకు నీట్‌ బిల్లును గవర్నర్‌ పరిశీలించారని, త్వరలోనే దానిని రాష్ట్రపతి ఆమోదానికి పంపనున్నారని రాజ్‌భవన్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఈ విషయమై గత పలు నెలలుగా తమిళనాడు ప్రభుత్వానికి, రాష్ట్ర గవర్నర్ లకు మధ్య తీవ్ర అంతరం ఏర్పడింది. ఈ నే పథ్యంలో వాస్తవ పరిణామాలను పరిశీలించిన తరువాత అవసరమైతే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని సోమవారం సీఎం స్టాలిన్‌ సభలో వెల్లడించారు. తమిళనాడు అసెంబ్లీలో 110 విధుల కింద సీఎం స్టాలిన్‌ ఒక ప్రకటనను విడుదల…

Read More

2013-18 కాలంలో అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ) కార్యకర్తలపై పోలీసు కేసులను ఉపసంహరించుకోవడాన్ని 2023లో జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ వివాదంగా ప్రస్తావించేందుకు బిజెపి సిద్ధపడుతున్నట్లు స్పష్టం అవుతున్నది. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశాల సందర్భంగా బహిరంగ సభలో ప్రసంగించిన బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా, రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించడంతో వాదోపవాదాలు ప్రారంభమయ్యాయి. ఈ రాడికల్ ఇస్లామిక్ గ్రూపుతో కాంగ్రెస్ చేతులు కలిపిందని ఆరోపించడాన్ని బిజేపికి ప్రధాన అస్త్రం దొరికినట్లయింది. అయితే, పిఎఫ్‌ఐ నిజంగా విధ్వంసకర కార్యకలాపాలకు పాల్పడుతోందని భావిస్తే, పిఎఫ్‌ఐని నిషేధించేందుకు బలమైన చర్య కేంద్రం, రాష్ట్రాలలో అధికారమలో ఉన్న బిజెపి ప్రభుత్వాలు ఎందుకు వెనకడుగు వేస్తున్నాయని అంటూ కాంగ్రెస్ బిజెపి ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నది. దక్షిణ భారతదేశంలోని మూడు ముస్లిం సంస్థలు, కేరళలోని నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్, కర్ణాటక ఫోరమ్ ఫర్ డిగ్నిటీ, తమిళనాడులోని…

Read More

తాను జరుపుతున్న ప్రజా సంగ్రామ పాదయాత్రను ఇటిక్యాల మండలం వేముల గ్రామంలో టీఆర్ఎస్ కార్యకర్తలు సోమవారం అడ్డుకొనే ప్రయత్నం చేయడం పట్ల బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ నేతల బెదిరింపులకు, దాడులకు భయపడే ప్రసక్తే లేదని, బరాబర్‌ ప్రజా సంగ్రామ యాత్ర చేసి తీరుతామని స్పష్టం చేశారు. “మేం ప్రజా సమస్యలు తెలుసుకుందామని పాదయాత్రగా వస్తే.. కొంతమంది టీఆర్‌ఎస్‌ గూండాలు బీజేపీ కార్యకర్తలపై రాళ్లదాడి చేసి, రక్తం కారేలా కొట్టారు. శ్రీకాంతాచారి, సుమన్, పోలీస్‌ కిష్టయ్య లాంటి అమరవీరులు ఇందుకోసమేనా ప్రాణత్యాగం చేసింది?” అంటూ ముఖ్యమంత్త్రి కేసీఆర్ ను ప్రశ్నించారు. ‘కేసీఆర్‌ దమ్ముంటే నువ్వు పాదయాత్ర చెయ్‌. తెలంగాణ ప్రజలకు నువ్వు చేసిన ఘన కార్యాలేమిటో వివరించు.. మేం చేసిన తప్పేంది? పాపమేంది? ప్రజా సమస్యలపై పోరాడటమే నేరమా? ప్రజలు పడుతున్న కష్టాలు తెలుసుకొని వాటిని పరిష్కారం కోసం పోరాటడమే తప్పా? మాపై రాళ్ల దాడులు చేస్తారా? మేం…

Read More

తాను గతంలో బిజెపి నేత కావడంతో తెలంగాణ ప్రభుత్వం తనను ఆ దృష్టితోనే చూస్తున్నదని రాష్ట్ర గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్ విచారం వ్యక్తం చేశారు. తన రాజకీయ గతాన్ని ఇప్పుడు తాను చెరిపివేసుకోలేనని పేర్కొంటూ అంతమాత్రం చేత గవర్నర్ పదవికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా చేయడం తగదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆమె మీడియాతో ముచ్చడిస్తూ తనను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో విభేదిస్తున్న కారణంగా తనను కూడా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగానే చూస్తోందని తెలిపారు. ఏ రాష్ట్రంలోనైనా గవర్నర్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య విబేధాలొస్తే  వాటిని వ్యక్తిగతంగా తీసుకోరని, కానీ తెలంగాణలో తనను వ్యక్తిగతంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తోందని తమిళిసై ఆవేదన వ్యక్తం చేశారు.  తెలంగాణ ప్రభుత్వం తన పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్న ప్రోటోకాల్ వివాదంతో సహా మరే అంశంపై తాను కేంద్రానికి ఎటువంటి ఫిర్యాదులు చేయలేదని తమిళసై స్పష్టం చేశారు. ప్రతి గవర్నర్ ఆయా రాష్ట్రాల్లోని పరిస్థితులపై కేంద్రానికి…

Read More

అంతర్జాతీయంగా ప్రసిద్ధిచెందిన మ్యూజిక్ మాస్ట్రో ఇళ‌య‌రాజాను రాజ్యసభకు నామినేట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు వార్తా కథనాలు వెలువడుతున్నాయి. రాష్ట్రపతి సాహిత్య, సంగీత, ఆర్ధిక, వైజ్ఞానిక రంగాలకు సంబంధించిన ప్రముఖులను రాజ్యసభకు నేరుగా నామినేట్ చేయవచ్చు. ఇందులో భాగంగానే రాష్ట్రపతి రాజ్యసభ సభ్యులుగా 12 మందిని నామినేట్ చేయనున్నారు. ఈ కోటా కిందే ఆరేళ్ళ క్రితం డా. సుబ్రమణ్య స్వామిని ప్ర‌ధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం రాజ్యసభకు పంపింది. ఆయన పదవీకాలం ముగియనుండటంతో, ఆ స్థానంలో ఇప్పుడు ఇళయరాజాను నామినేట్ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. నిజానికి ఇలా వార్తలు రావడానికి ఓ ప్రత్యేక కారణమే ఉంది. ఇళయరాజా ఇటీవల ‘అంబేడ్కర్‌- మోదీ రిఫార్మర్స్ ఐడియాస్ అండ్ పర్ఫార్మర్స్ ఇంప్లిమెంటేషన్’ అనే గ్రంధానికి ముందు మాట రాశారు. అందులో అంబేద్క‌ర్ ఆశయాలను ప్రధాని మోదీ నెరవేరుస్తున్నారని ఇళయరాజా కొనియాడారు. అంబేద్కర్ నేడు జీవించి ఉంటె మోదీ పరిపాలన చూసి ఎంతో సంతోషించేవారని కూడా చెప్పారు. ఇద్దరు పేదరికం,…

Read More

రాజకీయాల్లో ఇటీవలి కాలంలో ప్రత్యర్థులపై చేస్తున్న విమర్శల విషయంలో దిగజారుడుతనం, ప్రసంగాల్లో స్థాయిని మరచి మాట్లాడడం ఆందోళనకరమైన పరిస్థితికి దారితీస్తోందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. జాతీయ రాజకీయాలతో పాటు ప్రాంతీయ రాజకీయాల్లోనూ ఈ పరిస్థితి స్థాయి దాటుతోందని, ఇలాంటి వాటి కారణంగా ప్రజాస్వామ్యం నవ్వులపాలయ్యే ప్రమాదం ఉందన్న విషయాన్ని నాయకులు, భవిష్యత్తులో నాయకులు కావాలనుకునేవారు గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. రాజకీయాల్లో విలువలు, నైతికత అత్యంత ఆవశ్యకమన్న ఆయన… మన నడవడిక, ప్రవర్తన, వ్యవహార శైలి జనాలను ప్రభావితం చేస్తాయని, జీవితంలో విలువలు పాటించిన నాయకులనే జాతి కలకాలం గుర్తుంచుకుంటుందని స్పష్టం చేశారు. కృష్ణ జిల్లా రాజకీయాలపై తనదైన ముద్రవేసిన ప్రజానాయకుడు పిన్నమనేని కోటేశ్వరరావు విగ్రహాన్ని సోమవారం మచిలీపట్నంలో ఉపరాష్ట్రపతి ఆవిష్కరిస్తూ  మనకు అప్పజెప్పిన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహించాలన్న విషయాన్ని వారి జీవితం తెలియజేస్తుందని తెలిపారు. రాజకీయాల్లో విలువలు, నైతికత తగ్గిపోతున్నాయని ఈ పరిస్థితి ప్రజాస్వామ్యానికి ఆందోళనకరమన్న ఆయన, రానున్న రోజుల్లో ఎలాంటి…

Read More

ఇండియన్ ఆర్మీ కొత్త చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే పేరు ఖరారైంది. ఈ విషయాన్ని రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారంనాడు ఒక ట్వీట్‌లో తెలియజేసింది. ఇంజనీర్స్ కార్ప్స్‌ నుంచి ఆర్మీ చీఫ్‌గా నియమితులవుతున్న మొదటి వ్యక్తి ఆయనే కావడం విశేషం. 29వ ఆర్మీ చీఫ్‌గా ఆయన ఈనెలాఖరులో బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత ఆర్మీ చీఫ్‌గా ఉన్న జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే తన 28 నెలల పదవీ కాలాన్ని పూర్తి చేసుకుని ఈనెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో పాండే కొత్త ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపడతారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి అయిన పాండే 1982 డిసెంబర్‌లో ఇంజనీర్స్‌ కార్ప్స్‌లో చేరారు. జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి పల్లన్‌వాలా సెక్టార్‌లో ఆపరేషన్ ‘పరాక్రమ్’ సమయంలో ఇంజనీర్ రెజిమెంట్‌కు కమాండంట్‌గా పాండే వ్యవహరించారు. 39 ఏళ్ల మిలటరీ కెరీర్‌లో ఆయన ఎల్ఒసి వెంబడి లడక్ సెక్టార్‌లో…

Read More

లఖింపూర్ ఖేరీ హింసాకాండ కేసులో సుప్రీంకోర్టు సోమవారం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. లఖింపూర్ ఖేరీ హింసాకాండ నిందితుడు ఆశిష్ మిశ్రా బెయిల్‌ను రద్దు చేసిన సుప్రీంకోర్టు వారంలోగా లొంగిపోవాలని ఆదేశించింది. ఆశిష్ మిశ్రాకు బెయిల్ మంజూరు చేస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కోర్టు పక్కన పెట్టింది. అసంబద్ధ విశ్లేషణలతో హైకోర్టు బెయిల్‌ ఇచ్చిందని సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌వి.రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు విచారణ ప్రారంభం కాకముందే.. పోస్టుమార్టం నివేదిక, గాయాల గురించి బెయిల్‌ ఉత్తర్వుల్లో హైకోర్టు ప్రస్తావించటాన్ని తప్పుపట్టింది. దీనిపై గతంలో తీర్పును రిజర్వ్‌లో పెట్టిన న్యాయస్థానం.. హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనబెట్టింది. ఆశిష్‌కు బెయిల్‌ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ‘‘హైకోర్టు తన అధికార పరిధిని మించిపోయింది, విచారణలో పాల్గొనే హక్కు బాధితులకు నిరాకరించింది’’ అని సుప్రీం పేర్కొంది. ‘‘హైకోర్టు అనేక అసంబద్ధమైన సమస్యలను పరిగణనలోకి తీసుకుంది. ఈ కేసుకు అనవసర ప్రయోజనం కల్పించాల్సిన చట్టపరమైన అవసరం లేదు’’…

Read More

బంజారాహిల్స్ భూ కబ్జా యత్నం కేసులో ఏ5 నిందితుడిగా బిజెపి ఎంపీ టీజీ వెంకటేశ్‎ను నమోదు చేశారు. ఏపీ జెమ్స్‌ సంస్థ ప్రాపర్టీలోకి టీజీ వెంకటేశ్ మనుషులు అక్రమంగా చొరబడి.. ఆస్తులు ధ్వంసం చేయడంతో పాటు అడ్డుకోబోయిన సెక్యూరిటీ సిబ్బందిపైనా దాడి చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితులుగా టీజీ వెంకటేశ్‎తో పాటు ఆయన సోదరుడి కుమారుడు టీజీ విశ్వప్రసాద్, సుభాష్‌ పులిశెట్టి మిథున్‌, వీవీఎస్‌ శర్మ సహా 80 మందిని చేర్చారు. 2021లోనూ ఇదే తరహాలో దాడులకు యత్నించారని రిమాండ్ రిపోర్టులో తెలిపారు. పోలీసుల కధనం మేరకు, బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 10 లో ఏపీ జెమ్స్‌ అండ్‌ జువెలర్స్‌ పార్క్‌కు 2005 లో అప్పటి ప్రభుత్వం దాదాపు రెండున్నర ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఈ స్థలంలో సంస్థ నిర్మాణాలు చేపట్టగా ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న మరో అర ఎకరానికి పైగా స్థలం ఖాళీగా ఉంది. ఈ జాగా తమదేనంటూ కొందరు…

Read More

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తన రెండు రోజుల భారత పర్యటనను ఏప్రిల్ 21న అహ్మదాబాద్ నుంచి ప్రారంభించనున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీతో తొలిరోజే గుజరాత్‌లో బోరిస్‌ జాన్సన్‌ సమావేశం కానున్నారు. గుజరాత్‌లో పర్యటిస్తున్న తొలి బ్రిటన్‌ ప్రధాని ఆయనే కావడం విశేషం. అదానీని కలవడమే కాకుండా, గిఫ్ట్‌ (గుజరాత్‌ ఇంటరుేషనల్‌ ఫైనాన్స్‌ టెక్‌) నగరాన్ని బోరిస్‌ జాన్సన్‌ సందర్శిస్తారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్రభారు పటేల్‌ను కలుస్తారు. సబర్మతి ఆశ్రమంలో గాంధీకి ఆయన నివాళులర్పిస్తారు. వడోదర సమీపంలోని ప్రముఖ పారిశ్రామిక ప్రాంతమైన హలోల్‌ను సందర్శిస్తారు. గాంధీనగర్‌లోని అక్షరధామ్‌ ఆలయాన్ని కూడా బ్రిటన్‌ ప్రధాని సందర్శించనున్నారు. గుజరాత్‌లో, భారతదేశంలోని కీలక పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టాలని బోరిస్‌ జాన్సన్‌ భావిస్తున్నట్లు బ్రిటీష్‌ హైకమిషన్‌ ప్రతినిధి తెలిపారు. కరోనా మహమ్మారి దేశాన్ని తీవ్రంగా దెబ్బతీసే ముందు, అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 2020లో అహ్మదాబాద్ నుండి తన భారత పర్యటనను ప్రారంభించారు. ఆయన …

Read More